Previous Page Next Page 
హనీమూన్ పేజి 13


    "బోలెడు ర్తెళ్తూ, టైము...."

    "టైము ఖర్చుచేయాడానికి కేగాదా అసలి ప్రయాణాలు పెట్టుకోవటం?"

    "నిజమే  అనుకో-అదిగాక డబ్బుకూడా..."

    "మీ రూట్ కంటే ఈ రూట్ ఎంత  ఎక్కువవుంతుందో చెప్పు- అది నేనిస్తాను.సరేనా?"

    మాట్లాడ్డానికి నాకిం కేమి పాయింట్  దొరకలేదు.  అంచేత నిస్సహాయంగా సారధి వేపు చూశాను.

    "అదేమిట్రా-తాతయ్య మనతో రావాలని అంత ఇదావుతూంటే-వద్దు, కష్టం అంటూ కథలు చెప్తావేంటి? నీ  కెందుకు తాతయ్య! నిక్షపంలా మాతో వచ్చేయ్ ! అసలు నిన్ను కూడా ఇమ్మని నిన్నే ఒ కార్డురాసి పోస్ట్ చేశాను. ఇవాళ్ళ చేరి ఉంటుందది" అన్నాడు సారధి.
    "అలా బుద్దిచెప్పు వాడికి! నాలాంటి మూసలాడికి తోడూ, నిదా అంటూ లేకపోతే ఎలా ప్రయాణాలు చేయగలను? పెద్ద చిన్న అంటూ మీకూ  కొంచెం ఇది ఉండాలి కదా"

    నాకు సారధిగాడి మీద ఒళ్ళు మండిపోయింది. తాతయ్య సంగతి తెలిసికూడా  వాడు తాతయ్యను సపోర్ట్ చేస్తాడేమిటి అని.

    భోజనాలయాక వాడు నన్ను పెరట్లోకి లాక్కెళ్ళాడు.

    "నీ కేమయినా మతిపోయిందేమిట్రా! తాతయ్య మహా పెచికోరు  మనిషన్న విష్యం నీకు తెలుసు! తెలిసి కూడా మళ్ళి మనతో డార్జిలింగ్  రమ్మంటావేమిటి? మనూళ్ళో తాతయ్య మూలానా మనం ఒ సినిమా హాలు  వాడి చేతిలో చావు దెబ్బలు తిన్నాం మర్చిపోయావా?"

    "చ అదెలా మర్చిపోతాన్రా! పెద్దయాక  చావు దెబ్బలు తినటం అదేగా మొదటిసారి మనకి?"

    "అయితే మరెందుకు ?అట్లా తాతయ్యను ఎంకరేజ్ చేశావ్?"

    "నీకు తెలియదురా పక్షి! ప్రస్తుతం  మన ప్రయాణపు బడ్జెట్  దారుణమ్తెన లోటుతో ఉంది. మనం రడిచేసుకుంటున్న డబ్బు కేవలం మన ఖర్చులకు  లాడ్జింగ్ , బోర్డింగ్ లకు సరిపోతుంది. ఆ ప్తెన ఏమ్తేనా అర్ధంతరపు ఖర్చులోచ్చాయమ్తే చస్తాము అలాంటి సమయాల్లో తాతయ్య పక్కనుంటే  ఎంత లాభమో కొంచెం ఆలోచించు."

    కొంచెం సేపు ఆలోచించాక  వాడి వాదన సరయినదేనని తెలిసి పోయింది నాకు.

    తాతయ్య దగ్గర డబ్బు కేమి కొదవలేదు. ఇంటి అద్దెలు, పెన్షన్ అన్ని కలిసి పదిహేను వందలు సంపాదిస్తాడు. కూతుళ్ళ దగ్గరా ,కొడుకుల దగ్గరా గడపటం  వాళ్ళ ఒక్క ప్తెసా  ఖర్చులేదు. కనిసం యాభ్తే వేలు బాంక్  బాలన్స్ ఉంటుందని  మా అంచనా.

    "అలాగయితే  ఓ-కె!" అన్నాను.

    "ఊరికే అలా అన్ని  మన ఇష్ట ప్రకారమే జరగాలని అనుకోడదురా కొంచెం 'రాజి'  పడుతుండాలి అప్పడప్పడూ."

    దాంతో ఆ క్షణం నుంచి మాకు ఆర్ధిక బాధలు తప్పిపోయాయ్ ఇంకెవరిని  అప్ప అడగకుండా  హాయిగా డార్జిలింగ్  వెళ్ళవచ్చ్కాని ఆనందించాను.

