Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 16

    అజిత్ మాటలు తమాషాగా అనిపించాయి అందరికి.

    "ఎబ్తే  ఏళ్ళోచ్చిన  నీ తండ్రికంటే  నువ్వే బుద్ధిమంతుడిలా ఉన్నావు!"  ప్రశసంగా అన్నాడు వెంకన్న,   "కానీ,  అబ్బాయ్ ఉపనయం కానిదే దేనికి పనికిరావుకదా?"

    "ఉపనయనమా?  అంటే  ఏమిటి?"  అజిత్  ఆసక్తిగా అడిగాడు.

    "యజ్ఞో పవితం  మెడలోపడాలి!  గాయత్రి మంత్రో పదేశం  పొందాలి"

    "మెడలో ఏం పడాలన్నారు?"

    "ఇదిరా,  బాబూ!"  ఆయన చొక్కా గుండీలు  తొలగించి యజ్ఞో పవితం  పైకెత్తి చూపాడు.

    అజిత్  ఆయన యజ్ఞోపవీతన్ని  చేత్తో పట్టుకొని పరీక్షగా చూసి,  "ఇది నేనూ వేసుకొంటాను!  తెప్పించండి!"   అన్నాడు.

    అతడి  అమాయకతకు  నవ్వొచ్చింది అక్కడున్న  అందరికి.

    "ఇది ఎప్పడంటే  అప్పుడు బజారులో కొనుక్కు వచ్చి వేసుకోనేది కాదురా,  అబ్బాయ్!  నీ  జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక శుభాలగ్నాన్ని ఏర్పరచి,  గాయత్రి యజ్ఞం  చేసి,  గాయత్రి మంత్రోపదేశం పొంది ఈ యజ్ఞ పవితం  ధరించాలి! అలా కొట్టులో  తెచ్చి ఇలా మెడలో వేసుకోవలసింది కాదు యజ్ఞపవితం  అంటే"

    "అలాగా?  ఇప్పుడెలా?"  నిరుత్సాహపడి పోయాడు అజిత్.

    "మీ నాన్న చెయ్యనని ఖచ్చితంగా  చెప్పేశాడు కదా?  మీ నాయనమ్మ ఆ చన్నీళ్ళ స్నానాలూ,  అపరాహ్వం వరకూ ఏం తినకుండా  ఏం ఉంటుంది?  అవన్ని ఆవిడ చేత  చేయిస్తే  మీ తాతయ్య దగ్గరికి  వెంటనే  పయనం  కట్టగలదు!  మీ నాన్న తరువాత,  మీ నాయనమ్మ తరువాత మీ తాతయ్యకు  చేయడానికి హక్కున్నవాడివి నువ్వు  మనస్పూర్తిగా ముందుకు వచ్చినా నిన్ను కాదని ఇంకెవరి చేతో  ఎలా చేయించాలి!  పద,  ఆ బట్టలు విప్పేసి,  అడ్డపంచ ఉంటే తిసిచుట్టుకో?  ఆ తరువాత  చేయించాల్సింది అంతా వెంట ఉండి  చేయిస్తాను"

    ఆ ఆపత్  కాలానికి తలకొరివి అజిత్ చేత పెట్టించినా తరువాత పదవ రోజు నుండి  జరిపే కర్మకాండకి  ఉపనయనం కాలేదు గనుక అతడు పనికిరాడని  తీర్మానించారు. శాస్త్రం తెలిసిన బ్రాహ్మలు.  అజిత్ తాతగారికి కొడుకు వరుస్తేన  ఒకాయనచేత  కర్మకాండ చేయించడానికి  నిర్ణయం జరిగింది.  తనకు నచ్చని పనులు ఇంట్లో జరుగుతున్నాప్పడు  అక్కడా ఉండలేనని  కర్మముగిశాక తిరిగి వస్తానని  తల్లితో చెప్పి భార్యతో  కూతురితో సంజివనగర్  లో  ఉన్న అత్తగారింటికి వెళ్ళిపోయాడు మల్లిక్.

