Previous Page Next Page 
హనీమూన్ పేజి 18


     ఆ తరువాత నా వేపు చూశాడు శివానందం.

    "ఇలా చెప్పకపోతే వీళ్ళు చాలా ఏడ్వంటేజ్ తిసుకుంటారు" అన్నాడు  అదే సీరియస్ తో.

    "ఆఫ్ కోర్స్! కరెక్టేనండి" అన్నాన్నేను ఇంకేమనాలో తేలిక.

    "నేను ఇలాంటి విషయాల్లో  చాలాస్టిక్ గా ఉంటాను. రూల్, దిజిప్లిన్ విషయంలో నేనేవ్వరిని స్పేర్ చేయను."

    "అలాగా సార్?"

    "మా రెవిన్యూఇన్ స్పెక్టర్  రాఘవాచారినేం  చేశానో తెలుసా? సస్పెండ్ చేశాను" అన్నాడతను గొప్పగా.

    "సస్పెండ్  చేశారా?" ఆశ్చర్యం నటిస్తూ అడిగాను.

    "అవును! ఇందాకే చెప్పానుకదా టూల్స్ డిజిప్లిన్స్ విషయాల్లో నేనేవ్వరిని స్పేర్ చేయనని."

    "అవున్సార్."

    "ఆ రాఘవాచారి ఏం చేశాడో  తెలుసా?"

    "తెలీదండి...."

    "నూటపాతిక రూపాయలు లంచం  తిని ఓ ర్తేతునీ పెవర్ చేశాడు."

    "టూమచ్!" అన్నాన్నేను.

    కాని లోలోపల నాకు శివానందంమీద ఎలర్జీ ప్రారంభమ్తె పోయింది. ఎందుకంటే శివానందమే బోలెడు లంచాలుతిని  ఆ బిల్డింగ్ కట్టించినవిషయం మా విధిలో అందరకూ తెలుసు.

    "మనకి ప్రభుత్వం జీతం ఇస్తోంది ఎందుకు? లంచాలు తీసుకోటానికా?"

    "చచ! సిగ్గుచేటు..."

    "నేనూరుకోలేదుకదా! వెంటనే పట్టుకుని  సస్పెండ్ చేసిపారేశాను."

    "ఒండర్ పుల్ ధింగ్ సార్!"

    "ఇంతకూ రాఘవాచారి ఎవరనుకున్నారు?"

    "రెవిన్యూ ఇన్ స్పెక్టరనీ చెప్పారు కదండి?'

    "అది సరే....అతనెవరను కుంటున్నారు?"

    "తెలీదండి...."

    "మా బంధువుల కుర్రాడే."

    "అలాగే సార్!"

    "మా మేనమామ బామ్మరిది కొడుకు"

    "చాలా దగ్గర బంధుత్వం సార్?"

    "అయినా నేను బందుత్వాన్ని లెక్కచేసే రకం కాదు. చెప్పాను కదా-రూల్స్  డిజిప్లిన్ విషయంలో నేనేవ్వరిని స్పేర్ చేయనని."

    "అవున్సార్."

    "అందుకే రాఘవాచారినీకూడా స్పేర్ చేయలేదు."

    "చేయకూడదు సార్!"

    "నా పాలసి అది"

    "అవున్సార్!"

    "ఇప్పుడు క్తేకలూరు తాలూకా తాసిల్దారు రమణయ్య ఉన్నాడనుకో- అతని పాలసి వేరు"

    "అలాగండి."

    "అవును....వాడు తినేస్తాడు....వాడు కిందవాళ్ళందరినీ కూడా తినేయమంటాడు."

    "ఎంత ఘోరం సార్!"

    "ఘోరం అని నేననను! అది అతని పాలసి."

    "అవున్సార్-మనిషికో పాలసి ఉంటుంది."

    "కాని చూస్తుండు అలాంటివాళ్ళే ప్తెకోస్తారు. నా లాంటి సిన్సియర్ ఆఫీసర్స్  అడుగునే ఉంటారు."

    "ప్తెకోచ్చినవాళ్ళందరూ అదేబాపతండి."
   
    ఎంతసేపు మాట్లాడినా కనిసం మమ్మల్ని కూర్చోమనయినా అనకపోవటం తో నాకు ఒళ్ళు మండిపోతోంది.

    "నోర్మూసుకోర బోడి శివానందం! నీ బోడి గొప్పలు నా దగ్గర చెప్పకు. నువ్వూ పరమ లుచ్చగాడివే! నువ్ చేసిన వెధవ పనులన్నీ  కూడా అందరికి తెలుసు. ఇంకోడి గురించీ కామెంట్  చేసే అర్హత నీకు లేదు" అంటూ నాలుగూ దులిపెయలనుంది. కాని తీరా ట్రూ కాఫిన్ మీద సంతకాలు చేసే టైమ్ లో చెడగొట్టడం ఎందుకని ఓపిక  పట్టసాగాడు. అప్పటి కప్పుడు ఇంకో  గెజిటెడ్ ఆఫీసర్ని వెతకాలంటే ప్రాణం మీద కొస్తుంది కదా!

    "ట్రూ కాఫిన్ ఎవరికీ?"

    "మా కజినండి విడు.బి.కామ్. పాసయ్యాడు. మనూళ్ళో ఒకటే జిరాక్స్ ఉంది. అది చేడిపోయిందట."

    "ఐసి...."

    "అందుచేత...."

    "నేను ఇలాంటివాణ్ణి సాయంత్రం నలుగు నుంచి అయిదువరకే చేస్తనోయ్."

    "అవున్సార్! ఇప్పడే తెలిసిందా విషయం."

    "చెప్పానుకదా-రూల్స్ ,డిసిప్లిన్...."

    "చెప్పారు సార్- చెప్పారు" అన్నాను చప్పన అడ్డు పడిపోతూ.

    "అంచేత మీరు మరేమి అనుకోకుండా సాయంత్రం నాలుగ్గంటలకొస్తే...."

    నాకు కోపం అగటంలేదు.

    "అలాగేనండి."

    "అయామ్ సారి! ఇప్పుడు  పెట్టటానికేం అభ్యంతరం లేదు. కాని రూల్స్...."

    "అవున్లెండి పాపం....మీరు మాత్రమేం చేస్తారు?"
   

 Previous Page Next Page