అందరి మోఖాల్లోనూ కోపం మాయమై జాలి వచ్చేసింది.
"చూశారా నేను మొత్తుకుంటున్నా నన్ను నమ్మలేదు మీరు." కొంచెం దబాయింపుగా అన్నాడు.
అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తనూ బయటి కొచ్చేశాడు. ఇళ్ళల్లోని ఆడవాళ్ళందరూ నవ్వాపుకుంటూ తన వంక చూడటం కొంచెం చిరాకు కలిగించింది.
బస్ స్టాప్ దగ్గర నిలబడి బస్ కోసం ఎదురుచూస్తుంటే పక్కనుంచీ గాజుల చప్పుడు వినిపించింది.
"అయాం సారీ! మిమ్మల్ని అకారణంగా యిన్సల్ట్ చేశాను."
అదిరిపడి పక్కకు చూశాడు.
శిరీష!
మిలమిల మెరుస్తోన్న కళ్ళతో -
సంపెంగ సుకుమారంతో ---
"మీరు తప్పులేదు లెండి మీరు కాబట్టి అక్కడితో వదిలారు. అదే యింకోకరయితే యింకా గొడవయి పోయేది -"
ఆమెను ప్లీజ్ చేయటానికి అన్నమాట నూరుపాళ్ళూ పని చేసింది.
'అసలు తప్పంతా మాదే! మీరెవరో ఎందుకొచ్చారో కనుక్కోకుండా మీరు నన్ను చూడ్డానికి వచ్చారని అనుకోవటం-----"
"మీకో నిజం చెప్పుమంటారా?"
కళ్ళు మరింత విశాలం చేస్తూ అడిగింది.
"మీ అంత అందమయిన అమ్మాయి ఆ యింట్లో ఉందని తెలిస్తే నేను నిజంగా పెళ్ళి చూపులకే వచ్చే వాడిని ఇంకెవరూ మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా రిజర్వ్ చేసుకునే వాడిని."
ఆమె కళ్ళల్లో అనందం , గర్వం -
'అన్నీ అబద్దాలు "
"అందుకే ముందే హెచ్చరించాను. నిజం చెప్పబోతున్నానని--" నవ్వేసింది ఇంకా చాలా అందంగా.
అందం, సెక్సీతనం ఒకచోటే అఘోరిస్తాయ్ కాబోలు ----
"మీకు నిజంగానే కు నచ్చానా?"
"నచ్చటమా? మీ సిస్టర్ వప్పుకుంటే అప్పుడే తాళి కట్టేసి ఈ పాటికి ....."
ఆమె సిగ్గుతో తల వంచేసుకుంది.
"మీరూ నాకెంతో నచ్చారు "
"మరింకేమిటి ఆలస్యం?"
"అక్కయ్య క్కూడా అభ్యంతరం ఏమీ ఉండదని నేననుకుంటున్నాను ---"
"కానీ నేను యింకా నిరుద్యోగినే కదా! మీ సిస్టర్ అపాయింట్ లో అభ్యంతరం చెపుతుంది."
"ఎల్లకాలం నిరుద్యోగిగా ఉండదని నాకు తెలుసు. కొంతకాలం మీకోసం వేచి యుండగలను."
తను స్టన్ అయిపోయాడు. కొంచెం గర్వం కూడా కలిగింది. తను కోసం అంత అందమయిన అమ్మాయి వేచి యుంటానని చెప్పటం .
"ప్రామిస్ --" ఆమె చేతిలో చేయి వేయలేదు .
చేతిలో చేయి వేస్తేనే గానీ ప్రామిస్ అనిపించుకోదు ."
ఆమె అటూ ఇటూ చూసి ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని చేతిలో చేయి వేసింది. చేతిని గట్టిగా నొక్కి వదిలేశాడు.
"నాకు ఉద్యోగం లేకపోతే మీ సిస్టర్ ని మన పెళ్ళికి వప్పుకోదా?"
"ఏ మాత్రం వప్పుకోదు. ఈ రోజుల్లో ఆడామగా ఇద్దరూ ఉద్యోగం చేయకపోతే సంసారం గడపటం కష్టమని ఆమె అభిప్రాయం. అందుకని నా కిష్టం లేకపోయినా నన్ను ఉద్యోగంలో చేర్పించింది."
