"ఫర్వాలేదు. అయినా అతను చాలా అమాయకుడు."
మాణిక్యాలరావు ఒక క్షణం ఏవి మాట్లాడకుండా ఆగి___ "ఆ విషయం నేను ఒప్పుకోను కుమార్. అమాయకత్వం ఒక క్వాలిటికాదు. ఆ మాటకొస్తే అమాయకుడు అంటూ ఈ ప్రపంచలో ఎవరూలేరు. ఎవరి పాలసీలు వాళ్ళవి. తాగినవాణ్ని చూసి తాగనివాడు ఎంత జాలి పడతాడో, తగినవాడు తగనివాణ్ని చూసి అంతే జాలి పడతాడు. మనం ప్రకాశాన్ని చూసి "అయ్యో_ ఇఅతను అమాయకుడే "అని ఎలా అనుకుంటున్నావో ప్రకశావూ అలాగే మానని గురించీ "వీళ్ళు చెడిపోయేరు" అని జాలిపడొచ్చు అమాయకుడయినా- చెడిపోయిన వాడయినాసరే- తను నమ్మిన సిద్దాంతాలపట్ల స్ధిరంగా నిలబడేవాడు గొప్పవాడు" అని, "సర్లే- ఈ రాత్రిపూట ఈ వేదాంతం దేనికిగాని___రేపోస్తున్నావ్ గా" అన్నాడు మాట మారుస్తూ.
"తప్పకుండా" అన్నాడు కుమార్.
మాణిక్యాలరావు ఫోన్ పెట్టేసి, సుజాత వ్తెపు తిరిగి, "నీ క్లాస్ మేట్ ఇంకోకథను రేపు మనింటికి పార్టికి రాబోతున్నాడు....?" అన్నాడు.
చదువుతున్న ఫిల్మి పెర్ లోంచి తలెత్తి "ఎవరు ఫోన్ చేసింది?" అని అడిగింది.
"కుమార్ "
సుజాత నవ్వి "రేపోచ్చేది ఎవరుట?" అంది.
"అతని పేరు ప్రకాశం. తెలుసా నీకు?" అని అడిగేడు.
ఒక క్షణం ఆలోచించి "ఏవో మరి, చాలామంది వుండేవారు ఆ పేరుతో ఎవరూ జ్ఞాపకం రావటంలేదు" అంది.
10
ప్రకాశం లోపలికి రావటం పరందాంయ్యకి తెలిదు. కానీ లోపల కంచం పెట్టుకొంటూంటే వినబడిన చప్పడికి మెలకువ వచ్చింది.
వయసు ప్తెబడుతూ వుండటంవల్ల కొంచెం చప్పడ్తెన మెలకువ వచ్చేస్తూంది. ఆ తర్వాత నిర్దపట్టదు.
లోపల ప్రకాశం భోజనం పెట్టుకుని తినడం తెలుస్తూంది.
పరంధామయ్య నెమ్మదిగా పక్కమీద నుంచి లేచేడు.
దూరంగా పదిన్నారో ఎంతో కొట్టిన శబ్దం వినిపించింది. చప్పుడు అవకుండా దండెం మీదనుంచి లాల్చీతిసి వేసుకున్నాడు.
చెప్పులు వేసుకొని, తలుపు దగ్గరగా వేసి చీకట్లో కలిసిపోయేడు.
11
ప్రకాశం చాలా నెమ్మదిగా భోంచేయసాగాడు. బాగా ఆకలిగా వుండటంచేత అతనికి రుచి తెలియటంలేదు. అతనిని చాలా చిన్న కోర్కెలు తను తింటూ వుంటే పక్కనే నిలబడి ఎవర్తెనా వడ్డించాలనీ____
తన తల్లి బ్రతికుంటే?
ప్రకాశానికి నవ్వోచ్చింది. చిన్నప్పడే చచ్చిపోవటంవల్ల తను అలా అనుకుంటున్నాడేగాని, బ్రతికుంటే ఆమె ఎలా వుండేదో ___ కుమార్ తల్లిలా....
