ఎనభయి ఏళ్లు వచ్చినా జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేడు కాని నువ్వు ఆడదానివి. కొట్టుమిద కూచుని వ్యాపారం చెయ్యలేవు. ఇహ కాఫీ హోటలు. చిన్న తరహా హాలో, ఓ మెస్ లాగానో, ఓచిన్న సైజు కాఫీ హోటలులాగానో పెట్టుకోవచ్చు"
"కాఫీ హోటలయితే క్యాష్ దగ్గర ఎవరు కూచుంటారు?" అనడిగింది శటకుంతల.
వైకుంఠంగారు కొంచెం ఆలోచించి "జీవితంలో ఏ యాక్టివిటీ లేక నాకూ బోర్ కొడుతోంది.ఏదో కొంత వ్యాపకం కావాలనిపిస్తంది. నీ కభ్యంతరం లేకపోతే , నామిద నమ్మకముంటే నీకు చేదోడు వాదోడుగానే వుంటాను అన్నాడు.
శకుంతల ఓ నిర్ణయానికొచ్చింది.
13
పాప రెండు రోజులదాకా యింట్లోచి బయటకి కదల్లేదు. తండ్రి కొట్టిన దెబ్బలతో వొళ్ళంతా వాచిపోయి నొప్పులుచేసి మంచంమిద నుంచి లేవలేకపోయింది. జ్వరమొచ్చినట్లుగా అయి, తల బ్రద్ధలై చిట్లిపోతూన్నట్లుగా అని పించింది. బ్రతుకంటే విరక్తి కూడా పుట్టింది.
తనకి ఊహ తెలిసినప్పటికే తల్లి చనిపోయింది. అప్పట్నుంచీ జీవితంలో సుఖపడిందేమిటి? తండ్రి మొదట్నుంచీ అసమర్ధుడు, రోగిష్టినాడు. లేతవయసులోనే తనని పెద్ద పెద్ద వారి యిళ్ళలో పనులకి పెడుతూ వుండేవాడు. తనకు మొదట్నుంచీ చదువంటే ఎంతో యిష్టం.ఆదిలోనే చదువుకు ఉద్యాసన చెప్పి సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత తర్వాత ఆ సంపాదన చాలక చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి, చివరికి బండి పెట్టుకోవల్సి వచ్చింది.
" ఎక్కడికి?" అన్నాడు వరదరాజు.
"కొట్టు దగ్గరకు."
"వీల్లేదు."
" ఎందుకని?"
" నీకు పెళ్ళి సంబంధం చూస్తున్నాను."
" పెళ్ళా? నాకా" యిప్పుడప్పుడే చేసుకోను."
" ఎందుకని ? వాడితో లేచిపోతావా?"
" నాన్నా! అసహ్యంగా మాట్లాడకు."
"అబ్బో! వాడితో కార్లో షికార్లు కొడితే లేదుగాని అంటే వచ్చిందా?"
పాపకు ఎలా జవాబు చెప్పాలో తెలీలేదు. "నీ కంత వరకే అర్ధమవుతుంది. అని బయటకు బయల్దేరబోతూంది.
" ఆగు.... అని అరిచాడు. "వొద్దని చెబుతూంటే న క్కాదూ? నా మాటనే ఎదిరిస్తున్నావా?"
" ఇన్నాళ్ళబట్టీ పెట్టిన కొట్టు ఒక్క సారిగా తీసేస్తే ఎలా? ఇంట్లో ఎలా జరుగుతుంది?"
పాప తండ్రి దగ్గరకొచ్చి మొహంలో సూటిగా చూసింది. " నాన్నా! ఆ సంగతిప్పుడు తెలిసిందా? కొన్ని సంవత్సరాల క్రితమే తెలుసుకుని వుంటే నా జీవితం యింకో రకంగా వుండేదే."
"ఉండేది. ఆలస్యంగా తెలుసుకున్నాను."
" నాన్నా లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకుని మనుషుల్ని చిత్రవధ చెయ్యకు. నేనే తప్పూ చెయ్యటంలేదు. నువ్వనుకుంటూన్నట్లు బాబుగారికీ నాకూ ఎలాంటి సంబంధము లేదు. జీవితమన్నాక ఎన్నో పరిచయాలవుతూ వుంటాయి. నీ కిప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవట మీష్టంలేదు. మంచికో. చెడుకో కష్టపడటం అలవాటుపడ్డాను. నీకోసం, నాకోసం, మన యింటికోసం డబ్బు సంపాదించే అవసరమెంతయినా వుంది. అర్థం లేకుండా అడ్డం చెప్పకు."
వరదరాజు ముందుకొచ్చి ఆమె దారికడ్డంగా నిలబడ్డాడు.
" పాపా! తండ్రిగా చెబుతున్నాను. నువ్వు కొట్టుకెళ్ళి టానికి వీల్లేదు."
" వెళ్ళి తీర్తాను."
"అలాగా?" అంటూ లాగి చెంపమిద కొట్టి, వెనక్కి ఒక్కతోపు తోశాడు.
పాప వెనక్కి పడిపోయి. తల నేలమిద కొట్టుకుని "అమ్మా" అని మూలిగి కళ్ళు మూసుకుంది.
* * * *
తాను కథయిచ్చి వచ్చా పదిహేను రోజులకు సూర్యచంద్ర యధాలాపంగా యా వారపత్రిక వంక చూశాడు.
అందులో తన కథ అచ్చయివుంది.
ఆశ్చర్యం, ఆనందం ముప్పిరి గొనగా అప్రతిభుడై వుండి పోయాడు.
అప్పుడే ఎలా అచ్చయింది? అసలా సంపాదకుడి వాలకం చూస్తే ప్రచురణకి స్వీకరిస్తాడనుకోలేదు. ఒకవేళ స్వీకరించినా అచ్చువెయ్యాటనికి కనీసం అయిదారు నెలలు టైమ్ తీసుకోవటం ఆ పత్రిక అలవాటు . అంత వేగంగా ఎలా పబ్లిషయింది?
ఆ మధ్యాహ్నం ఫోన్ మ్రోగితే రిసీవ్ చేసుకున్నాడు.
" నేను...." అంది అవతల్నుంచి ఓ మృదు మధురకంఠం.
గుర్తుపట్టాడు. " కులాసాగా వున్నారా?" అనడిగాడు మర్యాదగా.
"ఊ"
"....."
" మి కథ చదివాను."
" చదివారా?" అన్నాడు సంతోషంగా.
" చాలా బాగుంది. ఈ రోజుల్లో ప్రవాహానికి ఎదురత ఈదుతూ యిలాంటి రచనలు చేస్తున్నారంటే గొప్ప."
"థ్యాంక్స్"
" మికు ఎలర్జీ స్టోక్రసీ అంటే కోపమా?"
"అదేంలేదు.అందులోని కృత్రిమత్వం అంటే అసహ్యం."
"మి ఊహలు ,ఆలోచనలు నాకు నచ్చుతాయి. మి భావాలన్నీ పొందుపరిచి ఓ నవల రాయకూడదూ?"
" నవలా?"
"అవును. రాసి యిప్పుడు కథ పడిన పత్రికకే పంపించండి."
" ఆ సంపాదకుడు కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్న వాడు ఇలాంటి రచనలు వేసుకోడు."