"మీ నాన్నగారు పోయాకా ఈ జ్ఞానోదయం?"
"ఇంకా అమ్మ ఉందికదా?"
"ఆవిడకు వంట మనిషిని, మంచి చెడ్డలు చూడడానికి కాస్తధగ్గరి వాళ్ళ నెవరిన్తేనా చూసి వెడదాం!"
అవేవి అమ్మకు నా సమానం కావు!"
"రెక్కలు వచ్చాక పిల్లలు ఎగిరిపోవడం సహజమే కదా? అంత బాధపడతారేందుకు?"
"జ్ఞనం తక్కువున్న పక్షుల్లో, పశువుల్లో అది సహజమేకావచ్చు! జ్ఞానవంతుడ్తెన మనిషికి అది సహజం కాదు, భావన! ప్-పిల్లల్ని పెంచి పెద్ద జేసేందుకు తల్లిదండ్రులు ఎంత బాధ్యత తల్లిదండ్రుల విషయంలో తీసుకోవడం ధర్మం! కానీ, నేనేంచేశాను? నా అభివృద్ది, నా సుఖం ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తించాను!"
"మీ పశ్చాత్తాపం మిమ్మల్ని వెనక్కి వెనక్కి తీసికెళ్ళి త్రిపుర సుందరి దగ్గర నిలుపుతుందేమో?"
భావన ఎత్తిపోడుపుకు మల్లిక్ ముఖంలో శుష్కమ్తెన నవ్వు మెరిసింది! "నిలబడితే నలబెడుతుందేమో! కానీ, ఇప్పాడా విషయంలో నేనేమి చేయలేనుకదా? అది పూర్తిగా ముగిసిపోయిన కథ. ఎట్టి పరిస్దితిలోనూ మొదలు పెట్టడం జరగని కథ!"
"అలా ఎందుకనుకోవాలి? రెండు పెళ్ళిళ్ళు చేసుకొన్న మగవాళ్ళు సహజంగా మొదటి భార్యతో కాపురం ముగిశాక రెండో భార్యతో మొదలు పెడతారు? మీరు ఈ కథని అడ్డం తిప్పి చూడండి. చాలా ధ్రిల్లింగ్ గా ఉంటుంది కథ!"
త్రిపుర ఇప్పటిక్తేనా మారిందనుకోను! నేనూ మారలేదు! మా ఇద్దరి వ్యక్తిత్వాలు, అభిరుచులు, ఆలోచనలు ఎన్నటికి కలవని రెండు సమంతర రేఖలు!"
"జరిగిపోయిన తప్పులను దిద్దుకోనే ప్రయత్నంలో ఉన్నారు కదా? ఈ తప్పను కూడా దిద్దుకొంటారేమోనని "
"ఎన్నడు లేనిదీ ఇప్పుడు త్రిపుర సంగతి ఎందుకు ఎత్తుతున్నావు?"
"పాతికేళ్ళ తరువాత ఇవాళ వెనక్కి తిరిగి చూచుకోంటూంటే "
పాతికేళ్ళ వెనక్కి తిరిగి చూచుకోంటే ఎవరుకానిస్తున్నారు? అప్పడే తోలిరేకులు విచ్చుకోంటున్న మొగ్గలాంటి ఒకమ్మాయి, పచ్చని పసిమిచాయతో, పెద్ద పెద్ద కళ్ళతో, ఒత్తుగా, పొడవుగావున్న తలకట్టుతో జిగేల్ మనే ఒక మెరుపుతీగలా కనిపించే త్రిపురసుందరి. కానీ, అంత లేత వయసులోనే ధృడమైన వ్యక్తిత్వం వికసించింది. తన భావాల్ని నిస్సంకోచంగా బయట పెట్టేది. తన కిష్టంలేని ఏ విషయంలో న్తెనా ద్తేర్యంగా ఎదురు తిరిగేది.
త్రిపుర ఇప్పుడు ఎలా ఉందో?
ఎలా ఉంటుంది? ఆచార్య వ్యవహారాల్ని పొల్లుపోకుండా అనుష్ఠిస్తూ పూజలు జపాల్లో ప్రోద్దుపుచ్చుకుంతూ ఉంటుంది. పాపం!
