Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 23

    ఈ మాట మమ్మీని  అడిగితే ఆవిడ ఏం జవాబు చెబుతుంది?  ఆ స్ధానాన్ని ఆవిడ వద్ధనుకొన్నకేగా నేనోచ్చింది? అని చేబుతుందేమో!  చదువుకొని  సంస్కారవంతుడ్తెన  డాడి  తన మొదటి భార్యకు అన్యాయం ఎలా చేయగలిగాడు?

    "మమ్మి తప్ప ఉంటే కొంత ఉండచ్చు,  నాయనమ్మ! ఇందులో  నీ మేనకోడలి తప్ప ఏం  లేదంటావా?"

    "లేకపోవడంఏమిటి? వచ్చిన తప్పే దానితోటి!  అది భర్తను అర్ధం చేసుకొని,  అతడి కనుగుణంగా  మారిపోతే మీ నాన్న దానినేందుకు  కాదనేవాడు?  వాళ్ళిద్దరు సఖ్యంగా ఉంటే  మీ అమ్మ  మీ నాన్న జీవితం లో  ఎలా  ప్రవేశించేది?   తన జీవితం  నాశనం  త్రిపురే చేసుకోందిరా!"

    "మరి  ఆమ్మను  నిందించడం దేనికి?"

    "బాధపడిన  మనసు  పరిపరివిధాలా  పోతూ ఉంటుంది గాని,  అసలు ఎవరి తప్పూ లేదురా. ఇలా ఇలా జరగాలని నొసట వ్రాసి పంపిస్తాడే ఆ విధాత!  వాడిదేరా అసలు తప్ప!" ఆవిడ నిర్వేదంతో అంది.


                                                                   14

    మెడలో కెమెరా,  భుజానికి 'హరేరామ హరేకృష్ణ,  అని వ్రాసిన  ఖద్దరు బాగ తో  ఆ ఊళ్ళో అడుగు పెట్టాడు అజిత్, ఫోటో  గ్రాపి  అతడికున్న  హబిల్లో అతి ముఖ్యమ్తెనది!  ఫోటోలు  తిసి  పత్రికలకి పంపడం ప్త్రేజులు  కూడా పొందడం ఎన్నిసార్లో జరిగింది.  అప్పడప్పడు పత్రిక లకి మాంచి ఆర్టికల్స్ కూడా వ్రాస్తూంటాడు.  అవన్ని ఫారెన్ పత్రికలలో  ప్రచురితమయ్యాయి.

    ఇండియావచ్చాక  పల్లెటూరిలో  అడుగు పెట్టడం ఇదే మొదటి సారి  అజిత్ కు.   ఎవ్తేనా  ఆసక్తికరమ్తె  దృశ్యాలు కనిపిస్తే ఫోటో  తీసుకో వచ్చని, కెమెరా తీసుకు వచ్చాడు.
    
    ఊళ్ళో అడుగు పెట్టినప్పటి నుండి అంతా ఆసక్తిగా,  వింతగా కనిపించసాగింది అజిత్ కు.

    ఆరు  గిలకలున్న  ఊరబావి చుట్టూ నీళ్ళూ తోడుకుంటున్నారు ఆడ వాళ్ళు.  మగవాళ్ళు ఒకతడు నాలుగ్తె దుబిందేలు పట్టేట్టుగా ఉన్న నల్లటి  బుంగని భుజం మిది  కేత్తుకొని,  దాని బరువు  తనని  అణచి వేయకుండా ఉండేందుకు పాదాల్ని ఒక విధమైన  ఊపుతో  లయగా వేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు.  "అంతలావు కడవని ఎత్తుకొని అతడు  డాన్స్ చేస్తున్నట్టుగా ఎలా నడుస్తున్నాడో అంత తేలికగా!"  అనుకొన్నాడు వింతగా అజిత్,  ఆరేడేళ్ళున్న  ఒకమ్మాయి చీరకట్టుకుని, పమిట భుజం మిద  సర్దు కోలేక అవస్ధపడుతూ,  దుకాణం నుండి  ఏదో పొట్లం కట్టించుకుని వేడుతూంటే చక్కగా ప్రాకులేసుకోవాల్సిన పిల్ల చీరలో ఎంత ఇబ్బంది పడుతుంది?"  అనుకొన్నాడు జాలిగా.

