"ఆ అబ్బాయి మల్లిక్ కొడుకేనా? అబ్బా! ఎంత పెద్ధవాడ్తే పోయాడు, మల్లిక్ మేనమామ కూతుర్ని వదిలేసి, కులాంతర వివాహం చేసుకోవడం, అది బంధువుల్లో పెద్ద దుమారం లేవడం. అదేదో నిన్న మొన్న జరిగినట్టుగా అనిపిస్తుంది! అతడికి పుట్టిన పిల్లలే అతడంతటి వాళ్ళయ్యారాప్పడే!" అని గుసగుసలాడుకోసాగారు.
కొడుకు హాల్లోకి అడుగు పెట్టగానే, నాకి వయసులో మీ నాన్న ఎంత కిష్టం పెట్టిపోయాడో చూడరా?" అంటూ కొడుకు గుండెల మీద తల ఉంచి బావురుమని ఏడవసాగింది యశోదమ్మ.
"ఎందుకు పుట్టానో మీ కడుపున! కనీసం నాన్నగారి చివరికోరిక అయినా తీర్చలేని వాడిన్తే పోయాను! ఇలాంటి కొడుకు జన్మజన్మలకీ వద్దు అనుకోనేట్టు గా ప్రవర్తించాను కదూ?" తల్లిని పోదుపుకొని, గాద్గాదికంగా అన్నాడు మల్లిక్.
"కనీసం తల కొరివి పెట్టటానిక్తేనా వచ్చావు కదా? ఎక్కడి కక్కడే 'చాలు ఈ భాగ్యం' అనుకోవాలి! నువ్వొస్తావని అన్నీ సిద్ధం చేసే ఉంచాను! టాక్సి మాట్లాడాను. కుండలు, అవసరమైన వస్తువులు, కోత్తగుడ్డా అన్నీ వచ్చేశాయి. వెళ్ళి నూతిమీద స్నానం చేసి వచ్చావంటే శవాన్ని లేపవచ్చు ఈ రాత్రి ఉంచి చద్దిపినుగను చేయడం ఎందుకు?" అన్నాడు వెంకన్న.
"నా సంగతి మీకు తెలుసుకదూ, పెద్దనాన్నా? ఈ స్నానాలూ, అగ్ని పట్టుకు నడవడాలు-అవన్ని అర్ధంలేని పనులు! మనిషి చనిపోయాక ఆ శరీరాన్ని ఇంట్లో ఉంచేసుకోలేం గనుక శవానికి ధహనసంస్కారం జరుపాల్సిందే! శవాన్ని తీసికెళ్ళడం, బూడిద చెయ్యడం-అంతాతే! మిగా పిచ్చిపిచ్చి పనులు నా చేత చేయించాలనుకోవద్దు!" నిక్కచ్చిగా తన అభిప్రాయం తెలిపాడు మల్లిక్.
మల్లిక్ ఎప్పడూ ఒక వంకర టింకర గితగానే కనిపిస్తాడు బంధువులకి, మిగతా ప్రపంచానికి! అపురూప సుందరి, సంగీత సరస్వతి సుగుణవతి అయిన కన్యను అతడు భార్యగా ఏలుకోనని నదిలేసినప్పడూ ఇలాగే ముక్కు మీద వేలేసుకొన్నారు. శుద్ధ ఆచారవంతుల ఇంట పుట్టి పెరిగి మరో కులం అమ్మాయిని రెండో వివాహం చేసుకొని తీసుకు వచ్చి నప్పడూ అంతకంటే తక్కువ ఆశ్చర్యపోలేదు. విదేశంలో డాక్టర్లుగా ఉద్యోగాలు సంపాదించుకొని, తల్లిదండ్రులను ఒంటరి పక్షులను చేసి భార్యాభర్తలిద్దరు వెళ్ళిపోయినప్పుడు 'ఎవరు కొడుకులు? ఎవరు తండ్రులు? ఎవరు తల్లులు? ' అని విరక్తితో ఓ నిట్టూర్పు విడిచారు.
ఇప్పుడూ,
మనిషి అంతిమయాత్రలో చేయవలసిన విధులను పిచ్చిపనులుగా కొట్టివేసి, అలాగే ఉంచుకొంటే క్రుళ్ళి కంపు కొడుతుంది కాబట్టి తీసుకు పోయి ఏదో చెత్త కాగితాన్ని తగలేసినట్టుగా తగలేస్తానంటున్నాడు.
