పైట జారినట్టు నటించే సుబ్బులు స్ధనాలవ్తెపు క్షణం సేపు__ క్షణం మాత్రమ్తేతేనేం? చూడకుండా కళ్ళనేలా ఆపగలడు? అప్సరాలోకి కొత్త అమ్మయోచ్చిందని తన కో-క్లర్కు ఇంకో క్లర్కుతో చెపుతుంటే- తను వెళ్ళాడు. అది వేరే సంగతి- వినాలనే ఆసక్తిని ఎలా చంపేసుకోగలడు? విన్న తరువాత వెళ్ళకుండా వుండగలగటం తన గొప్పతనం. వెళ్ళేవాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు తను మాత్ర్హం అందరి కన్నా గొప్పవాడు. వినాలన్నా ఆసక్తి పాడవటం కాదు తను వెళ్ళాడు అతీతుడు. సెల్ప్ కంట్రోల్ వున్నవాడు! ఇంట్లో హేమమాలిని కేలెండర్ చూస్తూ పడుకోంటాడు.
__చెడిపోవటం చేతలకి సంబంధించినద్తేతే ఫర్లేదు. మనసుకు సంబంధించినద్తేతే- తనేప్పదో చెడిపోయేడు. ఈ విషయంలో మావయ్యే నయం తనక్కావల్సిందేదో తీసుకొంటాడు. ఆయనలో సంఘర్షణలేదు ఆలోచిస్తే ఇలాంటివాళ్ళే హాయిగా జీవితాన్ని అనుభావించాగాలరేమో అనిపిస్తూంది.
పక్కనుంచి కారోకటి దూసుకుపోవటంతో ఈ లోకంలో కోచ్చేడు. చుట్టూచూసి ఆశ్చర్యపోయేడు. తను మెయిన్ రోడ్డుకోచ్చేడు. ఇప్పడింటికెళ్ళినా చేసేది ఏవిలేదని అనుకొని తాపీగా నడవటం మొదలెట్టేడు. షాపుల్లోంచి బయటకుపడే వెలుతురు రోడ్డుమీద చీకటిని పారదొలుతూంది. సైకిళ్ళ బెల్లుమోత, కార్ల హారన్లు.... సంకీర్ణ ధ్వనుల గంద్రగోళం.
ప్యాంటుజేబులో చెయ్యి పెట్టేడు కవరులేదు! ఎవడు కొట్టేశాడు? కంగారుగా జేబులో తడువుకొన్నాడు. ఎడమవ్తెపు జేబులో వుంది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అతనికి నవ్వొచ్చింది. ఎలానూ ఇచ్చేద్దా మానుకొన్న కవరు, పోతేనేం? ఎందుకంత కంగారు?
కవర్లో ఎంతుందో చూద్దామని అనిపించింది తేసేడు.
ఆ ఇన్ స్టింక్టు చాలు.
హ్తేడ్ ఈజ్ కమింగ్ అవుట్.
కవరు తెరచేడు. కొత్తవందరూపాయల నోటు!
.......
కవరు మూసేసి జేబులో పెట్టేడు.
చిత్రమేమిటంటే యిప్పదతని మనస్సులో మునుపుటంత లేదు. తుఫానువచ్చి వెళ్ళిపోయినా తరువాత ప్రశాంతత ఆవేశం లేకుండా ఆలోచించగలిగే స్ధితి!
చూటుక్కున అతనికో ఆలోచన వచ్చింది.
రేపెలాగో తను వాళ్ళ ఫంక్షనుకి వెళితే ఎద్తేనా బహుమతి ఇవ్వాలి. ఈ డబ్బుతోనే ఎద్తేనా కొనిస్తే - తన కోరికా నెరవేరుతుంది- తను అనాగరికంగా ప్రవర్తించినట్టు వుండదు. ఈ ఆలోచన వచ్చినందుకు తనని తానే అభినందించుకున్నాడు.
అంతలో అతనికి యింకో విషయం గుర్తుకొచ్చింది. రేపు సిత పుట్టిన రోజు ఆమె కేద్తేనా కొనిస్తే.
