Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 15

    "ఎందుకంత టెన్షన్"  వసుధ అడిగింది.
    "మనం ఏదైతే జరక్కూడదని అనుకున్నామో అదే జరిగింది.  ఆ ఫెడ్రిక్ గాడు ఇన్ స్పెక్టర్ బెనర్జీని కలిసాడు.వాళ్ళిద్దరూ మంతనాలాడుకున్నారు.
    నీ మీద ఫెడ్రిక్ కు అనుమానంగా వుంది.  నువ్వు చాలా కేర్ పుల్ గా  వుండాలి"  అన్నాడు ధీరజ్.
    "నా జాగ్రత్తలో నేను వుంటాను.  నువ్వు కేర్ పుల్ గా వుండు.  ముందు మనం అవని అడ్డు తొలగించుకోవాలి.  నేను  ప్యాకేజి సెక్షన్ లో  ఉండి,  డూప్లికేట్ సరుకును పంపుతున్నానని బాస్ కు అనుమానం వచ్చింది. నన్ను హిమాయత్ నగర్  బ్రాంచీకి ట్రాన్స్ ఫర్  చేస్తానన్నాడు.
    నేను చాలా పకడ్బందీగా,  బాస్ మీద అవనికి అనుమానం వచ్చేలా చేసాను.  అవని  బాస్ ని చెడామడా దిలిపేసి  ఉద్యోగానికి  రిజైన్ చేసింది.
    సో...  మనకు  అవని ప్రాబ్లం తీరినట్టే...నువ్వింకా అవనిని   బెదిరించాల్నిన అవసరం  లేదు."  అంది వసుధ.
    "యూ... పూల్...  నవ్వు గెస్ చేసేదంతా రాంగ్...  అవని ఆఫీసులో పని చేయడం మన పనులకు ఆటంకం అనుకున్నాం... అవని  రిజైన్ చేస్తే,   వచ్చే ఆ కొత్తమ్మయిని  ట్రాప్ చేయొచ్చు అనుకున్నాం.
    కానీ ఇప్పుడు కథే అడ్డం తిరిగింది.
    ఇక్కడనుంచి ఆఫీసు ఎతైసే ప్రపోజల్ లో  వున్నాడు.  తన ఆస్తిలో చాలా భాగం ఆ అవని పేరు రాయబోతున్నాడు."
    "అందుకు వని ఒప్పకోవాలిగా.  అవనికి ఇప్పుడు బాస్ అంటే పీకల్దాక కోపం వుంది.  ఆ కోపాన్ని మరింత పెంచితే సరి...నువ్వు ఇప్పుడు డైరెక్ట్ గా  రంగంలోకి దిగేయ్.
    బాస్ పేరుతో ఆమెను బెదిరించు. మరింత అసహ్యం కలిగేలా చయ్.  దాంతో బాస్ నీ పూర్తి గా   అసహ్యించుకుంటుంది.   ఇది అతని మీద మనం తీసే మొదటి దెబ్బ.  ఈలోగా నేను మరో అమ్మాయిని సెంటి మెంట్ పేరుతో బాస్ దగ్గరకు పంపిస్తాను."
    "అదెలా?"  ధీరజ్ ఆశ్చర్యం గా అడిగాడు.
    "చనిపోయిన ఫెడ్రిక్ చెల్లెల్ని పోలిన ఓ అమ్మాయిని నేను చూసాను.  ఆ అమ్మాయికి డబ్బు పిచ్చి.  కాస్త డబ్బు ఎర చూపితే చాలు...  మనం  చేయమన్నట్టల్లా చేస్తుంది."
    "ఫెడ్రిక్  చెల్లెలులా వుందా?"
    "ప్రపంచంలో  ఒకే మనిషిని పోలిన వాళ్ళు ఏడుగురు వుంటారట.  అసలే అవని చేసిన అవమానంలో నుంచి కోలుకోలేదు. ఇదే టైంలో మనం  ఆ  అమ్మయిని  ప్రవేశపెడితే చాలు."
