Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 21


     "అఫ్ కోర్సు.... ఆడా మగా మధ్య అందులోనూ మనలాంటి సంబంధం ఉన్నవాళ్ళు ఆ సబ్జెక్టుని  బాగా బెడ్ రూంలోకి  నడిచింది.

 

     "గుడ్...రైట్ ప్లేస్  లోకి వచ్చావు. యి నో, రేపు మన పెళ్ళయ్యాక మనం ఎక్కువుగా  గడిపేది ఈ గదిలోనే బాగుందా?"

 

    యధాలాపంగా చూసింది " మిత్రా, ఓ భార్య కేరెక్టర్ ని అనుమానించింది. కాని అది బలంగా నిర్థారించే అవకాశం లేకపోయింది. ఓ స్వామీజీ ఇంటికి వస్తే సంగతి చెప్పి సహాయన్ని కోరింది.అప్పుడు స్వామీజీ భర్త సమక్షంలోనే తన దగ్గరున్న ఓ ఖాళీ సీసా ఇచ్చి ప్రతిరాత్రీ గ్లాసుడు మంచినీళ్ళు అందులో పొయ్యమన్నాడట."

 

    " పోస్తే ?"

 

    "ఆలస్యంగా ఇంటికి వచ్చే అలవాటున్నభర్త ఒకవేళ బయట వ్యభిచారం చేస్తే ఆ  నీళ్ళూ తెల్లారేసరికి నల్లగా మారిపోతాయని."

 

    "అదెలా సాధ్యం?"

 

    "అని ఆ భర్త అనుకోవాల్సింది. కాని పొరపాటు పడ్డాడు.ఎలాగో తెలుసా?" క్రమంగా ఆమె ముఖకవళికవల్లో మార్పుచోటు చేసుకుంటూంది. " తెలివైన భార్య, ఓ అర్థరాత్రి భర్త పడుకున్నాక లేచి నీళ్ళలో సిరా కలిపింది.తెల్లవారుజామున నిద్ర లేచిన భర్త ఆ నల్లగా మారిన  నీళ్ళను కంగారుగా పరాబోసి  మళ్ళీ మంచినీళ్ళు పోశాడట.  ఇక్కడ భర్త చేసిన పొరపాటు...."

 

     "తెలివితక్కువగా తన తప్పును తెలియచెప్పడం " ఆహ్లాదంగా నవ్వేసిన మిత్ర వెంటనే అన్నాడు.  " నేరస్థుల్లో  ఇంతకన్నా మూర్ఖులు ఉంటారు.   ఓరోజు  ఒక అమ్మాయి ని రేప్ చేశాడు. ఆ తర్వాత అమ్మాయి పోలీసు కంప్లెయింటిచ్చింది. నీలాంటి పోలీసాఫిసర్ అనుమానితులందరితో పెరేడ్ ఏర్పాటు చేసింది. చిత్రంగా ఆరేప్ చేసినవాడు ఆ వరుసలో నిలబడి ఉన్నాడు.ఇందులో నిన్ను రేప్ చేసిందెవరూ అంటూ అమ్మాయిని అడిగింది పోలీసాఫీసరు.అమ్మాయి వరుసగా అందర్నీ చూస్తూందీ తప్ప  గుర్తుపట్టలేకపోయింది.అమ్మాయి అజ్ఞానానికి చింతించిన సదరు నేరస్థుడు తొందరపాటుతో ' ఈ అమ్మాయే' అంటూ అసలు సంగతి కక్కేశాడు తనే" ఫకాలున నవ్వేసిన మిత్ర ఆమెలో ఎలాంటి చలనం లేకపోయేసరికి " అదేమిటి.... నీలో అస్సలు రియాక్షన్ లేదే?"  అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ.

 

     "మిత్రా " ఆమె తలవంచుకుంది.
    


     అప్పుడు చూశాడు ఆమె కళ్ళనుంచి నేలపైకి జారి న ఓ నీట బొట్టుని.

