Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 21

    "మీ నాన్న మీ అమ్మని చూస్తున్న దానికంటే బాగానే చూశాడురా మీ తాతయ్య నన్ను!" మనుమడికి చురక  అంటిస్తూన్నట్టుగా అంది యశోదమ్మ.

    "ఈ కాలం దాంపత్యం  బెటరో,  ఆ కాలం దాంపత్యం బెటరో  తరువాత చర్చించుకుందాంగాని డాడి  ఆవణ్నేందుకు వదిలేశారు? ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఎంది? ఆ కథంతా చెప్పు నాయనమ్మ!"

   
    "తెలుసుకొని ఏం చేస్తావురా?  త్రిపురకి జరిగిన అన్యాయాన్ని నువ్వెమ్తెన  సరిదిద్ధగాలవా?"  ఆవిడ  వ్యదగా ఒక ఒక నిట్టూర్పు విడించిది.

    "ఆవిడ పేరు త్రిపురా?"

    "త్రిపురసుందరి  మా పుట్టింట్లో  తరతరాలుగా అంబ ఉపాసన వస్తూంది చాలావరకు ఆ ఇంట్లో ఆడపిల్లల  పేర్లన్నీ ఆవిడ పేరుమీదే పెట్టడం ఆనవాయితి!  త్రిపురసుందరి.  జగదాంబాలు, రాజరాజేశ్వరి, లలిత, శ్యామల,  దుర్గా అంటూ.  నాపేరు మాత్రం మా అమ్మమ్మ కాలంచేసిన  సంవత్సరమే  నేను పుట్టాను కాబట్టి  ఆవిడ పేరు పెట్టుకొంది మా అమ్మ, మానాన్న గారితో  పోట్లాడి,  అక్కడిక్కి యశోద అని పిలువడంతో నాకు అదే స్ధిరపడి పోయింది!"   

    "ఆవిడ మీ అన్నకూతురే కదూ?  అయితే డాడి  మేనరికం  చేసుకొన్నాడన్న మాట!"

    "అన్నకుతురేరా!  నా పుట్టింటితోనే వియ్యమంది పుట్టిల్లు అని అనుకోడానికి లేకుండా చేసుకొన్నాను! మీ నాన్న త్రిపురని ఎలుకోను  అని చెప్పిన  రోజే నాకు పుట్టింటితో సంబంధం తెగిపోయింది!" దుఃఖం తో  ఆవిడ గొంతు  పట్టుకుపోయింది. "మా నాన్నగారు పోయినా,  మా అమ్మ పోయినా మా అన్నగారు నాకు కబురు చేయలేదు. శుభకార్యాలకి లేదు పిలుపు ఆశుభాకార్యాలకి  లేదు పిలిపు యశోదమ్మ అనే ఆడపడుచు ఇంకా బ్రతికే  ఉందన్న సంగతి వాళ్ళు మరిచిపోయి  పాతిక సంవత్సరాల్తెంది!"

    "డాడి  ఆవిడతో  కాపురం ఎందుకు చేయ్యనన్నాడ?  ఆవిడ మంచిది కాదా అందంగా ఉండదా?"

    అందం సంగతి చెప్పాలంటే త్రిపుర కాలిగోటికి సరిపోదు మీ అమ్మ!  ఇక గుణం సంగతి  అంటావా, దాని గుణం దానికి మంచిదే! తనకి నచ్చని విషయాల్లో మనసు చంపుకు  లొంగిపోవడం దానికి చాతకాలేదు. తనకు సరిపడని మనిషిఅనుకొంది త్రిపుర.  విడిపోయారు ఇద్దరు!"

    "డాడి  మమ్మిమిద  ఎప్పడూ  ఆధారతి చేలాయించగా  చూడలేదే! పైగా  మమ్మి మాటను ఎంతో గౌరవిస్తాడు. బలవంతగా తన ఆలోచనలు, అభిరుచులు మమ్మిమిద  రుద్దగా  ఎప్పడూ చూడలేదు నేను!" విస్మయంగా  అన్నాడు అజిత్.

    "తన అభిరుచులకు  సరిపోయిన  పిల్లను ఏరికోరిచేసుకొన్నప్పుడు  ఇక పెచిలేందుకు వస్తాయిరా?  ఇద్దరూ  డాక్టర్లు. ఇద్దరూ సమంగా సంపాదిస్తారు. ఇద్దరూ సమవయస్కులు!"

    "నీ మేనకోడలు ఏవి చదువుకోలేదా?"

