"నాతువ్వాలు అందుకో!"
లేచి సూట్ కేస్ తీసి అతడికందియ్యబోయింది.... చెయ్యిపట్టుకుని లోపలికి లాక్కున్నాడు. గుండె ఝల్లుమంది. అతడుపూర్తి నగ్నంగా ఉన్నాడు. పచ్చటి శరీరం నీటితడిలో మెరుస్తోంది.
చూడలేక కళ్ళు మూసుకుంది. బయటికి నడవబోయింది. కుడిచేత్తో ఆమెని చుట్టి ఎడమచేత్తో గుండె మీదకు లాక్కుని రెండు చేతులతో హత్తుకున్నాడు వివేక్. ఆపాదమస్తకం విద్యుత్తుతరంగాలు ప్రవస్తున్నాయి యశోదకి!
భయం! సిగ్గు! సంతోషం! సంకోచం.
"చీరపాడయిపోతుంది!" అంది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ.....
"నిజమే! సుమా!" అని చీరను విప్పి అవతల పారేశాడు.
"ఇదేమిటీ?" కంగారు పడిపోయింది.
"అవును! ఇదేమిటీ? ఏ పనీ సగం చెయ్యకూడదు" అని మిగిలిన బట్టలు కూడా తీసి అవతల పారేశాడు... వణుకుతూ రెండు చేతులతో కళ్ళు మూసుకుంది. పెదవులతో బొడ్డు దగ్గరి నుంచి మెడ వరకూ చక్కిలిగిలి పెట్టాడు.
నవ్వేస్తూ అతడి నల్లుకుపోయి మెడ చుట్టూ చేతులు పెనవేసింది. గుండెలో ముఖం దాచుకుంది. హాట్ వాటర్ పవర్ అడ్జస్ట్ చేసి ఆన్ చేశాడు.... చిరు చలిలో వెచ్చని నీటి జల్లు మీద పడుతూ శరీరాన్ని మరింత రెచ్చగొడుతోంది. అతడి చేతులు పెదవులు ఆమె మీద తెగ అల్లరి చేస్తున్నాయి. తీయగా మూలిగింది. నిలవలేనట్లు అతడి మీద వాలిపోయింది.
"డూ యూ లవ్ మీ?" చెవి దగ్గర పెదవులుంచి మెత్తగా అడిగాడు.
"ఐలవ్ యూ! ఐ ఆల్వేస్ లవ్ యూ!" భుజం మీద తల ఆనించి పెట్టి చెప్పింది.....
ముందుకు వంగాడు వివేక్. తలపైకి ఎత్తి పెదవులందించింది. తడిగా వేడిగా మెత్తగా తీయగా నిలువునా తాగెయ్యాలన్నంత తపనతో ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె శరీరంలో ఆమెకే తెలియని ప్రకంపనలు. నిలవనియ్యకుండా ఢీ కొంటున్న వాంఛా తరంగాలు. గభాలున తప్పించుకుని గదిలోకి వచ్చేసి పక్క మీద దుప్పటి వంటికి చుట్టేసుకుంది. వెన్నంటి వచ్చి దుప్పటితో సహా పక్క మీదకి లాగాడు.
దుప్పటి ఏ మూలకో ఎగిరిపోయింది. కళ్ళు మూసుకుంది... అతడి స్పర్శ తెలుస్తోంది. శరీరంలోని సుతారమైన భాగాలు తాకుతున్నాయి అతడి వేళ్ళ కొసలు! నరాల్లో నెత్తురు జలపాతపు వేగంతో దూకుతోంది.
క్షణక్షణానికీ పెరుగుతోన్న వంటివేడి. గదిలో 'ఏసీ ని' సవాల్ చేస్తోంది. ఏదో అద్భుతమైనది ఎంతో.... ఎంతో.... ఎంతో తీయనిది జరగబోతుంది.
ఏదో జరిగింది. అదిరిపడి కళ్ళు తెరిచింది యశోద.
పక్కకు పడిపోయి ఉన్నాడు. వివేక్! అతడి శరీరమంతా స్వేదమయం. ఏదో భయంకర దృశ్యం చూసిన వాడిలా వణుకుతున్నాడు. కనుపాపలు వేగంగా సంచలిస్తున్నాయి. దిగ్గున లేచి కూచుంది... వివేక్ ని పట్టికుదుపుతూ "వివేక్! వివేక్!" అంది. అతడు పలకలేదు.
మరింతగా వణుకుతున్నాడు. మొదట ఆమెకి దుఃఖం వచ్చింది. అంతలో ధైర్యం తెచ్చుకుంది.
ముఖం మీద చల్లటినీళ్ళు జల్లింది. అతడు తేరుకున్నాడు. లేచి కూర్చున్నాడు. బట్టలు వేసుకుని" అయామ్ సారీ!" బిడియపడుతూ అన్నాడు.
అప్పటికే యశోద కూడా బట్టలు వేసుకుంది. "ఫరవాలేదు.... కానీ ఏం జరిగింది?. ఎందుకలా అయిపోయారు?"