* * *
చివరికి అయిష్టంగానే అంగీకరించింది భావన! తాము వచ్చేవరకు నాయనమ్మకు తోడుగా అజిత్ ని ఇక్కదేవదిలి వెల్లడ్సానికి కూడా నిశ్చయం జరిగింది.
వాసుదేవ్ సహాయంతో మంచి లోకాల్టిలో ప్లాట్ ఒకటి సెలక్ట్ హేసి కోనేయ్యడమూ, ఆరు నెలలలో బిల్డింగ్ పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చకచక పూర్తిచేశాడు మల్లిక్. నర్శింగ్ హొం చే బాధ్యత అజిత్ కి అప్పగించడం జరిగింది. వాసుదేవ్ కూడా ఇంజనీ రే! అవసరమైన సలహాలు మామ నుండి తీసుకొమ్మని కొడుకుతో చెప్పాడు.
భావన వాళ్ళు స్టేట్స్ కి తిరిగి వెళ్ళే ముందు రాధ అడిగింది. "సాధనని అజిత్ కి చేసుకొనే సంగతి ఇప్పడ్తేనా చెప్పా. వదినా!"
మగపిల్లవాడి తల్లి దర్పం ముఖంలో కొద్దిగా తోంగిచూస్తూంటే, "ఇంతకు ముందే నికా సంగతి తెలియజేశాను కదా? అది పెళ్ళి చేసుకొనే ఆ ఇద్దరిని అడగాల్సిన సంగతి అని!" అని జవాబిచ్చింది భావన.
"అజిత్ ఒప్పకోంటే నీ అభ్యతరం, అన్నగారి అభ్యతరం ఏం లేదుగా?"
"ఏం లేదు!"
ఆరోజే అజిత్ నీ అడగింది రాధ "సాధనని నికివ్వాలను కొంటున్నాం! నీ అభిప్రాయం ఏమిటి? నువ్వు అంగీకరిస్తే మీ అమ్మ నాన్నకి ఏం అభ్యతరం లేదన్నారు!"
"సాధన అభిప్రాయం అడిగారా, అత్తయ్యా?"
"ముందు నీ అభిప్రాయం తెలియాలి కదా?"
"ఉహు మీ అమ్మాయికి మీరు చేస్తున్న పెళ్ళికి, ముందు అభిప్రాయం తెలుసు కోవల్సింది మీ అమ్మాయినే! తన అభిప్రాయం తెలిశాకే నన్నడగండి!"
"తను ఇష్టంపడుతుంధనుకో! అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి?"
"అబ్బే! అదేం లాభం లేదత్తాయ్యా! మీరు ఎంత తెలివిగా ప్రశ్న వేసినా ముందుగా నా అభిప్రాయం బయట పెట్టించలేరు! సాధన ఏమందో తెలిశాకే నా అభిప్రాయం చెప్పడం!" అజిత్ గడుసుగా నవ్వాడు.
అజిత్ మాట్లాడుతూంటే ఇక్కడ అందరికి తమాషాగా ఉంటుంది! తెలుగు బాగా మాట్లాడడం వేర్చుకోవాలన్న తాపత్రయంతో ఎప్పడూ తెలుగులోనే మాట్లాడుతుంటాడు! కొన్ని మాటలు దొరకక చప్పన ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతుంటాడు!
"ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో హాయిగాగ్లిష్ లో మాట్లాడేయ్యాక ఎందుకొచ్చిన అవస్ధ?" అని అడిగింది ఒకసారి, సాధన.
"మీ పామిలిలో ఒక అమ్మమ్మ మినహా అందరూ ఇంగ్లీష్ లో అవర్గళంగా మాట్లాడగలిగిన వాళ్ళే! ఇంకెవరితో మాట్లాడను తెలుగు?"
"అమ్మమ్మతోటే మాట్లాడు!"
"ఉహు మాతృభాష సరిగా రానందుకు నేనిప్పటికే సిగ్గుపడుతున్నాను. ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. మీలాగా తెలుగు చక్కగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకొంటానా అని నాకెంత తాపత్రయంగా ఉందో?"