Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 22


     "ఆస్తిని రణధీర్ పేరరాసి, రాజీనిభార్యగా అంగీకరించేట్టు చేశారు. ఒక తండ్రిగా ఆయన అక్కడినుంచి నన్ను విడిపించాలని పోలీసు స్టేషన్ కి  వచ్చారు . విషయం తెలిసిన నేను ఆవేశపడ్డాను.  నా మూలంగా ప్రమాదాన్ని ఊహించిన అప్పారావు  నన్ను తీవ్రవాదిగా  ముద్రించి నా  కథను అంతం చేయాలని మరోపథకం వేశాడు. పోలీసుస అండతో ఆధారాన్ని సునాయసంగా సృష్టించగలిగాడు. మరో రెండు రోజుల నరకం నాకు. చిత్రం చూశావా మేనకా? నన్ను బలవంతంగా అజ్ఞాతంలోకి పారిపొమ్మని పోలీసులు అడగడం మొదలుపెట్టారు. నేను కాదన్నాను ప్రజలముందు నిలబడి న్యాయంకోసం తప్పుచేసి ప్రతిఒక్కడ్నీ నిలదీస్తానన్నాను.... "క్షణం ఆగాడు.

 

     "అంతే, నాశరీరం తూట్లుపడిపోయింది. నాన్నగారు నేరానికి దారుణంగా బలయిపోయాను మరో రెండురోజులపాటు . నాన్నగారు ఒకనాడు అప్పారావు  లాంటివాళ్ళని ఇంటి ద్వారం దగ్గర నిలబెట్టి మాట్లాడగలిగిన స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అంతా కోల్పోయి స్టేషను ఆవరణలో రెండు రాత్రులూ నిలబడ్డారు. నా కేకలకీ , ఆర్తనాదాలకీ  ఓ  అర్థరాత్రి ముందుకు రాబోయిన నాన్న గారిపైనే పోలీసులు చేయిచేసుకున్నారు."

 

      "మానసికంగా అప్పటికే సగం చితికిపోయిన నాన్నగారు స్టేషన్ ఆవరణలోనే ప్రాణాలు కోల్పోయారు. నా కళ్ళముందే చెట్టంత మనిషి కూలిపోతే గుండెలవిసేలా ఏడ్చానుతప్ప ఏం చేయగలిగానని. అమ్మ. మోసపోయిందక్కడే  పోస్టుమార్టంలో గుండె పోటుతో మరణించినట్టు వారు ఆధారాన్ని సృష్టించారు .ఇదంతా చేసిందీ, చేయగలిగిందీ నేను ఒకనాడు గౌరవించిన పోలీసు వ్యవస్థే!"

 

      భావరహితంగా చూశాడు అరక్షణంపాటు.

 

    "ఆ తర్వాత మిగిలిన అమ్మకోసం , మతి భ్రమించిన అమ్మని కాపాడుకోవడంకోసం నా పరంగా ఎలాంటి తిరుగుబాటూ ఉండదని హామీ తీసుకున్నాక పోలీసులు నన్ను విడిచిపెట్టారు. అసాధారణమయిన మలుపు తిరిగిన మా బ్రతుకుల్లో అప్పుడు ఆసరా  అయింది నాన్నగారి మరో స్నేహితుడయిన సూర్యదేవ్ గారు. అనాధలుగా మారిన నన్నూ అమ్మనీ చేరదీశాను. మేనకా, కుప్పకూలిన నమ్మకాలతో బ్రతుకుని మరో మలుపు తిప్పుకున్నది అక్కడే."

 

     "న్యాయవ్యవస్థ కాదు నేను చూస్తున్నది . న్యాయాన్ని సమాధి చేయగల నేరవ్యవస్థ  అని తెలుసుకున్న నాకిక అంతా అఖండ సచ్చిదానందమే."

 

     ప్రసన్నంగా నవ్వాడు కాదు, నవ్వేప్రయత్నం చేసాడు. " సో... మైడియర్ మేనకా. ఆ తర్వాత ఏనాడూ డబ్బుకు ఆశపడని నేను డబ్బుతో దేన్నయినా కొనవచ్చున్న ఆలోచనతో దాన్ని సంపాదించే ప్రయత్నంలో నిమగ్నమయిపోయాను. యూనో,  ఏడాది పాటు డబ్బు విరజిమ్ముతూ స్మగ్లింగ్ లో చాలా డబ్బు సంపాదించిన నేను తొలిసారి ఓడింది   నీవిషయంలోనే. అది కూడా ఓటమికాదు,  నీముందు నిజం చెప్పాలన్న నియమం. ఎస్ మేనకా... నేను  నువ్వనుకునేట్టు రాబిన్ హుడ్ ని కాకపోవచ్చు. కాని ఇప్పుడు నన్ను చాలామంది నిస్సహాయులు ఆరాధిస్తుంటారు. ఓ పెద్ద మాఫియా వ్యవస్థి  సౌథ్ జోన్ ఇన్ చార్జి గా నేను ఇంకా చాలా సంపాదిస్తాను. చాలామందికి సహాయపడతాను.ఎందుకో తెలుసా?  ఇలా బ్రతకడంలో ఎంత ఆనందమున్నదీ అన్న విషయం ఇప్పుడు తెలిసింది కనుక."