    అజిత్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు.  కర్మకాండ అంటే  ఏమిటో  తెలుసుకోవాలన్న కూతూహలం కొద్ది.


                                                                        10


    కర్మ  మొదలు పెట్టినప్పటి నుండి ముగిసేదాకా శ్రద్ధగా గమనించాడు అజిత్.  చిన్న పిల్లాడు ఏదో జానప చిత్రం చూసినట్టుగా ఏదో విచిత్రంగా,  వినోదంగా తోచసాగింది.

    ఒక్కోసారి  నవ్వుగానూ,  ఒక్కోసారి జాలిగానూ,  ఒక్కోసారి దుఃఖం గానూ  అనిపించేది!

    పదవరోజు నాయనమ్మకు జుట్టు లేకుండా  గాజుల్లెకుండా,  బొట్టు లేకుండా తెల్లటి పంచెలో చూసినప్పుడు అతడి మనసు విలవిల్లాడినట్టుగా అయింది.

    "తనముందు పట్టెడు పసుపు కుంకుమలతో పోకుండా నాకి అవతారం ప్రసాదించి పోయాడు!"  అంటూ నాయనమ్మ లోపలేక్కడో   ఓ హాది మూలన కూర్చొని ఏడుస్తూంటే అజిత్ కళ్ళంబడి  నీళ్ళోచ్చేశాయి!

    "నీ జుట్టుకు, నీ బొట్టుకు నీ బట్టకూ ఏమిటి సంబంధం తాతగారికి,  నాయనమ్మా?"

    "యోచిస్తే సంబంధం ఏం లేదు!  కేవలం ఇదొక ఆచారం!"

    "ఒక ఉద్దేశ్యంతో ఏర్పడిన పద్ధతేకదా,  ఆచారమంటే?"

    "మగడు పోయిన ఆడదాన్ని మరో  మగవాడు కన్నెత్తి చూడ కుండా  ఉండడం కోసం ఈ వికార స్వరూపం వచ్చేట్టుగా చేయడమే ఈ ఆచారంలో ఉద్దేశ్యంరా!"

    "మ్తేగాడ్,  ఈ వయసులో నువ్వు ఏ మగవాడిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తానవని  జుట్టు, బొట్టు తీసేసి తెల్లపంచే  కట్టించారు?"  ఆవేశంతో అడిగాడు.

    "ముసలివాళ్ళకి ఓ ఆచారం,  పడుచువాళ్ళకి ఓ ఆచారం లేకుండా స్త్రి లందరికి కలిపి ఓకే ఆచారం చేశారురా!  జుట్టు తీయడం ఒక బ్రాహ్మల్లో తప్ప మిగతా వర్ణాలలో లేదు!"



                                                                    11


    కర్మకాండ నిర్వహించిన అప్పయ్య శాస్త్రి బ్రాహ్మణాశి ర్వధం పొంది వెళ్ళి  పోయాడు.

    ఇంటి ముందు  ముగ్గులు వేసి,  గుమ్మాలకు మామిడాకు కట్టి,  భక్ష్యాల వంటతో పదమూడో రోజు పండగ ముగించారు.  వచ్చిన చుట్టాలందరూ. వాళ్ళ గోత్రికులు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ రోజు ఆ ఇంటి దీపం చూడకూడదని సాయంత్రమే ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు!

    అంతా అయిపోయాక,

    మరునాడు ఉదయం వచ్చాడు మల్లిక్.  అతడొక్కడే వచ్చాడు భార్యనీ,  కూతుర్ని అక్కడే ఉంచి.

    "అమ్మా!  మేం తిరిగి  వెళ్ళిపోయే  రోజు దగ్గరికి వస్తూంది!  నీ కిక్కడ కొన్ని ఏర్పాట్లు చేసి పెడదామనుకోంటున్నాను!"  అన్నాడు తల్లి కూర్చొన్న చోటికి వచ్చి,  తనూ అక్కడే చతికిలబడి.

