ఆ ఊరి పేరు శ్రీ రంగాపురం. గరుడాద్రి మిద వెలిశాడు. శ్రీ రంగం నుండి భక్తుడి కోరిక మిద తరలి వచ్చిన శ్రీ రంగ నాయకులు! ఏడంతస్తుల గాలి గోపురం చివరి వరకూ చూస్తే కళ్ళు తిరిగి పోతాయే మొననిపిస్తుంది! ప్రక్కనే రంగసము ద్రంగా పిలువబడే చెరువు. ఆలయం నిండా కోతులు.
స్వచ్చమ్తెన గాలి, ప్రశాంతమ్తెన వాతావరణం!
మల్లిక్ పెళ్ళికి వచ్చినప్పుడు మొదటిసారి దర్శించాడు ఈ ఆలయాన్ని సుందర్.
దేవాలయం నుండి చెరువులోకి మెట్లున్నాయి. సుందర్ బూట్లు విడిచి, కాళ్ళు కడుక్కోవడానికి మెట్లమీదుగా చెరువులోకి దిగాడు.
మెట్లచివర యువతీ కూర్చొని ఉంది! సుందర్ కాళ్ళు కడుక్కోంటూ అటు చూశాడు, "త్రిపురసుందరి, మీరిక్కడ కూర్చోన్నారా?"
తలొంచుకొని, నీళ్ళలో కదిలాడే చేపలను చూస్తున్న త్రిపుర సుందరి, ఆ స్వరానికి ఉలికిపడి చూసింది, "మీరు... మిరేప్పడోచ్చారు?"
"ఇంతకు ముందే! మీరు కోవెలకు వచ్చారని చెప్పారు మీ అమ్మ గారు! ఇక్కడే మీతో మాట్లాడవచ్చని వచ్చాను" పాదాలు నీళ్ళలో వుంచి, ఒక రాతి మీద కూర్చొన్నాడు సుందర్. " భవిష్యత్తు గురించీ మీరు ఏం నిర్ణయం తీసుకొన్నారు?"
"క్రొత్తగా ఏం నిర్ణయం తీసుకోలేదు!"
"మల్లిక్ నీ పూర్తిగా త్యజించినట్టేనా?"
"ఆ"
"అతడు మళ్ళి వివాహం చేసుకొంటే మీకేమీ అభ్యంతరం లేదా?"
"ఎందుకుంటుంది?"
"మరి మీ జీవితం?"
"నాకసలు పెళ్ళికాలేదను కొంటాను!"
"మళ్ళి పెళ్ళి చేసుకోంటారా, అలా అనుకొని!"
"సుందర్ గారూ!" ఎర్రబడిన ముఖంతో కరకుగా పిలిచింది. భర్త సంసారం లేకపోతే స్త్రి జీవితం తెల్ల వారధనా మీ ఉద్దేశ్యం?"
"ఎందుకు తెల్లవారదు? కానీ, ఏ వయసుకు తగిన జీవితం ఆ వయసుకు ఉంటే బాగుంటుంది! కొన్నింటికి సర్దుకోగాలిగితే మీ జీవితం ఆనందమయం కాగలదని నా నమ్మకం!"
"సర్దుకోవాల్సిన అవసరం నాకేంలేదు! సర్దుకోవడం కాదు! అతడి నిడకూడా భరించలేను?"
"మళ్ళి పెళ్ళికి మీ అనుమతి వ్రాత పూర్వకంగా తీసుకురమ్మని నన్ను౭ పంపాడు మల్లిక్"
"నీకూ అతడికి ఏ సంబంధం లేదని వ్రాత పూర్వకంగానే వ్రాసిస్తాను!"
"త్రిపురసుందరి! మీరు ఆవేశంతో తీసుకొన్న నిర్ణయమిది! కొంచెం శాంతంగా, ప్రపంచపు పోకడను దృష్టిలో ఉంచుకొని ఆలోచించండి! మీ అమ్మ నాన్న మిరున్నని రోజులు ఉండరు కదా?"
"ఇప్పడే అమ్మ ఉండి లేనట్టుగా చేస్తూంది. నేను వాళ్ళమీద కూడా ఆశలు పెట్టుకోలేదు! ఎక్కడో వంటపనో, పాచిపనో చేసు బ్రతుకుతాను!"
"ఆ పనికంటే మల్లిక్ భార్యగా మీ జీవితం సూరురెట్లు గౌరవ ప్రదంగా ఉంటుంది కదా?"
"మల్లిక్ భార్య అంటే కి ఇచ్చిన బొమ్మ అన్నమాట! మరి అలా మనసు చంపోకు బ్రతకలేను."
"మల్లిక్ వివాహం ఇంచుమించు గా నిర్ణయమ్తె పోయినట్టే! భావన అని మెడిసిన్ లో మా క్లాస్ మేట్. ఆవిడని చేసుకొంటున్నడు! వాళ్ళు రెడ్డిస్! పెళ్ళికి ముందు మీ అనుమతి కావాలి కదా? అందుకని నన్ను పంపాడు!"
"చెప్పానుకదా, నిరభ్యంతరంగా వ్రాసుస్తాను!"
"ఇప్పటిక్తేనా మీ నిర్ణయం మార్చుకోనేట్టు అయితే, తను మీకా ఆవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పమన్నాడు మల్లిక్!"
"ఎవరిచ్చిన అవకాశమూ నాకక్కరలేదు"
"మీరిప్పరు తీసుకొన్న నిర్ణయానికి మీరోకరోజు బాధపడాల్సి వస్తుందని నా నమ్మకం!"