    "ఇదంతా నవలల్లో,  సినిమాల్లో అయితే బావుంటుంది."
    "పిచ్చి ధీరజ్.  మనం నిజ జీవితంలో చేసే పనులే చూసి సినిమాల్లో వాడుకుంటారు.
    "నేను సరుకుల్ని మార్చి డూప్లికేట్ వి ఎక్స్ పోర్ట్ చేయడం లేదా?  ఇలాంటివి సినిమాల్లో కూడా చూపిస్తున్నారుగా"  అంది.
    "తెలివైన దానివే"  అన్నాడు వసుధను తన ఒళ్లోకి లాక్కొంటూ ధీరజ్.
    "ఎంత తెలివైనదాన్ని   కాకపోతే,  నీలాంటి వాడిని ముక్కు పట్టి ఆడిస్తా...   నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ఎన్ని కేసులు లేవు నీ మీద...ఎక్కడా దొరక్కుండా తప్పించుకున్నావు.
    ఎన్ని పేర్లు మార్చుకున్నావు?  చివరికి ప్లాస్టిక్ సర్జరీ కూడా సినిమా టిక్ గా చేయించుకున్నావు" అంది అతని ముక్కును అటు ఇటు ఆడిస్తూ.
    "సరేలే... ఈ ప్లాన్ కనుక సక్సెస అయితే,  ఇండియాకు గుడ్బై చెప్పి,  ఏ స్టేట్స్ లోనో  సెటిలవుదాం.. చాలా జాగ్రత్తగా టాకిల్ చేయాలి.  ఆ బెనర్జీ సామాన్యాడు కాదు"  అన్నాడు వసుధను కౌగిలిలోకి తీసుకుంటూ.
    ఆ గదిలో లైట్స్  ఆఫ్ అయ్యాయి.
    ధీరజ్ ఓ ప్రొఫెషనల్ క్రిమినల్  అని వసుధకు తెలుసు.
    కానీ వసుధ అంతకన్నా కిలాడీ అని ధీరజ్ కు తెలియదు.
                                    *             *             *
    అవని,  అనిరుద్ర బెనర్జీ ముగ్గురు కలిసి ఫెడ్రిక్ ఇంటికి వెళ్ళారు.  ఫెడ్రిక్ ఒక్కడే పియానో వాయిస్తూ కూచున్నాడు.
    వీళ్ళ అడుగుల శబ్దం విని తలెత్తాడు.
    ఎదురుగా వున్న అవనిని చూడగానే ఒక్కక్షణం అతని కళ్ళలో వింతకాంతి కనిపించింది.
    వాళ్ళని సాదరంగా ఆహ్వానించాడు.
    "మా రోజాకి పియానో ఇష్టం.  చాలా బాగా వాయించేది"  అలా అన్నప్పుడు అతడి కళ్ళలో తడి అవని దృష్టిని  దాటి పోలేదు.
    "అయామ్ సారీ సర్"  అంది అవని అపాలజిటిగా."
    "మనలో మనకు సారీలేంటి?  చెప్పండి...  ఏం తీసుకుంటారు?"  అడిగాడు ఫెడ్రిక్ కుక్ ని  పిలుస్తూనే.
    "కాఫీ..."  చెప్పాడు బెనర్జీ.
    అందరికీ కాఫీ, టిఫిన్స్  రెడీ చేయమని కుక్ ని పురమాయించాడు.
    ఆ హాలులో నలుగురు వున్నారు.
    నిశ్శబ్దం అక్కడ పహారా కాస్తోంది.
    "ఇఫ్ యూ డోంట్ మ్తెండ్... మనమోసారి మీ చెల్లిలి గదికి వెళ్దామా?"  అడిగాడు బెనర్జీ.
    అతని ఉద్దేశ్యం అర్ధమైనట్టు ముందుకు కదిలాడు ఫెడ్రిక్.
    నలుగురు రోజా గదిలోకి వెళ్ళారు.
