"డార్జిలింగ్ లో చచ్చేంత చలి ఉంటుందంటారు. మనం తిరిగి ఇళ్ళకు రానక్కర్లేదు అనుకుంటే మాత్రం ఒకటే తీసుకెళ్ళవచ్చు" అంది సారధి భార్య.
ఆమె సలహాకు నాతోపాటు సారధికి కోపం వచ్చిందిగాని, వాడి కోపం సాధారణంగా బయటకు తెలియనియాడు. అసలు లోలోపల కూడా గోనుక్కోవడం జరగదు. ఎందుకంటే వాడి పెదాలు కదలికను బట్టి వాడేమనుకుంటున్నది వాళ్ళావిడ పసిగట్టెయగలదు.
ఓసారిలాగే ఏదో తగాదా వచ్చి 'ఏడుపు మొహం'అని లోలోపల గోనుక్కున్నాడట అంతే! "నన్నేడుపుమొహం" అంటారా అని నాలుగు రోజులపాటు ఏడుస్తూ కూర్చుందిట.
"అబ్బే ! నిన్నెందుకు ఏడుపు మొహం అంటానే బాబూ! నువ్వేప్పడూ నవ్వుతూ, కలకలలాడుతూ ఉంటావ్ కదా...." అంటూ ఎంత బ్రతిమాలినా వినలేదంట.
"రెండు టిఫిన్ బాస్కెట్ లు-" అంది సారధి భర్య.
"రెండు వంటిళ్ళు" అన్నాడు సారధి హేళనగా.
"ఆహ! అలాగా! సరే టిఫిన్ బాస్కెట్ లు వద్దు లెండి! మాకేం పోయిందని ర్తేల్లోనే అందరికి భోజనాలూ, టిఫిన్ లూ ఆర్డర్ చేద్దురుగాని-"
"అవును....మనకే ఆఖరి నిమిషంలో ఆపాడు వంటింటిపని తప్పిపోతుంది" అంది మా ఆవిడ.
ఇద్దరూ 'షేక్ హ్యండ్ 'ఇచ్చుకున్నారు ఆనందంగా.
పరిస్ధితి విషమిస్తోందని గ్రహించి నేను కల్పించుకున్నాను వెంటనే.
"సరే-వాళ్ళమాటెందుకు కాదనాలి, అందరికి కలిపి ఒక టిఫిన్ బాస్కెట్ వేద్దాం" అన్నాను.
"ఆ !ఎందుకులెండి! ఒక్కటికూడా అనవసరం" అంది మా ఆవిడ. కాని మేమిద్దరం ఆ డ్తెలాగ్ విననట్లు నటించాం.
"ధర్మోస్ ప్లాస్క్ ఒకటి" అన్నాడు తాతయ్య.
అదెందుకు అనబోయి అది తాతయ్యకు అవసరం కాబట్టి, తాతయ్య మాకు (ముఖ్యంగా ఈ ప్రయాణానికి) మరింత అవసరం కాబట్టి వెంటనే లిస్టులో రాసేశాం.
"ఒక ఎయిర్ బాగ్-" అన్నాన్నేను.
"సామాసంతకంటే ఎక్కువ ఉంటే మనం గూడ్స్ ట్రెయిన్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది"అన్నాడు సారధి.
ఇక సూట్ కేసుల్లో ఎవరెన్ని బట్టలు తీసుకుపోవాలి అనే అంశం చర్చకు వచ్చింది.
"మగాళ్ళు మూడు జతలు, ఆడాళ్ళు మూడు జతలు " అన్నాడు సారధి.
మామూలుగానే వాళ్ళావిడ అతని అభిప్రాయంతో ఏకీభవించలేదు.
"ఆ... అవికూడా ఎందుకులెండి-అనలేమి అవసరం లేదు."
"అసలు బట్టలేకుండా ప్రయాణం చెయ్యటం అంతగా బావుండదను కుంటాను" అన్నాన్నేను.
"ఛి! మీది మరి పాడు బుద్ది" అంది మా ఆవిడ.
"నాకేం నాకు నాలుగుజతలు కావాలి-పువ్వుల చొక్కాకూడా కావాలి" అన్నాడు చిన్నిగాడు.
"ఎడ్చావ్ లే - చిన్నిపిల్లలకు రెండే జతలు" అన్నాడు సారధి.
"అమ్మా....నాకు పువ్వుల చొక్కాకూడా కావాలే" అంటూ ఏడుపు మొదలెట్టాడు వాడు
"నోర్మూసుకో వెధవ! అన్నిటికి ఏడుపు-తండ్రి పోలికలే వచ్చినయ్" అంటూ కసురుకుందామే.
సారధి కోపంగా ఆమె వేపు చూసి చేసేదిలేక ఊరుకున్నాడు.
ఆ రోజునుంచి మిగతా ప్రయాణ సన్నాహాలు ప్రారంభమయిపోయాయి. ఇంక రెండు రోజుల్లో ప్రయాణం అనగా ఆటకమీద నుంచి బెడ్డింగ్ రెండూ తీశాము. అవి రెండూ నలుపురంగుతో ఉన్నాయ్ అదే మిటి మనం తెల్లరంగు బెడ్డింగ్ లు కదా! ఇప్పడు నల్లవి ఉన్నాయేమిటి? యింకేవరి బెడ్డింగ్స్ తోనయినా మారిపోయయేమో"అన్నాడు సారధి.
"ఏమికాదు. అవి తెల్లేవే- దుమ్ముపట్టి అలా ఉన్నాయ్. బయటకు తీసుకెళ్ళి దులపండి" అంది మా ఆవిడ.
వాటిని జాగ్రత్తగా రోడ్డుమీదకు తీసుకెళ్ళి దులపటం ప్రారంబించాము. మరుక్షణంలో వాటినుంచి లేచిన దుమ్ము మా చుట్టూపక్కల ఇళ్ళన్నిటిని పొగలాగా మూసేసింది. ఆ ఇళ్ళవాళ్ళందరూ దాని ఘటుకి చాలా స్వ్పతి వరకూ దగ్గుతూండటం మాకు వినిపిస్తూనే ఉంది.
కొంతమంది భయంతో బయటకు పరుగెత్తుకొచ్చారు. అంతటి దుమ్ము ఎలా వచ్చిందో తెలుసుకోడానికి.
ఆ దుమ్ము మధ్య ఉన్న మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు.
"మిరా? ఇంత దుమ్ము ఎలా తేగలిగారు?"
"ఆ....పెద్ద కష్టమేంలేదు. బెడ్డింగ్ లు దులిపాము అంతే!"
"ఎప్పటి బెడ్డింగ్ లవి? ఈస్టిండియా కంపెనివారు తెచ్చినస్టాకులావా?"
"అబ్బే ! అయిదేళ్ళక్రితమే కొన్నాం."
"అలాగా! అయితే మరి దులిపాము....ఇవాళ రెండో సారి!"
"ఈ లెఖ్ఖన ఊరిబయట కొన్ని మ్తెళ్ళవరకూ దుమ్ము ఆకాశం ఎత్తున లేచి ఉండుంటుంది."
"మరి అంతఎత్తు కాదుగాని- మన ఎలాక్టిక్ పిల్ అంత ఎత్తు న వచ్చిందని ఎలాక్టిసితి డిపార్టుమెంట్ మనిషోకతను పొల దిగి వచ్చి చెప్పాడు."