    "చదువుకొంది కొంచెం. మీ నాన్న బలవంతం మిదే ట్యూషన్ చధిని ప్త్రేవేట్ గా మెట్రిక్ లేషన్ పాసయింది. అదొక్కటే పేచి అయితే ఇంకా ఎంత యినా చదువుకోనేదేమో, కానీ ,అదొక్కటే పేచి కాదాయె! ఎన్నో! అది సనాతనాచారా  పరుల ఇంటిపిల్ల!  ప్రోద్దున్నలేచి పూజలు, మాది, ఆచారం,  సంగితం.  ఇవే అభిరుచులు దానివి!  మీ నాన్నకి ఆధునికత అంటే చాలా ఇష్టం!  వంటింటిక  అంకితం కారాదు ఆడది'   అనే నినాదం చేసేవాళ్ళలో  చేరినవాడు! తన స్నేహితుల మధ్య అరమరికలు లేకుండా  తిరగామనేవాడు! ఆధునాతనంగా  అలంకరించుకొమ్మనేవాడు?  తనతో  సినిమా లకి  షికార్లకి  ఎప్పుడు పడితే అప్పుడు రామ్మ నేవాడు  వెంట!  వాడిభావాలకి  ఆ పిల్ల అదిరిపోయింది! భర్తనూ కాపురాన్ని వదులుకోడానిక్తేనా సిద్ధపడిందేగాని వాడికనుగుణం గా  మారలేకపోయింది!  పుట్టింట్లో ఉండి పోయింది! తరువాత ఏడాదికి అనుకొంటాను,   మీ అమ్మను ప్రేమించి పెళ్ళి చేసుకిన్నాడు! ఆ సంవత్సరమే చదువు కోడానికని ఇద్దరూ అమెరికా వెళ్ళి పోయారు!"

    "ఆవిడ మళ్ళి మళ్ళి చేసుకోలేదా?"

    "ఎంత పిచ్చి ప్రశ్నరా నిది! మళ్ళి పెళ్ళి చేసుకొనే తెంపరితనమే  త్రిపురకి  ఉంటే,  అదసలు భర్తనే  వదిలేసేది కాదు!  దానికి అలవడిన  సంస్కృతి సంప్రదాయమే  దానికి సంకెళ్ళయినాయి!"

    "భర్త ఉండిలేక,  మళ్ళి పెళ్ళి చేసుకోక-ప్చ్!  ఆమె జీవితం  చాలా అన్యాయమ్తె  పోయింది కదూ,  నాయనమ్మ? బాధనిపించడం లేదూ,  ఆమెను  తలుచుకుంటే?"

    "బాధ పడిపడి నా ఆరోగ్యమంతా చేడగోట్టుకోన్నామరా!  ఇప్పుడు ఇంకేం బాధ  పడతాను? అంతా అయిపోయింది. నా కొడుకు మళ్ళి పెళ్ళి చేసుకోవడమా అయింది!  వాడికి పుట్టిన పిల్లలు పెళ్ళీడుకు  రావడమూ అయింది! ఇంకేం బాధపడను?"

    "ఒకసారి ఆవిణ్ణి చూచిరావాలనిపిస్తూంది!  ఒకసారి  వెడదామా, నాయనమ్మ?"

    "ఏ  ముఖం  పెట్టుకు  రమ్మంటావురా?     'ఇదిగో నాకొడుకు పిల్లడు  ఎంతవాడయ్యడో చూడండి" అని చూపుకోడానికి వెళ్ళనా?"

    "నీకు రావడానికి  ద్తేర్యం  లేకపోతే  సరే! నేనిక్కడిని ఒకసారి వెళ్ళి నీ మేనకోడలిని, నీ పుట్టింటి వాళ్ళనూ చూచి వస్తాను. సరేనా?"

    "అవమానాలేమ్తేలా పొందాలని అంత వేడుకగా ఉంటే అలాగే వెళ్ళు!"

    అజిత్ విస్మయపడి,  " అవమానాలా? నన్నెందుకు అవమానిస్తారు వాళ్ళు?" అనడిగాడు.

    "ఎందుకంటే ఏం చెప్పను?  మీ నాన్న  మూలంగా పొందిన బాధ వాళ్ళెవరూ జీవితంలో మరిచిపోలేనిది!  వాడికో కొడుకు పుట్టి,  ఇంత వాడ్తే తగుదునమ్మ అని చూచి పోవడానికి వస్తే వాళ్ళకు గతమంతా కెలికి నట్టయ్యి బాధకోద్ది ఎద్తేనా అనొచ్చు!  పైగా శుద్ధ ఆచారవంతులు!  మీ అమ్మ వేరే  కుల స్తురాలని తెలిస్తే  నిన్నసలు  గడపలోకే రానివ్వరు!  రాణిచ్చినా,  నువ్వు వచ్చేశాక నువ్వు తాకిన చోటుని నీళ్ళుపోసి కడుక్కుంటారు!"

 Previous Page Next Page