 

    చట్టాన్ని ఇంత సునాయాసంగా తీసుకున్న మిత్ర ప్రవర్తున  ఆమెకు అబ్బురంగా ఉంది.

 

    "మేనకా.... అర్థరాత్రివేళ ఊరి పోలిమేరతోటలో రాలిపడిన నక్షత్రాల్ని ఏరుకుని జేబులో దాచుకుంటానన్న మిత్ర చచ్చిపోయి చాలా రోజులైంది.ఏదీ  ఆ పండువెన్నెల మత్తులాంటి నీ నవ్వేది? పొగడపువ్వుల గాలిలాంటి ఆప్యాయతేదీ అంటూ వెతక్కు ప్రొసీడ్."

 

     ఆమెతో నడుస్తుండగా ఎదురొచ్చింది వనిత.

 

    "మేనకా!"    

 

    టక్కున ఆగింది

 

    "ఈమె. వనిత. ఒకనాడు ఆశ్రయమిచ్చిన సురేద్రదేవ్ గారి కూతురు ఈ ఇంటి యజమానురాలు."


    వనిత కిదంతా బోధపడలేదు. మేనకకు ప్రతి నమస్కారం చేసింది.    

 

     వెళుతున్న   మేనకకు అనిపించిందొక్కటే- ఆ ఇంటి యజమాని  మిత్రకాదు. వనితోపాటు తనూ ఉంటున్నాడు.అందమో, సంస్కరమో వనిత చాలా ఆకర్షణీయంగా ఉంది.

 

     క్షణం పాటు రక్తప్రసరణ స్థంభింపజేసిన ఆలోచిన అది.

 

     ఓ రాత్రి  జాగరణకీ , కొన్ని గంటల అంతర్మథనానికీ లోనై మిత్రని అరెస్టుచేసిన మేనక ఆ తర్వాత పావుగంటకే ఎంత అప్రతిభురాలైందీ అంటే, స్టేషన్ కివెళ్ళేసరికే అతని లాయరు బెయిల్ తో సిద్ధంగా  ఉన్నాడు.


    
     అవాక్కయింది.

 

    సీజన్డ్ క్రిమినల్ లా నవ్వాడు మిత్ర.

 

    అది ఆమెను రెచ్చగొట్టలేదు.

 

     ఇక్కడ గెలుపూ ఓటముల సమస్యకాదు. చట్టంలో సుదుద్దేశంతో ఏర్పాటు అయిన 'బెయిల్' ఇప్పుడుల డబ్బు మూలంగానో, చట్టంలోని లొసుగుల మూలంగానో దుర్వినియోగమవుతూంది.

 

    " మిస్  మేనకా! అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా మీ కర్తవ్యాన్ని మీరు అద్బుతంగా నిర్వహించారు.మార్గంలో నేను బయటకి వెళుతున్నాను. నిన్న రాత్రి నేను పోగొట్టుకున్నది ఎంతయినా రెవిన్యూ ఇంటెలిజెన్స్ కోసె బంధించిన ఈ కోసులో సునాయసంగా తప్పించుకోగలనని మాత్రం  మీకు తెలియజేస్తున్నాను.ఇప్పటి నేనేమిటో అన్నది మీకు స్పష్టంగా తెలిసే   ఉంటుంది. కాబట్టి ఇక పోరాటాన్ని ఆపుచేస్తారో, కొనసాగిస్తున్నారో మీ ఇష్టం.... బై."

 

    " ఆగు! నీతో పర్సనల్ గా మాట్లాడాలి" నెమ్మదిగా అంది.

 

    " చెప్పండి."

 

    "ఇక్కడకాదు."

 

    "మరి?"

 

    చెప్పింది.

 

                     *    *    *    *


    
     "వెల్ కం" సాదరంగా ఆహ్వానించాడు విశ్వామిత్ర.


    
     మునిమాపువేళ బీచ్ లో ఆ  ప్రాంతం నిర్మానుష్యంగా వుంది. సమీపంలో  సముద్రపు హోరు శోకపు చివరి ఆర్తగీతంలా అనిపిస్తూంది.

 

     మేనక నడిచింది నిశ్శబ్దంగా.


    
     ఇసుకలో కూరుకుటున్న ఆమె పాదాలు ఊబిలో నడుస్తున్న అనుభూతిని అందజేస్తుంటే " మిత్రా!" అంది తలవంచుకుని.

 

    గాలి ప్రభంజనంలా ఉధృతమవుతూంది. నేఘావృతమైన ఆకాశం ఏ క్షణంలోనయినా వర్షించేట్టుగా ఉంది.


    
     మిత్రసైతం ప్రశాంతంగా లేడు.

 Previous Page Next Page