"ఆ ! లేకపోతే ఆ పుట్ బాల్ ప్లేర్ గంగాధరాన్నే చేసుకోవలసింది! ప్రాక్టిస్ కోసం రోజూ నిన్నే పుట్ బాల్ ఆడుకునేవాడు" అన్నాడు కోపంగా.
ఆమె కాలేజిలో చదువుకునే రోజుల్లో వాళ్ళ కాలేజి పుట్ బాల్ ప్లేర్ గంగాధరాన్ని ఎంతో ల్తేక్ చేసేదిట! ఆ విషయం తెలిసిన క్షణం నుంచి సారధికి పుట్ బాల్ అన్నా పుట్ బాల్ ప్లేర్స్ అన్నా ఒళ్ళు మండిపోతుంది.
"నాన్నా!" అన్నాడు చిన్నిగాడు మధ్యలో.
"ష్! పెద్డళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను?" కోపంగా అంది వాళ్ళమ్మ.
"మరెప్పుడు మాట్లడాలమ్మ?"
"మేము మాట్లాడడంఆపేవరకూ ఆగాలి"
"కాని మీరు మాట్లాడడం మొదలు పెడితే ఆపరుగాదా?"
"ఏడ్చవులే నోర్ముయ్" అంటూ వాడి నేత్తినొకటి తగిలించింది.
వాడు ఇల్లెరిగిపోయేట్లు ఏడుపు మొదలేట్టేసరికి మా సమావేశం అప్పటికి అత్యవసరంగా ముగిసిపోయింది.
ఆ రాత్రి భోజనాలయ్యాక తిరిగి మా వసారాలో సమావేశం ప్రారంభమయింది. ప్రయాణానికి ఏమేం వస్తువులు తీసుకెళ్ళలో లిస్ట్ తయారు చేయసాగాము.
"బట్టలకు రెండు సూట్ కేసులు" అన్నాడు సారధి.
"రెండేందుకు?" అడిగాను సందేహంగా.
"మికొకటి, మాకొకటి ఉండాల్సిందే కదా!"
"మరి నా సంగాతేమిటి?" అడిగాడు తాతయ్య మంచం మీద పడుకున్నవాడల్లా లేచి కూర్చుని.
"నీ బట్టలు ఓ ఎయిర్ బాగ్ లో సర్దేద్దంలే!" అన్నాను ఖచ్చితంగా గొణుగుడు లేకచేస్తే సామాను పెరిగిపోతుంది?
"రెండు బెడ్డింగులు" అంది మా ఆవిడ.
"నువ్ నోర్మూసుకో! నీ సలహా ఎవడూ అడగలేదు" అని లోపల అనుకోబోయి ప్తెకనేశాడు పొరపాటున.
అంతే- వార్ డిక్లేర్ అయిపోయిఅది.
"మా సలహా అక్కర్లేకపోతే మీరే అఘోరించుకోండి!" అంటూ ఇద్దరాడాళ్ళు వాకౌట్ చేయబోయారు.
సారధిగాడే వాళ్ళను బ్రతిమాలి "వాడనాలని అన్లేదుగ-పొరబాటున ప్తెకనేశాడు!" అంటూ నా తరపున సర్ది చెప్పాడు.
లోపల అనుకునే మాటలు ఒకోసారి పొరబాటున ప్తెకి అనేయడం వల్ల ఎన్ని అనర్దాలు జరుగుతాయో నాకు బాగా తెలుసు.
మా ప్రెండ్ కృష్ణ పెళ్ళయిన కొత్తలో వాళ్ళావిడతోపాటు దబా మీద వెన్నెల్లో కూర్చుని మంచి మూడ్ తో కబుర్లు చెప్తూండగా మాటల మధ్యలో పొరపాటున "హిరణ్మాయి- ఐ లవ్ యూ" అన్నాడట ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అప్పుడు స్పృహలోకొచ్చినాలక్కరచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళావిడ పేరు స్వప్న. దాంతో పరిస్ధితులు అతి వేగంగా అతి భీకరంగా మరిపోయినయ్ అంతవరకూ తన భర్త తనను ఎంత ప్రగాడంగా ప్రేమిస్తున్నాడోనని మురిసిపోయిన వాళ్ళావిడ సీరియస్ అయిపోయింది.
"నిజం చెప్పండి-హిరణ్మాయి ఎవరు?" అడిగింది అనుమానంగా.
"అబ్బే- ఆ పేరు పొరబాటున వచ్చేసింది స్వప్నా"అన్నాడు కృష్ణ తడబడుతూ.
"నేనూ అదే అనేది! పొరబాటున మీ మనసులోని వ్యక్తి పేరు బయటకొచ్చింది కాబట్టి ఇప్పటికయినా నా కళ్ళు తెరుచుకున్నాయ్!"
"అయ్యో! అసలా పేరుగలవారెవరూ నాకు తెలిదు స్వప్నా!"
"తేలిపోతే హఠాత్తుగా ఆ పేరు ఎలా మీ నోటి కొచ్చింది?"
"అదే నాకూ ఆశ్చర్యంగా ఉంది! ఒకోసారి అంతే! అనుకోకుండా భలే పేర్లు వస్తుంటాయ్."
"అనుకోకుండా పేరు రావచ్చేమోగాని - ఇంత అరుదయిన పేర్లు ఎవరూ పలకరు."
ఇంక లాభం లేదని కృష్ణ ప్లేట్ ఫిరాయించాడు.
"అసల్సంగ తేమిటం-నిన్ను పోయిటిన్ గా పిలవాలని ఎప్పట్నుంచో నా మనసులో ఉంది! అందుకని నిన్న చదివిన ఓ కవిత పుస్తకంలో ఆ పేరు కనిపించేసరికి ఉపయోగించాను."
"ఎందుకలా అబద్దాలు చెప్తారు? మీ ఆఫీసులో హిరణ్మాయి అనే టైపిస్ట మీ పక్కసిట్లో లేదూ?"
"హిరణ్మయా? ఆ అమ్మాయిది ఆ పేరు కాదె!"
"అదే పేరు అని మీరే చెప్పారు?"
"నేను చెప్పానా?"
"అవును!"
"ఎప్పడు?"
"వారం క్రితం!"
"ఓహొ-అయితే సరే నాకు గుర్తులేదు. ఎందుకంటే ఆడపిల్లలకు గాని వాళ్ళల పేర్లకు గాని నేను చాలా దూరంగా ఉంటాను."
"మరి 'హిరణ్మాయి-అయ్ లవ్ యూ' అని ఎందుకన్నారు?"
"స్వప్న అనబోయి-"
"రేపోద్దున్నేను మా యింటి కెళ్ళిపోతున్నాను..." అందామె.
అంతే ఆ రోజునుంచి వాడి జీవితం నరకమ్తెపోయింది. మళ్ళి వాడి సంసారం కుదట పడడానికి సంవత్సరం పట్టింది. ఆ విషయం వాడు చెప్పిన దగ్గర్నుంచి మాగ్రూపు వాళ్ళందరము పేర్ల విషయంలోనూ, ఇంక ఇతర అవాంచనియ డ్తెలాగ్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా మాసాలు కోవటం అలవాటు చేసుకున్నాం. కాని ఇప్పుడు మాత్రం మళ్ళి పొరబాటు జరిగింది.
"రెండు బెడ్డింగ్ లు బదులు ఒకటే బెడ్డింగ్ తీసుకెళితే ఎలా వుంటుంది?" అనడిగాడు సారధి.