Previous Page Next Page 
ఋషి పేజి 21

    పౌర్ణమినాటి రాత్రి. నిండు గోదావరిలో పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగే అనుభూతి. ఈ అనుభూతి చాలాదూ ఒక మనిషి  జివితాకాలం గడపటానికి?

    "ఏమిటాలోఛిస్తున్నావ్?" అలవోకగా పక్కమీదకు వాలి  అంది ఆ అమ్మాయి....

    మాట్లాడలేదు నేను___ ఆమెనే చూస్తూ వుండిపోయేను. చిరేకి జాకేట్టుకి  మధ్య , సముద్రపు తిరానే  స్ధిరంగా నిలబడి యుగయుగాలుగా ఆ అలల  తాకిడికి సున్నితత్వాన్ని ఆపాదించుకొన్న కొండరాళ్ళ నునుపు సెక్స్ కాదు, ఉద్విగ్నత.

    "ఏమిటి  కొంపదీసి ఈ గంటూ యిలా ఏదో ఆలోచిస్తూనే గడిపేస్తా వేమిటి బాబూ?"

    అడుగు ముందుకేసి- ఆమె చేరువై- ఆ స్పర్శలో- ఆ గుండె  చలనపు సవ్వడి, తరతరాలుగా స్త్రీని పురుషుణ్ణి ఏకంచేసే రాగబంధం___ లయ, ఏ వాద్యకారుని వెళ్ళు సుతారంగా మిటుతున్నాయో_

    ఆమె చెయ్యి లైట్ మీదకు వెళ్ళబోయింది- వారించాను.

    లైటార్పితే____

    ఇంత ఆనందం  ఎక్కడుంది?

    అనుభూతిని ఆవేశం డామినేట్ చేసి, కోరిక - సెక్స్ - వల -శవం  వర్షం-అమ్మ - జ్వాల- ముసుగు -చీకటి - కోరిక - నలుపు.

    ఈ వెలుతురులో__ఈ అమ్మాయి _ ఈ అపరంజి బోమ్మ__ తన జీవిత సర్వస్వం! తన  సర్వ స్వాన్ని దోసిలి పట్టి ఆమెకి అర్పిస్తాడు తను. ఆ వెచ్చని కనురెప్పల మాటున ఈ ప్రపంచంలోని బారువుల్ని బాధల్ని మర్చిపోయి విశ్రమిస్తాడు. ఈ సాయం చేసినందుకు గాను తను జీవితాంతం ఆమెకు బందిగా వుంటాడు. తను అనురాగపుసౌధంలో ఆమెనో మహారాణినిచేసి కూర్చోబెదతాడు తనకామే____ అఆమెకు తను___జీవితాంతం.

    "ఒక్కక్షణం" అందామె చిరునవ్వుతో.

    "వద్దు, కౌగిలిలోంచి జారిపోకు సాకి...."

    "ఇంత అల్లరి మనిషివి అనుకోలేదు బాబూ" పక్కకు వంగి  హేండ్ బ్యాగ్ లోంచి ఏదో తిసి, తన చేతిలో పెట్టింది. ఉలిక్కిపడి బిగించిన పిడికిలిని నెమ్మదిగా విడదీసి చూస్తే___

    అయిదు ప్తేసల  రబ్బరు తొడుగు- రక్తం  యింకిపోయిన తన మొహంల తెల్లగా!

   
                                                                      8

    కారులో చాల సేపటి వరకూ ఇద్దరూ మాట్లాడుకోలేదు.

    ప్రకాశం  తన యింటి  గుర్తులు చెప్పాడు. కారు అటు  నడిపాడు కుమార్.

    "ఇక్కడాపు" అన్నాడు ప్రకాశం. కారు  పక్కగా  తిసి ఆపు చేశాడు_ "అదే మా ఇళ్లు" అంటూ చూపించి కారు దిగేడు.

    "వెళ్ళొస్తాను. మళ్ళి రేపు కలుస్తాను. అన్నట్టూ మాణిక్యాలరావు ఇంటిలో కలుస్తాం కదూ!ఇంకో విషయం! సుజాత తెలుసా?"

    ప్రకాశం ఉలిక్కిపడ్డాడు.

    "మన క్లాస్ మేట్ , మాణిక్యాలరావు భార్య. అ అమ్మాయే!"

    ప్రకాశం మాట్లాడలేదు. కుమార్ యింక  ఆ విషయమేమి ప్రస్తావించకుండా "ఇప్పుడు నేను చెప్పిన విషయాల గురించీ ఏవి పట్టించు కోకు. ఏదో ఇన్స్ పిరేషన్ లో మాట్లాడేశాను. మరి వుంటాను" అని కారు ముందుకు పోనీచ్చాడు.

    రాత్రి పదయింది విధి అంత దాదాపు నిర్మానుష్యంగా వుంది. ప్రకాశం గుమ్మం ముందు నిలబడి తలుపు వెనక్కి లాగేడు. బోల్డు వదులయి  పడగానే  తోసి  లోపలికి ప్రవేశించాడు.

    ముందు హల్లో పరంధామయ్య, సిత పడుకొని వున్నారు. తలుపు తెరిచిన చప్పడికి పరంధామయ్య కొంచెం కదిలి, మళ్ళి అటు తిరిగి  పడుకొన్నాడు. తన గదిలోకి వెళ్ళి  చీరే పాకెట్టు  బల్లమీద పెట్టి, బట్టలు మార్చుకొన్నాడు ప్రకాశం.

    పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి భోజనం ముందు కూర్చొన్నాడు అన్నం ఐస్ కన్నా చల్లగా వుంది. చారుమీద కరివేపాకు అసహ్యంగా తేలుతోంది.

    ___నెమ్మదిగా భోజనం చెయ్యటం మొదలుపెట్టాడు.

    అతనికి అమ్మ జ్ఞాపకం వచ్చింది.

                                                                             9

    "హల్లో" అన్నాడు కుమార్.

    "మానిక్ రావ్ ఫ్రం హియర్"

    "నేను కుమార్ని."

    "హల్లో  కౌబాయ్ ఏవిటి విశేషం- ఇంత రాత్రి వేళ ఫోన్ చేశావ్?"

    "ఏవి  తోచటంలేదు, ఊరికినే"

    "ఈజిట్- నాకూ తోచటం లేదు. ఆఫ్ కోర్స్ నా కంటే  యాబైఏళ్ళు కాబట్టి నిద్రపట్టకపోవటంలో ఆశ్చర్యంగా లేదనుకో. కానీ నీకేం " బిగ్గరగా నవ్వాడు. "పోనీ ఇక్కడ కోచ్చేయ్యి ఫ్రిజ్  ఓపెన్ చేద్దాం."

    "ధాంక్స్ వద్దు. బై ది బై _ఆ క్లర్కు ప్రకాశం ఎవరో కాదు కాలేజలో మా క్లాస్ మెటు. నా డియరేస్టు ప్రెండ్."

    "అలాగా" మాణిక్యాలరావు గొంతులో ఆశ్చర్యంగా ధ్వనించింది. ఐయామ్ సారి అతని గురించీ ని దగ్గర తేలిగ్గా మాట్లాడాను" నొచ్చు కుంటున్నట్టు అన్నాడు.  

 Previous Page Next Page