"త్రిపురా!"
జవాబుగా త్రిపుర సన్నగా మూలిగింది.
"ఎప్పటి నుండి జ్వరం? జ్వరం వచ్చిన సంగతి అమ్మవాళ్ళకి తెలిదా?"
ఏదో గోణగినట్లుగా అందిగాని మల్లిక్ కి సృష్టంగా వినిపించలేదు.
ప్రక్క గదిలోంచి ధర్మమిటారు తెచ్చి త్రిపుర నోట్లో వుంచి చూశాడు. 'మ్తెగాడ్' నూటమూడు! ఇంత జ్వరంవచ్చిన మనిషిని శోభనం గదిలోకి త్రోసిన మనుషుల్ని ఏమనాలి! త్రిపురకి ఇంత జ్వరం వచ్చిందంటే ఆవిడ ఎంతవేదనకు గురి అయిందో? ఎంత బలవంతాన గదిలోకి త్రోయ్యబడిందో? త్రిపురకి ఇంజక్షన్ ఇచ్చి కాళ్ళ దగ్గరున్న దుప్పటి తిసి ఆమె నడుము వరకూ కప్పాడు. సీలింగ్ ఫెన్ వేసి బయటికి వచ్చాడు.
ఎవరి పక్కలమీద వాళ్ళు పడుకొని వున్నా ఎవరూ నిద్రపోలేదు తల్లి, అత్తా! గుండెలరచేతిలో పట్టుకొని గుతగుట మంటున్నారు! త్రిపుర మళ్ళి ఏం ప్రళయం తిసుకువస్తుందోనని!
"అమ్మ!"
యశోదమ్మ దిగ్గున లేచి కూర్చొంది. "ఏంరా?"
"మీరు ఎంత మూర్ఖులు? ఏదో అది జరిగిపోతే చాలునన్న ఆరాటం తప్ప ఆ మనిషి చచ్చినా బ్రతికినా మీకు అక్కర లేదన్న మాట!"
ఆవిడ గాబరా పడిపోయింది. "ఏం చేసిందిరా అది?"
"ఏం చేయలేదు! ఒంటిమీద తెలివి లేకుండా పడి ఉంది! నూట మూడుడిగ్రీలు జ్వరం! ఇప్పడే ఇంజక్షన్ ఇచ్చివచ్చాను! వెళ్ళి పలుకరించండి నువ్వూ,అత్తా!"
* * *
త్రిపురకు జ్వరం విడిచి పథ్యం పెట్టేసరికి పదిరోజులు గడిచి పోయాయి!
త్రిపురకు జ్వరం వచ్చిన మూడోరోజు, మల్లిక్ విహారయాత్రకు వెడుతూ "త్రిపురా! నేను రావడానికి వారం రోజులు పడుతుంది. నీకి జ్వరం మానసికమైన ఒత్తిడికి వల్ల వచ్చిందనుకొంటున్నాను! నీకిష్టం లేనిదీ నిన్ను కొనవ్రేలితో కూడా తాకను! నీకు నాతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే నిరాక్షేపణియంగా వెళ్ళిపో! కలవని మనసులతో మన సంసారం నరకం కావడం నాక్కూడా ఇష్టం లేదు! ఉండడం. వెళ్ళడం నీ ఇష్టానికే వదిలి వేస్తున్నాను! ఉండాలి అంటే నా మనసుకు నచ్చినట్టుగా ఉండాలని మరచిపోకు?" అని చెప్పి వెళ్ళిపోయాడు.
త్రిపురకి పథ్యం పెట్టిన రెండోరోజు తల్లిదండ్రులు వెళ్ళిపోవడానికి తయారయ్యారు.
త్రిపుర గోడని ఆసరా చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చింది "నాన్నగారూ! నేనూ వస్తాను మీతో! నన్ను తీసికెళ్ళండి" అంది.
"ఏం తోందరమ్మ? నువ్వూ బాగా ఆలోచించుకోవాలమ్మ! కాపురం వదులుకోవడం కంటే, కొన్నింటికి సర్దుకోవడమే ఉత్తమమ్తెందని అణు కొంటున్నాను!"
"నా వ్యక్తిత్వం బలిపెట్టి, నేను చేసే కాపురం నాకు నరకంగా ఉంటుంది నాన్నగారూ! అతడి పద్ధతులు నాకు నచ్చనట్టే నా పద్ధతులు ఆయనకూ నచ్చవు! పూర్తిగా ఉత్తర దక్షిణ ధృవాలం."
తల్లి ససేమిరా తమతో రావడానికి విల్లెదంది! పరమేశమే ఆమెకు నచ్చజెప్పాడు. "మనతో రానీ? నెమ్మదిగా అమ్మాయికి నచ్చజెప్పి పంపొచ్చు! మరి మనం నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తే అది ఎ అఘాయిత్యామ్తెన చేయొచ్చు!"
త్రిపురను తీసికెళ్ళరు.
త్రిపురకు నచ్చజేప్పగలమను కొన్నారు గాని ఏమి నచ్చజేప్పలేక పోయారు! త్రిపుర ముండిపట్టు పట్టింధి; తనిక అత్తగారింటికి వెళ్లేది లేదని!
"ఇదెక్కడి చోద్యమే? అతడి కేం లోపముందని? నిన్నేం కష్టాలు పెట్టాడని?" అని రోజూ పోరాడుతూనే ఉంది తల్లి.
"ఉంచుకొంటే ఉంటాను! వెళ్ళిపోమ్మంటే పోతాను! కానీ, అత్తగారింటికి కాదు! ఎక్కడికి పోతానో తెలియదు నాకే!"
