అజిత్ ముఖం ఎర్రబడింది. ఆ అవమానమేదో ఇప్పడే జరిగినట్టుగా! "అబ్బా!అంత చాందసులా, నాయనమ్మా నీ పుట్టింటి వాళ్ళు! అయిఒతే వాళ్ళకి బుద్ది చెప్పడం కొసమ్తెనా నేనోసారి తప్పకుండా వెళ్ళాలి!"
నువ్వలా విరోధం కల్పించుకోనేందుక్తేతే అసలు వెళ్ళొద్దు! తెగిపోయిన బంధం అతికించి నా పుట్టింటి వాళ్ళ ప్రేమాధరణలు తిరిగి నాకివ్వగాలిగితే, నా అంత్యదశలో ఎంతో మనశ్శాంతి ఇచ్చినవాడివి అవుతావు! అలా చేయగలిగితే వెళ్ళు! లేకుంటే లేదు!"
"అలాగే, నాయనమ్మ నీ పుట్టింటి వాళ్ళ ప్రేమ ఈ మనుమడి బహుమతిగా నీకిస్తాను! సరేనా?"
"నిజంగా? నువ్వలా చేయగలవా?" ఆవుద సంబరంగా అడిగింది.
"ఘ్యర్! ఏం, నాయనమ్మ? నీ మనుమడి సామర్ధ్యం మీద నికా నమ్మకం లేదా?"
"తెలివ్తే నవాడివి! చురుక్తే నవాడివి! నీ మీద నాకా నమ్మకం ఉంది కానీ, కారుడు కట్టిన మనునల్ని కరిగించడానికి నీ తెలివి, నీ సామర్ధ్యం ఎంతవరకు ఉపయోగపడతాయా అని!"
"తెలివి అనేది ఉన్న తరువాత, అన్నిటికి ఉపయోగపడితేనే అది తెలివి అనిపించుకొంటుంది!
"తెలివి ఒక్కటి ఉంటేనే చాలదురా! నిదానం, ఓర్పు కూడా!ఉండాలి!"
"సరే? నీ పుట్టింట్లో ఎవరేవరుంటారో, ఎవరెవరు ఎలాంటి వాళ్లో చెప్ప, నాయనమ్మ!
"మా అన్న భార్య పోయింది గాని, అన్న ఉన్నాడు! ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఇంటిదగ్గరే ఉండిపోతే రెండోవాడు చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దవాడి పేరు విశ్వేశ్వరయ్య. త్రిపుర ఒక్కతే కూతురు నా అన్నగారికి. విశ్వేశ్వరయ్యకు ఎంతమంది పిల్లలో నాకు తెలియదు! మీ పెద్దమ్మ త్రిపుర అక్కడే ఉంది! కులవృత్తిగా పౌరోహిత్యం, గుడి పూజ ఉన్నా పొలాలు దండిగా ఉన్నాయి! పైకి ఆడంబరంగా కనిపించక పోయినా సిరిసంపదల కేం లోటు లె౪ధు? నీకు ఇంకో సంగతి చెప్పడం మరిచిపోయాను! మా చిన్నాయన ఒకాయన చిన్నతనంలోనే సన్యసించి, ఊరి బయట పొలంలో ఆశ్రమం నిర్మించు కొని ఉంటున్నాడ! ఇప్పడాయన బ్రతికి ఉన్నడో లేదో తెలియదు!
"మనుషులు ఎలాంటివాళ్ళు?"
"ఎవరిజోలికి వాళ్ళు వెళ్ళరు, ఎవరూ వాళ్ళజోలికి వెళ్ళే ఆస్కారం కలిగించరు"
బయట వాళ్ళతో ఎలాంటి సంబంధం బాంధవ్యాలు కలిగి ఉండని మనుషులన్న మాట! ఆ మూర్ఖుల్ని ఈ వెళ్ళమీద ఒక్క ఆట అడించకపోతే చూడు! మగడు వదిలేసినా సరే, తన మడి ఆచారం, పూజలు, అవి పదిలం అయితే చాలుననుకొన్న పెద్దమ్మ కు కూడా తన తప్ప తెలుసు కోనేట్టుగా చేస్తాను"
"మరి అంత తేలిగ్గా తిసివేయకురా వాళ్ళని! వాళ్ళు ఈకాలం చదువులు చదవలేదేమోగాని సంస్కృతంలో మాంచి పండితులు! శాస్త్రాలు. వేదాలు వాళ్ళకు కంఠపాఠం! మా అన్న, మా చిన్నాన్న పుస్తకాలు కూడా వ్రాశారు"
కంఠస్తంయ్యి ఏం చేశాయి ఆ శాస్త్రాలు, వేదాలు? వాళ్ళని కూపస్ధమండూకాలని చేశాయి! 'నన్నాంటకు నా మాలకాకి' అన్నట్టుగా చేశాయి! తమ చుట్టూ తాము గిరి గిచుకోనేట్టు చేశాయి! శాస్త్రాలు, వేదాలు నాలికమిధ ఆడినంత మాత్రాన అవి మనుషులను యోగ్యులను చెయ్యవు!"
