కాదు విప్లవమూ, విప్లవమూ అంటారేకానీ అనలు దాన్ని యెలా నిర్వహించలో ఎవరికీ తెలియదు. అది వచ్చి వెళ్ళేక మళ్ళి మామూలే? చెంగిజ్ ఖాన్ చరిత్ర చాలు.
ప్రకాశానికి నవ్వొచ్చింది. రేషన్ షాపు క్యూలో నించొని విప్లవము గురించీ ఆలోచించటం__
ఆలోచన్ల నుంచి తేరుకొని ముందుకు చూసేడు. ఫర్లేదు క్యూ కొంచెం కదిలింది. ఇంకో అరగంటలో వెళ్ళిపోవచ్చు.
ఎండ కొంచెం యెక్కువ్తెంది.
మగవాళ్ళు వరసకి కొంచెం ఎడంగా ఆడవాళ్ళ క్యూ వుంది. అప్రయత్నంగా అటువ్తేపు చూసేడు. వరస మధ్యలో వున్న అమ్మాయి ఎందుకో అతన్ని ఆకర్షించింది. అంటే అందంగా వుందని కాదు అప్పటివరకూ అతన్నె చూస్తూ, అతను చూసేసరికి చప్పన కళ్ళు తిప్పెసుకోంది. ప్రకాశం పెదవులమీద అప్రయత్నముగా చిరునవ్వు వెలసింది. ఆ అమ్మాయి అది గమనించినట్టుంది_నాలుక కొంచెం బ్తేట పెట్టి పెదవులు తడిచేసుకొనే నెపంమీద అతన్ని వెక్కి రించింది. ప్రకాశం ఆ చొరవకి ఆశ్చర్యపోయేడు. తమ ఇద్దర్ని ఎవరన్నా గమనిస్తున్నారుమోనని చుట్టూ చూసేడు. ఆ పాప అతనికి తెలుసు. అతని యింటికి నాలుగాయిదిళ్ళి అవతల వుంటారు. వాళ్ళు ఆరో క్లాసో ఏడో క్లాసో చదువుతున్నట్టుంది.
షాపు దగ్గర ఏదో గొడవ అవటంతో తలయెత్తి చూసేడు_ షాపు వాడితో ఎవరో గొడవ పడుతున్నారు. ప్రకాశానికి విసుగేసింది ఇదొక ఆలస్యం.
ఎవరో సర్ది చేపతానికి ప్రయత్నం చేస్తున్నారు__కానీ లాభం వున్నట్టు కనిపించలేదు. చూస్తూ వుండగానే గొడవ పెద్దదయింది. క్యూలో వున్నవాడికి కాకుండా పక్కనుంచి యెవరికో పోసేడట_ ఆదిచూసి ఎవరో గొడవ పెట్టుకున్నారుఅది సంగతి.
"అయిపోయిందేదో అయిపోయిందిగా, వదిలెయ్యకూడదూ____ఈ పాటికి అందరికి వచ్చేసును" యెవరో అంటున్నారు.
నిజమే__కానీ__కానీ __ఎందుకు?
ఈ సహనం మన రక్తం లోనే జీర్ణించుకుపోయిందా?
"అరెరె_ అదేమిటి" అని యెవరో అరిస్తే చప్పన అటుచూసేడు, షాపువాడు రేకులు దింపెస్తున్నాడు.
"అదేమిటయ్య__కిరసనాయిలు పోయ్యవా?" యెవరో అడుగు తున్నారు. షాపువాడు ఏమీ మాట్లాడకుండా తాళాలువేసి పక్కింట్లోకి వెళ్ళిపోయేడు.
"పొలిసు రిపోర్టివ్వాలి."
"మనకన్నా ముందు వాడే ఇస్తాడు."
"అయినా పక్కనుంచి తీసుకున్న వాడికి బుద్దివుండాలి__ఇంత మంది క్యూలో నిల్చుంటే వాడికా తొందరేమిటి?"
"ఆ మాత్రం భావనిప్లవం వస్తే ఇంకేం?" ఖాళిసీసా పట్టుకొని ఇంటికి వెళ్తూ అనుకున్నాడు ప్రకాశం.
ఇంటి మేట్లేక్కుతూవుంటే బియ్యంలేవని సిత చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చింది. షాపువాడికి రెండు రోజుల తరువాత యిద్దమనుకున్నాడు. కానీ యిప్పడేలా ? ఉన్న మూడు రూపాయలు పెట్టి బియ్యం కొంటే యింక రెండురోజులు గదిచేదేలా?
సీతకి ఖాళిసంచి యిస్తూ" నాకు టైమ్ అయిపోయింది. నేను ఆఫీసుకు వెళుతున్నాను" చెప్పాడు.
ఆమె ఆశ్చర్యంగా "మరి భోజనం!" అంది.
"నేను బయటచేస్తాను" అంటూ జేబులోంచి ఉన్న మూడు రూపాయలూ తిసి "యివిగో యివే వున్నాయి__ ఈ రోజు యెలాగో గడుపు" అన్నాడు.
ఆమె డబ్బు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది.
బట్టలు మార్చుకొని ఆఫీసుకు బయలుదేరాడు. సాయంత్రం వరకూ ఏవి తినదల్చుకోలేదు. అతనికి కసిగా వుంది. ఎవరిమీదో తెలిదు.
2
పదకోండున్నర అయింది.
పనిలో మునిగిపోవటంవల్ల ఆకలి అంతగా తెలియటంలేదు.
తను చేసే పని గురించీ యిప్పడిప్పడే ప్రకాశానికి అర్ధం అవుతూవుంది.
అన్ని బోగస్ రిటర్న్ లు. ఎవరూ సరిగా ఆదాయం చూపించరు తప్పదు లెక్కలు. అందరికి తెలుసు అవి తప్పదు లెక్కలని. ఇరవ్తే నాలుగు శాతంకన్నా తక్కువ వడ్డీలు వసూలు చెయ్యని మార్వాడి పది హేను శాతంమీద లెక్కకట్టి టాక్స్ వేస్తే కోపంలు మునిగిపోయినట్టు గోల పెడతారు. వీటిని సరిచేయడం కోసం ఎద్తేనా రూలు ఎమేండ్ చేస్తే నెల తిరిగే సరికల్లా ఏ ట్రిబ్యునల్ డెసిషనో వ్యతిరేకంగా వచ్చి కూర్చుంటూంది. న్యాయం ఎక్కడాలేదు. ఈ రాజ్యంగా న్యాయశాస్త్రం___ అంతా తెలివ్తెన వాళ్ళు ఆడుకొనే చదరంగపు ఆట అంతే.
"మీకు ఫోనొచ్చింది సార్" ప్యూన్ చెప్పటంతో ఆలోచనల నుంచి తేరుకొని లేచాడు.
రిసీవర్ ఎత్తి "హల్లో" అన్నాడు.
అటునుంచి జవాబు రాలేదు.