తండ్రితో పాటు అక్కడికి వచ్చిన అజిత్ "నాయనమ్మ దగ్గర నేనుంటాను, డాడి! నాయనమ్మ భారం నామీద వదలి మీరు నిశ్చింతగా వెళ్ళండి!" అన్నాడు.
మల్లిక్ నివ్వెరపోయాడు. ఏమిటి? నువ్విక్కడే ఉంటావా? ఇదేం నిర్ణయం అనడిగాడు.
"సర్తెన నిర్ణయమే ననుకొంటున్నాను! ఈ వయసులో నాయనమ్మని వంటరిగా వదిలేసి మనదారిన మనం వెళ్ళిపోవడం ధర్మం కాదు మీరు ఇండియా వచ్చేసి ఉండలేరుకదా?"
"కాదు, అజీ! అక్కడ నీకున్న అవకాశాలు...."
"పోనీండి, డాడి! ఆ అవకాశాల్ని! ఈ దేశంలో యువకులు బ్రతకడం లేదా? నేనూ బ్రతికేస్తాను, కాస్త హేచ్చుగానో, తక్కువగానో స్వంత ఇంటిలో కలోగంజో త్రాగిన మర్యాదేకదా?
మాతృదేశం మీద ఈ భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది?"
"మీకంటే ముందుగా!"
"నా తల్లి కోసం నువ్వేమీ త్యాగం చేయొద్దు! నేనే వచ్చేస్తాను! ఇండియా! ఇక్కడే నర్సింగ్ హొం ఓపెన్ చేస్తాను! ఇంజనిరు వికదా వరకే నువ్వు ఇండియాలో ఉండాల్సింది! తరువాత నేనోచ్చేస్తాను! నువ్వెళ్ళిపో!"
"ఉండడం, వెళ్ళడం నా నిర్నయమ్నికే వదిలి పెట్టండి-డాడి! కానీ మీరు ఇండియా వచ్చేయ్యడానికి మమ్మీ ఒప్పకోదేమో!"
"ఒప్పించడానికి ప్రయత్నిస్తాను! తను రాకపోతే నేను ఒక్కడిని వచ్చేస్తాను!"
"మీ మనసులు కష్ట పెట్టుకొని నాకోసం ఏం చేయొద్దండి రా? ఇన్నాళ్ళు గడిచిన రోజులు ఇప్పుడు గడవవా? మీకు ఎక్కడ బాగుంటే అక్కడే ఉండండి! ఈ చివరి రోజుల్లో మీ మెడకు గుదిబండను కావాలను కోవడం లేదు! భాగీరధి అత్తను నాతో ఉండిపోమ్మని నేనే అడుగుదామను కొంటున్నాను! నువ్వె అడుగుతానంటున్నావు! అడుగు! నీ మనస్సేందుకు చిన్నబుచ్చాలి?"
"కాదమ్మా! నా పిల్లలు నాకు బుద్ది చెప్పే అవకాశాన్ని నేను వాళ్ళ వ్వదలుచుకోలేదు!" అంటూ ఓ కోరచూపు కొడుకు మీదికి విసిరాడు.
"క్షమించండి. డాడి! ఒక సమస్య మనముందున్నప్పడు నా బుద్ధికితోచిన పరిష్కారం నేను చెబుతాను! అది మీకు బుద్ది చెప్పడం గా ఎందుకు భావించాలి?"
"ఆ సంగతి పోనివ్వు! మీ అమ్మమ్మ నిన్ను చూడాలని ఒకటే ఇద్తేపోతుంది! బయల్దేరు!"
తల్లి తననిక్కడ ప్రసవించి వదలి పోతే అమ్మమ్మ చేతిలోనే రెండేళ్ళ పాటు పెరిగినట్టుగా గుర్తు అజిత్ కు. ఆవిడకు తనమీద ప్రత్యేకాభిమానమని తెలుసు! "వచ్చే వాడినే డాడి కానీ, తాతగారికి తలకొరివి పెట్టానుకదూ! కర్మ అయిపోయేదాకా ఎవరిళ్ళకి వెళ్ళకూడదని చెప్పారు ఇక్కడ! అందుకే రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళలేదు!"
"పిచ్చి సెంటిమెంట్లు! పిచ్చి ఆచారాలు! మెల్లిగా చిక్కుకు పోతున్నావా, వాటిలో? రెండు ముక్కులూ మూసుకొని నీళ్ళలో మునిగినవాడి కథేనా హాయిగా ఉంటుందేమోగాని, వాటిలో చిక్కినవాడికి హాయి ఉండదు! జాగ్రత్త!" అని లేచాడు. "బయల్దేరిక! వెడదాం....! రేపు నీ కోడలితో మళ్ళి వస్తాను, అమ్మ! మేం ఇక్కడి నుండి వెళ్ళేవరకు ఇక్కడే ఉంటా!" అని చెప్పి కొడుకు తో బయల్దేరాడు మల్లిక్.