"నాకు తెలీదు?"
"ఇదివరకెప్పుడైనా ఇలా జరిగిందా?"
చురుగ్గా చూశాడు... రోషంగా అన్నాడు" ఇంతవరకూ ఏ స్త్రీతోనూ నేనిలా..."
"అదిగాదు ఇలా శరీరం వణకటం. చెమటలుపట్టడం.... వగైరా...."
"ఎప్పుడూ లేదు."
"అయితే. ఇప్పుడే ఇలా అకస్మాత్తుగా జరిగిందా?"
మాట్లాడలేదు వివేక్. మళ్ళీ అడగలేదు యశోద! తన మనసులో ఎన్నోసార్లు బుసలు కొట్టిన అపస్వరాలకి ఎక్సప్లనేషన్ ఇప్పుడే ఉండవచ్చు అనిపించింది ఆమెకి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం.
అలారం టైం పీస్ టక్ టక్ మని చప్పుడు చేస్తూ ఆగకసాగే కాల గమనాన్ని సూచిస్తోంది.
"యశూ! పెళ్ళికి ముందే నీకు చెప్పాలనుకున్నాను. కానీ డాక్టర్ వొద్దన్నాడు. అసలు అలాంటి విషయం ఆలోచనలోకి రానీయవద్దన్నాడు. అందుకని...."
"పోనీ ఇప్పుడు చెప్పండి!" అపారమైన సహనంతో అంది. ఆమె సహనం అతనికి జీవం పోసింది. ఒకసారి మొదలు పెట్టాక నిస్సంకోచంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
"నాకు ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. ఆడవాళ్లని చూడగానే ఫియర్. కాంప్లెక్స్ పట్టుకుంది. ముఖ్యంగా వయసులో ఉన్న ఆడవాళ్లని చూడగానే శరీరమంతా వణికి చెమటలు పట్టేవి. తలఎత్తి వాళ్ళ ముఖం చూడలేకపోయేవాడిని. వాళ్ళతో మాట్లాడలేకపోయేవాడిని. నాకు బాగా జ్ఞాపకం! పదమూడేళ్ల వయసులో ఇరవై ఏళ్ల వయసులో ఒక ఆవిడ నా గెడ్డం పట్టుకుని ముఖం పైకెత్తి పట్టుకుని ఎంత బాగున్నావు నీవు?" అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.
మనసులో ఉన్న ఆనందం కలిగింది కానీ ఆ శారీరకంగా చాలా కంపరం కలిగింది. కంపరమే కాదు! గుండె ఆగిపోతుందా? అన్నంత అనిపించేటంత భయం!
ఆ రాత్రి నాకు జ్వరం కూడా వచ్చింది. జ్వరంలో కూడా ఏదేదో కలవరించానని సీతారాముడు చెప్పాడు.
ఆయాగా కూడా ఆడదాన్ని సహించగలిగేవాడిని కాదు! నా పనులు చేసి పెట్టడానికి ఎప్పుడూ మగ కుర్రాడే ఉండే వాడు. ఆ రోజు నుంచీ ఆడవాళ్ళని దూరం నుంచి చూసినా పారిపోయేవాడిని. వయసు వస్తోన్నకొద్దీ నాకు ఈ "ఆ భయం!" పెరుగుతుందేగానీ పోవటం లేదు.
స్టేజ్ ఫియర్ లేదు. మానసిక, శారీరక. బలహీనతలులేవు. నపుంసకత్వం అసలు లేదు. ఇందాక నువ్వు చూశావు!
"చదువుకున్నవాడిని.. నా బలహీనత నాకు తెలుస్తోంది. సైక్రియాటిస్ట్ ని కన్సల్ట్ చేశాను. ఆయన రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి.. ఏవేవో మందులు కూడా ఇచ్చాడు. బహుశా హిస్టీరికల్ నరాలబలహీనతలు తగ్గటానికి అనుకుంటాను!
కానీ నా ఫియర్ కాంప్లెక్స్ పోలేదు. ఈ దశలోనే నిన్ను చూశాను. నువ్వు నన్ను ఆకర్షించావు. భయం పోలేదు. కానీ రహస్యంగా దూరం నుంచి చూసేవాడిని. చాలాసార్లు నీకు దొరికిపోయాను.
డాక్టర్ని అడిగాను. "నేను వైవాహిక జీవితానికి నేను పనికొస్తానా!" అని... నాలో ఏ లోపమూలేదని సెక్స్ స్పెషలిస్ట్ నిర్ధారణగా చెప్పాడు. నా సమస్య కేవలం మానసికం మాత్రమేనని సైక్రియాటిస్ట్ చెప్పాడు.... భయాన్ని వెనక్కి నెట్టేసి ఆడవాళ్లతో ఫ్రీగా మాట్లాడటమే మంచి మందు అని చెప్పాడు. అదీ ప్రయత్నించాను............" ఆగి నవ్వాడు.