    మర్నాడు పొద్దున్నే లేచి పాత ఇండియా  మాస ఒకటి దగ్గర పెట్టుకుని అలహాబాద్  మీదుగా డార్జిలింగ్  వెళ్ళేరూటు తాయారు చేయసాగాము. కాని ఎంత సేపు తంటాలు పడినా  మావల్ల కావడం లేదు. ర్తేళ్తూ మారతాలు. బ్రాడ్ గేజ్ నుంచి మిటర్ గేజ్ లు-మిటర్ గేజ్ నుంచి  నారోగేజిలు -ఇలా చాలా కంప్లికేటే డ్ గా ఉంది మాఫ్! మరికొద్ది సేపటికి ఏది ర్తెలు మార్గమో, ఏది రోడ్డు ,ఏది నాదో తెలీకుండా పోయింది. తీరా రూట్  తాయారు చేశాక చూస్తే మధ్యలో కొంచెం  భాగం 'నది, కనిపంచింది. దాన్నే సారధి పొరపాటున ర్తేల్వేట్రాక్ అనుకున్నాడట! మధ్యాహ్నం వరకూ  మా మేధాస్సునంతా  ఉపయోగించి  రూట్  తయారు చేశాము. దాని ప్రకారం మేము మందస్తుగా ఝాన్సీ వెళ్ళాలి! అక్కడి నుంచి సిలిగురి! నుంచే సిలిగురి  ల్తెట్ గేజ్ ర్తేల్లో డార్జిలింగ్ చేరుకోవటం! 

    "ఇదే చాలా తేలికగా వెళ్ళే  మార్గం " అన్నాడు సారధి ఆనందంగా.
   
    కాని అదే చాలా చుట్టూ తిరిగి వెళ్ళే మార్గమని, కేవలం ఏమాత్రం బుర్రలేనివారు మాత్రమే అలాంటి రూట్ లో ప్రయాణం చేస్తారని తర్వాత  మాకు తెలిసింది (తర్వాత అంటే సగం ప్రయాణం అయాక అన్నమాట!)

    ఆరోజు అంతా అలా వృధా ఆవటం చేత మర్నాడు ఉదయం శెలవు పెట్టి వెళ్ళి రిజర్వేషన్ 'క్యూ'లో నిలబడాలని నిర్ణయించుకున్నం.

    మర్నాడు మేము వెళ్ళేసరికే చాలా పొడుగు 'క్యూ' ఉంది. ఓ కాలేజి స్టూడెంట్ క్యూ చివర్లో నిలబడి "లలలా" అంటూ ఓ ఇంగ్లీషు  పాట దంచేస్తున్నాడు.

    "అబ్బ! చాల పెద్ద క్యూ" అన్నాడు సారధి అతన్తో.

    "అవున్సార్! ఒండర్ పుల్ 'క్యూ!' ఇంతకు ముందేప్పడూ ఇన్ని మెలికలు తిరుగుతుండగా  నేను చూళ్ళేదు" అన్నాడు స్టూడెంట్  పాటఆపి.

    "మనం కౌంటర్ దగ్గరకు  ఘమారుగా  ఎప్పటికి చేరతామంటారు?" నే నడిగాను.

    "అదుగో 'క్యూ'లో కౌంటర్  కో దగ్గరగా ఉన్న ఆ మూసలాయాన్ని చూశారా?" అడిగాడు స్టూడెంట్.

    ఇద్దరం ఆ ముసలాయాన్ని చూసి జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నాము.

    "ఆ!చూశాం" అన్నాడు సారధి.

    "ఆయన 'క్యూ'లో చేరిన కొత్తలో అచ్చం  నాలానే ఉండేవాడు కౌంటర్ దగ్గరకు  చేరుకునే సరికి పాపం- వయసయిపోయింది. అది సంగతి! అరె నవ్వరేమిటి? ఫర్లేదు నవ్వుండి. ఇది జోక్ ! నిజంకాదు!" అతనంతగా అడుగుతూన్నప్పడు బావుండదని నేను కొంచెం నవాను. సారధి మాత్రం మొఖవాటానీకయినా నవ్వలేదు. మరికాసేపటికి లంచ్ బ్రేక్  అయింది. రిజర్వేషన్ క్లార్క్  భోజనం చేస్తూంటే మేమ్మంతా భోజనం లేకుండా క్యూలో నిలబడ్డాము మళ్ళి ఎప్పుడు తెరుస్తాడా  అని చూస్తూ ఈలోగా క్యూలో పెద్ద కలవరం చెలరేగింది. క్యూలో నిలబడకుండా ముందు వెళుతున్న ఓ వ్యక్తినీ అందరూ కలసి ఆపేశారు.

 Previous Page Next Page