"నీ సర్విస్ లో ఉండగా నువ్వు ఒక్కడికి సహాయం చేసిన పాపాన పోలేదన్న విషయం అందరికి తెలుసు ఎవడికి సహాయాలు చేయనివాళ్ళకు సహాయం చేయడానికి మేము వెధవలం కాదు." శివానందం నిష్చేఘ్టడయ్యాడు.
బహుశా ఆ నిజాన్ని అంత డ్తెరెక్టగా చెప్పిన మొదటి వ్యక్తి శారదే ఆయుంటాడు.
"నేను సహాయాలు చేయలేదా?"
"ఆ రోజు నేనా ట్రూ కాఫిన్ కొచ్చినప్పుడు ఏమన్నారు? రూల్స్, డిజిప్లన్ అంటూ వంకాయ్ కబుర్లు చెప్పారు. కనిసం కూర్చోమని కూడా అనలేదు. సాయంత్రం నాలుగింటికి రూల్ ప్రకారం వచ్చ్చి సంతకం తీసుకొమ్మన్నారు. రూల్స్ డిజిప్లిన్ అని ఏడ్చేవాడు ఇతరుల దగ్గర కూడా రూల్స్ ,డిజిప్లిన్ తోనే అఘోరించాలి అంతేగాని ఇలా వచ్చేసి పచ్చళ్ళు తీసుకెళ్ళండి, వంకాయలు తీసుకెళ్ళండి అంటూ గోంగూర ఆబ్లిగేషన్స్ అడక్కూడదు" అన్నాన్నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.
"మేము పెద్ద మనుషులం కాబట్టి-మా అనుమతి లేకుండా మా కుర్చీలో కూర్చున్నందుకు సహించి ఊరుకున్నాం ఇదే ఇంకోకరయినట్లయితే తన్ని బయటగ్గేంట వాళ్ళు" అన్నాడు సారధి.
ఆ మాటతో చతుక్కున కుర్చీలో నుంచి లేచి నించున్నాడు శివానందం.
"మీకు మేనర్చే తెలిదు. అందుకే ఇష్ట మొచ్చినట్లే మాట్లాడు తున్నారు" అన్నాడు కోపంగా .
"ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు బాగా తెలుసు! నువ్వేం నేర్పించాక్కర్లేదు" అన్నాడు సారధి.
"అయితే గెజిటెడ్ ఆఫీసర్ తో ఇలాగేనా మాట్లాడడం?"
"బోడి గెజిటెడ్ ఉద్యోగం నువ్వూనూ! ఎవడిరెక్కువోయ్ నీ కక్కుర్తి ఉద్యోగం? ఫో బయటకు ఫో!"
ఈ హడావిడికి మా భార్యామణులు పరుగుతో బయటికొచ్చారు. అదే సమయానికి మా చుట్టూప్రక్కల వాళ్ళుకూడా పిల్లా జెల్లా అంతా మూగిపోయారు.
"ఏమిటి నాది బోడి గెజిటెడ్ ఉద్యోగమా?"
"కాపోతే ఏమిటోయ్ ఉష్ణపక్షి! మాకు తెలిసిన ప్యూన్ ఒకడు గెజిటెడ్ అయిపోయాడు ర్తేల్వేలో మాకు చెప్తావేంటి గెజిటెడ్ అయిపోయాడు ర్తేల్వేలో మాకు చెప్తావేంటి గెజిటెడ్ పోస్ట్ గురించీ."
"నన్ను అవమానించినందుకు మీ మీద పోలిస్ రిపోర్టిస్తాను" మెట్లు దిగుతూ అన్నాడతను.
"వాళ్ళు రెండు తన్ని నిన్నే లాకఫ్ లో పడేస్తారు."
అందరూ ఘొల్లున నవ్వారు. పిల్లలు కొంతమంది తప్పట్లుకూడా కొట్టారు.
"సరే చూస్తానుగా-"
"కళ్ళజోడు పెట్టుకుని చూడు, సరిగా కనబడిచావదు నీకు" అన్నాన్నేను.
మళ్ళి అందరూ ఘొల్లున నవ్వులు.
దాంతో శివానందం పలాయనం చిత్తగించేశాడు. ఆ రోజంతా చుట్టూ పక్కవాళ్ళందరూ ఈ సంఘటన గురించీ మహదానందంగా చెప్పుకుని నవ్వసాగారు.
ఆ రాత్రి బెడ్డింగ్ లో బట్టలు సర్దటం ప్రారంభించాం చిన్నిగాడు మాట్లాడితే కాళ్ళకూ చేతులకూ అడ్డం పడటం చూసేసరికి సారధికి వళ్ళు మండిపోయింది.
దుప్పటి బెడ్డింగ్ లో పరుద్దమంటే చిన్నిగాడు దాని మీదే నిలబడి ఉంటాడు. తలగడ బెడ్డింగ్ లో పెడదామని తెస్తే అది కనిపించదు. ఇల్లంతా వెతికాక చూస్తే చిన్నిగాడు దానిమీదే కూర్చుని ఉంటాడు. కార్చి ఫ్ లు ఆఖరికి వాడి జేబులోనే దొరికాయి. అందులో రెండింటికి చిమిది ఉంది.
"నువ్వెళ్ళి చదువుకోరా!" విసుక్కున్నాడు సారధి
"చదువుకుంటాగాని డాడి దేవుడు ఎన్టి రామారావ్ నీ ప్రధాన మంత్రిని చేస్తాడు కదూ?"
నేను ఆశ్చర్యపోయాను.
"అదేమిట్రా!నీకు ఎన్టిఆర్ అంటే అంత ఇష్టమా?"
"అదికాదు బాబాయ్ -మన ప్రధానమంత్రి ఎవరని అడిగితే ఎన్టి రామారావ్ అని రాశాను మా యూనిట్ టెస్టులో ఇంటికొచ్చ్చాక చూస్తే ఎన్టిఆర్ ముఖ్యమంత్రి అని ఉంది. అందుకని టిచర్ మా పేపర్స్ దిద్దే లోగానే దేముడు ఎన్టిఆర్ నీ ప్రధాన మంత్రి చేయాలనీ దణ్ణం పెడుతున్నాను."
నాకు నవ్వాగలేదు.
"నీలాంటివాళ్ళు నలుగురుంటే చాలు క్లాస్ టిచర్ కి పిచ్చెక్కి పోతుంది" అండి వాళ్ళమ్మా.
"అవునమ్మా! మా టిచర్ కూడా అదే అంది."
"ఏమని?"
"వచ్చే ఏడు నీతోపాటు స్కూలు కొచ్చే తమ్ముడు గాని, చెల్లెలు గాని ఉన్నారా అనడిగింది ఇంక్కేవ్వరూలేరు టిచర్, మా ఇంట్లో నేనిక్కడితే చిన్నపిల్లాడినీ!" అని చెప్పాను.
"అయితే టిచర్ ఏమంది?"
"బ్రతికించావ్ రా నాయనా! అందమ్మా."
తీరా బెడ్డింగ్ అన్ని కట్టేశాక బెల్టులకోసం వెతకటం ప్రారంభించాము.
"అదేమిటి! నేను ఇంతకుముందేకదా బెల్టులు తెచ్చి ఇక్కడ పెట్టింది?"
"మీరు తెచ్చి ఉండరులెండి...అవలే మతిమరుపు" అందామె నవ్వూతూ.
"మతిమరుపు కాదె-నేనే స్వయంగా తెచ్చి ఇక్కడ పెట్టాను."