Previous Page Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 14

 

మొబైల్ లేదు కదా ఇంకేం చేస్తుందిలే అనుకుని అనుమానించడం మానేశారు మంజరి తల్లితండ్రులు. 
వాళ్లకి సాంకేతిక పరిజ్ఞానం లేదు కదా ! 
దాన్ని అలుసుగా తీసుకొని మంజరి కొత్త దారిలో కదను  తొక్కింది. 
దానికి తోడు ప్రియుడి ఎంకరేజ్మెంట్ మరీ ఎక్కువయ్యింది. 
ఎవరూ ఇంట్లో లేనపుడు బట్టలు లేకుండా ప్రియుడితో మాట్లాడేది మంజరి. అవన్నీ మురళీకృష్ణ చక్కగా రికార్డు చేసాడు. 
మంజరి అన్ని రకాల ఫోటోలు, వీడియోల తో పెద్ద గ్రంధాలయం తయారు చేసి పెట్టుకున్నాడు మురళీకృష్ణ అవసరమొస్తే బ్లాక్ మెయిల్ చేసేందుకు. 
ఇక మంజరి అతని చేతిలో పూర్తిగా బందీ అయ్యింది. 
అతని ఆజ్ఞలననుసరించి ఆడటం మొదలు పెట్టింది. 
ఒక రోజు ధైర్యంగా తల్లితండ్రులకు చెప్పింది మంజరి తను మురళీకృష్ణ ని పెళ్లి చేసుకుంటానని. 
ముకుందరావుకు మురళీకృష్ణతో పెళ్లి ససేమిరా ఇష్టం లేదు. 
వాణి అతని గురించి పూర్తిగా చెప్పింది భర్తతో. 
కాలేజీలో అతను అల్లరి చెయ్యని అమ్మాయి లేదు. 
కొంతమంది అమ్మాయిలూ అతని చేతిలో మోసపోయారు కూడా అని. కాకుంటే వాణి గారికి తెలియని నిజమేంటంటే తన కూతురు కూడా అతని మోసానికి బలైందని.
ఇష్టం లేకపోయినా కూతురు పట్టుబట్టడంతో ముకుందరావు మురళీకృష్ణ ని ఒకసారి ఇంటికి పిలవమన్నాడు మాట్లాడుదామని.
మంజరి ఎంత బ్రతిమిలాడినా మురళీకృష్ణ ఇంటికి రాలేదు. 
తనకు ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేసుకోనని తప్పించుకున్నాడు. 
మంజరిని బెదిరించి సుఖం మాత్రం పొందేవాడు. 
తనకు వేరే ఆప్షన్ ఏమీ లేదు కనుక మంజరి అతను చెప్పినట్లు చేసేది. 
ఇవన్నీ తల్లితండ్రులకు తెలీకుండా జాగ్రత్తపడేది.
ఇలాంటి సమయంలో ఓ రోజు సంజయ్ పెళ్లి సంబంధం వచ్చింది. ముకుందరావు ఆ సంబంధాన్ని ఒడిసిపట్టుకుని మంజరిని పెళ్ళికి ఒప్పించాడు. పెళ్ళిచూపులప్పుడు మంజరి ముభావంగా ఉన్నా తల్లితండ్రులు సర్ది చెప్పారు మధు, ప్రవల్లిక కి. 
సంజయ్ తో మాట్లాడేప్పుడు వాళ్ళు వెనుకనే నిలుచుని మంజరి తిరస్కారంగా మాట్లాడకుండా చూసారు. 
ఇలా ఎక్కడికక్కడ మేనేజ్ చేసి మంజరి మెడలో మూడు ముళ్ళు పడేట్లు చూసారు. 
అమెరికాకు పంపిస్తే ఇంకేం ఫరవాలేదు అనుకున్నారు. 
ఇండియాలో అయితే మురళీకృష్ణ మంజరి ని కలిసే వీలుంటుంది. 
అమెరికాకు ఎలా వెళ్లగలడు అని భ్రమపడ్డారు. 
అంతేగాక మంజరి త్వరగా తల్లయితే ఇంక ఏ సమస్యా ఉండదు అనుకున్నారు.   
మంజరి, మురళీకృష్ణ మధ్య జరిగిన పూర్తి భాగోతం ముకుందరావు వాళ్లకు తెలీదు.
మంజరి, మురళీకృష్ణల సంభాషణ చదువుతూ ఉంటె అందులో చాలా కుట్రలు గమనించి ఉలిక్కిపడ్డాను.
సంజయ్ తో పెళ్ళికి మంజరిని మురళీకృష్ణ బలవంతంగా ఒప్పించాడు. 