సిత మధ్యాహ్నం అన్న వాక్యాలు జ్ఞాపకం వచ్చేయి. తన కాబోయే భార్య సంతృప్తికోసం- తను చేతకానీ వాణ్ణి కాదని నిరూపించుకోవటం కోసం...
రేపెలాగో ఫస్టు ఇప్పుడు సీతకి కొంటే రేపు జీతం తీసుకుని వాళ్ళకి ప్రజంటేషన్ తీసుకెళ్ళవచ్చు__
ఆ మరుసటిరోజు ప్రకాశం ప్రజంటెషను సరిగ్గా వందరూపాయ లకు కొన్నాడా_ తక్కువగా అన్న పాషన -అవసరం పోతే- మనిషి కొద్దికొద్దిగా-కొద్దికొద్దిగా 'ఈల్టు' అయిపోతాడో చెప్పటానికి అది నిదర్శనం.
బట్టల షాపులకి వెళ్ళేడు. సెలక్షనుకి యెక్కువ కష్టపడనక్కర లేదు. కొంటే తెల్లచిరే! సెల్ప్ మాన్ తీసుకొచ్చిన చిరేల్లోంచి పాము కుబుసంలా మెరుస్తున్న మెత్తటి చిరోకటి తిసేడు.
"ఎంతది?" పక్కనుంచి ఆ చిరేని తన చేతుల్లోకి తీసుకొంటు ఇంకో కంఠం వినబడితే పక్కకి తిరిగి చూసేడు. యష్ కలర్ ఫేంటులో వ్తేట్ షర్టు ఇన్ షర్టు చేసి స్త్కేబ్లూటై- ఎప్పడూ నవ్వుతూ వుండే ఆ పెదవులూ - నుదుటి మీదకు జారిన క్రావూ-
"కుమార్" ఆశ్చర్యపోయేడు ప్రకాశం. మిత్రుడి భుజంమీద చెయ్యివేసి "ఇదేమిటి, నువ్వు ఇక్కడున్నావ్" అని అడిగేడు కుమార్.
"ఇక్కడే పనిచేస్తున్నాను. ఇన్ కంటక్సు ఆఫీసులో."
"చిత్రం_ నేనిక్కడే ప్రాక్టీసు చేస్తున్నా నువ్వింతకాలం తెలియక పోవటం ఏమిటి?" అన్నాడు. మణిక్యాలరావు చెప్పింది తన స్నేహితుడి గురించే అని అర్ధమయింది.
"నేను చేరి ఎంతోకాలం కాలేదు" అన్నాడు. ప్రకాశం స్నేహితుణ్ణి చూడగానే రెండురోజుల్నుంచి అతని మనసులో కదులుతున్న అస్పష్టమ్తెన వ్యధ పోయినట్టనిపించింది.
"సర్లే, ఆ చీరే తీసుకో. బయటికెళ్ళి మాట్లాడుకొందాం... అన్నట్టూ పెళ్ళేప్పడు చేసికొన్నావ్?"
"ఇంకా లేదు."
కుమార్ నవ్వి "ముందే మంచి చేసుకొంటున్నావన్న మాట" అన్నాడు. సిగ్గుతో ప్రకాశం మొహం ఎర్రబడింది.
ఇద్దరూ బట్టలషాపులోంచి బయటకోచ్చేరు.
"కొంచెం ఎక్కడైనా కూర్చుందామా?" కుమార్ అడిగేడు.
"అదే నేనూ చెప్పాలనుకొంటున్నాను."
ఇద్దరూ కారు దగ్గరికి వచ్చేరు. "ఎక్కు" అన్నాడు డోర్ తెరుస్తూ కూర్చొని తలుపువెస్తూ "కారేక్కడిది? మావగారిచ్చేరా" అని అడిగేడు ప్రకాశం.
కుమార్ నవ్వి "నాకూ పేళ్ళవాలెదు. ప్రాక్టీసు పెడితే కారు అవసరం చాలా వుంటుంది. నాన్నగారే ప్రజంటేషన్ గా యిచ్చేరు.... అన్నాడు.