అతడి పక్కన నిండు ముత్తయిదువు యశోదమ్మ కల్లోత్తుకోంటూ కూర్చొని ఉంది.
"మల్లిక్ వాళ్ళు బొంబాయి వచ్చారట! సాయంత్రం వరకు ఇక్కడికి వచ్చేస్తారండి!"
"ఇప్పుడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, నాయనా! ఇప్పుడు వాడోచ్చినా గుర్తించలేని స్ధితిలో ఉన్నారు!పూర్తిగా అపస్మారకంలోకి వెళ్ళిపోయారు!" ఆవిడ గొంతులో దుఃఖం సుళ్ళు తిరిగింది. "తెలివిలో ఉన్నంతవరకు 'మల్లి ఖార్జునా!' అని కలవరించారు. 'నా మాల్లిఖార్జునుణ్ని పిలిపించు ! చూచిపోతాను!' అని ఒక టే పోరారు! వాడిపేరు కలవరిస్తూనే అపస్మారకంలోకి వెళ్ళిపోయారు! ఇప్పుడు వాడోచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే!"
బాగా పిక్కుపోయినట్టుగా ఉన్న ఆవిడ ముఖం లోకి జాలిగా చూస్తూ, "మిరేమ్తేనా తిసుకోన్నారా?" అడిగాడు.
ప్రక్కనున్న పూర్వాసు వాసిన ఒకామె కల్పించుకోంటూ అంది. "ఏం తీసుకొంటుంది, నాయనా? మగాడిని మరణశయ్య మిద ఉంచుకొని! ఒకటా, రెండా అరవయ్యేళ్ళు కలసి కాపురం చేశారు. వృద్దాప్యంలో..... ఈ జతపక్షిని ఒంటరిని చేసి దేవుడి పిలుపందుకొని తనదారిన తను వెళ్ళి పోతున్నాడు! కొడుకు కూడా దగ్గర ఉండడాయే! ఈ వృద్ధాప్యంలో తోడుమాయమ్తె ఒంటరిగా నిలిచిపోవాల్సివస్తే....ఆమెను చూస్తున్న వాళ్ళకే కడుపు తరుక్కుపోతూంది! ఇహస్వయంగా ఆమెకెలా ఉంటుందో ఆలోచించు!"
"అలాగంటే ఎలాగండి పోయేవాళ్ళతో మనం పోంకదా? ఆవిడ ముఖం చూస్తే నాలుగు రోజుల బట్టి ఏం తినలేదని పిస్తుంది! కాస్త ఎద్తేనా తినిపించండి"
"యశోదా, కాస్త కాఫి తిసుకుంటావేమే?"
"ఆయన్ని అలా ఉంచుకొని నానాటికి ఏం పోతుంది అత్తయ్య?"
"మా మామగారు ఇలాగే వారక్మ్ రోజులు మృత్యు ముఖంలో ఉన్నారు! ఆయనకీ మనుమడి మిద చెప్పలేనంత ప్రాణం! వాణ్ని పిలిపించండి! అని ఒకటే పోరు! ఆ మనుమడి కేమో పరిక్షలటైం! ఆ మనుమడు రాలేదు! ఆ ముసలాయన పోలేదు! త్రిప్పకొని నాలుగేళ్ళు బ్రతికి చచ్చాడు!"
"ఈయన అలాగే బ్రతుకుతాడని ఆశా? ముక్కు సాగిపోయింది! చెవులు వెనక్కిపోయి బిగిశాయి! కళ్ళు చేతులు ఎప్పుడో చల్లబడి పోయాయి! ఇన్ని మృత్యు లక్షణాలు కనిపిస్తూంటే ఏం ఆశ బ్రతుకుతాడని?"
అంతలో యశోదమ్మ త్రుళ్ళిపడ్డట్టుగా అయి, "అత్తా ఇలా దగ్గరగా వచ్చి విను! ఆయన గొంతులో ఏమిటో గుడుగుడుమని శబ్దం వస్తూంది!" అని పిలిచింది.
ఆవిడవచ్చి చూసి, జ్యోతి కోండేక్కుతూందే, యశోదా!" అంది అతడి చావుని చాలా సహజంగా తిసుకోంటున్నాట్టుగా.
రెండు నిమిషాల తరువాత ఆయన ప్రాణం పోయింది. గొంతులో శబ్దం కానీ చిన్న కదలిక గాని లేకుండా నిశ్చలంగా ఉండిపోయింది ఆయన శరీరం!
పూర్వసువాసిని ఒక్క నిమిషం అలా చూసి, కళ్ళు, నోరు దగ్గరగా మూస్తూ, "నాలుగు రోజులు మృత్యువుతో పోరాడిన మనిషి!ఇంకొన్ని గంటలు ఉంటే 'నాన్నా' అనే పిలుపు వినేవాడు కదా? మనం అనుకొంటాంగాని ఎంత ప్రాప్తమో అంత!" అంది.
ఏదో షాక్ కొట్టి స్తంభించి పోయినట్టు గా పదనియకే! మన ఒక్కో కల్లితి చుక్క ఒక్కో నరకం సృష్టి స్తుందట ఆ జీవుడికి! వద్దు! ఏడవకు! పండు రాలిపోయింది! మనమూ ఓ నాడు పోయేవాళ్ళమే? ముందూ వెనుక! అంతే!" అంది అత్తగారు.
ఇలాంటి సమయంలో ఎలాంటి వాళ్ళక్తేనా ఈ వేదాంతం సహజంగా వచ్చేస్తుందేమో!
