Previous Page Next Page 
హనీమూన్ పేజి 17


    "అయినా ఇలా ఇళ్ళ మధ్యనే  బెడ్డింగులు దులపటం  చట్టరిత్య నేరం  అని నా అభిప్రాయం "అన్నాదోకతను కాసేపు విపరితంగా దగ్గాక.

    "మీ అభిప్రాయం తప్పు. అలాంటి  చట్టం ఏమీ లేదు" అన్నాడు సారధి  చిరునవ్వుతో.

    "లేకపోతే సత్వరం చట్టం తేవాలి!"  మళ్ళిదగ్గు.

    "తేవటం మంచిదే!"

    "ఇలా ముందు హెచ్చరికలు చేయకుండా బెడ్డింగ్  లు దులిపే వారికి చాలా కటినశిక్ష విధించాలి."

    "అవును!కనిసం ఓ సంవత్సరం జ్తేలు వందరూపాయలు  ప్తేనూ  అలా ఉండాలి."

    "అవును"

    అందరూ దగ్గుతూ  మరికాసేపూ మాట్లాడుకున్నాక ఎవరిదారిన  వాళ్ళు వెళ్ళిపోయారు.

    ఎందుకయినా  మంచిదని  ఆ రోజు మేమిక బయటకు వెళ్ళలేదు. మర్నాడు మధ్యాహ్నం  మేము చాలా బిజీగా ఉండగా మా వీధిలోనే ఉండే  రిటైర్డ్  డిప్యూటి తాశిల్దారు శివానందంగారు వచ్చారు.

    ఆయనలో ఓ విశేషం  ఉంది.

    తాలూకాఫిస్ లో క్లార్క్ గా ఉన్నప్పుడు తాసిల్దరులా మాట్లాడేవాడు డిప్యూటి తాసిల్దారుగా ఉన్నప్పుడు కలెక్టర్ లా పోజిచ్చేవాడు.

    ఇప్పుడు రిటైరాయినాకూడా ఇంకా అతనట్లే మాట్లాడడం  మొదలు పెట్టాడు. ప్రపంచమంతా కేవలం  తవవల్లె నడుస్తోందని  అతని అనుమానం. అతని అనుమానాన్ని ఖండించడం ఎందుకులే అని మే మెవ్వరం ఎప్పడూ పట్టించుకోలేదు.

    "ఏమోయ్ బావున్నారా?" అడిగాడతను మేము కూర్చోమన కుండానే కూర్చుంటూ.  
   
    "ఆ...బాగానే ఉన్నామండి" అన్నాడు సారధి ఎయిర్  బాగ్ లో తాతయ్య సామాను సర్దుతూ.

    "ఈ మధ్య నేప్పడూ మా ఆఫిస్ కి  రాలేదేం? ఆ మధ్య ట్రూ కాపిస్  మీద  సంతకాలు కావాలని  వచ్చేవారుగా?"

    నాకు వళ్ళు మండిపోయంది ఆ ప్రశ్నతో.

    నేను మా కజిన్  బ్రదర్  ఒకతని  ట్రూ  కాపిస్  మీద సంతకాలు కావాలంటే మా విధిలోనే ఉంటాడు, బాగా తెలిసినవాడూకద అని  శివానందం ఆఫీసు కెళ్ళాను.

    ప్యూన్ నన్ను గడప దగ్గర ఆపేశాడు.

    "శివానందం నాకు బాగా  తెలిసినవారండి? మీ బంధువా?"

    "బంధవు కాదయ్యా- మా యింటి దగ్గరే ఆయనిల్లు కూడా!"

    "ఇళ్లు దగ్గరయినంత మాత్రాన  తెలిసినట్లేలా అవుతుందండి?"

    "ఎందుక్కాదు- తెల్లారిలేస్తే ఇకరికొకరు పలుకరించుకుంటూంటాం!"

    ప్యూన్ కి మా దగ్గర్నుంచి ఒక్క ప్తెస కూడా  రాలదని తేలిపోయింది "మళ్ళి తరువాత మిమ్మల్ని లోపలకు  పంపినందుకు ఆయన మమ్మల్నేమీ చివాట్లు వేయరుకదా!"

    "చచ! ఆయన మాకు మంచి  ప్రేందయి బాబూ!"

    "సరే.... అయితే లోపలికు నడిచాము.

    నేనూ మా కజినూ లోపలకు నడిచాము.

    "గుడ్ మానింగ్ సార్!" అన్నాన్నేను చిరునవ్వుతో.

    ఆయన ఏదో రాసుకుంటూన్నవాడల్లా తలెత్తి నా వంక చూశాడు తరువాత మా కజిన్ వంక చూశాడు.

    "హలో గుడ్ మానింగ్! మీరా రండి  కూర్చోండి! విరెవరు? మీ కజినా? ఏమయినా పనిమీద వచ్చారా?-ఒర్ రామయ్య-మూడు బ్రూ కాఫీలు పట్రా...." అని అంటాడేమోనని నేను ఉదయం నుంచి ఊహించాను కాని ఆయన అలాంటిదేమి చేయలేదు.

    "యస్?" అన్నాడు నా వేపు ప్రశ్నార్ధంకంగాచూస్తూ.

    నేను షాక్  తిన్నాను.

    అతను మా విధిలో కనబడ్డవాడినల్లా 'హలో' అని పలుకరించే శివానందమేనా  అన్న అనుమానం కలిగింది.

    ఆ తరువాత అతనికసలు నేను తెలుసా? గుర్తుపట్టాడా అన్న మరో అనుమానం.

    "నేను మీ ఇంటి దగ్గర్లోనే ఉంటాను-నన్ను గుర్తుపట్టారా?" అడిగాను ఎందుకయినా  మంచిదని.

    "యస్-యస్-ఆయ్ రి మెంబర్! ఏం కావాలి మీకు?" అదే సీరియస్ నెస్ తో అడిగాడు.

    నాకు వళ్ళు మండిపోయింది. నన్ను గుర్తుపట్టే విడు తన గెజిటెడ్ హొదా అంతా చూపుతున్నాడన్నామాట! కాని అంతదూరం వచ్చాక ఇంక పని పూర్తి చేసుకెళ్ళడమే ఉత్తమమానిపించి "విడు మా కజిన్ అండి! ట్రూ కాపిస్ మీద సంతకాల కోసమని...."అంటూ  కాగితాలు బయటకు తీశాను.

    మా మాట వినిపించుకోకుండా టేబుల్ మీద బెల్  మోగించాడతను.

    ప్యూన్ రివ్వున లోపలకు  దుసుకొచ్చాడు.

    "నీకు బుద్ది ఉందా లేదా?" అన్నాడు శివానందం కోపంగా.

    "ఏం సార్...." భయంగా అడిగాడు ప్యూన్.

    "ఇంటర్ వ్యూ టై మెప్పడో వీళ్ళకు  ఎందుకు చెప్పలేదూ? వీళ్ళను లోపలికెందుకు పంపించావ్?"

    ప్యూన్ నా వంక నమిలి మింగేసేట్లు చూశాడు.

    "మీకు తెలిసినవారని చెప్తే...."

    "అయితే  అవ్వుచ్చు-తేల్చినవారందరికి  ఒక రూలూ, మిగతావారికి ఒక రూలూనా?"

    ప్యూన్ ఇక నన్ను బయటకు గెంటివేయడం భయం  అనుకున్నాను.

    "ఇంక వెళ్ళు-"అంటూ ప్యూన్ నీ బయటకు పంపాడతను. 

 Previous Page Next Page