అయ్యో- ఆ మాత్రం చేతనవుతే యింకేం దేనికయినా పెట్టి పుట్టాలే! అందరికి చేతకావద్దు."
ప్రకాశం మొహం తెల్లగా పాలిపోయింది? మంచితనానికి.... చేతకానితనానికి మధ్య బేదం యెంత చిన్నదో అర్ధమయిందతానికి__ మాణిక్యాలరావుతో తనన్న మాటలు_ "ఐయామ్ ప్రిన్సిపుల్టు - ప్రిన్సిపుల్టు" యేమిటి తన ప్రిన్సిపుల్ తో తన కాబోయే భార్య దృష్టిలో ఎదగ్గలడా తను? సుజాతని తన ఆలోచల్లోకి రాకుండా అరికట్టగలడా తను?__
మళ్ళి సుబ్బులు కంఠం వినబడుతూంది-
"అయినా నీకు ని బావే ఒక ప్రజంటేషన్లె__ఆ అందమూ , పెర్సానాలిటి__"
"నువ్వు తల్చుకుంటే ఆ ఎదురు రూము సుబ్బారావు మాత్రం? నువ్వంటే పడిచస్తాడుగా. అచ్చు శోభన్ బాబులా వుంటాడు. పోనీ కాస్త కనికరించరాదూ...పెళ్ళి చేసుకుంటాడెమో...."
"అయ్యబాబోయ్ , ఇంకేవన్నా వుందా. మా అమ్మాకి తెలిసిందంటే చంపేస్తుంది" భయంగా అంది సుబ్బులు.
ఈ అమ్మాయి ప్రేమకలాపాలు సాగించకుండా వుండటానికి కారణం, కట్టుబాట్లపట్ల వున్న గౌరవమూ, భర్తని తప్పు యింకో పురుషుణ్ణి ప్రేమించకూడదనే సంస్కారమూ, ఇవేవి కాదన్నమాట. కేవలం తన తల్లిదండ్రులు కోప్పడతారనే భయం ఒక్కటేనన్నామాట!
ప్రకాశానికి నవ్వు రాలేదు, అసహ్యం వేసింది. ఆమె మీద కాదు, మొత్తం స్త్రి జాతిమీద.
4
లంచ్ చేసి ఆఫీసుకి వచ్చేక ప్రకాశం పనేవి చెయ్యలేదు. అతని ఆలోచనలు సుబ్బులి మాటలమీదే సాగినయ్. సాయంత్రం మాణిక్యాలరావు ఇంటివ్తెపు వెళ్ళాలా వద్దా మీమాంస ఒకవ్తెపు....
వెళ్ళకూడదనే నిశ్చయించుకొన్నాడు....
అవును వెళితే ఏముంది_ మరికొంచెం మధన ఎక్కువౌతుంది. నిజానికి ప్రేమ కలిగించేటంత బాధ, వ్యధ ఈ ప్రపంచంలో యింకేవి కలిగించవు.
రానంత సేపూ రాలేదనే బాధ, వచ్చేక విడి పోతామేమోననే బాధ ప్రేమంటే అంతే!
5
సాయంత్రం అయిదయింది.
ప్తేల్సు కట్టేసి లేచాడు ప్రకాశం. బయటికోస్తుంటే మాణిక్యాలరావు గేటుదగ్గర కలిసేడు. అప్పటివరకూ తన కోసమే వేచి వున్నట్లు "రండి వెళదాం" అన్నాడు.
ప్రకాశం ఆశ్చర్యంగా "ఎక్కడికి" అన్నాడు.
"మీ యింటి దగ్గర దింపుతాను."
"అక్కరలేదు. నేను వెళతాను " విసుగ్గా అన్నాడు ప్రకాశం. "మీ పని పొద్దున్నే అయిపోయిందిగా."
మాణిక్యాలరావు నవ్వేడు. "నా పనికి దీనికి ఏవి సంబంధం లేదు. సరదాగా ఒక స్నేహిడిగా రమ్మంటున్నను."
__చాలా పదున్తేన బాణం ఇది, గురి తప్పదు.
ప్రకాశం క్షణం తటపటాయించేడు.
"నా పని యెలానూ అయిపోయింది. ఆ ఆనందంతో రమ్మంటున్నాను."
ఇక మరిబెట్టుసరిచేస్తే బావోదని కారేక్కాడు. ధనవంతుడి జీవితంలా సాఫీగా కదిలింది కారు....
క్రితంరోజు ఇదే సమయానికి ఈ కార్లోనే వున్నాడు.
ఒక రోజులో యెన్ని అనుభవాలు?
ప్రకాశం ఆలోచన్లని తెగ్గోడుతూ మాణిక్యాలరావు మాట్లాడేడు- "మిమ్మల్ని చూస్తుంటే నాకు ఈర్ష్యగా వుంది ప్రకాశం."
ప్రకాశం ఉలిక్కిపడ్డాడు.
"ఔను. యెందుకంటే దాదాపు పదిహేను సంవత్సరాలక్రితం నేనూ మీలాగే అమాయకంగా, హాయిగా వుందేవాడ్ని."
ప్రకాశం మాణిక్యాలరావు వ్తెపు చూసేడు. మొహం అంతా స్పోటకం మచ్చల్తో వికృతంగా వుంది. యెక్కువ సిగరెట్లు తాగటం వల్ల పెదవులు నల్లగా కమిలిపోయివున్నాయి. కానీ అతని మాటల్లో ఏదో అస్దిత్వం ధ్వనిస్తూంది. అతని కళ్ళు రోడ్డుని చూడటం లేదు. శూన్యం లోకి యెక్కడి కో ఆలోచన్ల అవతల తీరాలకి____
"మనిషికి అనుభవాలు యెంత తొందరగా డామినేట్ చేస్తాయో తెలియజెప్పటానికి నేనే నిదర్శనం. ఇప్పుడు నా కెన్నెళ్ళో తెలుసా? యాభయి ఆరు. దాదాపు నలభ్తే సంవత్సరాల క్రితం నేనూ ఇలాగే నేను నమ్మిన ఆదర్శాలకే కట్టుబడి ఉండేవాణ్ణి కానీ ఎంతకాలం కలల్ని తింటూ బ్రతకటం? నా తెలివితేటల్ని, ఆలోచన్లని ఇతరుల్ని మోసం చేయటానికే వినియోగించుకొన్నాను. పది సంవత్సరాలలో లక్ష్జాదికారి నయ్యును....'ఇందులో ఆనందం వుందా' అని అడక్కండి. లేదు, అందుకే మిమ్మల్ని చూస్తుంటే ఈర్ష్యగా ఉందన్నాను. కానీ మీరున్న 'పేజ్' లోనే జీవితాంతం బ్రతికితే- అంతకన్నా హెయమ్తెన పరిస్ధితి ఇంకొకటి ఉండదు. మీరు ఎదగాలి. మీరు పొద్దున్న నాతో అన్నారే- ప్రన్సిపుల్ అని- అది మీ మనసుకు సంబంధించినది. మీ చేతలకి దాన్ని అన్వయించటం అవసరం...." అగేడు 'అదే ద్వంద ప్రవృత్తి'.
ప్రకాశం విస్తుపోయి అతన్నె చూడసాగేడు. అది సామాన్యంగా కనబడే ఒక వ్యాపారస్తుడిలో యింత స్తేకో ఎనలిటికల్ నాలెడ్జి వుందా?