Next Page 
ఋషి  పేజి 1


   
                                                               ఋషి

                                                                                -యండమూరి వీరేంద్రనాద్

    నా పాతరోజుల్ని తలచుకుంటే చాలా ఆశ్చర్యంగా  వుంటుంది. నాకు ఎంత  క్యాజువల్ గా బ్రతికేను...ఎప్పటి కప్పుడు పరిస్దితులతో రాజిపడిపోయి.!__ కానీ  తలచుకుంటే  అందులోనే సుఖం వుందని అనిపిస్తోంది. ప్రకాశాన్ని చంపేసి ఏం  సుఖపడగలిగేను నేను?

    అసలు మనుషులు సరిగ్గా ఎదగకపోవటానికి కారణం  బిడియం (కాంప్లెక్స్ )! ఈ బిడియానికి కారణం వాళ్ళని నొక్కిపట్టి వుంచిన తల్లి తండ్రుల ప్రభావం! అది కాకాపోతే  మంచో_ చేడో కొన్ని అభిరుచులపట్ల చిన్న వయసు నుండి  పెంచుకోవాల్సిన ఇష్టాన్ని పెంచుకోక పోవటం!! పంతొమ్మిది ఇరవ్తే ఏళ్ళు  వచ్చేసరికి, తల్లితండ్రుల కట్టడి నుండి  బయటకి వచ్చేయటంతో- కావలసినంత స్వేచ్చ ఒక్కసారి లభిస్తుంది మానసికంగా ఎదగని వ్యక్తిత్వానికి సరిగ్గా  అప్పాడే రకరకాల రంగునీడలు అందంగా  నాట్యం చేస్తూ కనపడటంతో- స్వేచ్చకి ఇంకో రకం అర్ధం కనబడుతుంది.... అది పతానానికి ప్రారంభం. సాధారనగా మనిషి ఎదుగుదల ఈ పతనంతో ఆగిపోతుంది. ఆగకపోతే ఆ మనిషి వేదాంతి అవుతాడు.

    నా ఇరవ్తే నాలుగో  ఏట ఈ స్ధితి  లభించింది నాకు ....చిత్రం... పందొమ్మిదో ఏట ఎంత అమాయకంగా బ్రతికేంనేను!

    [....అమాయకత్వం  అంటే "వ్యక్తిత్వం లేకపోవటం" మేమో నాకు తెలిదు.]


                                                                              2


    రెండు చేతులూ పేంటుజేబులో పెట్టుకుని తాపీగా నడుస్తున్నాడు ప్రకాశం. సాయంకాలపు నీరెండ అతని పచ్చని శరీరం మీద పడి మరింత పచ్చగా మెరుస్తుంది. రోడ్డు రాష్ గా వుంది. ఎదురుగా వస్తున్న ఒక కాలేజి అమ్మాయి పుస్తకాలు అలవోకంగా సర్దుకొని అతనివ్తెపే కన్నార్పకుండా తల వంచుకుని ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాడు.

    ప్రకాశం గ్రాడ్యుయేట్ ! అంతకన్నా విలువ్తెన క్వాలిఫికేషను అతని అందం. అలంకరణ విషయమ్తె అతనే విధమ్తెన శ్రద్ధ తీసుకోకపోయిన అతని నిర్లక్ష్యమే అతనికో రకమ్తెన ఆనందాన్నిస్తుంది. అతని నిర్మాలమ్తెన కళ్ళూఇంకా మృదుత్వంపోనీ పాలబుగ్గలూ కొంచెం ఎర్రగా ఉండే  క్రింది పెదవి అతని అందాన్ని పట్టిచ్చేస్తూ వుంటాయి. ప్రకాశం ఆలోచించేది కూడా పెద్ద విషయమేమికాదు. మూడ్రోజుల్లో ఫస్టు వస్తుంది. జీతం అందగానే తీర్చవలసిన చిల్లర బాకీలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు అంతలో అతని ఆలోచనలని తెగ్గోడుతూ__పక్కగా కారోకటి వచ్చి ఆగింది.


    "ప్రకాశం...నిన్నే..."తిగ మిటినట్టు కంఠం వినిపించింది.

    ప్రకాశం ఆగేడు. కారులో స్టీరింగ్ దగ్గరవున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యంగా అస్పష్టంగా "సుజాతా" అన్నాడు. ఆ అమ్మాయి పలువరస తళుక్కుమనేలా నవ్వి, డోర్  తిసి "కమిన్" అంది. ఏదో  లోకంలో వున్న వాడిలా లోపల కూర్చున్నాడు. కారు  కదిలింది.

    ప్రకాశానికి చాలా ఆశ్చర్యంగా  వుంది. ఆమె తనకి  క్లాస్ మేట్ అంతే! కాలేజిలో తను ఆమెతో ఎప్పడూ మాట్లాడలేదు కూడా అమ్మా యిలతో మాట్లాడేటంత  ద్తేర్యం కూడా తనకు లేదు. కానీ ఈ రోజు  దాదాపు మూడు  సంవత్సరాల తర్వాత ఆమె ఇలా హఠాత్తుగా  కనబడటం.... యిలా కారు ఎక్కించుకోవటం అతనికిదంత ఏదో కలలా వుంది....

    ప్రకాశం తలతిప్పి సుజాతవంక చూసేడు. రోడ్డు చాలా రాష్ గా వుండటంవలన ఆమె చాలా ఏకాగ్రతతో డ్తెవ్ చేస్తూంది. కాలేజిలో చదివే రోజుల్లోకన్నా ఇప్పుడు నిండుతనం వచ్చింది. వేసి వేయనట్టూ వున్న లిఫ్ స్టిక్  వలన ఆమె పెదవులు గులాబి వర్ణంతో మెరుస్తున్నాయి. సహజమ్తెన అందానికి మేకఫ్ తోడ్తే కళ్ళు తిప్పుకొనివ్వకుండా చేస్తూంది.

    కాలేజిలో చదివే రోజుల్లో సుజాత చాలామంది విద్యార్ధులు గుండెల్లో అలజడి రేపింది. ప్రకాశం కూడా అతనేప్పడూ ఆమెతో మాట్లాడే సాహసం చేయలేదు. చిత్రమేమిటంటే ఆమెతో మాట్లాడే స్టూడెంట్స్ నీ చూసి అతను ఎప్పడూ ఈర్ష్యపడలేదు కూడా. వాళ్ళకన్నా తను ఉన్నతున్ననీ, ఎత్తయిన శిఖరం మీద వున్నానని అనుకునేవాడేమో! ఒకటి  మాత్రం నిజం. మనిషి పాడవకుండా వుండటానికి కారణం అతని బలమ్తెన వ్యక్తిత్వమే అయి వుండనక్కరలేదు. పిరికితనం  కూడా మనిషినీ చెదిరిపోకుండా కాపాడుతుంది. అయితే ప్రకాశం ఆ మూడేళ్ళ లోనూ సుజాతతో మాట్లాడకుండా వుండటానికి కారణం అతని బలమ్తెన వ్యక్తిత్వమా? అన్నది సందిగ్దం అయినా అది అవసరం కూడాను. ప్రకాశం ఈ కథలో హిరోకాడు, ఈ కథ ప్రకాశానికి సంబంధించింది అంతే!

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"

    ప్రకాశం ఉలిక్కిపడ్డాడు. ఆమె తనని ఏకవచనంలో సంబోధించటం అతను గమనించలేదు.

    "చాలా కాలానికి కలుసుకొన్నాం కదూ,"     

Next Page