"ఆ రోజు ఎప్పటికిరాదని నా నమ్మకం!"
"మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సిన కాగితాలు కారులో ఉన్నాయి."
"తీసుకురండి పెట్టిస్తాను!"
"ఇంటికి వెళ్ళాక మీ తల్లిదండ్రుల ముందే పెడితే బాగుంటుంది!"
తరువాత అయిదారు నిమిషాల వరకు ఇద్దరూ మౌనం వహించారు.
పడమటి కొండల వెనుక అస్తమించాడు సూర్యుడు. పడమటి సంధ్యారాగం ప్రతిఫలించి చెరువు నీళ్ళు సిందూరం చల్లినట్టు గా అయ్యాయి
పక్షుల్లు, కొంగలు గుంపులు గుంపులుగా గూళ్ళకు చేరుకోంటున్నాయి.
చెరువు నీళ్ళలో చేప పిల్లల గుంపు బిలబిల్లాడుతూ కాళ్ళ దగ్గరికి వచ్చి కాస్సేపు అల్లరి పిల్లల్లా తోకలూ, నడుములూ అడంచి గిర్రున వేణు దిరిగి పోతున్నాయి.
"త్రిపుర సుందరి గారూ!" ఇంతసేపు దేన్ని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న సుందర్ మందస్వరంతో పిలిచాడు. "మీ వివాహ విచ్చిత్తికి ప్రాతినిధ్యం నాకప్పగించాడు మల్లిక్. ఎంతో బాధతో బయల్దేరి వచ్చాను నేను! సాధ్యమ్తెతే మీ మనసు మార్చి తీసుకుపోగల నే మోనని ఆశ పడ్డాను! కానీ, మీరు నాకా ఆవకాశం ఇవ్వలేదు! మల్లిక్ తో సంబంధానికి మీరు పూర్తిగా త్రెగదెంపులు చేసుకోడానికి నిశ్చయించు కొన్నారు కాబట్టి. నేను మిమ్మల్ని ఒక కోరిక కోరదలుకొన్నాను!.... మీ వ్యక్తి త్వాన్ని గౌరవించి, మిమ్మల్ని అపురూపంగా చూసుకోగల వ్యక్తి దొరికితే. ఆ వ్యక్తి చేతినందుకుడానికి మీ కభ్యంతరమా?"
నాలో జీర్ణించుకుపోయిన సంప్రదాయం సంస్కారం మీ స్నేహితుడిని అసహ్యించుకోడానికి కారణమయ్యాయి! అనే నన్ను రెండో పెళ్ళికి విముఖురాలిని చేస్తాయి. సుందర్ గారూ! నన్ను అపురూపంగా చూచుకో గల వ్యక్తి ఎక్కడోకాదు! నా కెదురుగానే ఉన్నాడు! అతడు మీరే! కాని అమ్దుకోలేను మీ చేతిని! నిజానికి, నా మనస్తత్వనీకి సరిపోయినవారు మీరు! మనసులో ఏమూలో ప్రణయస్పందనే కారణమ్తెం దనుకోంటున్నాను! అడుగడుగునా ఆయన్ని మీతో పోల్చేదాన్ని ఆయన అధః పాతాళానీకి జారిపోతే, మీరు శిఖరాగ్రం మీద నిలిచేవారు! మనసులో మీరు ప్రవేశించక పోతే ఆయన తో రాజిపడేందుకు ప్రయత్నించేదాన్నే మో"
"త్రిపురా!" ఊహించని విషయం విన్నట్టుగా విభ్రాంతిగా పిలిచాడు.
"మనసులో ఒకరు! జీవితంలో ఒకరు! ఎందుకో నా మనసుకు అది వ్యభిచారమనిపించింది. ఆ కారణం చేతకూడా నేను ఆయన్నుండి దూరంగా వచ్చేశాను!"
"మీకు తగినివాడిని నేను! నాకు తగిన వారు మీరు! మన కలయిక ఆనందమాయ మౌతుంది. త్రిపురా!"
"ఉహు సంప్రదాయం అంటే ప్రాణం పెట్టె మీ అమ్మగారి మన సుకు కష్టం కలిగించా లేను! నామీద ఆమె కున్న ఆప్యాయతను అసహ్యంగా మార్చుకోలేను!"
"ఒక విధంగా నేను మీకు దూరంలో ఉన్నంత వరకే మీకపు రూపం! దగ్గర్తే తె ఏమి మిగలదు! దగ్గార్తేనా విలువను తగ్గించుకోవడం కంటే , దూరంగా వుండే నా విలువను పెంచుకోవడం నాకిష్టం!"
"మరోసారి ఆలోచించరా?"
"ఆ నిర్ణయానికి తిరుగులేనట్టే ఈ నిర్ణయానికి లేదు!"
సంధ్య ఎప్పుడో అంతరించింది. చెరువులో నీళ్ళు నలుపు రంగుకి తిరిగాయి. ఆకాశం లో చుక్కలు ఒక టోకటిగా మొలుచుకు వస్తున్నాయి! కోవెలలో ఎవరో గణగణా మ్రోగిస్తున్నారు గంటలు!
హృదయం బరువెక్కిపోగా నెమ్మది గా లేచాడు సుందర్.
త్రిపుర కూడా లేచింది.
ఇద్దరూ ప్రక్క ప్రక్కనే మెట్లు ఎక్కసాగారు.
"ఇదే మన ఆఖరి కలయికేమో! మీ గుర్తుగా నాకేమీ ఇవ్వరా?" ఆర్తిగా అడిగాడు సుందర్.