    "ఏం ఏర్పాట్లు!"  యశోదమ్మ ఉదాసినంగా అడిగింది.

    "ఇదివరక్తెతే  నాన్నగారు,  నువ్వు ఒకరికి ఒకరన్నట్టుగా ఉండే వాళ్ళు!  పెద్దగా మీ గురించి బెంగాపడేవాడిని  కాదు!  ఒక్క దానివిప్పడు.  వృద్ధాప్యం కూడా వచ్చేసింది! అందుకని నువ్వు వంటరి దానిని కాకుండా భాగీరధి నాయనమ్మను   తోడుగా ఉండిపోయేందుకు అడుగుదామనుకొంటు న్నాను!  వంటకి  ఒక మనిషిని కూడా మాట్లాడాను!ఒక్కదాన్ని నాకు వంట మనిషేందుకురా?  అని నువ్వంటావనే, ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి రేపు రమ్మని చెప్పాను.  ఇంకా ఏం కావాలో అడుగు. నువ్వు ఈ వయసు లో ఏ  కష్టం పడ్డా నేను సహించలేను!  నీకు అన్ని విధాలా సౌకార్యం  ఏర్పరిచి  వేడితేనే నేను వెళ్ళిన చోట నిశ్చింతగా ఉంటాను"

    "నాకోసం నువ్వు ఇంత తాపత్రయ పాడడం ఎందుకురా?జీవితం చివరి మెట్టు మిద నిలబడి ఉన్నాను.  మీ నాన్నగారు వెళ్ళిపోలేదా?  నేనూ పోతాను ఒకరోజు!  నాకోసం నువ్వేం తాపత్రయ పడక్కరలేదు!"

    "ఇది అభిమానంతో  అనే మాటతప్ప,  మనసులో మాటకాదమ్మ!"

    "ఏబ్తే  ఏళ్ళోచ్చాయిరా నీకు!  ఇంత కాలమూ నువ్వు మాకోసం ఒక్కటంటే ఒక్కటి చేశావా?"

    "అందుకే ఈ తల నీముందు వంగిపోతూందమ్మా!  ఇప్పటిక్తేనా  నీ మనసుకు నచ్చేపని చేసి కొద్దిగా తలెత్తుకొందామని  తాపత్రయ పడుతున్నాను!"

    కొడుకు కంఠంలో  వినిపించివ ఆ ర్తికి  యశోదమ్మ కప్పకొన్న అభిమానపు తెర తొలగిపోయినట్టుగా అయింది.  దుఃఖవి చలిత స్వరంతో అంది.  "ఈ వయసులో ఏ తల్లయినా ఏంకోరుకుంటుందో  నేనూ అదే కోరుకుంటున్నానురా!  కన్నా కొడుకు చేతుల్లో కన్ను మూయాలని!  కానీ,  అది తీరని కోరిక!  అందుకే నిన్నేమి కోరడం లేదు!  నీకు ఈ దేశమంటే అసహ్యం!  ఈ మనుషులంటే అసహ్యం! ఇక్కడ ఉండలేనని ఎప్పుడో చెప్పేశావు!  నువ్వాదేశంలో!  నేనిక్కడ!  రోకుల్ని లెఖ్ఖ పెట్టుకుంటూ!  ఈ హంస  ఏ రాత్రి ఏ పగలో వెళ్ళిపోతుంది!  వస్తే ఇక్కడ చూడటాని కేమి మిగిలి ఉండదు కాబట్టి నువ్విగడ్డమీద కాలు పెట్టడం ఇదే ఆఖరను కొంటాను!"

    ఈ దేశం వచ్చేయ్యమనడం తప్ప ఇంకేం కోరినా తిర్చిడానికి  సిద్ధంగా ఉన్న మల్లిక్,  తల్లి మనసులో మాట విన్నాక కాస్సేపు నోటమాట రానట్లుగా కూర్చుండి పోయాడు.

 Previous Page Next Page