Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 13

    "ఏమివ్వను?"

    "మీ చేతిని ఒకసారి నా చేతిల్ప్కి తిసుకోనివ్వండి!"

    త్రిపుర నిస్సంకోసంగా చేతిని చాచింది.

    కోమలంగా ఉన్న ఆ చేతిని సుతారంగా  అందుకొని,   అంతకంటే సున్నితంగా  ముద్దు పెట్టుకొన్నాడు.  అపురూపంగా ఆ చేతిని కాస్సేపు తన రెండు చేతుల్లో ఉంచుకొని,  తరువాత వదిలేసాడు.

                                                               8



    యశోదమ్మ హల్లో కూర్చొని ఒత్తులు నలుస్తూంది.  శ్రీ నివాస శాస్త్రి గోవింద నామాలు చదువుకొంటున్నడు.
   
    ఇంటి ముందు మోటారు స్తెకిల్  ఆగడం,  మల్లిక్ తో పాటు మరొక యువతీ యింట్లో కి  నడిచిరావడం ఆమెకు గుమ్మంలోంచి కనిపిస్తూనే ఉంది! యువతీ  నుదుట  కళ్యాణ తిలకం ఉంది!  తెల్లపట్టుచిర కట్టుకొంది.

    సంగతి అర్ధమ్తెపోగా  యశోదమ్మ కళ్ళు పత్తికాయలు చేసుకు చూసింది!

    డాక్టరుగా ప్రాక్టిస్ పెట్టిన తన క్లాస్ మేట్  ఒకామెతో  తన వివాహం జరగనున్నట్టు  ఇదివరకే చెప్పాడు మల్లిక్ సూచనగా,  కానీ ఇవాళ పెళ్ళి అని చెప్పలేదు.

    కొడుకుని ఏమి చేయలేని ఆశక్తత త్రిపుర మిద కోపంగా మారిపోసాగింది ఆవిడరు!  అది సరిగా ఉంటే వాడు  మరోకదావ్ని ఎందుకు కట్టు కొంటాడు!

    ఇద్దరూ లోపలికి వచ్చి ముందు శాస్త్రి పాదాలకు నమస్కరించారు.  తరువాత యశోదమ్మ దగ్గరికి వచ్చారు.

    "కాళ్ళు ముందుకు చపమ్మా!"

    "ఆవిడ చాపలేదు ఆవిడ కళ్ళు ఆ గ్రహంతో చూశాయి."

    "రిజిస్ట్రార్  ఆఫీసులో మా పెళ్ళి ఉదయం స్నేహితుల సమక్షంలో జరిగింది!  పిలిచానా మీరు రారని పిలువలేదు"

    "చివరికి కులభ్రష్టుడివి కూడా అయ్యవన్న మాట!"

    "ప్రస్తుత్తం సమాజంలో కులాల  అవసరం అంతగా లేదమ్మా! కులాలు పోవలసినవే! మనుషులంతా ఒకే కులంగా  బ్రతికేరోజు రావాలని నాకోరిక!  పాత ఆచారాలకు,  సంప్రదాయాలకు స్వస్తి పలికి నేటి పరిస్ధితికి అనుగుణ మ్తెన,  మనుషులందరికీ ఒకే విధమ్తెన సంప్రదాయాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఎంతయినా వుంది!  క్రొత్తవి రూపొందించడానికి ముందు పాతని చెరిపి వేయాలి! నేనిప్పుడు చేసింది అదే!"  మల్లిక్ నింపాదిగా చెప్పాడు.



                                   *                           *                     *


    భావన ఆ ఇంటి కోడల్తే  వచ్చి రెణ్ణేల్లు  గడవక ముందు,  మల్లిక్ ఒక రోజు తను,  తన భార్యా పై చదువులకు అమెరికా వెళుతున్నామని చెప్పాడు ఇంట్లో.

    ఈ కొడుకువల్ల ఎన్నో బాధలు పడ్డారు వాళ్ళు!  ఏం చేసినా ఒక్కగా నొక్కాడు! మంచివాడు కానీ, చెడ్డవాడు కానీ,  కళ్ళముందుటే  అదొక ఊరట! ఇప్పుడు దేశంకాని దేశం  వెళ్ళిపోతున్నమని  చెబితే యశోదమ్మకి  కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు!

