ఆ సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వుకోంది రాధ.
అజిత్ మీ అమ్మాయి అభిప్రాయమే ముందు తెలుసు కొమ్మని చెప్పాక, సాధనని అడిగింది రాధ, "అజిత్ మిద నీ అభిప్రాయం ఏమిటి? నచ్చాడా?"
"ఇంకా ఆరునెలల దాకా అతడిక్కడ ఉండడం ఖాయమేకదా, మమ్మి? ఆరు నెలలయ్యాక చెబుతాను నా అభిప్రాయం"
రాధ ఊహించని జవాబు విన్నట్టుగా విస్మయపడింది. "ఎందుకూ! ఇంతవరకు అతడి మిద ఏ అభాప్రాయం ఏర్పడనేలేదా?"
"అప్పడేనా? అతడి అభిరుచులు, ఆలోచనలు, జీవితంపట్ల అతడి ధృక్పధం అన్ని స్పష్టంగా తెలుసుకోవాలి నేను! పదిహేను ఇరవ్తే రోజులలో ఏం తెలుస్తుంది?"
అన్నం ఉడికిందని తెలుసుకోడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలదూ? అజిత్ సహజంగా మంచివాడు! ఇంజనీరింగ్ చదివాడు. ముఖ్యంగా మనకు కావాలసిన వాడు. ఇవి చాలదూ?"
"చాలదు మమ్మి! అంత తొందరెందుకు చెప్ప? అతడింకా ఉంటాడుగా? అభిప్రాయలు, అభిరుచులు అన్ని కలసి దంపతులమ్తెతే మా జీవితాలు సాఫీగా సాగుతాయన్న గ్యారెంటి ఏర్పడినడే అతడితో పెళ్ళికి అంగీకరిస్తాను!"
"నీకు అన్ని కలసి, అన్ని నచ్చినవాడే కావాలంటే నీకి జన్మలో పెళ్ళికాధు!"
తల్లికి కోపంగా వచ్చినా స్దిరంగానే జవాబిచ్చింది సాధన. "మల్లిక్ మామయ్యని చూడు! ఆయన భార్య చాలా అందగత్తేట! గొప్ప పాత గత్తె ట కూడా! ఏ దుర్మార్గాలూ, దురాలోచనలూ తెలియని మనిషి! కడిగిన ముత్యంలా స్వచ్చమ్తెన వ్యక్తిత్వం కలిగిన మనిషట! మరి, మల్లిక్ మామయ్యా ఆమె నుండి ఎందుకు విడిపోయాడు? అందం విషయానికొస్తే ఆమె కాలిగోటికి కూడా సరిపోలని భావన ఆమ్తిని ఎందుకు చేసుకున్నాడు? అందుకనే చెబుతున్నాను, మంచితనం, చక్కటి వ్యక్తిత్వం. అందం-ఇవి మాత్రమే చాలవు! నా తత్వానికి అతడూ, అతడి తత్వానికి నేనూ సరి పోవాలి. ఆ సంగతి తేల్చుకోడానికే ఆరు నెలల గడువు పెడుతున్నాడు!"
కూతురు అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చాక రాధకి ఇక ఏం మాట్లాడడానికి తోచలేదు. అజిత్ ముందు సాధన అభిప్రాయం తెలుసు కొమ్మని చెప్పి బ్రతికించాడు. లేకపోతే, అతడు ఒప్పుకోని, సాధన ఒప్పుకోలేదని తెలిస్తే, పెళ్ళి ప్రస్తావన తామే తెచ్చి తామే అతడిని అవమానించినట్ట య్యేది!
13
పూజ ముగించుకొని బయటికి వచ్చిన యశోదమ్మ, వంటగది దగ్గరికి వచ్చి "బాబుకి పాలు తీసికెళ్ళవా?" అనడిగింది వంటయాన్ని.
"ఆ తీసికెళ్ళనమ్మా!"
"ఇవాళ ఫలహారం ఏం చేస్తున్నావు?"
"ఏం చేయమంటారో మీరే చెప్పండమ్మా!"
"ఆ ఫలహారాలు నేను తింటనా, చస్తానా? వాడికోసమేకదా చేసేది? వాణ్నె అడిగిచేస్తే సరిపోతుంది. ఒకమాట కనుక్కుని వస్తా నుండు!" వెనుదిరిగిన యశోదమ్మ కు ఎదురుగా కనిపించాడు అజిత్.