    రోజా ఫోటోలను చూసి ఆశ్చర్యపోవడం అవని వంతయింది. అచ్చు తన పోలికలే... కొత్తగా చూసిన వాళ్ళయితే  తనే రోజా,  రాజానే తను అనుకుంటారు.
    "సారి మిస్ అవని...మీలో నా చెల్లెలును  చూసుకోవడం తప్పయితే...రియాల్లీ సారీ...నేను ఓ విధంగా అన్నీ వుండి చెల్లెలి  ప్రేమ లేని ఒంటరిని. నాకూ,  తనకూ ఇరవయ్యేళ్ల అనుబంధం...చిన్నప్పుడు పాలకోసం ఏడుస్తున్నప్పుడు తనని నా గుండెలకు హత్తుకొని,  పాలకోసం బల్లలు తుడిచి బూట్లు పాలిష్  చేసి,  తన ఆకలి తీర్చాను.
    అలాంటి స్ధితి నుంచి తనని తివాచీ మీద నడిపించే స్ధాయికి ఎదిగినా,  ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.
    మిమ్మల్ని ఆఫీసులో చూడగానే ఏదో అనుబంధం,  ఏదో సంబంధం వున్నట్టు అనిపించింది. మీ నవ్వు,  పలకరింపు,  మాటతీరు అంతా రోజాలానే వుండేది.
    ఈ విషయాలన్నీ ఎప్పుడో చెప్పాల్సింది.  కానీ,  నా మనసులో ఓ కోరిక.  నా చెల్లెలుకు చేయలేకపోయిన ముచ్చట్లు మీకు చేయాలి.   ఈ ఆస్తిని,  వ్యాపారాలన్నీ మీకు అప్పగించాలి.  అందరూ కొడుకులను దత్తు తిసుకుంటారు.  నేను చెల్లెల్ని దత్తు తీసుకోవాలి.    
    ఇవన్నీ మీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయ్సత్నించినా,  చివరికి నేను చెప్పాల్సిన సమయం వచ్చేసరికి,  మన మధ్య అపార్ధం మిగిలింది."  ఫెడ్రిక్ చెప్పకుపోతున్నాడు.
    కదిలిపోయింది అవని.
    చెల్లెలి  ప్రేమకోసం అతనెంత తపించిపోయాడో అర్ధమైంది.  తనే తొందరపడింది.  అతడ్ని అపార్ధం చేసుకుంది.
    "అ..న్న..య్యా.."   మనస్పూర్తిగా పిలిచింది.
      కొన్ని లాజిక్ కు అందవు.  అధ్బుతంగా ఆర్ద్రంగా వుంటాయి.అపురూపంగా మనసు పొరల్లో నిలిచిపోతాయి.
    అవని ఎప్పుడైతే అన్నయ్యా... అని  పిలిచిందో ఫెడ్రిక్ కదిలిపోయాడు.
    "నన్ను అన్నయ్యా... అని పిలిచావా?"  ఆర్ద్రంగా అడిగాడు ఫెడ్రిక్.
    "అవునన్నయ్యా...   ఆ దేవుడిచ్చిన  అన్నయ్య మీరు"  అంది మనస్పూర్తిగా అవని.
    అవని తలమీద  చేయేసి,  నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టుకుని"  ఆ ప్రభువు నిన్ను చల్లగా చూస్తాడు" అన్నాడు  ఫెడ్రిక్.
    ఆ వాతావరణం ఉద్ద్వేగా భరితంగా వుంది. సినిమాల్లో నవలల్లో కనిపించని మెలోడ్రామా కనిపించింది.
    ఎప్పడూ నేరస్తులు,  కేసులు... తప్ప మరో ప్రపంచం తెలియని బెనర్జీ కూడా కదిలిపోయాడు.
    "సార్...కాఫీ,  టిఫిన్స్ రెడీ"  కుక్ వచ్చి చెప్పేసరికి నలుగురు హాలులోకి వచ్చారు.