బయట నిలబడి మాట్లాడుకొంటున్న వాళ్ళు లోపలికి వచ్చారు గబగబా.
శాస్త్రి ప్రాణం పోయిందని నిర్ధారణ చేసుకొన్నాక.
"తల దిక్కున ప్రమిది వెలిగించి, వాకిట్లో నెగడు రాజవేయండి" అని పురమాయించాడు ఒక పెద్దమనిషి.
శవం తల దిక్కున దీపం వెలిగించబడింది. పిడకలు తెచ్చి వాకిట్లో నెగడు రాజవేశారు.
"యశోదమ్మ! ఎవరికేవరికి కబురు పంపాలమ్మ?" అనడిగాడు వెంకన్న అనే పెద్ద మనిషి!
"మాచిన్న మామగారు ఖమ్మంలో ఉంటున్నారు! మనిషిని పంపడం ఎక్కడా కుదురుతుందిగాని, టెలిగ్రాం ఇవ్వండి!" దుఃఖం దిగమింగుతూ చెప్పింది యశోదమ్మ.
"మీ అన్నగారి వాళ్ళకు?"
"ఎవరు అన్న? ఎవరు చెల్లెలు? నా అన్నాకూ, నాకూ రుణం తీరిపోయి పాతిక సంవత్సరాల్తెంది!"
"అలా అనుకొంటే ఎలా? కావలసిన వాళ్ళు! ఈ సంగతి తెలుపడం మనధర్మం! రావడం, రాకపోవడం వాళ్ళ ఇష్టం!
"మీ ఇష్టం," ఉదాసినంగా అంది యశోదమ్మ.
విల్తేన చోటికి మనుషుల్ని పంపడం, వీలుకానీ చోటికి టెలిగ్రాంలు ఇవ్వడం. ఈ తతంగమంతా యశోదమ్మకి బావ వరుస్తేన ఆ పెద్దమనిషె నిర్వహించాడు.
"మల్లిఖార్జునుడు ఎన్ని గంటలకు రావచ్చు?"
"ప్రోద్దుగూకే వరకు రావచ్చును" అని చెప్పాడు, మల్లిక్ బొంబాయి వచ్చాడన్నా వార్తా తెచ్చిన వాసుద్వ్ అతడు మల్లిఖార్జున్ కి బావమరిది.
"అయితే అన్ని సిద్ధంచేసి పెడదాం. రాగానే శావాన్ని ఎత్తవచ్చు. ఈ రాత్రి ఉంచి చద్ది పినుగాను చేయడం ఎందుకు?
విమానం దిగితూనే మల్లిఖార్జున్ కి తెలిసింది తండ్రి మరణ వార్త.
తండ్రికి సీరియస్ గా ఉందని తెలిసి అంత దూరం నుండి వస్తే ఆఖరి చూపుకు మిగిలింది ఆయన శవం మాత్రమే.
వాకిట్లో నేగాడిచూసి, మల్లిక్ కి దుఃకం ఎగతన్నుకు వచ్చినట్టు గా అయింది.
"ఒరేయ్! ఇంత కాలం నువ్వు లేకుండా ఎలా ఉన్నామో తెలియదు గాని, ఇప్పుడు జీవితపు చివరి ఘట్టం లో ఉందా లేమురా! సంపాదించింది చాలు. వచ్చెయ్యి!కన్నా కొడుకు చేతుల్లో కన్ను మూసే అదృష్టం మాకు ధక్కనివ్వు!" అంటూ ప్రతి ఉత్తరం లో వ్రాసే వాడు తండ్రి. తల్లి దండ్రుల ఎ కోరికా తిర్చనట్టే ఈ కోరికా తీర్చలేదు. ఊళ్లో కాలు పెడుతూనే వాసుదేవ్ చెప్పాడు. నాలుగు రోజు నుండి ఆయన అపస్మారకంలో ఉన్నాడని, అపస్మారకంలోకి వెళ్ళాక ముందు తననే కలవరించాడని. ఈ సంగతి తలుచుకొన్న కొద్ది మల్లిక్ కి దుఃఖం రెట్టింపు కాసాగింది.
అపరాధ భారంతో హృదయం కృంగి పోయినట్టు గా అయి తల్లి ఎదుటికి వెళ్ళడానికి ముఖం చెల్లనట్టుగా వరండా స్తంభాన్ని అనుకొని నిలబడిపోయాడు మల్లిక్.
అతదితోపాటు కారుదిగిన భార్యా, కొడుకూ, కూతూరు ల్ప్పలికి వెళ్ళిపోయారు.
అయిదు నిమిషాల తరువాత కొడుకు తిరిగి వచ్చాడు. "డాడి, ఇక్కడే ఆగిపోయరేం?" అడిగాడు ఇంగ్లీష్ లో .
"నాయనమ్మ ఎదుటికి రావడానికి ద్తేర్యాన్ని కూడదిసుకొంటున్నానురా!"
"పాపం నాయనమ్మని చూస్తే భలే బాదేస్తూంది. డాడి!"
మల్లిక్ కళ్ళు మూసుకున్నాడు బాధతో.
అక్కడున్న అందరి చూపులూ ఆ అబ్బాయి మిదే నిలిచిపోయాయి. మల్లికే పొడుగాటి మనిషి అంటే అతడి కంటే ఓ బెత్తెడు పైనే ఉన్నాడు కొడుకు.