బస్ లు ఒకేసారి ఎనిమిది వచ్చి ఆగినయ్.
"ఓకే! వీలున్నప్పుడు మా ఆఫీస్ కి ఫోన్ చేస్తుండండి." జాకెట్ లో నుంచి ఓ కార్డ్ తీసి ఇచ్చింది.
పరుగుతో ఓ బస్ అందుకున్నాడు.
ఆమె చేయి ఊపింది.
మెట్ల దగ్గరే ఎదురుచూస్తోంది పింకీ!
కావాలని తెచ్చి పెట్టుకున్న ఆర్టిఫిషియల్ యవ్వనంతో మిడ్డీ ------
"హాయ్ మీ కోసమే చూస్తున్నా. నేను నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందా? కవ్వింపుగా అడిగింది.
ఆ ప్రశ్న కేవలం సరదాకి అడిగిన ప్రశ్న కాదు.
తనను సైకాలజికల్ గా డౌన్ చేయడానికి వేసిన ప్రశ్న.
జవాబు చెప్పకపోతే యింక తన మీద స్వారీ చేసేస్తుంది.
"ఇంతసేపా/ అప్పుడే దొరికింది?' టక్కున అబద్దమాడేశాడు. ఊహించినట్లే కంగారుగా చూసింది.
"రియల్లీ"
"యస్"
"చెప్పు అన్సరేమితో ! ఒకబ్బాయ్ ఒకమ్మాయ్ ఫోన్ లో ముద్దు పెట్టుకోవడం ఎలా?"
"ముందు నా పజిల్ కి అన్సర్ చెప్తే నీ ప్రశ్నకి సమాధానం చెపుతా."
"నీ పజిలేమిటి?"
"ఒక నాలుగక్షరాల ఇంగ్లీష్ పదంలో ఆఖరి మూడక్షరాలూ యూ ఎన్.టి. మొదటి అక్షరం ఏమిటి?"
ఆమె ఓ క్షణం ఆలోచించింది.
"క్లూ ఏమయినా ఇవ్వగలవా?"
"ఓ! ఆ పదం ఆడవాళ్ళకు సంబంధించింది."
ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది.
"అలాంటి ఫజిల్ అడగడానికి సిగ్గుండక్కర్లేదూ? ఇప్పుడే మమ్మీతో చెప్తానుండు."
"సురేష్ ఉలిక్కిపడ్డాడు."
"నోనో! అలాంటి పని చేయకు! చాలా ఈజీ అది, నీకు తెలియదంటే నేను చెప్పేస్తాను."
"చెప్పు "
"అంటే ! ఎ యూ. ఎన్. టి"
ఆమె పగలబడి నవ్వేసింది.
'యూ సిల్లీ"
"సిల్లీ -- నువ్వు! నేను కాదు "
సైకలాజికల్ గా చావుదెబ్బ కొట్టాడు.
ఇంక తనతో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం మర్యాద ఇస్తుంది.
"మరి నా కొశ్చేన్ ని సమాధానం చెప్పవేం?"
చటుక్కున నోటి కొచ్చింది చెప్పేశాడు.
"అమ్మాయీ, అబ్బాయీ ఒకే టెలిఫోన్ బూత్ లో ఒకే ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు."
ఆనందంతో ఎగిరి తప్పట్లు కొట్టింది. అక్కడికీ ఆనందం పట్టలేక ఎగిరి ముద్దు పెట్టుకుంది.
"యూ ఆర్ గ్రేట్! యింతవరకూ ఎవరూ అన్సర్ చేయలేకపోయారు."
ఇంక తనకు ఈ పింకీ ఎలాంటి పెంకి సమస్యా ఉండదు.
"పింకీ! లోపలకు రమ్మని చెప్పు అతనిని ----" గొంతులో ఆఫీసర్ హోదా!"
"కమిన్! ఇవాళ నుంచీ ట్యూషన్ మొదలు కదా!"
గత్యంతరం లేక లోపలకు నడిచాడు.