              *             *             *
    టిఫిన్లు,  కాఫీ త్రాగడం లాంటి పనులు అయిపోయాక,  నలుగురూ... బయట లాన్ లో  కుర్చీలు వేసుకొని కూచున్నారు.
    "చెప్పండి ఇన్ స్పెక్టర్...ఇప్పుడు ఏం చేద్దామంటారు?"  అడిగాడు ఫెడ్రిక్.
    "అవనికి,  మీకు మధ్య అపార్ధాలు తొలగిపోయాయన్న విషయాన్ని గోప్యంగా వుంచండి.  తను మామూలుగా రేపు ఆఫీసుకు   వస్తుంది.  ఇంట్లో వాళ్ళు 'పోర్స్' చేయడం వల్ల  తిరిగి జాయిన్ అయ్యానని చెబుతుంది.
    "ఈలోగా నేను వసుధ బ్యాగ్రౌండ్ ఏమిటో కనుక్కుంటాను.  ఆనిడ వెనక ఎవరున్నారు?  అవనిని ఎవరు బెదిరిస్తున్నారు?  మిమ్మల్ని ఎందుకు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారు...  లాంటి వివరాలు ఎంక్వయిరీ చేస్తాను"  అని, అనిరుద్ర వైపు తిరిగి,
    "మిష్టర్ అనిరుద్రా... మీరు అవనిని కేర్ పుల్ గా వాచ్ చేస్తూ వుండండి.  ఆవిడకు ఏదైనా ప్రమాదం వస్తుందని తెలిస్తే, వెంటనే మీరు నాకు ఇన్ ఫార్మ్ చేయండి"  అన్నాడు బెనర్జీ.
    "అలాగే సార్" అనిరుద్ర అన్నాడు.
    "ఇన్ స్పెక్టర్...ఎంత త్వరగా ఈ కేసును సాల్వ్ చేయగలిగితే, అంత మంచిది. నేను ఇక్కడ ఆఫీసు బాధ్యతలన్నీ,  అవనికి అప్పగించి,  వీళ్ళ పెళ్ళి చేసి,  స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి అక్కడే సెటిలైపోతాను.  సంవత్సరానికి ఒక్కసారి ఈ నా దేవుడిచ్చినా చెల్లెల్ని చూసిపోతూ ఉంటా!"  కన్నీళ్ళతో అన్నాడు ఫెడ్రిక్.
    "మీరేం వర్రీ అవకండి... సాధ్యమైనంత త్వరలో మీ కేసు సాల్వ్ చేసే పూచీనాది.  బై  ది బై...అవనీ...మీ ఫోన్ నీ అబ్జర్వేషన్ లో పెడతాను.  ఎవరు.  ఫోన్  చేసినా చాలా జాగ్రత్తగా  డీల్ చేయండి.  ఎమోషనల్ గా అవోద్దు"  చెప్పాడు బెనర్జీ.
    "అలాగే సార్"  అంది అవని.
    "ఏదో ఓ సమయంలో నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.  మీరు తప్పనిసరి  అయితే తప్ప నన్ను కాంటాక్ట్  చేయొద్దు...  సరేనా"  అన్నాడు బెనర్జీ.
    ముగ్గురూ అలాగే అన్నట్టు తలూపారు.
    ఫెడ్రిక్ దగ్గర ముగ్గురూ సెలవు తీసుకున్నారు.
                      *           *            *
    అవని,  అవురుద్ర కామత్ లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూచున్నారు.
    ముగ్గురు ఫెడ్రిక్ దగ్గర్నుంచి బయటకు వచ్చాక,  బై చెప్పి,  బెనర్జీ వెళ్ళిపోయాడు.
    "అనూ...భయపడుతున్నావా?"  అడిగింది అవని.
    "ఎందుకు?"  అనిరుద్ర అడిగాడు.
    "నాచుట్టూ వున్న ఈ విషవలయాన్ని చూసి"  అంది అవని.  

 Previous Page Next Page