 

     "నువ్వు తెలివైనవాడివి మిత్రా. కాబట్టే నేను ప్రయాస పడకుండా నీ  నేరాన్ని  ఒప్పుకోవాలి అలా అయితే..." ఆమె అంది బాధగా, " నీ గట్స్ ని ఈ స్థితిలో సైతం నేను మెచ్చుకుంటాను. నేను అదృష్టవంతురాలినా, దురదృష్టవంతురాలినా అన్న సమస్యని ఇప్పుడు చర్చిచబోవడంలేదు మిత్రా!" ఆమె తలవంచుకుని చెప్పుకుపోతూంది  ఇంకా.    "ఒకనాడు నువ్వు ఆరాధించిన చట్టాన్ని ఈరోజెందుకు మోసం చేస్తున్నావు? విచిత్రంగా నువ్వు తయారుచేసిన  మేనక చేతిలో ఎందుకు చిక్కిపోయావు అంటూ నేను అడగను. ఇట్సాల్ మై ఫేట్ అంటూ సరిపెట్టుకుపోయింది.

 

     ఆగదిలో నిశ్శబ్దం పేరుకుపోయింది.

 

    ఇలాంటి సన్నివేశం ఎదుర్కోవాల్సి వస్తుదని తెలిసినా,ఇంత తొందరగా ఎదురవుతుందని ఊహించని మిత్ర నిర్లిప్తంగా కిటికీలోంచి  బయటకు చూస్తున్నాడు.

 

    రెండు నిముషాలు గడిచాయి.

 

    ముందు తేరుకున్నది మేనక మేనక  "నువ్వు ఇంక  ఏ కథ చెప్పిన నేను నమ్మలేను మిత్రా. నువ్వోస్మగ్లర్ వి. ఆమెను సమీపించాడు. " ఈ  ప్రపంచాన్నంతటినీ మభ్య పెట్టగలను. మోసం చేయగలను కాని నీతో అబద్ధం చేప్పలేను..... ఎస్. నేను స్మగ్లర్ ని."

 

    ఆమె వాడిచూపులకి తట్టుకోలేనట్టు తల తిప్పుకున్నాడు.

 

    " నేను హంతకుడ్ని కాదు మేనకా,వట్టి స్మగ్లర్ ని మాత్రమే . నా వృత్తి వ్యవస్థని  దోచుకోవడం కాదు నువ్వు నిలబడ్డ పోలీసు వ్యలస్థని వంచించడం, అలా వచ్చినదాన్ని..."

 

    "వద్దు. నాకే సంజాయిషీ అక్కర్సేదు. నేను తెలుసుకోవాలనుకుంటున్నది నువ్వు రాబిన్ హుడ్ అవునా ,కాదా అనికాదు . నువ్వు నేరం చేశావా, లేదా అని. ఓ. కే.ఎందుకు?" ఆమె చెంపలపై నీళ్ళు ధారపడుతున్నాయి. " ఒకనాడు నేను పోలీసాఫీసర్ని కావాలి అంటూ కోరి నన్నీ మర్గంలోకి మళ్ళించిన  నువ్వెందుకు నేరస్థుడిగా ఈ మార్గాన్ని ఎన్నుకున్నావు?"

 

    "నేను నమ్మిన నీ వ్యవస్థ నాకు చేసిన గాయం" మిత్ర కళ్ళలో ఎరుపుజీరలు చోటుచేసుకున్నాయి.

 

    "ఎస్. మేనకా. మనిషికి అతిచేరువగా ఉంటూ మనిషిని రక్షించగలిగేది పోలీస్ వ్యవస్థే నంటూ చెప్పినా నేను నీ   డిపార్ట్ మెంట్ మూలంగా ఎంత దెబ్బతిన్నానూ అంటేనా నరాలు చిట్లిపోయాయి. గుండె అరలు పగలిపోయాయి. నాన్నగారు పోయింది పోలీసులే చేశారని నిరూపితం కాని హత్యలో"

 

    విభ్రమంగా చూస్తూందామె.

 

    "నేను చెప్పింది నిన్ను నమ్మమనను. నమ్మి నాకు సహాయం చేయమనను. నీకు మాత్రమే నేను నిజంచెబుతాను. కమాన్" ఆవేశం ఆమె చేయిపట్టుకుని ఓ గదిలోకి నడిపించాడు.    

