"పెడితే ఏది?"
అందరం మళ్ళి ఇల్లంతా వెతికాము. చివరకు గ్లేడుతో కోసిన నాలుగు బెల్టు ముక్కలు బయట దొరికాయని ఎదురింటివాళ్లు తెచ్చిచ్చారు.
"ఇది తప్పకుండా చిన్నిగాడి పనే- ఇందాక బ్లేడు కావాలని అడిగాడు నన్ను" అన్నాడుసారధి.
వాడికోసం వెతికాముగాని చిన్నిగాడేక్కడా కనిపించలేదు. నేను పక్కవేపు నున్న మెట్లకింద చూసేసరికి పాతసామాను వెనుక నక్కి కూర్చుని కనిపించాడు.
"ఏం చేస్తున్నావురా ఇక్కడ?" అడిగాను.
"ష్! నాన్నా నాకోసం వెతుకుతున్నారు బాబాయ్! నేనిక్కడున్నా నని చెప్పకు" అన్నాడు వాడు భయంగా
"మారా బెల్టు ఎందుకు ముక్కలు కోశావ్ రా!"
"అవి సమానంగా లేవు బాబాయ్.....అందుకని కోశాను. కాని కుదరలేదు."
వాడిని సారధికి పట్టివ్వడానికి నాకు మనసాప్పలేదు. వాడికోసం వెతికి వెతికి ఇంక వెతకలేక వేరే పని చూసుకోసాగాడు సారధి.
అప్పుడు వెనుకనుంచి ఇంట్లోకి చ్రుకుని మంచంకింద హాయిగా నిద్రపోయాడు వాడు.
చివరకు పక్కింటాయనాను నిద్రలేపి వాళ్ళ బెడ్డింగ్ తాలూకూ బెల్టులు అప్ప తీసుకున్నాము తీరా బెల్టులు కట్టపోతే బెడ్డింగ్ ఏనుగులా బలిసిపోయి బెల్టులు కండకుండా పోయింది. సారధి గాడూ నేనూ దాని మీదెక్కి కూర్చుని మరి ప్రయత్నించాము. అయినా అది లోంగాలేదు.
"లోపల బట్టలూ అవి ఎక్కువయినట్లున్నాయ్" అన్నాన్నేను.
"ఓ తలగడ తీసేయడం మంచిది" అన్నాడు సారధి.
ఎవరి తలగడ తిసేయాలా అని చాలా సేపు ఆలోచించాం.
"పోనీ నిది తీసేద్దాం" అన్నాడు సారధి.
నాకు ఒళ్ళు మండిపోయింది.
"మనిద్దరివి తేసేద్దాం" అన్నాను.
"నాకు వెధవది తలగడ లేందే నిద్రపట్టిచావాదేందుకనో"అన్నాడువాడు.
"నాకూ అంతే!" అన్నాన్నేను.
చివరకు ఇద్దరి తలగాడలూ విచారంగా తిసివేశాం అప్పడు పట్టినయ్ బెల్టులు. మరి కాసేపట్లో సూట్ కేస్ లు కూడా రాడి అయిపోయాయ్.
ర్తెలు తెల్లారు జామున అయిదుగంటలకు అంటే మేము కనిసం మూడన్నరకయినా నిద్రలేవాలి. ఆడాళ్ళకు వంటపని ఉండనే ఉంది.
"మూడున్నరకు మెలకువ వస్తుందో రాదో...." అనుమానంగా అన్నాడు సారధి.
"పోనీ ర్తేల్వేస్టేషన్ కి ఇప్పడే వెళ్ళిపోయి అక్కడే పడుకుంటే?" అడిగింది వాళ్ళావిడ గొప్ప అయిడియా ఇచ్చనన్న ఫోజుతో.
"పడుకోవచ్చు! అయిడియా చాలా బావుంది. సూపర్స్ బ్రెయిన్ ఒప్పకుంటాం , కాని తెల్లారి లేచేసరికి మన వంటిమీద బట్టలతో సహా ఊడదిసుకుపోతారు."
"ఎవరు?"
ర్తేల్వేస్టేషన్లలో దొంగలు ఎంత కిటకిటలాడిపోతుంటారో మాకు బాగా తెలుసు. పెద్ద స్టేషన్స్ అన్నిటిలోనూ ర్తేల్వే పోలిస్ స్టేషన్ ఒకటి ఉంటుందిగాని వాళ్ళు దొంగల జోలికి పోరు. దొంగలు వాళ్ళ జోలికి పోరు. ఇలా అని మా ప్రెండ్ రామచంద్రం చెప్పాడు. వాడు ఓసారి మా ఊరు ఏదో పనిమీద వచ్చాడు.
రెండు రోజులున్నాక మేమంతా వాడికి సెండాఫ్ ఇవ్వడానికి స్టేషన్ కెళ్ళం. కాసేటికి తర్వాత ర్తెలు ప్లాట్ ఫారం మీద కొచ్చింది. వాడు తన సూట్ కేస్ స్లీపర్ కోచ్ లో తనకు ఎలాట్ అయిన బెర్తుమీద పెట్టి ప్లాట్ పారం మీదకు దిగి మాతో రెండు ముక్కలు మాట్లాడి "ఇంక మీరు వెళ్ళాండ్రా! ఇప్పటికే బాగా లేటయింది" అని చెప్పి తను కోచ్ లోకి వెళ్ళాడు. నాలుగడులు వేశామో లేదో వాడు వెనుక నుంచి పరుగుతో అరుస్తూ వచ్చాడు.
"ఏమిటి? ఏమయింది?" అంటూ ఆశ్చర్యంగా అడిగాను.
"నా సూట్ కేసు కొట్టేశారు."
"ఎలా?"
"వెనుక వేపునుంచి."
అందరం ర్తేల్వే పోలిస్ దగ్గరకు పరుగెత్తాము
ఇన్ స్పెక్టర్ మమ్మల్ని చూడగానే మొఖం మాడ్చుకున్నాడు.
"నా సూట్ కేస్ కొట్టేశారండి-ప్లిపర్ కోచ్ లో నుంచి" అన్నాడు రామచంద్రం.
"ఎప్పుడు?"
"ఇప్పడేనండి."
"ఏటైన్ లో ?"
"సర్కార్ ఎక్స్ ప్రెస్ లో."
"ఆ సూట్ కేస్ లోపలేందుకు వదిలావ్?"
"నా బెర్తుమీద పెట్టుకున్నాను"
"మళ్ళి కిందకెందుకు దిగావ్?"
"మా ప్రేండ్సుతో మాట్లాడ్డానికి."
"సూట్ కేస్ ఎక్కువా, ప్రేండ్సుతో కబుర్లేక్కువా?"
"ముందు సూట్ కేస్ తీసుకుపోయిన వాడిని పట్టుకోండి సార్! ఇంకా స్టేషన్ ఏరియాలోనే ఎక్కడో ఉంటాడు."
"నీ పేరేమిటి?"
చెప్పాడు మావారు.
"నీ అయ్యా పేరేమిటి?"
అది చెప్పాడు.
"నీ తాత పేరేమిటి?"
"తాతదా! అదెందుకు."