అతని ఆలోచన్లు కుమార్ మీదకు మళ్ళినయ్. "అన్ని వుండి ఏవి లేనిస్దితి అతనిది. తనే నయం" అనుకొన్నాడు. ఆ తరువాత అతని ఆలోచన సితమీదకు వెళ్ళింది.
___తను ఓ రోజు రాత్రి ఆలస్యంగా యింటికొస్తాడు. తలుపు తట్టటమే ఆలస్యంగా పరుగెత్తుకొంటూ వచ్చి తీస్తుంది.
"ఇంకా నిద్రపోలేదూ" అంటాడు. ఆమె ఎర్రబారిన కళ్ళని చూస్తూ.
వాలిపోతున్న కనురెప్పల్ని బరువుగా ఎత్తి తనవ్తెపు చూసి నవ్వు తుంది. "ఇదేమిటి- ఇంకా నువ్వు తినలేదు?" అంటాడు ఆశ్చర్యంగా రెండు పిటలు చూస్తూ.
"ఊహు" అడ్డంగా తల వూపుతుంది.
"ఏం?" అడుగుతాడు.
ఆ ప్రశ్నకి జవాబులేదు__ నీ కోసం - నీ ఆప్యాయత గెలవటం కోసం- నీ ప్రేమలోని స్వచ్చాదనం కోసం- నీ దగ్గర దొరికే నిశ్చింత కోసం, నీ సన్నిధిలో స్పందన కోసం- నాలో నువ్వు చూపించే ప్రత్యేకత కోసం....
ఈ ఆలోచనలతో భోజనం ఎప్పుడు పూర్తిచేశాడో తెలిదు_చెయ్యి కడుక్కొని తన గదిలోకి వచ్చేడు. బల్ల మీద ప్యాకెట్టు కానబడింది. దాన్ని తీసుకొని ముందు గదిలోకి వచ్చేడు.
కిటికీలోంచిపడే వెలుతురుతో గదంతో స్పష్టంగా కనిపిస్తూంది. సిత పక్కకి తిరిగి పడుకొని వుంది.
లేపి ప్యాకిట్టు యివ్వడానికి సిగ్గుపడ్డాడు. లేవగానే కనబడేటట్లు బల్లమీద పెట్టి తన గదిలోకి వచ్చేస్తాడు. ఏదో పుస్తకం తిసి చదవటానికి ప్రయత్నించెడు. కుదర్లేదు . మాటిమాటికి ఆ కాబరే డాన్సర్ జ్ఞాపకం రావటం ప్రారంభించింది. న్తేలాన్ తనని ముద్దు పెట్టుకోవటం__
దూరంగా ఎక్కడో గడియారం పదకొండు కొట్టింది. తలపక్కకి తిప్పి చూసేడు- మూల మాసిన బట్టలు పెట్టి, దానిమీద చిందర వందరగా మూతల్లేని డబ్బాలు వున్నాయి. వాటి మధ్యనుంచి ఎలుకపిల్ల కొద్దిగా తొంగిచూసి పక్కకి తప్పుకోంది. దూరంగా యెవరో కుర్రాడు "నను బ్రోవమని చెప్పవే" అంటూ కర్ణకఠొరంగా పాడుకొంటూ వెళ్తూన్నాడు.
ప్రకాశం వెల్లకిలా తిరిగి తలక్రింద చేతుల పెట్టుకొని పడుకొన్నాడు. మంచం పక్కనే గోడకి కట్టిన దండెం లేస్తే తలకి తాగిలేలా వుంది. దానిమీద మాసిన చీరే, లంగా నిర్లక్ష్యంగా విసిరేసినట్లు వున్నాయి. వాటి పక్కనే బ్రాసరి ఒకటి చివరి అంచు పట్టుకొని క్రిందికి వేలాడు తుంది. గాలికి అది ఊగుతూవుంటే దాని నీడ పెద్ద పాములా గోడమీద కదులుతూంది.