"తోటిపిల్లలు తిక్క ఎక్కవ్తే గుండ్లు చేయించుకోంటారు! వీళ్ళూ కొట్టించుకోవడమేనా? ఇది మనకు తగిందేనా కాదా అని ఆలోచించాక్కర లేదా?"
ఉన్నట్టుండి అజిత్ ఫక్కున నవ్వాడు.
"ఎందుకురా, నవ్వూతున్నావు?" అడిగింది అమ్మమ్మ.
"సాధనని బోడిగుండులో ఊహించుకోంటుంటే!"
"ఏయ్ కోంగబావా!" చెయ్యి ఎత్తింది సాధన కోపంతో.
"నీ చోద్యంకాలా! మగపిల్లవాదిమిదికే చేయ్యేత్తుతావేమిటి?"
"మగపిల్లవాడ్తేతే ఏమిటి గిప్ప? నాకంటే కాస్త పొడవున్నాడు! అంతేకదా? ఒంటేలూ, కొంగలూ ఉండవా పొడవు?"
"అయితే నేను పోడుగ్గు ఉంటానన్న ప్రశంసని ఇలా అందజేస్తున్నావన్నమాట! థ్యాంక్యూ?" ఠీవిగా భుజాలు కుదిపి నవ్వాడు మళ్ళి.
"ఊరికే ఎందుకు నవ్వుతున్నావు? మల్లెలు ఏరుకుందుకు ఇక్కడే వరూ లేరు!"
"ఓ! నేను నవ్వితే మల్లెలు కురిసినట్టు ఉంటుందన్నమాట! మెనీ మెనీ థ్యాంక్స్! ఫర్ యువర్ కాంప్లి మెంట్."
"బాగుంధర్రా బావా మరదళ్ళ సరసం!" స్వరాజ్యలక్ష్మమ్మ నిండుగా నవ్వింది.
రెండు రోజులు తరువాత.
చేయిచేయి కలుపుకొని గలగలా నవ్వూతూ మేడమెట్లు దిగివస్తున్న సాధనా అజిత్ లని చూసి తల్లిదండ్రులు నిశ్చింతతో ఓ నిట్టూర్పు విడిస్తే ముసలావిడ మాత్రం-
"పెళ్ళి కాక ముందే ఏమిటో ఒకరి మిద ఒకరుపడి తిరగడాలూ, ఎక ఎకలూ, పకపకలూ! అతగాడు ఫారిన్ నుండి వచ్చాడు. కాబట్టి అతదికిది సారి పోయిందిగాని, ఈ అమ్మడు ఇది అమెరికా అనుకొందా ఏమిటి?" అని గోనుక్కుంది. గొణుక్కుని ఊరుకోలేదు. పట్టలేనట్టుగా కోడలితో అంది "వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలే అనుకో! అయితే మటుకు వాళ్ళని అంత దగ్గరగా తిరగనివ్వడం ఏం బాగుంటుంది? లక్షణంగా పెళ్ళి జరిగాక ఇక ఏం జరిగినా ఫర్వాలేదు! పెళ్ళికి ముందే అన్ని అయిపోయాక ఇక ఏం పెళ్ళి?"
"చదువుకొన్ని పిల్లలు. వాళ్ళకామాత్రం తెలియదా, అత్తయ్యా?"
"వయసులో ఉన్న పిల్లలు! పెద్దవాళ్ళ ఆక్షేపణేమీ లేదని తెలిశాక ఊరుకోంటారేమో?"
"మీ కూతుర్నీ, అల్లుడి నీ అడిగి త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాంలే, అత్తయ్య! మీరు అనవసరంగా హ్తెరానా పడకండి! మీకసలే బి.పి."
"నేనూ కన్నానే ఆడపిల్లల్ని! ఆ కాలంలోనే ఒకరిని డాక్టరీ, ఒక రిని ప్లీడరీ చదివించాను ఇలాగ వెర్రి వేషాలు. వేయనిలేదు!"
"ఆ ఆ చాలా గొప్పగా పెంచారు ఆడపిల్లల్ని! అందుకేగా మా పెద్దాడపడుచు భావనగారు పెళ్ళి చేసుకొని పూలదండలతో అల్లుడితో ఇంటికి వచ్చేవరకు తమకు తెలియంది. అప్పటికే అజిత్ కడుపున పడ్డాడని చెప్పా కుంటారు అందరూ!" నాలిక చివరి వరకు వచ్చాయి మాటలు. కానీ జార లేదు పెద్ద మనిషి అన్న గౌరవం అంత తేలిగ్గా తిసిపారేయడం ఇష్టంలేక, తల్లివి తక్కువ చేసి మాట్లాడితే మగడు కోప్పడతాడన్నా భయం కూడా ఉంది.