    ఆవిడ కొడుకు తప్పులన్నీ మరిచిపోయి ప్రాధేయ పడింది.  "మాకు ఏ నలుగురో వుంటే ఒకడు దూరం వెడితే ఏమ్తెందని ఊరుకోమా!  మాకు నువ్వున్నది ఒక్కడివే కాదా?  మా కళ్ళముందు లేకుండా వెళ్ళిపోతే  మేం ఎలా వుండమురా?  కాలునోచ్చినా,  మమ్మల్ని ఎవరు పలుకరిస్తారురా? మమ్మల్ని దిక్కులేని పక్షుల్ని చేసి వెళ్ళకు?"

    "గొప్ప డాక్టర్లమ్తె  తిరిగి వస్తాం  కదమ్మా అప్పడు  మమ్మల్ని చూసి మీరు గర్వపడాలి! కన్న  ప్రేమ  పిల్లల భవిష్యత్తుకు  గొడ్డలి పెట్టు కాకూడదని తెలుసుకోవడం  మంచిదమ్మా?   మీరు ఇప్పడే మంచాన పడలేదు కదా? పడినా నేను స్వయంగా నా చేతులతో చేయను కదా?  డబ్బు పారేసి డాక్టర్ల చేతే కదా చేయించేది!  ఆ డబ్బు ఇక్కడుండి ఇస్తేనేం?  అక్కడికి వెళ్ళి పంపింస్తేనేం?"

    "ప్రేమలకూ,  సెంటిమెంట్లకూ లొంగని మనిషిగా తయార్తెన  కొడుకుని చూసి నోరేత్తలేక పోయింది యశోదమ్మ. పైకి చెప్పా కోలేని  బాధ శ్రీ నివాస శాస్త్రి ది!

    మల్లిక్ భార్యా సమేతంగా అమెరికా ప్రయాణమ్తె  వెళ్ళిపోయాడు.

    కొడుకూ కోడలూ వెళ్ళిపోయాక ఇల్లంతా బావురుమన్నట్టుగా  అనిపించింది  యశోదమ్మకు!  "ఈ  సమయంలో  త్రిపుర అయినా తమతో  వుంటే  ఎంత బాగుంటుంది!  దాని విరోధమంతా వాడితోనేకదా ?  వాడు మూడు నాలుగు సంవత్సరాల  వరకు  రానేరాడు!   అంత వరకు  త్రిపురను  వచ్చి తమ దగ్గర వుండమని అడగాలి!" అనుకొని, ఒకరోజు శ్రీ రంగా పురం బయల్దేరి  వెళ్ళింది యశోదమ్మ.

    "త్రాష్టుడ్ని కన్నావు!  నా కూతురి జీవితం నాశనమ్తెపోయింది!  వాడు  మళ్లి పెళ్ళి చేసుకోన్నాడట  దిని బ్రతుకులో మట్టిపోసి! వాడూ మట్టి కొట్టుకు పోతాడు!"   అని శాపనార్ధాలు పెట్టసాగింది లలితమ్మ.

    "త్రిపుర నా కోడలు  కాకముందు మేనకోడలే కదా? మేనకోడలి గానే పంపిచంనయ్య! ముసలి వాళ్ళం. బిక్కు బిక్కు  మంటున్నంఈ  సమయంలో  త్రిపుర ను  పంపిస్తే చీకట్లో చిరుదీపం వెలిగించిన వాడివి అవుతావు!" పరమేశాన్ని ప్రాధేయపడింది యశోదమ్మ.

    "త్రిపురా వస్తే తిసికేళ్ళు !" పరమేశం  నిర్లిప్తంగా  అన్నాడు.

    కానీ,  త్రిపుర ఒప్పుకోలేదు.  "ఒకసారి వద్దు అనుకోన్నచోటికి నేను మళ్ళి అడుగు పెట్టనత్త!"  నిష్కర్షగా చెప్పింది త్రిపుర.