అజిత్ నీ, అతడి అమ్మమ్మ గారింట్లో పది పన్నెండేళ్ళ క్రితం అతడు పది పన్నెండేళ్ళ పిల్లవాడుగా ఉన్నప్పుడు చూశారు. ఇప్పుడు ఇరవ్తే నాలుగేళ్ళ చక్కని యువకుడుగా మారిపోవడం చూసి, "అబ్బా! అజిత్ ఎంత ఎదిగిపోయాడు! చెంపలు సన్నబడి ముఖం పోడుగ్తే ఆ అజిత్ ఇతడు కాదన్నట్టుగా అయ్యాడు!" అమ్మమ్మ, మేనమామ భార్య రాధ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు.
మేనమామ వాసుదేవ్ కి ముగ్గురు కూతుళ్ళు. పెద్దమ్మాయి సాధన ఎం. బి. బి. ఎస్. ఫ్తేనల్ చేస్తూంది. రెండో మ్మాయి. వందన బి. ఎస్. సి. ఫ్తేనల్ చేస్తూంది. మూడో అమ్మాయి కాంచన ఇంటర్ మిడియాద్ చదువుతోంది.
ఏడాది క్రితం రాధ, భావనకు ఉత్తరం వ్రాసింది.
"కోడలు సాధన ఎమ్ బి. బి. ఎస్ . వచ్చే ఎటితో అయిపోతుంది. తను ఎం. డి. చేయాలంటూంది. అజిత్ ఉండగా వేరే సంబంధాలకు పోవడం మీ అన్నయ్యకు ఇష్టం లేదు! నువ్వు కాదంటే వేరే సంబంధంలకు పోవడం తప్పదనుకో! ఏ సంగతి నువ్వు వ్రాస్తే జవాబు మాకు అనుకూలంగా లేకపోతే మేం వేరే ప్రయత్నాలు మొదలు పెడతాం" అని వ్రాసింది.
"అజిత్ పెళ్ళి పూర్తిగా అతడి ఇష్టానికే వదిలి పెట్టధలుచుకొన్నాను! పిల్లలకు ఆ మాత్రం స్వేచ్చ ఇవ్వాలనుకోంటున్నాను. మల్లిక్ అభాప్రాయం కూడా అదే. ఈసారి మేం ఇండియా వచ్చేప్పుడు అజిత్ నీ కూడా తీసుకువస్తాం! ఆప్పుడు సాధన, అజిత్ ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకొంటారు!" అని వ్రాసింది భావన.
ఈ సంగతి అజిత్ కి తెలుసు! సాధనకూ తెలుసు.
"అక్కా!అక్కా! అజిత్ బావాచ్చాడే! అమ్మ నిన్ను క్రిందకి తిసుకురమ్మంది" అంటూ కాంచన సంబరంతో పరుగెత్తుకు వచ్చింది. మేడమీద తన గదిలో చదువుకొంటున్న సాధన దగ్గరికి.
"నీ ఫేవరేట్ హిరో ఎవరో వచ్చినట్టుగా ఏమిటా సంబరం?" సంతోషాన్ని దాచుకొని పైకి మాత్రం చిరాకు ప్రదర్శించింది. "తరువాత వస్తాలే! అప్పడే వెళ్ళిపోడు కదా?"
"అమ్మ తిడుతుంది!రా!" చెయ్యిపట్టి లాగింది.
"చదువుకొంటున్నను"
] "తరువాత చాదువిచ్చులే! రా!"
సాధన పుస్తకం స్టూలు మీద ఉంచేసి లేచింది. హల్లో దృశ్యాన్ని పరిశీలనగా చూస్తున్నట్టుగా ఒక్క నిమిషం పై మెట్టు మీద ఆగింది.
కుటుంబ సభ్యులంతా హల్లో సోఫాల్లో కూర్చుని ఉన్నారు. అమ్మమ్మని అనుకొని కూర్చొని కబుర్లు చెబుతున్నాడు అజిత్. దేనికో ఆవిడ గట్టిగా నవ్వేస్తూంది. సోఫాల్లో కూర్చొన్న అందరు మగవాళ్ళలోకి అజితే పొడవుగా కనిపిస్తున్నాడు.
"కానీ అంత సన్నగా ఉన్నాడేమిటి, బాబూ! నిలబడితే గేడకర్రలా ఉంటాడేమో మగవాళ్ళు అంత సన్నగా ఉంటే ఏం బాగుంటారు?" అనుకొంది సాధన ఉంగరాలు తరిగిన హిప్పిజుట్టు. ముఖం తెల్లగా, అందంగా కనిపిస్తూంది. ఎంత మందిలో ఉన్నా కొందరి ముఖం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ కొంత మందికి చెందిన వాడితడు అనుకొంది వ్తేట్ పాంట్ కు వ్తేట్ షర్ట్ టాక్ చేశాడు. సన్నగా, పొడుగ్గా ఉన్న ముక్కు చురుకుగా చూసే పెద్ద పెద్ద కళ్ళు.
అజిత్ అమ్మమ్మ స్వరాజ్యలక్ష్యమ్మ మెట్లవ్తెపు చూసి, "రావే, సాధూ! అజిత్ బావొచ్చాడు!" అని పిలిచింది.