12
ఇండియాకు తిరిగి వచ్చేసి ఇక్కడే నర్శింగ్ హొం ఓపెన్ చేయాలన్న ఆలోచనకు మొదట తీవ్రమైన అభ్యంతరం తెలిపింది భావన.
"అక్కడే సెటిల్తే పోవాలనుకోన్నాంగా? ఇప్పడిదేం నిర్ణయం?"
"ఏం నిర్ణయమంటే. అమ్మకోసం ఇది. కన్నకొడుకు చేతుల్లో కన్నుమూయాలని అనుకొన్నాడు నాన్నా! ఆయన కోరిక తీరకుండానే అసంతృప్తి తో కన్ను మూశాడు! చివరికి అమ్మకి కూడా అదే గతిపట్ట కూడదు! నాన్న లాగే ఆవిడా ఆశాంతితో కన్ను మూస్తే నేను జీవితాంతం పశ్చాత్తాపంతో క్రుంగిపోవాలని నా అంత నికృష్టపు బ్రతుకులేదని తిట్టుకొంటూ కూర్చోవాలి"
"అంతా అయిపోయిన ముసలావిడ కోసం మీరిప్పుడు త్యాగం చెయ్యడం ఏమిటి?"
"అంతా అయిపోయిన మనిషి చివరిక్షణాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు పెద్దలు, జీవితమంతా ఎలా గడిపినా సరే, చివరి క్షణాలు తృప్తితో, శాంతితో గడిచిపోవాలని, ఉన్న ఒక్క కొడుకు దూరమ్తె, కన్న వాళ్ళు విలవిల్లాడుతున్నా లేఖ్ఖచేయ్యకుండా విదేశాలుపట్టుకు ఎందుకు వెళ్ళి పోయాం? వ్తెధ్యరంగంతో విజ్ఞాన సముపార్జనకు అక్కడ అవకాశాలు ఎక్కవని, రెండు చేతులా సంపాదించుకోవచ్చునని! ఏ ఉద్దేశ్యంతో వెళ్లామా అది నెరవేరింది. అమ్మని బాధపెట్టి ఇంకా ఎందుకు అక్కడ?"
"మీరు ఏమ్తెనా చెప్పండి! నా కిష్టం లేదు వచ్చేయ్యడం!"
"అయితే నువ్వు అక్కడే ఉండు! నేను వచ్చేస్తాను!"
"విడాకులిస్తారా? నచ్చని భార్యను తెగిపోయిన చెప్పను విసిరేసి నట్టుగా వదిలేయడం మీకు అలవాటేకదా?"
"అవును! విడాకులిస్తారా? ముచ్చటగా మూడో పెళ్ళికి తయారు కావాలని ఉబలాటంగా ఉంది! సరేనా?"
"ఆ మాట ఒప్పుకోవాలి నేను! ఇద్దరు బిడ్డల తల్లివి! కోడలూ, అల్లుడూ రావలసిన వయసు! ఇన్నేళ్ళు దాంత్యం తరువాత నేను నిన్ను తెగిపోయిన చెప్పను విసిరేసినట్టు ఎందుకు విసిరేస్తా అనుకుంటున్నావు? ఆ మాట అని నిన్ను నీవు కించపరుచుకోవడం లేదూ?"
"ఇన్నేళ్ళ దాంపత్యం తరువాత అనాల్సిన మాట అన్నారా మీరు? నన్నోక్కదాన్ని అక్కడ వదిలేసి మీరొక్కరే ఎలా వచ్చేయలను కొంటున్నారు?"
"మరి నీకు రావడం ఇష్టం లేదు! నాకురాక తప్పదు! ఇంకేమనను"
"సెంటి మెంట్స్ మనిషి ని బలహీన పరుస్తాయి, మనిషిని ఎదగకుండా చేస్తాయి అనే వాళ్ళు! ఇదే మమకారపు వల్ల ఆనాడు మనం స్టేట్స్ కు వెళ్ళే ముందు కట్టిపడేసి ఉంటే మీరు ఎంత నష్టపోయే వాళ్ళో తెలుసా!"
"మమకారపు వల త్రెంచుకొని వెళ్ళి నేను ఏం సపాదించు కొన్నానో- దాన్ని, నా ప్రవర్తనవల్ల అమ్మ నాన్న ఎంత ఘోషించారో- ధాన్ని, త్రాసులో ఉంచి తూచితే నేను సంపాదించింది దూదికన్నా తేలిగ్గా తెలిపోతుందేమో, భావనా!" శుష్కంగా నవ్వాడు మల్లిక్.