రెండు
మరుసటిరోజు పొద్దున ఏడింటికి పక్కమీద నుంచి లేచేడు ప్రకాశం. సాధారణంగా అతనికి ఆరింటికే మెలకువ వచ్చేస్తుంది. కానీ లేవడు. లేసై ఆ వాతావరణం అతనికి నచ్చదు__ పళ్ళు తోము కుంటూ సిత, చుట్టూ గిన్నెలేసుకుని పనిమనిషి, ఇంకేవిపనిలేనట్టు అంత పొద్దున్నే లేచి అరుగుమీద కూర్చొనే మావయ్యా అదంతా చూడటానికి ఇష్టపడడు అతను.
అతను గదిబ్తేటకి వచ్చేసరికి అందుకోసమే యెదురు చూస్తున్నట్టు "కొంచెం తొందరగా మొహం కడుక్కో బావా-కిర్సానాయిలు కావాలి" అంది సిత.
ప్రకాశానికి ఒక్కసారిగా నిస్సత్తువ అవరించినట్టుయింది. అతనిది చాలా చిన్న కోరిక. ప్రొద్దున్నే లేచి ఏ పని పెట్టుకోకుండా తీరిగ్గా పేపరు చదువుకొని, ప్రెష్ గా ఆఫీసు కెళ్ళిపోవాలని! మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దౌర్బగ్యానికి అది కూడా పెద్దకోరిక అయిపోయింది.
అతని మొహంలో అయిష్టతని కానీపెట్టినట్లుగా ___"సుబ్బులూ వాళ్ళని అడిగెను బావా! వాళ్ళింట్లోనూ లేదట___"
"మాటిమాటికి వాళ్ళింటికి వెళ్ళటం కూడా బావోదు షాపుకి వెళ్తాన్లే___" అన్నాడు ప్రకాశం.
మొహం కసుక్కొని, సీసా తిసుకోబోతూ వుంటే, సిత అతనికి సంచి అందిస్తూ, "బియ్యం కూడా అయిపోయినయ్ బావా!" అంది.
క్రితంరోజు రాత్రి వచ్చిన ఆర్రూపాయల్లో మూడు అతని కిచ్చినట్టూ జ్ఞాపకం వచ్చి, "అరె___నా దగ్గర అంత డబ్బులేదె..." అన్నాడు.
సిత సంచి పక్కన పెడుతూ "నాన్నా దగ్గర వున్నాయేమో అడిగి వస్తాను" అని వెళ్ళితిరిగివచ్చి, "తన దగ్గిరా లేవట" అంది.
ప్రకాశానికి చిరాకేసింది. కొంతమంది ఆడవాళ్ళు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా యెందుకు తాయారవుతారో అతనికి అర్ధంకాలేదు. నెలాఖర్లో డబ్బులులేకుండా ఆ సినిమా చూడకపోతేనేం?
అంతలోనే అతనికి ఇంకో ఆలోచన వచ్చింది. తను మాత్రం రాత్రి కార్నవాల్ కి ఎందుకు వెళ్ళేడు. ఈ సమస్యల నుంచి ఎస్కేప్ అవటానికి కాదూ! అవును సమస్యలు నిజంగా చూడటానికి పెద్ద సమస్యల్లా కనిపించవ్. కానీ జీవితంలో ఒక భాగంగా అయిపోయిన సమస్యలు కిర్సానాయిలు లేకపోవటం_ ఎప్పట్నుంచో చూడాలనుకొంటున్న సినిమా విడుదల్తే__జేబులో డబ్బుల్లేక పోవటం __పక్క క్లర్కు కుట్టించుకున్న బెల్ బాటమ్ ఫేంటూ, అన్ని సమస్యలే. అంతర్లినంగా జీవితంలో ముడివేసుకున్న సమస్యలు. ఈ దేశంలో మధ్యతరగతి మనిషంత ఎస్కేపిస్టు ఇంకెవరూ వుండరు. వాళ్ళరక్తంలోకి ఈ ఎస్కేపిజాన్ని కొద్ది కొద్దిగా ఇంజెక్ట్ చేస్తూనే వుంది ఈ వ్యవస్ధ. వీళ్ళు తిరాగాబాడరు. సమస్యని ఎలా 'దాటేయాలా?' అని ఆలోచిస్తారు. సిత సినిమా చూసినా అతను కార్న వాల్ కి వెళ్ళినా అందుకొసవెం ఇందులో ఆమెని ప్రత్యేకంగా తప్పు పట్టవలసింది ఎవింలేదు.