"ఎవరో అనాధ శవాన్ని తీసుకుపోయి తగలేసినట్టుగా తగలేస్తానంటా వేమిటిరా? ఆ పని నువ్వే చేయాలేమిటిరా? అ పని మేమ్తెనా చేస్తాం! మున్సి పాలిటి వాళ్తే నా చేస్తారు! నువ్విలా అనాధ ప్రేతాన్ని చేస్తే బ్రతికివున్న మీ అమ్మ బాధపడదా! మీ అమ్మ కొసమ్తెనా నీ పద్ధతులు కొంచెం నడలించుకో, నాయనా!" అంది పూర్వాసువాసిని అయినా భాగీరధమ్మ.
"మీరెవరూ ఏమి చెప్పకండి, అత్తా వాదిష్ట ప్రకారమే చేయనీ! ఎప్పడూ తన పద్ధతులనూ, అభిప్రాయాలనూ మార్చుకొని వాడు ఇపుడు మాత్రం ఎందుకు మార్చుకోవాలి! ఎవరి గురించ్తేతే వాదులాడు కోంటున్నారో ఆయనే లేడు?" అభిమానంగా అంది యశోదమ్మ.
"లేక ఎక్కడి కెళ్ళాడే" మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆత్మశారిరాన్ని వదిలిన తరువాత ప్రేతరూపంలో ఉంటుంది. దానికి, శాస్త్రా లలో చెప్పినా ప్రకారం కర్మ కాండ నిర్వహిస్తే గాని ఆ ప్రేత రూపం వదిలి సూక్ష్మ రూపం ధరించి స్వర్గలోకానికి బయల్దేరదు. కడుపు పుట్టిన కొడుకు ఉండి శ్రీనుకి ప్రేతత్వం నుండి విముక్తి లేకుండా పోవడమా? పోవడామా? కొడుకు ఉండి లేని వాడ్తెనప్పుడు కట్టుకొన్న దానిని నువ్వున్నావుకదా? నువ్వు చెయ్యి వాడికి ఉత్తర క్రియలు!" భాగిరధమ్మ ఆవేశంగా అంది.
మల్లిక్ ప్రశాంతమ్తెన స్వరంతో "నాయనమ్మా' మీరు బ్రతికే ఉన్నారుకదా? మీ ఆత్మను మీరెప్పుడైనా చూచుకోన్నారా? ఎవరి ప్రేతాన్తెనా ఎప్పడ్తేనా చూశారా?" అనడిగాడు.
చర్రుమంది భాగిరధమ్మకు. " తమని తాము చూచుకోగల మహాను భావులు చూచుకొన్నారు? మనబోటి అంధులకి చెప్పారు మనం అంధులమ్తె మనకు కనిపించనిదంతా లేదంటే ఎలా?" ఆవిడ ఝాడిస్తున్నాట్టుగా అంది. ఇంతమంది బంధువులం ఉండి శ్రీనివాసుడు అనాధ ప్రేతమ్తె పోతుంటే చూస్తూ ఎలా ఊరు కొంటాను, లేవే! కొంగు నడుముకు చుట్టుకో! నూతి మీదికి పద!
ఇంత సేపటికి మల్లిక్ భార్య భావన కల్పించుకోంది. భర్త భుజం మీద చెయ్యివేసి నచ్చజెప్పతున్నత్తుగా అంది మిరెప్పడూ బాధపడుతుంటారుకదా? కనీసం మీ అమ్మగారి మన శ్శాంతి క్తేనా మిరిపని చేయక తప్పదు!"
"ఎవరి కోసమో నాకెంత మాత్రం నమ్మకం లేని పనులు ఎలా చేయను, భావనా? ఉహు, నావల్ల కాదు! తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేని కొడుకుగానే నన్ను మిగిలిపోని!"
ఇంతసేపు అతి శ్రద్ధాసక్తులతో మౌనం వింటున్నాడు మల్లిక్ కొడుకు అజిత్ కుమార్ విషయమేమిటో పూర్తి గా అర్ధం కాలేదతడికి "డాడి ఇప్పుడు మిమ్మల్ని ఏంచేయ్యమంటున్నారు వీళ్ళు? అనడిగాడు ఇంగ్లీష్ లో"
"ఇక్కడి ఆచారాల ప్రకారం ఇప్పుడు నేను నూతిమిదికి వెళ్ళి చన్నీళ్ళు మీద గ్రుమ్మరించుకొని, మట్టి కడపలో నీళ్ళుతోడుకు వచ్చి వాకిట్లో రాజుతున్న ఆ నెగడుమీద వెచ్చజేసి, ఓ మట్టి పిడతలో బియ్యం ఉడికించి ఓ మట్టి చిప్పలో నిప్పని, అన్నపుకుండని చిక్కంలో పట్టుకొని పాడెకు ముందు నడవాలి! అన్నీ పిచ్చిపనులే! ఆటవి కులు చేసే, పనులు. నాకిష్టం లేదని చెబుతున్నాను!"
