"వెనక్కెళ్ళవయ్యా! పెద్ద మొనగాడిలా ముందు కెలుతున్నావ్?" అన్నాడు ఒకతను కోపంగా.
"మేమంతా ఆ పని చేతకాకేనిలబడ్డామా?" అన్నాడు యింకోకతను వెటకారంగా.
"నువ్వేం దిగి వచ్చావా?" అన్నాడు మరొకతను చొక్కా చేతులు ప్తెకి మడుస్తూ.
ఆ వ్యక్తి అందరిని చూసి జాలిగా చిరునవ్వు నవ్వాడు.
"ఇలా నన్ను అడ్డగించేట్లయితే మీకే నష్టం!" అన్నాడు పెద్ద పెద్దమనిషి.
"నిలబడటానికి నాకేమి అభ్యంతరంలేదు. కాని ఈ రిజర్వేషను కౌంటర్ లో మీకు టికెట్స్ యిచ్చేది నేనే!" అన్నాడతను.
దాంతో అందరూ స్తేలంటయిపోయారు.
ఒకరిద్దరు పక్కకు తొలగి అతనికి ముందుకు వెళ్ళడానికి చోటిచ్చారు. అతను 'ధాంక్స్ ' చెప్పి 'క్యూ' దాటి ఆ పక్కనే ఉన్న రిజర్వేషన్ ఆఫీసులో కెళ్ళాడు. ఈలోగా కౌంటర్ మళ్ళి ఓపెన్ అయింది. అయిదు నిమిషాల తర్వాతా 'మీకు టికెట్స్ ఇచ్చేది నేనే' అన్న వ్యక్తి రెండు టికెట్లు జేబులో పెట్టుకుంటూ బయటకొచ్చిఠివిగా వెళ్ళిపోయాడు" అన్నాడు స్టూడెంట్.
చివరకు మూడు గంటలకు మేము కౌంటర్ దగ్గరకు చేరుకున్నాం.
"శుక్రవారం బెర్తులు ఖాలిలేవు" అన్నాడు కౌంటర్ క్లార్క్.
"లేవా?"
"లేవు."
"మరేప్పటికున్నాయ్?"
"శనివారానికి."
సారధి ఓ క్షణం ఆలోచించాడు.
"కాని శనివారం మంచిరోజు కాదుగదా?"
"ఆ! మీలాగా మేమూ తిదులూ, నక్షత్రాలూ చూస్తూ కూర్చుంటే నెలలో ఇరవ్తే రోజులు ర్తేళ్ళు నడవవు" అన్నాడతను చిరాగ్గా.
"అందుకే ర్తేలు ప్రమాదాలు జరిగి రేళ్ళలా పడిపోతున్నాయ్" అన్నాడు మా వెనుక నుంచి ఓ వ్యక్తి.
"త్వరగా చెప్పండి వెనుక చాలా మంది ఉన్నారు" అన్నాడు క్లార్క్ కోపంతో
"సరే! ఆ రోజుకే ఇవ్వండి" అన్నాను నేను.
డబ్బు కట్టేసి టికెట్లు తిసుకోచ్చేశాము.
ఇంటికి చేరుకునేసరికి మా సతిరత్నలిద్దరూ చాలా ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు.
"ఎక్కడ తిరుగు తున్నారింతసేపూ....?" ఆత్రుతగా అడిగారు.
"రిజర్వేషనుకోసం వెళ్తున్నాం-మధ్యాహ్నం భోజనానికి రావటం కుదరదని చెప్పంగా" అన్నాడు సారధి.
"అయినా మరి ఇంతసేపా? అన్నేసి గంటలు క్యూలో ఉండిపోతే మాకివతల ఆదుర్దాగా వుండదూ....?" అంది వాళ్ళావిడ.
"అంటే మేము రావటం కొంచెం సేపు ఆలస్యమయిపోతే- మా కోసం ఆడుర్దాపడేవాళ్ళు ఉన్నారన్నమాట!" సంతృప్తిగా ఉందో లేదోనని."
ఆ మాటకు మా ఇద్దరికీ చాలా కోపమొచ్చింది.
"అంటే మాకెమయిపోయినా ఫర్లేదుగాని, డబ్బు జాగ్రత్తగా ఉంటే చాలన్నామాట."
"అలా అని మేమన్లేదు" అంది మా ఆవిడ.
చేసేదిలేక ఇద్దరం అలవాటు చొప్పన ఆ అవమానం సహించేశాం.
"ఇంతకి ప్రయాణం శుక్రవారమేనా?" అడిగిందామె అనుమానంగా.
"శుక్రవారం బెర్తులు ఖాళిలేవు. అందుకని శనివారానికి చేయించేశాం" అన్నాడు సారధి భయంభయంగానే
"అదేమిటి- శినివారంనాడు ప్రయాణమా? తెలివివున్నవాళ్ళెవరయిన అలాంటి చెడు రోజున ప్రయాణం చేస్తారా?" అంది సారధి భార్య.
"ఏం ఫరవాలేదులే! మన రాత బావుండాలిగాని చెడు రోజు మంచి రోజు అని ఏమిలేదు" అన్నాన్నేను సారధినీ సపోర్ట్ చేస్తూ.
"లేపోవటమేమిటి? ఈయనగారు రెండుగంటలు ఆలస్యంగా పుట్టబట్టే, మంచి చదువు, ఆస్తి, తెలివి అన్ని లేకుండా పోయాయని జ్యోతిఘ్యాడు చెప్పలేదు!" అంది సారధి భార్య పాత రిపోర్ట్ నీ తిరగతోడుతూ.
"అది వేరు__ఇదివేరు" అన్నాడు సారధి ఉక్రోషంగా.
"ఆ మాటకొస్తే నేను దుర్ ముహూర్తంలోనే నా ఉద్యోగం ఇంటర్ వ్యూ కెళ్ళాను. అయినా మరి టకీమని నాకి ఉద్యోగం దొరక లేడూ"?
"ఆ చెడు మీ ఉద్యోగానికి కొట్టింది! అంచేత అందులోకి మిమ్మల్ని తీసుకోవాల్సి వచ్చింది." అందామె.
"మరి మన పెళ్ళిచూపుల మా టేమిటి! ఆ రోజు బస్ లేటవటం మూలాన- వర్జ్యంలో పెళ్ళిచూపులవలేదూ? దాని వల్ల ఏం నష్టం జరిగిందని?"
"ఏమిటి నష్టం జరగలేదా?" వెటకారంగా అడిగిందామె.
"ఏం జరిగింది?"
"దాన్తాలూకూ చెడు తగిలేకదా నాకు మీతో పెళ్ళయింది?"
సారధి మొఖం మాడిపోయింది.