Previous Page Next Page 
ఋషి పేజి 20

 

   "అదే బలహీనత.... ఇందులో యెప్పటిక్తేనా ఆనందంకనిపిస్తూందేమో అన్న తపన! అనుభవాల్లోంచి ఏదో పిండేసుకోవాలనిఆశ!"

    "పూర్తిగా తాగేసి ఈ ప్రపంచాన్ని, బాధల్ని ఆనందించేవాడ్ని చూస్తే నాకు ఈర్ష్యగా వుంటుంది. ఎందుకంటే ఆ స్ధితి నాకు రావటం లేదు. తాగుడు  వరకూ   ఎందుకు? సిగరెట్ తీసుకో. ఒక సిగరెట్  తాగుతూ వుంటే దాన్ని తాగటంలో వుండే ఆనందాన్ని  గ్రహించటం నాకు చేత కావటంలేదు. 'ఇదేమిటి? సిగరెట్ . దిన్ని తగటంలో వుండే ఆనందం ఏమిటి? మిగతా వాళ్ళకి దొరికే ఆనందం  నా కెందుకు కొరకటంలేదు?' ఇలాటి ప్రశ్నాలూ__సంఘర్షణ___ఇదే చివరకు మిగిలేది. దూరంగా ప్రేక్షకుడిలా నిలబడి అనుభవాన్ని అనుభవించాలంటే - ఇంక అందులో ఆనందం ఏమీ దోరుకుతుంది?

    అందమ్తెన అమ్మాయి భుజాలచుట్టూ చెయ్యి వేస్తే గాలిబ్ గితం విన్నంత ఆనందం లేదు. ఎక్కడో  తెలీకుండా అస్పష్టతలో అసంతృప్తి.

    ఈ  అసంతృప్తి పోగొట్టుకోవడం కోసం నేను చాలా ప్రయత్నించాను_ రాత్రి పదింటివరకూ  స్నేహితులతో తిరిగి తరువాత రెండింటి వరకూ  బార్ లో  తాగుతూ కూర్చొని ఆ తరువాత ఓ ఐదురూపాయాలిచ్చి ఓ గంట అనుభవించి...ఇలా ఓ సంవత్సరం గడిచింది...కానీ ఇందు లోనూ ఏదో ఎగోని-మళ్ళి నా ఒంటరితనం నాకే మిగిలింది....

    ఈ ఒంటరితనంలో నన్ను నేను నిర్మించుకోవటానికి ప్రయత్నంచాను. పుస్తకాలు చదవటం అలవాటయింది. కిట్స్  నుంచి  కృష్ణ శాస్త్రి వరకూ చదివాను. భావుకత్వం చాలా మంచి స్ధితి. రాత్రంతా  మంచులో తడిసి పొద్దున్నే  లేయెండలో బద్దకంగా   ఒళ్ళు  విరుచుకునే గడ్డిపరకల్లో లాలిత్యం- దూరంగా - పగలూ రాత్రి కలిసిపోయే వేళ- లోకాన్నంతా ఎర్రటి ముసుగులో కప్పేసే  అసురసంధ్యలో స్ధబ్ధత్వం_ వెన్నులో  కొబ్బరి ఆకుల మధ్యనుంచి -వినిలాకాశాన్ని చంద్రుణ్ణి చూస్తూ వుంటే మనసులో స్పందించే అస్దిత్వం__

    ఎవర్నో ప్రేమించాలి!

    ఓ పదహారేళ్ళమ్మాయి.... మల్లెలో స్వచ్చాదనాన్ని ,గులాభిల స్నిగ్ధత్వాన్ని పోగుచేసుకొని వచ్చి  అమాయకంగా తన జీవితాన్ని హరథిగా దోసిలలో వుంచి ఆర్పిస్తుందని....ఈ కృత్రిమమ్తెన వాతావరణాన్ని మర్చిపోయి ఆమె వడిలో సేదతీరాలని- తపన! ఆ ప్రేమ అనే అనిర్వచనియమ్తెన శిక్షని- ఆరాగరంజిత రాసానుబంధాన్ని- అనుభవించాలని కోర్కె!

    వెన్నెల రాత్రులలో విశాలమ్తెన సెలయేటి ఇసుక తిన్నెలమీద ఏ గమ్యమూ లేకుండా వేళ్ళలో వెళ్ళు జొనిపి.... ఆ చెక్కిళ్ళమీదపడే వెన్నెల__ కళ్ళలో ప్రతిబింబిస్తూంటే- నడిచి- హృదయన్నంతటిని ఆక్రమింపచేసిన ఆనందం పొంగి- పరుగెత్తి అలిసి ఆమె చుట్టూ వేసిన చెయ్యి బిగిసి-పక్కనే సెలయేరు సిగ్గుపడి  వంకర్లు తిరిగిపోయి__ ప్తెన వెన్నెల్లా సిగ్గుపడి  చంద్రుడితోపాటు ముబ్బుచాటుకు తప్పుకొని__ జీవితామంతా మూడు నిమిషాల ఘర్షనే  అయితే అందులో గెలవాలని, ఓడిపోయిన అమ్మాయి రెప్పలమాటున సిగ్గు దాచుకుంటుంటే  గర్వంగా చూడాలని....

