ప్రకాశం విసుగ్గా "హల్లో-ప్రకాశం హియర్! ఎవరండి మాట్లాడుతూంట?" అన్నాడు.
"నేనే ప్రకాశం సుజాతని" మృదుమధురమ్తెన స్వరం వినిపించింది. రిసీవర్ మీద అతని చెయ్యి బిగిసింది. క్షణం పాటు మాట్లాడలేదు.
"హలో"
"ఊ....చెప్పు...."
ఈసారి మౌనం అటు ఆవరించింది ఒక క్షణం ఆ క్షణంలో ప్రకాశం స్దిమితపడ్డాడు. ఎక్కడో మనసు అట్టడుగు పొరల్లో అస్పష్టమైన ఆనందం.
"ఒక్కసారి యిటు రాగలవా ప్రకాశం?" కంఠంలో అభ్యర్ధన వినిపించింది.
"సారి" అప్రయతనంగా అన్నాడు. "నన్ను బలవంతం పెట్టకు.
"అలా అనకు ప్లీజ్ లోపలికి రావొద్దు. నాతో మాట్లాడనక్కర లేదు కూడా. సాయంత్రం మా ఇంటిముందు నుంచి వెళ్ళు చాలు నిన్ను ఒక్కసారి చూస్తాను అంతే" ఆ కంఠంలో కనబడే నిజాయితీకి విచలితుడ్తెపోయేడు అతను.
నిజానికి ఆమె తనని యింతగా అభిమానించే ప్రత్యేకత ఏమీ తనలో లేదు, ఆ విషయం తనకి తెలుసు.కానీ___ మరి దీనికి అర్ధం?- ఫస్టులవ్ అవును, తనకి అనుభవం పద్దెనిమిదేళ్ళ క్రితం సీతతో తనకి పెళ్ళయిపోయింది. సుజాత యిప్పుడు అనుభవిస్తున్న స్టేటస్ కి, తనకన్నా అందమైనవాళ్ళూ, తనకన్న యెక్కువ ఆకర్షించగలిగే వాళ్ళూ ఎంతోమంది తారసపడుతుంటారు. అయినా తనని ఇంత అభిమానిస్తూ వుందంటే ఫస్టు లవ్ ప్రభావం ఆమెమీద యెంత పడిందో అర్ధం అవుతూంది. ఎవరన్నారు మన జీవితాల్లో డ్రామా లేదని?
"హల్లో, హల్లో"
"ఆ" అంటూ అస్పష్టంగా అన్నాడు తన ఉనికిని జ్ఞాపకం తెచ్చుకుంటూ.
"సాయంత్రం బాల్కనీలో నించొని ని కోసమే యెదురు చూస్తూ వుంటాను వస్తావు కదూ!"
ఫోన్ డిస్ కనెక్ట్ చేసింది.
అప్రయత్నంగా రిసీవర్ పెట్టేశాడు.
నుదుటిమీద నిలిచినా స్వేదబిందువుల్ని జేబురుమాలతో తుడుచుకొంటూ అప్రయత్నంగా తన టేబుల్ వ్తెపు చూసి షాకు తగిలినట్టు నిశ్చేష్టడ్తెపోయేడు.
ఎదుటి కుర్చీలో కూర్చొని టేబుల్ మీదవున్న పేపర్ వెయిట్ ని వ్రేళ్ళమధ్య ఆడిస్తూ మాణిక్యాలరావు తనవ్తెపే చూస్తున్నాడు.
3
"అది విషయం" అంటూ వెనక్కి వాలెడు మాణిక్యాలరావు.
అతికష్టంమీద తనని తాను తమాయించుకొంటూ "కుదరదండి. ఎన్నిసార్లు చెప్పంనేను? నాకూ ప్రిన్సిపల్స్ వున్నాయి. రూల్స్ కి వ్యతిరేకంగా నేనేవి చెయ్యలేను" అన్నాడు ప్రకాశం.
"పెద్ద పనేమి కాదు. మిరా కాగితం ప్తేలోంచి తీసేస్తే..."
"అరె, మళ్ళి మొదటికోస్తున్నరు ఐయామ్ సారి" అంటూ లేచి నిలబడి "మీరిక వెళ్ళవచ్చు" అన్నాడు.
మాణిక్యాలరావు నవ్వేడు. వేదాంతాన్ని , లౌక్యాన్ని ఓటమిని , గెలుపుని రంగారించిన నవ్వు అది. లేచి నిలబడి "మళ్ళి కలుసుకొందాం" అన్నాడు.
తరువాత అయిదు నిమిషాల్లో ప్రకాశానికి ఆఫీసరు దగ్గరనుంచి కబురొచ్చింది_మాణిక్యాలరావు తాలూకు పైలు పంపమని.పంపేడు.
అతనికి తెలుసు తరువాత జరిగేదేమిటో!
అరగంట తరువాత అతనికి ప్తేల్ తిరిగోచ్చింది. ఆ కాగితం లేదు! ఉండదు!
ప్రకాశానికి ఎవరిమీదా కోపం రాలేదు. అంతకన్నా ఘరమ్తెన స్ధితి-అసహ్యం. ఈ కుత్సితమ్తెన మనుషుల్నించి ఈ కల్మషభరితమైన వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే తపన... వేదాంతం కాదు ప్రకాశం స్ధితి స్ధబ్దత....
లంచ్ అవర్లో ఇంటికొచ్చాడు_పొద్దున్న తన మనసులో చేసుకొన్నా ప్రతిజ్ఞ మర్చిపోయి.
ఇంటి తలుపులు తీసేవున్నాయి. సితా, సుబ్బులూ పక్కగదిలో కూర్చొని మాట్లాడుకొంటున్నారు. హల్లో ఒక మూలనుంచి మామయ్యా గురక వినిపిస్తూంది అతనోచ్చిన సంగతి ఎవరూ గుర్తించలేదు. అందులో చిత్రమేమిలేదు-ప్రతిరోజూ జరిగేదే.
పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొనివచ్చి, పిత వాల్చుకుని కంచం తిప్పి అడుగునున్న కూరప్లేటు చూశాడు. కాకరకాయ_అతని ఆకలంతాక్షణంలో యేగిరిపోయింది. కొద్దిగా అన్నంలో చారు కలుపుకొని భోజనం పూర్తయిందనిపించాడు.
చొక్కా వేసుకొంటూవుంటే తన ప్రసక్తి వినబడి ఆసక్తిగా వినసాగేడు_
సుబ్బులంటుది___"రేపటి కెన్నెళ్ళు నిండుతాయే?"
"పద్దెనిమిది"
"ఇంతకి ని పుట్టిన రోజుకి ఏం ప్రజంటేష నిస్తున్నాడు మీ బావ?"
"ఆ నా మొహానికి ప్రజంటేషను కూడానా."
"అదేమిటే...మీ బావ ఉద్యగాన్లో పైన బాగా దొరుకుతుందాటగా!"