    యశోదమ్మ కు   ఒళ్ళు మండి  నానామాటలు  కడిగేసింది త్రిపురను, ఆమె తల్లిదండ్రులను.

    "మగవాడికి చాలా సహజమ్తెన  అలవాట్లను భూతద్దంలోంచి  చూశావు.  నువ్వు కొంచే సహనం చూపితే వాడు చేయిదాటి పోయే వాడా?"  అని కోడలిని,  "పిల్లను ఇంట్లో ఉంచుకొన్నప్పుడు పిల్ల  జీవితం నాశనం చేస్తున్నామని ఆలోచించకూడదూ? పిల్లను సిగ్గు లేకుండా ఇంట్లో ఉంచుకోన్నది చాలక నన్నూ నా కొడుకును అంటారా?  చిన్న పిల్ల.... తెలియక ఒక తప్ప చేస్తుంటే పెద్దవాళ్ళు దిద్దడానికి బదులు, ఆ తప్పను సమర్ధిస్తారా?....."  అని  అన్న వదినల్ని దులిపేసి,  ఆ పూట అక్కడ  అన్నం కూడా తినకుండా  ఉపోషం తో  బస్సెక్కింది.



                                                           9


    దాదాపు  ఇరవ్తే అయిదు సవత్సరాలు గడిచిపోయాయి.

    పాతకాలం నాటి మేడ.  అక్కడక్కడా పెచ్చులూడిపోయి శిధిలావస్థను తెలియజేస్తూంది.  మేడముందు ఖాళీ స్ధలం ఉన్నా ఒకటి రెండు చెట్లు ఉన్నాయి.

    ఇద్దరు ముగ్గురు వరండాలో నిలబడి చిన్నగా మాట్లాడుకొంటున్నారు.

    "......ముసలివాడి ప్రాణం మొండిదే! నాలుగు రోజులు నుండి  గొంతులో  కొట్టుకొంటూంధి  ప్రాణం?  పాలు పోసినా,  నీళ్ళు పోసినా ప్రక్కలకి కారిపోతున్నాయి!   ఈ క్షణమో,  మరు క్షణమో అనిపి స్తూనే నాలుగు  రోజులు గడిచాయి"

    "కొడుకుమీద  పెట్టుకొన్నాడు ప్రాణాన్ని!  అతడిని చూస్తే గాని  ఆ ప్రాణం పోదు!"

    "ముసలా యన్ని  క్రింద పెట్టారని కొడుక్కి కేబిల్ పంపించారట. కానీ,  దగ్గరా రావడానికి!  అమెరికా  నుండి రావలయే!"

    "పాపం!  ఉన్న ఒక్క కొడుకూ ఈ అవసాన దశ లో దగ్గర  లేక పోవడం..."

    వాళ్ళలా  మాట్లాడుకోంటూండగానే  కారోకటి వచ్చి ఆగింది.  అందులోంచి ఎబ్తే ఏళ్ళ వయసున్న ఒకతడు దిగి,  వీళ్ళ దగ్గరికి వచ్చి, "పోయాడా?" అనడిగాడు.

    "ఉహు ఇంకా అలాగే ఉన్నాడు!"

    మల్లిక్ వాళ్ళు బొంబాయి వచ్చారట. రాత్రి వరకు వచ్చేస్తారు ఇక్కడికి!"  అని, అతడు జోళ్ళు అక్కడే వ్వదిలి,  లోపలికి మెల్లగా నడిచాడు.

    గుమ్మానికి ఎదురుగా శ్రీ నివాస శాస్త్రి  శావాకారంగా పడుకోబెట్టి  ఉన్నాడు!  గుండెల వరకు దుప్పటి ఒకటి  కప్పిఉంది?  హఠాత్తుగా  చూస్తే శవంలా కనిపిస్తాడు గాని కొంచెం నిదానించి చూస్తే గొంతులో ప్రాణం కొట్టుకొంటూ ఉండడం కనిపిస్తుంది. నల్ల పాపలు పై కెళ్ళి పోయాయి!  నోరు కప్పలా తెరుచుకొని ఉంది!  నిట్లోంచి అప్పడప్పడూ చిన్న శబ్దం వస్తూంది!

 Previous Page Next Page