ఒక ఆరు నెలలు ఎలాగోలా సంజయ్ తో  గడుపు. 
ఈ ఆరునెలల్లో శృతి, మరికొందరి అస్లీల ఫోటోలు సేకరించు. 
అప్పుడు వాటి తో సంజయ్ ఫామిలీ ని బ్లాక్మెయిల్ చేసి చాలా నగదు డిమాండ్ చేద్దాం. 
దానితో జీవితాంతం హాయిగా బతికేయొచ్చు అని నూరిపోశాడు. 
ఏ మాత్రం తేడా వచ్చినా ఆ ఫామిలీని మొత్తం లేపేద్దాం అని ఒక క్రూరమైన ఆలోచన నూరి పోసాడు మంజరికి. 
అందుకు ఒప్పుకున్న మంజరి ఆ ప్లాన్ ప్రకారం సంజయ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన మొదటి రోజు నుంచి తమ ప్లాన్ ఇంప్లెమెంట్ చేసింది.
 సంజయ్ తనని ముట్టుకోనీకుండా ఏవో అర్ధం కానీ వ్రతాల పేర్లు చెప్పి ఒక ఆరు నెలలు భౌతిక దూరం పాటించాలని చెప్పింది. 
ఇవేవీ అంతగా తెలియని సంజయ్ అలాగే అని సరిపెట్టుకున్నాడు. 
ఆ విషయాలేవీ ఎవరితో చెప్పలేదు కూడా. 
ఆరునెలలే కదా ఏముంది అని ఊరుకున్నాడు.
కొద్దిరోజుల క్రితం మురళీకృష్ణ తమ సంభాషణ అంతా డిలీట్ చెయ్యమని మంజరితో చెప్పాడు. 
కానీ అవి డిలీట్ చేస్తే మురళీకృష్ణ మీద తన గ్రిప్ పోతుందని ఏవీ డిలీట్ చెయ్యకుండా అన్నీ ఇమెయిల్ హ్యాంగౌట్స్, పేస్ బుక్ చాటింగ్ లో ఉంచి పెట్టింది. 
అవన్నీ సంజయ్ కి దొరకడంతో మంజరి ఆట కట్టినట్లయ్యింది. 
సంజయ్ తెలివిగా తప్పించుకోగలిగాడు. 
లేకుంటే సంజయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది అమెరికాలో.
అన్నీ చదువుతూ ఉంటె ఇదేదో సినిమా ఫక్కీలో ఉండటంతో ఇంకేమన్నా పాయింట్స్ దొరుకుతాయా, ఏమైనా కుట్రలు దాగున్నాయా అని లోతుగా వెతుకుతున్నాను. 
ఇది కేవలం వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారమే అయితే ఎవరికీ ఇబ్బంది లేదు . 
అలా కాకుండా అందరిని నాశనం చెయ్యాలన్న వాళ్ళ ఆలోచన నన్ను కలవరపెట్టింది. 
ఇంతలో ట్రింగ్ మంటూ ఫోన్ మ్రోగింది. 
****
మధు ఫోన్ చేస్తున్నాడు.
చెప్పరా మధు అన్నాను. 
పొద్దున సంజయ్ ఫోన్ చేసాడురా. నీకు అన్ని వివరాలు పంపానని చెప్పాడు.
అవునురా. నాతో చాలా సేపు మాట్లాడాడు. నాకు అన్ని ముఖ్య వివరాలు వాట్సాప్ లో పంపాడు. నేను ఇవాళ కోర్ట్ కు వెళ్ళలేదు. అవే చూస్తున్నా. చాలా పిచ్చి రాతలు ఉన్నాయి రా. ఒక విధంగా ఈ విషయం ఇక్కడితో ముగియడం చాలా మేలయ్యింది అన్నాను.
మధుకి విషయం అర్ధమయ్యింది. ఏం చేద్దాం అన్నాడు. విడాకులు అంత ఈజీ గా వస్తాయా అని అడిగాడు.
ఇమెయిల్స్ లో విషయాలు కొన్ని చెప్పాను. అన్ని మనకు అనుకూలమేరా. సంజయ్ ఇండియా రాకుండా మంజరి చేతే కేసు వేయిస్తాను. 
ఒక సంవత్సరంలో విడాకులు వచ్చేట్లు చేస్తాను అని చెప్పాను. ఇంకా ఫేస్ బుక్ పూర్తిగా చూడలేదురా . సంజయ్ వాటిలో చాలా ఫొటోస్, వీడియోస్ ఉన్నాయని చెప్పాడు. అవి కూడా ఎవిడెన్స్ కి పనికి వస్తాయి. అప్పుడు కేసు బలపడుతుంది. 
