"ఇది వేసుకున్నాడుగా."
" అదే ఆశ్చర్యంగా వుంది. ఎందుకు వేసుకున్నాడో."
" మిరు ఆపత్రిక కే పంపిచండి. నవల రాసి."
" కాని నవల రాసే శక్తి నాకుందంటారా?"
"ఏం యిప్పుడు తలా తోకా లేకుండా రాస్తోన్న వాళ్ళందరి కంటే మిరు తీసిపోయారా?"
"అలా అనికాదు ఎన్నో రకాల పాత్రలు తీసుకోవాలి. ఎన్నో మనస్తత్వాలు. .... వీటన్నిటిచుట్టూ బలమైన యితివృత్తం...."
" మి రెవరు? నాకెందుకిలా ప్రోత్సాహమిస్తున్నారు?"
"మి అభిమానిని."
" ఎందుకు కనబడరు నాకు?"
నువ్వు." కనబడతాను. అవసరమొచ్చినప్పుడు."
" అదే. ఎప్పుడు?"
" ముందుగా ఎలా తెలుస్తోంది?"
" మి పేరేమిటి?"
" చెప్పను."
" మి యిష్టం."
" ఉంటాను. తప్పకుండా నవల రాయండేం"
ఫోన్ పెట్టేసింది.
* * * *
ఆమె మాటలు అతనిమిద బాగా పనిచేశాయి .ఎలా గైనా నవల రాయటానికే నిశ్చయించుకున్నాడు.
అతన్లో ఓ అగ్ని పర్వతం బ్రద్ధలవుతోంది.
ఈ సమాజం... అందులో పేరుకుపోయి వున్న అవినీతి.
రోజూ పేపర్ లో చూసే అనేక సంఘటనలు . వరకట్నం చావులు.
అమానుషమైన మానభంగాలు. మానవజాతి కే కరళంక మాపాదించే రాక్షసకృత్యాలు.
ఒక కారులో ఏడుగురు ఆడవాళ్ళు ప్రయాణం చేస్తూ న్నారు. అందులో తల్లీ కూతుళ్ళూ వున్నారు.అత్తా కోడళ్లూ వున్నారు. వొదినా మరదళ్ళూ వున్నారు. ఓ ముఠా వాళ్ళ మిద దాడిజరిపి సామూహికంగా మానభంగాలు చేసేసింది.
ఆరేళ్ళ పిల్లని రేప్.
జీవితంమిద ఎన్నో ఆశలు పెంచుకుని కలలుకనే కన్నెపిల్లలు, వివాహం చేసుకొని భర్తలతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటూన్న సంసార స్త్ర్రీలు....
పూలరాశిలో కార్చిచ్చులా...ఎవరో అమాతంగా జొరబడి రేప్ చేసి జీవితాలను సర్వనాశనం చేసెయ్యటం....
ఎన్నో ఆశలతో, కోరికలతో అత్తవారింట్లో అడుగు పెట్టిన ఆడపిల్లకు భర్తవల్ల, అత్తమామలవల్ల హింసాకాండ, వరకట్నం చావులు.
జీవితంలో ఎంతో పైకి వద్దామని ఎంతో శ్రమించి. ఉన్నత విద్యాభ్యాసంచేసి, చదువుకు తగ్గ ఉద్యోగాలు రాక, ఘోరంగా రాజీపడి , దొరికిన ఉద్యోగంతో అహర్నిశలూ సంవసత్సరాల తరబడి యుద్ధంచేసి అలసిపోయి, చివికి చివికి....
పురుషుల నిరంకుశత్వం.
ఆడవాళ్ళ హృదయ విదారకమైన అగచాట్లు...
గూండాల స్థయిర విహారం , రాజకీయాలమిద వాళ్ళ సాధికారం.
సమాజాన్ని ఒక వర్గం పీల్చి పిప్పి చేసేస్తోంది. లంచ గొండితనం , దగా, మోసం....
మనిషికి శీలంమీద విలువ లేదు ప్రాణ స్నేహితుడయినా- సరే- అవకాశమొస్తే అతని భార్యతో అక్రమ సంబంధం...
అవినీతితో, స్వార్థంతో, అహంకారంతో, మోసపూరిత విష వాతావరణంతో సమాజం కుళ్ళిపోతోంది.
నాగరికత చాటున వికృత మనస్తత్వ లు , విపరీత ప్పవర్తనలు....
సిటీ జీవితాల్లోని వేగం.
ఆధునికత్వంలోని అరాజకం....
ఇవన్నీ కూర్చి గబగబ ఓ యితివృత్తం తయారుచేశాడు.
ఇంట్లోంచి బయటకు కూడా పోవటం లేదు. చకచక నవల రాయటం మొదలుపెట్టాడు.
* * * *
వరదరాజు యిరుగు పొరుగువాళ్ళ సాయంతో పాపకో సంబంధం చూశాడు. పెళ్ళిచూపులు తతంగమంతా జరిగి పోయింది . పెళ్ళి కూడా ఖాయమైపోయింది.
పాప ఆ అబ్బాయివంక తలెత్తి చూడలేదు. ఆపెళ్ళి నిరాకరించటానికెంతో ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.
ఉన్నట్లుండి వరదరాజు రాక్షసుడిలా మారిపోయినట్లు కనిపించాడు. ఆమె మాట వినిపించకోవటం లేదు. చివరికామె పెళ్ళిఖాయం చేసేశారు.
ఒక్కసారి.... ఒక్కసారి.... బాబుగార్ని చూస్తే బాగుండును. ఆయన కిదంతా చెబుతే బావుండును ఒక్క సారి...
చివరికామె ఆశ ఫలించింది. పెళ్ళి యింకో అయిదారు రోజులుండగా ఓ సాయంత్రం కనుచీకటి పడుతూండగా వరదరాజు లేచి ఓపిక తెచ్చుకొని బజారు పనిమిద బయటకెళ్లాడు.ఇంట్లో దూరపు బంధువు ఒకావిడను కాపలా వుంటే వెళ్లాడు. ఆ దూరపు బంధువుకు సినిమాపిచ్చి. వారానికయిదు సినిమాలు చూస్తేగానీ ఆవిడకి నిద్ర పట్టదు. అప్పటికి సినిమా చూసి రెండు రోజులయింది. కాళ్ళు యింట్లో నిలవ నివ్వటం లేదు. ప్రక్కింట్లో టి.వి.లో తెలుగు సినిమా వస్తోంది.ఇహ వుండబట్టలేక పాపను లోపలకు నెట్టి బయట్నుంచి గొళ్ళేంపెట్టి " వెధవేషాలేస్తో జాగ్రత్త" అని వార్నించ్చి పరుగు పరుగున ప్రక్కింట్లో కెళ్ళిపోయింది.