 

     అక్కడ మిత్రతల్లి భారతి ఉందిఆమె మతి భ్రమించిన దానిలా చూస్తుంది ఎటో. ఆ కళ్ళ జీవంలేదు.

 

     " గుర్తుందా మేనకా? ఈవిడెవరో తెలుసా? ఒకనాడు నా చెల్లి రాజీలాగే నిన్నూ తన  పక్కన కూర్చోబెట్టుకుని , నీకు అన్నంతినిపించిన మా అమ్మ భారతీదేవి.ఇప్పుడు ఆలోచించలేదు మతి భ్రమణంతో . మాట్లాడనూలేదు గొంతు మూసుకుపోయింది మేనకా! తరతరాలుగా ఈదేశంకోసం, ఈ నేల కోసం తపించి ప్రాణాలు వదిలిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల ఇంట పుట్టున అమ్మ ఇలా చైతన్యాన్ని కోల్పోవడానికిక కారణం నీ  వ్యవస్థ!"

 

     "ఎంతటి సాంప్రదాయకరమయిన కుటుంబం నాది! ఒకనాడు దాతృత్వంలో ఔదార్యంలో ఎవరు సాటి అనిపించుకున్న నాతండ్రి రాజారావు బ్రతుకు ఎలా ముగిసిందీ నువ్వూహించలేవు మేనకా! మనుషుల్ని ప్రేమించడం , మనిషిని రక్షించలిగే చట్టాన్ని గౌరవించండమే ఒకనాడు నాకు చేతనయిన విషయాలు అంటే, కారణం నా తండ్రి ఆయన  ఆలోచనలు! ఆలోచనలు! అలాంచి మా నాన్నాగారు తన ఆస్తిని వెచ్చించి, అతన్ని ఓ ఎమ్మెల్యేని  చేయగలిగారు. అక్కడే మొదలయింది అసలు పతనం. ఒకనాడు నాన్నగారితోపాటు వాళ్ళ ఊరు వెళ్ళింది రాజీ. అక్కడ రణధీర్ అనే ఓ రాక్షసుడు పొంచి వున్నాడని తెలుసుకోలేని రాజీ ఓ రాత్రి వాడి పశుత్వానికి  బలయిపోయింది.ఇది ఊహించని మలుపు. న్యాయం కోసం నాన్నగారు అప్పారావుని నిలదీశారు.అప్పటికే ఓ ప్రజానాయకుడయిపోయిన అప్పారావు ఇది నిజం కాదు పొమ్మన్నాడు."

 

     " ఆ అవకాశవాదికి బుద్ది చెప్పాలని నేను ఆ ఊరు వెళ్ళాను . వాడినుంచి  కాకపోయినా, నేను నమ్మిన పోలీసు వ్యవస్థనుంచి నా చల్లెలికి న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించాను. అక్కడే గ్రహించాను మేనకా. పోలీసు వ్యవస్థ ఓ స్థాయికి దిగజారగలదో  తొలిసారి తెలుసుకోగలిగాను.డబ్బుకీ , పరుపతికీ లొంగిన పోలీసుబలగం అప్పారావుతో చేతుల కలిపి అసలు రణధీర్ నీ చెల్లెలికి ఒళ్ళు కొవ్వెక్కి ఎవడితోనే పడుకుంది.అంటూ బాహాటంగా ఛాలెంజ్ చేశాడు . నిగ్రహాన్ని కోల్పోయిన నేను చెయ్యి చేసుకున్నాను. నన్ను అరెస్టు చేశాడు. మూడు రోజులపాటు అప్పారావుని సంతృప్తి పరచడానికి నన్ను వాళ్ళు పెట్టిన హింసలు నేను బ్రతికినంత కాలం మరచిపోలేని గుర్తులుగా మారాయి. దిక్కుతోచని నాన్న గారు ఆమూడురోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదీ ముందు నాకూ తెలీదు."

 Previous Page Next Page