ఏమోరా నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయం. నువ్వే చూడాలి అన్నాడు మధు. 
నువ్వేం వర్రీ అవ్వకురా. నేనే డీల్ చేస్తాను అంతా అని చెప్పాను. 
రేపు పది గంటలకు ఫ్లైట్ హైదరాబాద్ వస్తుందట. నువ్వు మా ఇంటికి వచ్చేయ్ ఇద్దరం వెళదాం. 
ఒక గంట ముందే అక్కడ ఉందాం. మంజరి పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్లకి మంజరి ని అప్పగించి మనం వచ్చేద్దాం. 
తరువాత విషయాలు నేను చూసుకుంటాను. నేను రేపు కూడా కోర్ట్ కు వెళ్లట్లేదు. 
వచ్చేప్పుడు ప్రవల్లిక, శృతి ని కూడా తీసుకురా. వాళ్ళని ఇక్కడ దించేసి మనం ఎయిర్పోర్ట్ వెళదాం అని చెప్పాను. రేపొక్క రోజు నువ్వూ లీవ్ పెట్టు అన్నాను. రాత్రి భోజనం చేసి అందరూ వెలుదురు గాని అని చెప్పాను. 
సరేరా అని ఫోన్ పెట్టేసాడు మధు. 
టైం చూస్తే రెండైంది. లంచ్ కి పైకి వెళ్లాను. గబ గబా లంచ్ పూర్తి చేసి మళ్ళీ ఆఫీస్ రూమ్ కొచ్చాను. జూనియర్స్ వచ్చే లోపు ఫేస్ బుక్ లో విషయాలు కూడా చూసి చిన్న నోట్స్ తయారు చెయ్యాలి అనుకున్నాను.
ఫేస్ బుక్ ఓపెన్ చేసాను. 
అందులో ఫొటోస్, వీడియోస్ మరీ వరస్ట్ గా ఉన్నాయి. 
ముకుందరావు వాళ్లకు చూపించేందుకు ఒక్కటి తీసి ఫోల్డర్ లో పెట్టాను. 
ఇక అంతకంటే చూడటం వేస్ట్ అనిపించింది. 
ఫేస్ బుక్ లో కూడా మెస్సేజెస్ ఉన్నాయి. 
అంటే ఇమెయిల్, ఫేస్ బుక్ రెండూ ఉపయోగించారు వాళ్ళ సంభాషణకు. 
సాక్ష్యాలు చిక్కినందున కేసు చాలా సులభం ఐంది. 
కాకుంటే న్యాయపరంగా ఎవ్వరికీ దెబ్బ తగలనీకూడదు. 
మంజరి చేసిన తప్పు పెద్దదే అయినా తల్లితండ్రులు ఇబ్బంది పడతారు ఏది చేసినా. 
అందుకే జాగ్రత్తగా ఈ కేసును నడిపించాలి అని నిర్ణయించుకున్నాను.
ఇంతలో ముకుందరావు ఫోన్ చేశారు. 
హైదరాబాద్ కి వచ్చారట. పెద్ద కూతురు ఇంట్లో ఉన్నారు. 
రేపు పొద్దున్న తొమ్మిది గంటలకి పెద్ద కూతురు, అల్లుడు కూడా వస్తున్నారట ఎయిర్పోర్ట్ కి. 
మంచిది అని చెప్పాను.
మంజరి గురించి ఎదో మాట్లాడబోయారు ముకుందరావు. 
ఫోన్ లో ఎందుకండీ. రేపు పొద్దున్న ఒక గంట ముందే ఎయిర్పోర్ట్ లో ఉంటాము. మీరు కూడా తొమ్మిది గంటలకు వస్తున్నారుగా. అక్కడే మాట్లాడుకుందాము అని చెప్పాను.
అలాగే సర్ అని ఫోన్ పెట్టేసారు ముకుందరావు.
మంజరి చేసిన పని వలన అందరూ ఇరుకున పడ్డారు. 
తల్లి తండ్రులకు చాలా అవమానకర పరిస్థితి తెచ్చింది తను. 
అసలు  ఆ ఈ మెయిల్స్, ఫొటోస్ చూశారంటే గుండె ఆగిపోతుంది. 
ఇది చాలా సెన్సిటివ్ విషయం. 
ఏ మాత్రం ఆవేశపడినా అందరికీ అనర్ధమే. 
అందుకే నేనే మొత్తం వ్యవహారం చూసేట్లు నిశ్చయించుకున్నాను. 
 

 

 Previous Page Next Page