Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 24


    పాప కిటికీ దగ్గర  నిలబడి బయటకు చూస్తోంది. ఎవరయినా కనబడతారేమోనని.


    ఓ నిమిషం గడిచాక పదేళ్ళ అబ్బాయి అటుకేసి వెడుతున్నాడు.

    
    ఆమెకు ప్రాణం లేచివచ్చినట్లయి "చిన్నా! చిన్నా!" అని పిలిచింది.

    
    చిన్నా ఆ పిలుపు విని దగ్గరకొచ్చాడు. " అదేమిటక్కా! నిన్ను  లోపలపెట్టి  తలుపు గొళ్ళెం పెట్టారేమిటి?" అన్నా డాశ్చర్యంగా.


    "నేను లోపల పనిలో వుండే యింట్లో  లేననుకొని నాన్నపెట్టి వెళ్ళిపోయాడులే. చూసుకోలేదు. కాస్త గొళ్ళెం తియ్యావా?"


    "అలాగే అక్కా" అంటూ చిన్నా గొళ్ళెం తీశాడు.


                          *    *    *    *

    
    పాపకు భయంగా వుంది. ముఖాన స్వేదబిందువులు అలుముకుని వున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. పాదాల్లో వొణుకు....


    బెదురుచూపులు చూస్తూ ఆ యింట్లోకి ప్రవేశించింది.


    బయటెవరూ కనబడలేదు. అంత కంగారులోనూ దారిలో ఓ గులాబీపువ్వు కొనుక్కునచ్చింది.


    ప్రక్కనుంచి చప్పుడయినట్లయితే వులికిపడి తల ప్రక్కకకి త్రిప్పి చూసింది.


    ప్రక్కనున్న గది తలుపు దగ్గర రమాదేవి నిలబడి వుంది.

    
    ఆమె బాబుగారి తల్లి అని పాపకు తెలుసు. ఆమె కారుల్లో బయటకు వెళ్ళటం, తిరిగి రావటం తరుచూ చూస్తూనే వుండేది.


    " అమ్మాగారూ?" అంది వొణికే గొంతుతో.


    రమాదేవి పాపవంక ఒక్క క్షణం మాత్రం పరిశీలనగా చూశాయి.


    " ఈ అమ్మాయి.. ఈ  అమ్మాయి..."


    లోపల్నుంచి నరాలు  జివ్వుమని తోడేస్తున్నాయి. నాలిక వెనక్గకి లాగేస్తున్లనిపిస్తోంది.


    శరీరమంతా మంటలు. అణువణువునా నిప్పు కణికలతో కాల్చినట్లుబాధ.


    " నాకో సాయం చెయ్యాలి" అంది. ఆమె గొంతు ఎలానో వుంది.


    " నేనా?"


    " అవును. నువ్వే.ప్లీజ్! బాధతో చచ్చిపోతున్నాను."


    " ఏమిటమ్మగారూ!"


    " ఇలారా. చెబుతాను."


    పాప కొంచెం సంకోచించి దగ్గర వెళ్ళింది. రమాదేవి ఆమె చెయ్యి పట్టుకొని  లాగుతున్నట్లు లోపలకు తీసుకెళ్ళింది.
    పాప భయంగా " అమ్మాగారూ! అమ్మగారూ?" అంటోంది.


    " ఫర్వాలేదు ఫర్వాలేదు" అంటూ లోపలికి వెళ్ళాక చెయ్యి విడిచిపెట్టింది.


    గదిలో ఖరీదయిన బ్లాకెట్ తో మెరిసిపోతోన్న డబల్ కాట్ బెడ్ ! ఓ ప్రక్కన కలర్ టి.వి. దానికున్న స్టాడ్ లో క్రింది అరలో వి.సి.ఆర్. చుక్కలు సన్ మైకాతో కవర్ చెయ్యబడి తీర్చి దిద్దబడివున్న వాడ్రోబ్ డోర్స్.