"తాతగారికి నేను చెయొచ్చునేమో అడగండి!"
"నువ్వు చేస్తావా?!" ఎగిరిపడ్డట్టుగా అడిగాడు మల్లిక్.
"చెయొచ్చు నంటే నేను తప్పకుండా చేస్తాను, డాడి!"
"నేను ఎద్తేతే చేయకూడదంటున్నానో, అర్ధం లేని పిచ్చి పనులంటున్నానో అదే నువ్వు చేసి నన్ను అవమావిస్తావా? తండ్రి ముఖం ఎర్ర బడుంది.
"చూడండి, డాడి! మీ తండ్రిగారి నమ్మకాలు, సిద్దాంతాలు మివి కాదు! అలాగే మీ నమ్మకాలు, సిద్దాంతాలు మీ కొడుక్కి సంక్రమించాలని కోరుకోకూడదు! మా తండ్రిగారు మీకెలా స్వేచ్చ ఇచ్చారో మీరూ నాకలాగే ఇవ్వాలి!" తన అభిప్రాయాన్ని స్పష్టంగా, వినయంగా చెప్పాడు అజిత్.
"ఏ ఆటవికుల కాలంలోనో ఏర్పడిన పద్ధతులివి! మనం నాగరికంగా, స్తేంటిఫిక్ గా ఇంత ఎదిగి ఆ ఆచారాలకి తల ఒగ్గడంలో అర్ధమే మ్తెనా ఉందా? నువ్వు నమ్ముతావా, అజి? ఆత్మ ఒకటి ఉందని, శారిరాన్ని విడిచాక అది ప్రేత , మౌవుందని, దానికి పిండ ప్రదానాలూ, మిగతా కర్మ కాండ జరిపితే తప్ప అది ప్రేతత్వాంనుండి విముక్తిపొంది ఊర్ధ్వ లో కాల వ్తెపు సాగిపోదని!"
"వాటిలో నాకు నమ్మకం ఏర్పడి చేస్తాననడం లేదు డాడి, నాయనమ్మని చోస్థె౪ నాకు చాలా జాలేస్తూంది! ఆవిణ్ణి ఈ వయసులో కష్ట పెట్టడం భావ్యం కాధు! ఆవిడ మనశ్శంతికోసం ఏమ్తేనా చేయాలని పిస్తుంది!"
ఇద్దరి సంభాషణా ఇంగ్లీష్ లోనే నడుస్తోంది!
"నా అభిప్రాయల్ని నీమీద రుద్ధకూడదని ముందే హేచ్చారించావు కాబట్టి నేనేమి అనను, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి!" ఎంత నెమ్మదిగా అన్నా గాయపడ్డ అభిమానం అతడి స్వరంలో తోంగిచూడకపోలేదు!
అందరిలోకి పెద్దమనిషి గా కనిపిస్తున్న వెంకన్నను సమీపించి, "తాతగారికి మన ఆచారాల ప్రకారం ఏమేం చేయాలో నేను చేస్తాను! ఆయనకీ మనుమడిని కాబట్టి నేను చెయొచ్చుననుకుంటున్నాను" అన్నాడు అజిత్. అతడు మాట్లాడింది తెలుగే! కానీ , తెలుగులా అనిపించలేదు ఎవరికీ! ఇంగ్లీష్ వాడు తెలుగు నేర్చుకొని ఒక విధమ్తెన యాసతో పట్టిపట్టి మాట్లాడినట్టుగా ఉందే తప్ప ఒక తెలుగువాడు మాట్లాడినట్టు గా లేదు.
పుట్టాడమ్తెతే ఇక్కడే పుట్టాడు. రెండేళ్ళ పిల్లవాడప్పుడు తల్లిదండ్రులతో అమెరికా వెళ్ళిపోయి అక్కడే పెరిగి అక్కడే చదువు సంధ్యలు ముగించుకొన్నాడు. తెలుగు మీద, తెలుగుజాతిమీద, అసలు హిందూ జాతిమిదే అభిమానం లేని తల్లిదండ్రుల దగ్గర ఆ మాత్రమ్తెనా తెలుగు వచ్చిందంటే గొప్పే!