    ముఖమల్  గుడ్డతో  తయారు చేసినట్టుగా  ఉన్న కోడిపిల్లలూ,  పుట్టి అయిదారు రోజులు కానీ లేగాదూడలూ.  దారిపొడవునా అతడికి ఆసక్తికర మ్తెన  దృశ్యాలే కనిపిస్తున్నాయి.

    చూడగానే పట్నవాసపు  బాబూ అనిపించే ఈ పొడుగాటి యువకుడిని  ఆ ఊరివాళ్ళు  తక్కుఅవ  ఆసక్తితో  చూడడంలేదు.

    అజిత్  ఒక చిన్న డబ్బా కొట్టు  దగ్గర ఆగి,  "పరమేశ్వర శాస్త్రి గారిల్లు ఎటు?"  అనడిగాడు.

    "ఈశ్వరయ్యగారిల్లా!"

    "పరమేశ్వరశాస్త్రి గారిల్లు,"

    "ఆయనే  పరమేశ్వరశాస్త్రి గారు!  ఎణ్నించి  వస్తున్నావ్?  బందుగులా?"

    "ఆ బందువునే ఇల్లెటు?"

    బిడిలు తీసుకు పోవడానికి వచ్చిన కుర్రాడితో,  "అరే,  నర్శిగా! నువ్వేల్లెది అటేగా? ఈ బాబుని తోలుకుపో!" అన్నాడు కొట్టతడు  బిడిలు వాడి  చేతిలో పెట్టి డబ్బు పుచ్చుకుంటూ.

    "దా,  అయ్యా!"  అంటూ ముందుకు దారి తీసిన  కుర్రాడిని అనుసరించాడు అజిత్.

    రెండు సందులు తిరిగాక,  "అదే ఇల్లయ్యా!"  అనిచెప్పి కుర్రాడు ముందుకు వెళ్ళి పోయాడు.

    రాతితో కట్టిన రెండు నిలువులేత్తు  కాంపౌండు  గోడ.  కాంపౌండ్ గోడలకి,  లోపల ఇంటి గోడలకి కూడా సున్నం ఎర్రమన్ను  పట్టేలున్నాయి!  గేటుకి  బదులుగా నగిషీలు చెక్కబడిన తలుపులున్న పెద్ద  దర్వాజా  గడపకి పసుపుకుంకుమాలబొట్టు  ఉన్నాయి. అందరూ నడిచే  దారి  అయినా కళ్ళాపజల్లి  ముగ్గు పెట్టారు!

    అజిత్ తలుపు తడదాం  అనుకోనేంతలో- బొడ్డు దగ్గర కుచ్చెళ్ళు  దోపుకొని,  పనిమనిషీలా  కనిపిస్తున్న ఒకామె తలుపు తెరిచింది.
    "ఎవరయ్యా?"  దానిగోంతు  మోటుగా ఉంది.  అంటే మనిషి నాజూకుగా ఉందని కాదు! అది అందుకు తగ్గట్టుగానే ఉంది.

    "పరమేశ్వరశాస్త్రి గారున్నారా?"

    "పెద్దయ్యాగారా?"

    "చిన్నయ్యగారెవరు?"

    "ఇస్సేశ్శరయ్యగారు?"

    "ఉన్నారు! అదిగో,  వరండాలో ఆపక్కని చెక్క మంచం మిద  పడుకొని ఉన్నారు. పెద్ధయ్యగారు వంట్లోకాస్త బాగుండలేదు  కాబట్టి  పడుకొని ఉన్నారు లేపోతే  అంత వయసొచ్చినా  పగటి పూట పండు కొని  ఎరుగరు!  వరండాలనే  చిన్నయ్యగారు కూడా ఉన్నారు చూడండి!  పిల్లలకి పాఠం  చెబుతున్నారు!"  అది అజిత్ నీ దాటి  వెళ్ళ బోతూ ఆగింది ఏ ఊరి నుండి  వస్తున్నారు బాబూ" 

    "హ్తెధరాబాద్"

    "అయిద్రాబాదా?  నూ యశోదమ్మ గోరు వాళ్ళు అణ్ణే  ఉంటారు! మీకు తెల్సా?"

    "తెలుసు!" చిరునవ్వుతో  జవాబిచ్చాడు అజిత్.

    "బాగున్నారా ఆయమ్మగారు?"

    "ఆ బాగున్నారు!"

 Previous Page Next Page