    ఎంత చిన్న కోర్కె ఇది?

    ఆ రోజుల్లోనే ఒక అమ్మాయితో పరిచయం అయింది. పేరు అంత ముఖ్యమ్తేంది కాదనుకో.


    ఆ అమ్మాయితో నా ఊహసుందర్నీచూడసాగెను. చాలా అందమ్తెన అమ్మాయి, పసిడివర్ణపు చాయ. విశాలమ్తెన కళ్ళూ కుందనపు బొమ్మలా ఉండేది.అ రోజు రోజుకి మా పరిచయం పెరగసాగింది. నా భావాల్ని , కలల్ని ఆమెకు చెప్పాలని ఆ కళ్ళల్లోకి చూస్తూ నన్ను నేను మర్చిపోవాలని కలలు కనేవాడ్ని. కానీ ఎక్కడున్నాయి. ఆ సెలయేళ్లు ఇసుక తిన్నేలూ? 

    ఊహల్లో ఎంతో బావున్న అనుభవం వాస్తవంలోకివస్తే ఎంత నిరాశ కలిగిస్తుందో?

    అప్పటికే చదువు పూర్తయిపోయింది. జీవితంలో దాదాపు సెటిల్ అయిపోయినట్టే నాన్నకున్న పలుకుబడివల్ల ప్రాక్టిసు చాలా తొందరగా పెరగసాగింది. నాన్నకున్న పలుకుబడివల్ల ప్రాక్టిసు చాలా తొందరగా  పెరగసాగింది. ఆశయాలకి, రియలిజానికి ఎంత తేడా వుందో చూడు. నాన్నని అంత  అసహ్యించుకొనే నేను-  మళ్ళీ నా జీవితంలో పైకి రావటం కోసం  ఆయన్నే  ఆశ్రయించవలసి వచ్చింది. నాకున్న క్వాలిఫికేషనుతో ఓ ఆరొందల రూపాయల ఉద్యోగం దొరక్కపోదు- అప్పడి బంగాళా, కారూ వుండవు. రాజీపడాలి తప్పదు జీవితంలో ప్రతి స్టేజిలోనూ రీకెన్ సిలేషన్.

    మొదట్లో ఆమెతో స్నేహం బాగానే వుండేది- కానీ రోజులు గడుస్తున్నకొద్దీ ఏదో అసంతృప్తి. పెసిమిజం కాదు. నాకు బాగా తెలుసు. నేను పెసిమినిస్టునుకానీ, "ఈమె నన్నెందుకు ప్రేమిస్తుంది? యిలా  పెళ్ళి కాకుండా ప్రేమించటం తప్పుకాదా?" యిలా మనసులో కాల్చేసే  ఆలోచనలు దొరికింది ఏదో ఆనందిద్దామని కాదు- అనుభవాన్ని తరిచి చూద్దామనే ప్రవృత్తి.

    ఆమెతో గంటలు తరబడి మాట్లాడాలనే నా ఆశ నెరవేరింది. ఒక రోజు ఎర్రటి ఆసురసంధ్యలో కొండల మధ్య పారే సేలయేటి ఇసుక తిన్నెలమీద కూర్చొనికాదు, ఒక ప్రెండ్ సాయం చేశాడు. లాడ్జిలో రూమ్ బుక్ చేసి తాళం చెవి యిచ్చాడు.

    రూమ్ బాయ్ దగ్గర నుంచీ మానేజర్ వరకూ- అందరి కళ్ళలోనూ కదిలీ కదలనట్టు కనబడే చిరునవ్వుని గమనిస్తూ గమనించనట్టు ఆత్మవంచన చేసుకొంటూ- రూము తలుపులు వేసి......

    అయిదు నిముషాలునేనేం మాట్లాడటంలేదు. ఆ క్షణం ఆమెని చూస్తూ వుంటే నాలో భావుకుడు మళ్ళీ నిద్రలేవసాగాడు.

    __ఆగి ఆగి వీస్తున్న గాలికివూగే ముంగురుల వెనుక-మబ్బులచాటునుంచి వచ్చే పూర్ణచంద్రుడిలా ముఖం__ రాత్రి  కురిసిన మంచు బిందువుల స్పర్శకి సుకుమారత్వాన్ని  ఆపాదించుకున్న గడ్డిపరక లాలిలిత్యం-

 Previous Page Next Page