"ఏరా? ఏం చేయాలి ఈ పూట ఫలహారం?"
"ఏదో ఒకటి చేయించు నాయనమ్మా!"
మనుమడి చేతిలో ఉన్న ఆల్పాంచూసి, "అదెక్కడ దొరికిందిరా నీకు?" అనడిగిందావిడ.
"తాతయ్య ట్రంకు పెట్టెలో దొరికింది, నాయనమ్మ! డాడి పెళ్ళి ఫోటోలున్నాయి ఇందులో! ఒకసారి ఇలారా, నాయనమ్మ! డాడి తన మొదటి భార్య నుండి ఎందుకు విడిపోయాడు? ఆ సంగతులన్నీ నువ్వు నాకివాళ చెప్పాలి!" అని ఆవిడ చెయ్యి పట్టి తీసుకుపోయి హల్లో సోపాలో కూర్చో బెట్టి, తను ప్రక్కన కూర్చున్నాడు. ఆల్పం పెట్టుకొని మిద.
"ఇంత ప్రొద్దున్నే నీకు కథలు చెబుతూ కూర్చుంటే ఎలారా? ప్రొద్దుటే నాకు వణుకుడు! ఓ ముద్దు కడుపులో పడితే తప్ప తెరుకోదు ప్రాణం!"
"అందుకే ఉదయం కాస్త ఫలహారం తీసుకొమ్మని చెబుతాను"
"ఆ నూనేతిళ్ళు నాకు పడవు నాయనా , అసలేం లేకపోయినా ఉంటానుగాని ఆ నూనేతిళ్ళు తిని కడుపులో ఆ వికారం పడలేను!"
"సరేగాని, నాయనామ్మ! డాడి పెద్దభార్య నీ మేనకోడలేనటకదూ?" అంటూ ఆల్బంలో ఆకులు త్రిప్పివేయ సాగాడు అజిత్.
మొదటి రెండు మూడు పేజీల్లో తాతగారు, నాయనమ్మ ఇద్దరు కలిసి దిగిన ఫోటో, ఫామిలి ఫోటో. అజిత్ తండ్రి మల్లిక్ చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి! తరువాత ఆయన పెళ్ళిపోటో ఉన్నాయి!
మాంగల్యధారణ జరుగుతూంటే తీసిన ఫోటో చూస్తూంటే యశోదమ్మకి ఒకసారి గత మంత జ్ఞాపకం వచ్చి హృదయం భారమ్తె కళ్ళు చెమ్మగిల్లాయి.
"పెళ్ళి కూతురి వయసు ఎంతుంటుంది. నాయనమ్మ పెళ్ళప్పుడు?"
"పదేళ్ళు!"
"మ్తెగాడ్ ! పదేళ్ళపిల్లకి పెళ్ళి! అంత చిన్నప్పడే ఆడపిల్లకి పెళ్ళి చేసి ఏం చేస్తారు" వింతగా అడిగాడు.
"ఏం చేస్తారని కాదురా, వెర్రినాయనా! అది ఆచారం! ఎనిమిదేళ్ళ పిల్లకి పెళ్ళి చేస్తే కన్యదానఫలం దక్కుతుందని మనలో ఒక నమ్మకం! ఆ పిల్లకి అప్పుడు పదేళ్ళయితే మీ నాన్నకి ఎన్నేళ్ళో తెలుసా? ఇరవ్తే రెండేళ్ళు"
"మ్తెగాడ్ ! ఇద్దరికి పన్నెండేళ్ళ తేడా! ఈ కాలంలో ఏమోగాని, ఆ కాలంలో ఇలాంటి పెళ్ళిళ్ళు అతి సాధారణంగా జరిగేవి! మగ పిల్లవాడికి మీసాలు మొలుస్తుంటేనో, మీసాలు మొలిచాకో అతడికి పెళ్ళి జరిగితే అతడి వధువుకు ఎ ఎనిమిదేళ్ళో ఉండేవి"
"ప్చ్! చాలా చెడ్డ ఆచారం, నాయనమ్మ! తన భార్య తన కంటే పదిహేను, పదేళ్ళు చిన్నయితే మామలాగానో, తండ్రి లాగానో ఆమె మిద పెత్తనం చెలాయించాలని అనిపిస్తుందే గాని భర్తలాగా లాలించాలనిపించదు!"