Previous Page Next Page 
ఋషి పేజి 15



    "ఈ ప్రిన్సిపూల్స్ తో  యేంతకాలం బ్రతగ్గలరు మీరు? జీవితాంతం బ్రతికేరానుకోండి మీకేం లభిస్తుంది?"

    "ఆత్మ సంతృప్తి__" చటుక్కున అన్నాడు ప్రకాశం.

    మాణిక్యాలరావు నవ్వేడు "నేనూ, నా భార్యా కారులో సినిమా కొచ్చినరోజే మీరూ మీ భార్య వచ్చేరనుకోండి. అరగంటసేపు బెర వాడి మీరిచ్చిన నలబై  పైసలూ రిక్షావాడు నిసుక్కుంటూ తీసుకుంటాడు. టిక్కెట్లు కోసం క్యూలో నిలబడి మీరు మమ్మల్ని చూస్తారు. కారులోంచి దిగటంవాళ్ళ అలిసిపోయి నా భార్య కోకోకోలా తాగుతూ  ఉంటుంది. బ్లూ కలర్ బ్లౌజ్ మీద, స్త్కే కలర్ చిరెలో - డబ్బుతో  వచ్చిన నాజూకుతనం- అందం మెరుపుతిగేలా క్షణం మెరుస్తే__ ఆ క్షణం ఆమెని... సాదా చిరెలో , మీ కోసం ఎండలో  నిలబడి -మీకు టిక్కెట్టు  దొరుకుతుందో దొరకదో  మికేవి, ఈర్ష్యలాంటిది అనిపించదా? అప్పుడు కూడా  మీ గోప్పదనవూ ప్రిన్సిపూల్సూ_ఇవే జ్ఞాపకం వస్తాయా? రావు, వస్తాయని గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పండి చూద్దాం...." క్షణం ఆగేడు.

    "విరక్తిలోంచి వచ్చిన వేదాంతం అంత ఆరోగ్యపరదమైనది కాదు ప్రకాశం. మీకోప్పడు ఇరవ్తే నాలుగేళ్ళు, మీ ముందింకా చాలా జీవితం వుంది అనుభవించండి...."

    కారు పక్కగా ఆపుచేసేడు. " ఐ ల్తేక్ యూ ప్రకాశం ఐ లైక్ యూ వెరీమచ్ ___ యెందుకో తెలిదు. బహుశా నేనెలా ఉందా లను కోంటున్నానో మీరలా ఉంటున్నందుకయి వుండొచ్చు-" అని నవ్వి "కానీ యిలా వుండటం - జీవితం లో అన్ని అనుభావించేశాక యాభయ్యో యేట అయితే బావుంటుంది. ఇరవ్తే అయిదోయేట కాదు" అన్నాడు.

    ప్రకాశం కారు దిగుతూ వుండగా మాణిక్యాలరావు అతని చేతిలో ఒక కవరు పెడుతూ "రేపు  మా మ్యారేజి యనివర్సిరి. మీరు తప్పకుండా రావాలి..." అన్నాడు.
 

    ప్రకాశం  ఏడో అనబోయాడు. అతన్ని మాట్లాడనివ్వకుండా "కాదనకండి, చాలా కొద్ది మందినే పిలిచెను. మిమ్మల్ని ఆ కొద్దిమందిలో కలపటం మీతో నాకున్న పనివల్ల కాదని  మీకూ తెలుసు..." అని కారు  స్టార్టుచేస్తూ" ఉంటాను  మరి. బ్తెదిబ్తె ఆ కవరులో కొద్దిగా డబ్బుంది ఉంచండి. మిమ్మల్ని అవమానం చేద్దామని కాదు. అది జస్తూ  నా ఆనందం  వెలిబుచ్చుకోవటం కోసం.... వస్తాను" అన్నాడు.

    ప్రకాశం ఏదో మాట్లాడబోయేటంతలో కారు వెళ్ళిపోయింది అతను నిశ్చేష్టుడైఅలాగే నిలబడిపోయేడు.