తల్లి ఎన్ని తిట్టాలో అన్ని తిట్టింది! శాపనార్ధాలు పెట్టింది! పరువు బజారున పడిందని ఏడ్చింది! తండ్రి మాత్రం ఒత్తిడి చేయలేదు! ఏం ఒత్తిడి చేసినా ఆ పిల్ల ప్రాణం తిసుకోంటుందేమోనని ఆయన భయం! త్రిపురకి తెలియకుండా భార్యని మంధలిస్తున్నాడు ఆయన, ఆ పిల్లని అలా వేధిస్తే కడుపున చిచ్చు పెట్టి పోతుంది చూడని!"
"ఆ చిచ్చు భరించవచ్చునండి! ఈ చిచ్చునే భరించలేను. కూతురు కాపురం వదిలేసి ఇంట్లో ఉందంటే నేనిక ఎవరికీ మొఖం చూపలేను! నా తల ఇక ఎవరి ముందూ లేవదు!"
"ఒక ఆడది భర్తను వదిలేయల్సివస్తే ధాన్ని అంత అవమానకరంగా ఎందుకు భావించాలి?"
త్రిపుర మాత్రం ఎవరి మాటలకూ, కోపాలకూ తోణగడంలేదు.
త్రిపురను వాళ్ళే తీసుకువచ్చి వదులుతారేమోనని ఓ నెల రోజుల పాటు చూసిన యశోదమ్మ, రెణ్ణేల్లయినా రాకపోయేసరికి ఆవిడే అందోళనతో బయల్దేరి వచ్చేసింది!
"దానికి బుద్ది లేకపోతే మీకేమ్తెంది? పిల్లను విడిపించి ఇంట్లో పెట్టుకుంటారా? అటు ఏడు తరాలలో, ఇటు ఎడుతరాలలో ఎప్పడ్తేనా ఈ ఆప్రాచ్యపు సంఘటన జరిగిందా?"
"దానికిష్టం లేదు. బలవంతంగా పంపిస్తే అది ఏమ్తేనా చేసుకోంటుందని భయం"
"అలాంటి పాపిష్టి దానికోసం విచారించక్కరలేదు! దిని చోద్యం కాకపోతే, వాడు దిన్ని ఏం కష్ట పెట్టాడిని? త్రాగోచ్చి కొట్టాడా తిట్టాడా? ఎవతేమిద వ్యామోహంతోనో ధాన్ని చిత్రహింసలు పెట్టాడా?" అంది. సాధారణంగా అడిగే మాటలనే ఆవిడా అడిగింది.
ఎవరేమన్నా, ఎవరిచేత బుద్ది చెప్పించినా త్రిపుర విర్ణయం మారలేదు. త్రిపుర అంత మొండి పట్టు పట్టడం ఇష్టం లేకపోయినా బలవంతంగా మాత్రం ఆమెను పంపించదలచుకోలేదు పరమేశ్వరశాస్త్రి.
ఇంట్లో తండ్రి కూతుళ్ళు ఒక జుట్టు. లలితమ్మ ఒక జట్టు అన్నట్టుగా తయరయ్యారు. త్రిపురకంటే నాలుగ్తెదేళ్ళు పెద్ద అయిన విశ్వేశ్వరయ్య ఈ విషయంలో తటస్తుడు. తండ్రి కూతుళ్ళు మనసు మార్చి పిల్లను అత్త వారింటికి వెళ్ళేట్టు చేయమని వెయ్యి దేవుళ్ళకి మ్రొక్క సాగింది లలితమ్మ.
7
సంవత్సరం గడిచిపోయింది.
ఒకరోజు లలితమ్మ సాయంత్రం వేళప్పుడు వాకిలి చిమ్మి నీళ్ళు చల్లుతుంటే కారోకటి వచ్చి ఆగింది. అందులోంచి సన్నటి పొడుగాటి యువకుడొకడు దిగాడు.
"ఎవరు నాయనా?"
"మల్లిక్ స్నేహితుడిని! నా పేరు సుందర్. పెళ్ళికి ఈ ఊరు వచ్చానప్పడు"
"అలాగే, బాబూ?"
"మల్లిక్ పంపించాడు నన్ను!"
"మా త్రిపురను తిసురంమన్నాడా?" ఆవిడ సంభ్రమంతో అడిగింది,
".... ...." అతడు దేనికో తటపటాయింపుగా చూశాడు.
"చెప్పు, బాబూ! తిసుకురమ్మాన్నాడా?"
"తను వస్తుందా?"
"అల్లుడు పిల్లవాలేగాని కాళ్ళు చేతులు కట్టి మరి పంపిస్తాను, బాబూ ధాన్ని ఇక ఒక్క క్షణమ కూడా భరించలేను!"
త్రిపురసుందరితో నేను మాట్లాడతానండి! తనకి ఇష్టం లేకుండా ఏది జరగడానికి వీల్లేదు!"
"కోవెలకు వెళ్ళింది.వస్తుంది. ఇంట్లోకి వచ్చి కూర్చో, బాబూ!"
"రంగనాయకుల కోవెలకేనా?"
"ఆ"
"ద్తేవధర్శనం నేనూ చేసుకోన్నట్టుటుంది! త్రిపుర సుంధరిగారితో మాట్లాడినట్టూ అవుతుంది! నేను కోవేలకే వెడతానండి!" సుందర్ కారెక్కి స్టార్ట్ చేశాడు.