సంచి తీసుకొని షాపుకి బయల్దేరేడు. ఒక రూపాయో రెండో అరువు పెడతానంటే షాపువాడు వప్పకొంటాడు.
షాపు దగ్గరకి చేరుకొన్నాడు. బ్తేట 'క్యూ' చూసేసరికి నీరుకారి పోయేడు. ఏంప్లాయ్ మెంటు ఎక్సేచేంజ్ ముందు నిలబడ్డ గ్రాడ్యుయేట్ల 'క్యూలా' వుంది. వెళ్ళి చివరనుంచున్నాడు.
క్యూలో ముందున్న వాడు ట్రాన్సిష్టర్ చేతితో పట్టుకొని నిలబడ్డాడు. ప్రకాశానికి నవ్వొచ్చింది ఆ ప్రిఫరేషన్ చూసి.
సూర్యుడు మబ్బుల చాటునుంచి బైటకొచ్చాడు. స్నానం చెయ్యక పోవడం వలన వళ్ళు చిటపటలాడుతుంది. క్యూ నెమ్మదిగా కదులు తుంది ప్రకాశం ఏదో ఆలోచిస్తూ క్తూతోపాటే ముందుకు కదులు తున్నాడు.
ట్రాన్సిష్టర్ లో వస్తున్న పాట ఆగిపోయింది. అడ్వర్ టైజ్ మెంట్ మొదలయింది... మా బ్రాండు పళ్ళపొడి వాడండి.... టంగ్ టంగ్.... భారతదేశంలో పైర్లు యింతగా ఎదగటానికి కారణం మా ఎరువులే. టంగ్...టంగ్... "ఎత్తు రాజా ప్తెకెత్తు" పాట వున్న సినిమా తప్పక చూడండి. తలనొప్పా? మా మాత్ర వాడండి... మీ పళ్ళు ఎందుకు ఊడిపోయాయి? మా టూత్ పేస్టూ వాడలేదమో...హహ్వాహ్వ... టంగ్...టంగ్... వాడండి... టంగ్ టంగ్ సినిమా చూడండి... టంగ్ టంగ్ ...మెయిన్ రోడ్ లో మా వస్తాలయం ...టంగ్ టంగ్... ట్రాన్సిస్టర్ బ్రద్దలు కొట్టేద్దమన్నంత కోపం వచ్చింది ప్రకాశానికి. అదృష్టవశాత్తు వాడే కట్టేశాడు- క్యూ నెమ్మదిగా సాగుతోంది.
క్యూలో అందరికి కిరసనాయిల్ దొరకవచ్చు__ మరి రేషన్ దేనికి? ప్రోడక్టు తక్కువ ఉపయోగించేటట్టు చేయడం కోసమేనా?___ ఆ మాత్రంనైతిక బాధ్యత మనిషి యెందుకు తీసుకోడు?... "నేను తీసుకొంటాను. కానీ నా పక్కవాడు తీసుకొంటాడని హామీ ఏమిటి?" ప్రతివాడూ యిదే ఆత్మవంచనతో గడిపెస్తాడే తప్పు ఆ గోరంత దీపాల్ని తనే వెలిగించాలి అనుకోడు. ఏ 'ఇజం' వస్తే బాగుపడుతుంది దేశం? విప్లవం వస్తేనా? కార్మికులు సమ్మెలుచేసి కావల్సినని పొందుతున్నారు. యువకులు జుట్టు పెంచటంలోనూ, కొత్త పెషన్లు వెతకడంలోనూ నిమగ్నుల్తే ఉన్నారు. ఇంకెలా వస్తుంది? నిజంగా కష్టపడేది మధ్య తరగతి సగటు మనిషి. వాడిమీద ఎవరికీ సానుభూతి లేదు. కార్మికుల కనీసపు కోర్కెలు యూత్ లో అన్ రిస్టూ__ఇవి చర్చించే వాళ్ళే తప్పు_ తాలూకా ఆఫీసు యు.డి.సి. గుండెల్లో అంతర్లినమై వున్న వేదనని ఎవరూ గుర్తించరు. ఏమిటి పరిష్కారం?.... విప్లవమా?