నాకొడుకు కులంకాని పిల్లను రట్టుకు వచ్చి మమ్మల్ని ఆచారం, మాడి, సాంప్రదాయం అని నోరెత్తకుండా చేశారుగాని నేనూ, మీ అమ్మ కోడలిగా రాకపూర్వం అలా ఎగిరి పడ్డదాన్నేరా! తాడిబట్టలు మా ఒంటి మిదే ఆరిపోయేవి! పూజలు, వంటలు అయ్యేసరికి అపరాహ్ణం అయ్యేది!
అంతవరకు నోట్లో పచ్చి మంచినీళ్ళు కూడా పోనేవాళ్ళం కాదు. ఈ సిటిలో వచ్చి పడ్డాక కాలానుగుణంగా కొంచెం కొంచెంగా మరి పోయం! చివరికి మీ అమ్మ ఏవ్ ఇంటికి కోడల్తే వచ్చాక 'ఇది తినొచ్చు ఇది తిన కూడదు' అని లేకుండా మీ నాన్న ఈ ఇంట్లో కోళ్ళూ, కుక్కలు వండించటం మొదలు పెట్టాక పూర్తిగా అయిపోయింది మాపని! 'నలుగురితో నారాయణా అని మనసును చెప్పకోడం మొదలు పెట్టాం!"
అజిత్ ముఖం కొంచెం నల్లబడ్డట్టుగా అయింది "మమ్మీని డాడి పెళ్ళి చేసుకోవడం నీకూ, తాతయ్యకూ ఇష్టం లేకుండానే కరిగిందా?' అనడిగాడు.
]
"అప్పటికే మా ఇష్టాఇష్టాలను పట్టించుకినే స్ధితి ధాటి పోయాడురా మీ నాన్న మీ అమ్మని ఇంటికి తీసుకువచ్చి 'ఇదిగో మీ కోడలు' అని చెప్పేంతవరకు వాడి పెళ్ళి సంగతె మాకు తెలియదు. ఎక్కడో ఆశ కొటుకులాడుతూ ఉండేది. వాడి మనసు మారద, త్రిపురని కాపురానికి తెచ్చుకోడా అని! మీ అమ్మని వాడు పెళ్ళి చేసుకు తీసుకు రావడంతో ఆ ఆశ ఆడగంటా నాశనమ్తెపోయింది. త్రిపుర జీవితం బండల్తే పోయింది కదా అని! నేనెంత క్రుంగి పోయానో" అప్పుడు ఆవిడ ఎంత బాధపడిందో దాని తాలూకు చాయలు ఇప్పడా మే ముఖంలో తారాడ సాగాయి.
"మీ అమ్మ చదువుకొంది! తనేకేంతో తెలుసునను కుంటుంది. ఎంతో సంస్కారం పరురాలినన్నట్టుగా ప్రవర్తిస్తుంది. కానీ ఎక్కాడుంది ఆ సంస్కారం? తన సాటి ఆడదాని స్ధానాన్ని ఆక్రమించుకోడానికి ఆ సస్కారం, ఆ చదువు అడ్డు రాలేదే అనుకొంటూ ఉంటాను. భార్య బ్రతికే ఉన్న వాడిని పెళ్ళి చేసుకొని, ఆ భార్య నిండు జీవితంలో నిప్పులు గ్రుమ్మరించానని మీ ఆమ్మకు ఎప్పుడు తట్టదా అనుకోంటూంటాను!"
"నాయనమ్మ!" అజిత్ ముఖం బాగా వివర్ణమ్తెంది. తన తల్లి డాడి మొదటి భార్య బ్రతికి ఉండగానే ఆయన్ని పెళ్ళి చేసుకుందని తెలుసు! కానీ. ఒక ఆడదాని జివితం నాశనం మనిషిగా తనకేప్పడూ తట్ట లేదు. నాయనమ్మ ఆవేదనతో అన్నా ఆవిడ మాటల్లో నిజం కాదన లేనిదీ!