                                                                   6

    "కుమార్ స్పీకింగ్__"

    "హౌ ఆర్ యూ ఆడిటర్ " మాణిక్యాలరావు అడిగేడు.

    "మిరా! ప్తెన్ ధాంక్యూ."

    "ఏమిటి విశేషం? సాయంత్రం పూట ఇంట్లో  వుండాలి  అనిపించిందంటే_ ఇక మీరు పెళ్ళి చేసుకోవచ్చు" బిగ్గరగా నవ్వేడు మాణిక్యాలరావు.

    కుమార్ కూడా నవ్వేడు.

    "ఇంతకి అసలు విషయం ఏమిటంటే" అగేడు.

    "ఏమిటి?"

    "మన ఇన్కంటాక్స్ క్లర్కులేడూ- ప్రకాశం"

    "ఔనౌను... ఇంతకి ఆ పని జరిగిందా?"

    "అదే చెబుతోంది. పని ఆఫీసరుతోనే జరిగిందనుకోండి. ఆఫ్ కోర్స్ కానీ ఆ క్లర్కు పాపం కొత్తగా ఉద్యోగంలో చేరెడు. చాలా వండర్ పుల్ పెలోలె, కుర్ర వాడు చాలా స్మార్ట్ గా వున్నాడు. కానీ  అంత అమాయకత్వం నేనెక్కడా చూళ్ళేదు. అతన్నోసారి కలుసుకోండి. మీ కథల్లోకి పనికొస్తాడు.బై ది బై- ఖాళిగా వుంటే రాకూడదూ- కూర్చోందా."

    "లేదు. కొంచెం షాపింగ్ వుంది."

    "ఏమిటి విశేషం?"

    "రేపు మీ మారేజి యనివర్శిరి కదా" నవ్వేడు కుమార్.

   
                                       7

    రక్తం అంత ఇంకిపోయి, తెల్లగా పాలిపోయిన మొహంతో నిలబడిపోయేడు ప్రకాశం. అతని చేతిలో  కవరు నలుగుతూంది. అతని మెదడులో అక్వేరియలో చేపల కదలికల్లా అస్పష్టమ్తెన ఆలోచన్లు.... సాంద్రతలేని భావాల స్పందనలో సందిగ్ధమ్తెన సంఘర్షణ__ సముద్ర గర్భంలో బ్రద్దలైన  అగ్నిపర్వతపు  సెగలకూ జలాలకూ మధ్య సంఘర్షణ - ఆర్ణవపుహొరు....ట్రాన్సిమిషన్....ట్రాన్స్ ....ట్రాన్స్...

    ఏదో మైకంలో వున్నవాడిలా నడవసాగేడు. ఏదో కసి_ ఏదో చెయ్యాలి! అందరూ చూస్తూ వుండగా ఈ కవరు మాణిక్యాలరావు మొహంమీద కొడితే.... అతను సిగ్గుతో  తలవంచుకుంటే.... అందరూ తన చుట్టూ చేరి తన నిజాయితీకి అభినందిస్తూ వుంటే...తను సగర్వముగా తలెత్తి అందరివ్తేపూ చూస్తాడు! దూరంగా నిలబడి విప్పారిన నేత్రంతో తనవైపే చూస్తున్న సుజాత.

    చటుక్కున  అతని ఆలోచన్లు ఆగిపోయేయి. అంటే  తను నిజాయితిగా  వుందాదల్చుకొంటున్నది వాళ్ళందరి అభినందనలకొసవా?__ ముఖ్యంగా సుజాత ఎండుకొచ్చింది తన ఆలోచన్లకి!

    తను సిగరెట్ తాగకుండా వుండగలడు. పేకాటవైపు వెళ్ళ కుండా వుందాగలడు! సిత దగ్గర్లో లేదని తెలిసినప్పుడు పోరాపాటున

 Previous Page Next Page