    పాపకు వాటి పేర్లు తెలీవు. ఆశ్చర్యంగా చూస్తోంది. రమాదేవి వాడ్రోబ్ తెరిచి ఓ సిరంజ్,రెండు ఇంజక్షన్ యాంప్యూల్స్ బయటకు తీసింది.ఇంజక్షను చేసుకుని చేసుకుని వుండటంవల్ల ,వాటి ప్రభావంతో ఆమె  అరిచేతులు, వ్రేళ్ళు ఎప్పుడూ ట్రిమర్స్ వల్ల వొముకుతూ వుంటాయి.


    "అమ్మాయి దీన్ని నానరంలోకి  ఇంజక్షన్ చెయ్యాలి."


    " అమ్మగారూ" అంది పాప హడలిపోతూ.


    "ఫర్వలేదు. నాకు తెలిసిన ఓ సిస్టర్ వచ్చి చేసేది. ఇందాకట్నుంచీ చూస్తూన్నాను ఇవేళ రాలేదు బయటకు పోటానికి కారులేదు. ప్రాణాలు కడబట్టిపోతున్నాయి. ప్లీజ్ చెయ్యవా?"


    " అమ్మగారూ! నాకు రాదు.ఎలా చెయ్యాలో తెలీదు.  పాప వొణికిపోతోంది."


    " ఫర్వాలేదు. నేను చెబుతాను, నేను సాయంచేస్తాను."    


    "అమ్మగారూ!   అమ్మాగారూ! నన్నొదిలెయ్యండమ్మ గారూ" అంది పాప ఏడుపు నాపుకుంటూ.


    " ఉహు.ప్లీజ్! నా బాధ నీకు తెలీదు. చూడూ. ఇలారా. ఇదిగో యిక్కడ. మోచేతి దగ్గర. చూశావా? చెయ్యి కనబడుతోంది. ఈ సిరంజి ఓ చేతితో పట్టుకో అంటూ సిరంజి పాప కందించి తన కుడిచేత్తో ఎడమ జబ్బ దగ్గర గట్టిగా పట్టుకుంది.


    " ఇది డిసిపోజబుల్ సిరంజ్, నీడిల్. చాలా ప్రెష్ గా వుండి తెలిగ్గా ఎక్కిపోతుంది. ఆచెయ్యిలోకి నీడిల్ గ్రుచ్చెయ్యి."


    పాప ఆశ్చర్యంతో , భయంతో చూస్తోంది. రమాదేవి శరీరం పాలరాతిలా మెరిసిపోతోంది.


    " చేసెయ్ చేసెయ్ త్వరగా"  అంటోంది.


    పాప చెయ్యి వొణికిపోతోంది.


    "ఇక్కడ యిలా గుచ్చెయ్. ఇదిగో ..యిలా ... నా చెయ్యిచాలా బ్యూటీపుల్ గా కనబడుతుంది. అసలింతహాయిగా ఎవరి చెయ్యనూ వుడందు. ఏమి లేదు. సూది అందులో గుచ్చేయటమే...."


    రమాదేవి ఆత్రంగా డైరెక్షన్స్ యిస్తోంది.


    పాపకు ఆమె మాటకు ఎదిరించే శక్తిలేక రక్తనాళం మిద సూదివుంచి నెమ్మదిగా గ్రుచ్చింది.


    ఏదో జరుగుతోంది . సూది చాలా తేలిగ్గా లోపలకెళ్ళింపోయింది.


    సిరంజిలో రక్తం వచ్చింది.


    "అమ్మో! నెత్తురు" అంది చాలా భయంతో ప్రమాదం జరిగిపోతున్నదనే ఉద్ధేశంతో...


    "సిరంజి వొదిలెయ్యకు. పిస్టనీ లేదూ... యిదిగో.... ఇది.... లోపలకు పుష్ చెయ్యి ఏమి పర్వలేదు... ఇలాగే...."


    పాప  యాంత్రికంగా ఆమె చెప్పినట్లు చేస్తోంది.


    మందు లోపలకు వెళ్ళిపోతోంది. ....అయిపోయింది.


    ఏవో లోకాల్లోకి, స్వర్గధామంలోకి తేలిపోతున్నట్లు హాయిగా  మగతగా కళ్లు మూసుకుంది రమాదేవి.


    " ఇప్పుడు?" ఏం చెయ్యను?" అనడుగుతోంది పాప కంగారూగా.


    "ఊ"

 Previous Page Next Page