సాధన మెట్లు సరసరా దిగివచ్చింది. "ఏం పిలుపది నానమ్మ? నీ కెన్ని సార్లు చెప్పాలి, నన్ను అలా పిలువోద్దని? ఇవాళ ముద్దకి 'సాధూ' అని పిలిచావు!రేపు 'సన్యాసి' అని పిలుస్తావు!" అంది రుసరుసలాడుతూ.ఆవిడ అప్పడప్పడు అలాగే పిలుస్తుంది! ఎవరూ లేకపోతే అంతగా పట్టించుకోదు సాధన ఎవర్తేనా కొత్తవాళ్ళు వున్నపుడు, స్నేహితుల ముందో పిలిస్తే ఇలాగే విరుచుకుపడుతుంది!
ఆవిడ అదేం పట్టించుకోకుండా, "ఇది గోనే, అజిత్ బావ! పలకరించావా ఏం?" అంది.
"అజిత్ బావకాదు! కోంగాబావ! అను"అనుకొంది స్వగతంగా. తన ఊహకు తనే లోలోపల నవ్వేసుకోంటు. నిజంగా కూడా అతడు తెల్లటి బట్టల్లో తెల్లగా, కోంగలాగే ఉన్నాడనిపించింది.
"ఇదిగోరా! ఇది సాధన! మీ మామకూతురు! జ్ఞాపకముందా?"
"ఫ్రాకుల్లో చూశానప్పాడు!" చిరునవ్వుతో అన్నాడు అజిత్.
"అబ్బా! వెన్నెలకురిసినట్టుగా, మల్లెలు విరిసినట్టు గా హాయిగా ఉంది నువ్వు!" అనుకొంది సాధన అతడి నవ్వుకు ముగ్దురాల్తే పోయి.
"నిలబడి పోయవేం? రా, కూర్చో!" అంటూ, ఆ పిల్ల చెయ్యి పట్టిలాగాడు. తన ప్రక్కన కూర్చోమన్నట్టుగా, అజిత్.
సాధన సిగ్గుతో చేయి లాగేసుకొని, ఏమిటిది? న్యూయార్క్ అనుకోన్నావా? ఇంతమంది ఎదుట చెయ్యిపట్టి లాగడమే కాక నీ ప్రక్కన చోటు కూడా చూపుతున్నావు?" అంది చిరుకోపంతో.
"నీ బాబ్డ్ హెయిర్, మొండిచేతులు, స్లీవ్ లెస్ బ్లౌజ్ న్యూయార్క్ అనిపిస్తూంటేనూ!"
"భలే దెబ్బ కొట్టావురా, మనుమడా!" మనుమడి భుజం తట్టి మరి నవ్వింది పెద్దగా స్వరాజ్యలక్ష్మమ్మ.
సాధన ముఖం ఎర్రగా కంది పోయినట్టుగా అయింది.
తొలిపరిచయం లోనే చిలిపి కయ్యానికి దిగిన బావామరాదళ్ళను చూసి మిగతావాళ్ళు కూడా ముసిముసిగా నవ్వారు.
"విదేశంలో పెరిగివచ్చిన వాడు మనల్ని వెలేత్తి చూపుతున్నాడే! మనకట్టు, మన బొట్టు, మన పద్ధతి మన కుండాలిని ఎంతో చెబుతుంటాను తెలుగింటి ఆడపడుచంటే ఎలా వుండాలి? కంటినిండుగా కాటుక, నుదుట కుంకుంబొట్టు, నున్నగా దువ్విన తల బారెడు పొడువు వాలుజడ, చేతుల నిండుగా గాజులు, ఒంటినిండుగా చిర-రెవికా, కాళ్ళకి పసుపు, చెంపలకి పసుపు....ఆ అందం ఈ చేతులులేని జాకేట్లలో , మగవాళ్ళ లా కత్తిరించు కున్నజుట్టులో, మొద్దుల్లా మొండి గా కనిపించే చేతుల్లోనూ ఎలా వస్తుందే? చక్కగా జుట్టు పెంచవే పిల్లలకి అని ఎన్నిసార్లు చెప్పానో మీ అమ్మకు! ఈ కాలం పిల్లలు మనం చెప్పినట్టుగా వింటారా అత్తయ్య?" అంటూ పిల్లల్ని మగా ఆడా కాకుండా చేసింది!" అంటూ ఆవిడ కోడలి మిద అక్కను వెళ్ళబోసుకోంది.
"మరి నిజమే అత్తయ్య! ఈ కాలం పిల్లలు మనం చెప్పినట్టుగా వింటారా? మీరు చెప్పినట్టుగా తయారు కమ్మంటే "అమ్మమ్మల్లా తయారు కావాలా?" అని మండిపడతారు వాళ్ళు. వాళ్ళతోటి పిల్లలు ఎలా ఉంటారో తామూ అలాగే ఉండాలని కోరుకోవడంలో అనుచిత మేమిలేదు కదా?" అంటూ సమర్దించుకోంది రాథ.