Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 11

   
    ఆమె చేసిన టిఫినూ , భోజనమూ తింటూంటే అతనికి జిహ్వ లేచి వచ్చినట్లుగా వుంది.


    "నీ వంట చాలా బ్రహ్మాడంగా వుంది" అని మెచ్చుకుందామనుకున్నాడు. కాని ఆమె ఏమయినా అనుకుంటుందే మోనని వెళ్ళకుండా యింట్లోనే  వున్నాడు.


    ఆమె చాలాసేపు సందేహించి సందేహించి అతని దగ్గర కొచ్చింది.


    "బావగారూ! మితో కొంచెం మాట్లాడాలి"అన్నది.


    అతను వులికిపడినట్లయి ఆమెవంక ప్రశ్నార్ధకంగా చూశాడు.


    "చొరవ తీసుకొని మాట్లాడుతూన్నందుకు క్షమించండి. ఎన్నాళ్లు గడిచినా ఆఫీసువాళ్లు డబ్బివ్వటం లేదు.ఇన్సురెన్స్ డబ్బు పాతిక వేలు కూడా రావటంలేదు. చేతిలో చివల్లిగవ్వలేక  చాలా  యిబ్బందిగా వుంది. ఇలా మిమిద ఆధారపడి బ్రతకటం కూడా నాకు చాలా సిగ్గుగావుంది."


    " ఇందులో సిగ్గు పడటానికేముంది? పార్వతీశం ఎవరు? సాక్షాత్తూ నా తమ్ముడు."


    "కావచ్చు. అయినా కుటుంబాలని కుటుంబాలు నెలలు తరబడి పోషించటం కష్టం. ఎక్కడో- దీనికకి ఓ  అంతం వుండాలి. చేతిలో చివ్విగవ్వలేకుండా  బ్రతకటం ఎంత కష్టమో మిరు ఊహించలేరు. అడుగుతీసి అడుగుపెడితే డబ్బుకావాలి.... అందుకని.... నాకెక్కడియినా ఉద్యోగం చూసి పెట్టండి బావగారూ!


    "ఉద్యోగమా? పెద్దపెద్ద డిగ్రీలున్న వాళ్ళకే దొరకటంలేదు. నీకు....


    " పెద్దఉద్యోగాలు దొరికే అర్హతలు నాకు లేవని తెలుసు. కనీసం మూడు నాలుగొందలు దొరికే చిన్న ఉద్యోగం... ఒక్క పుటయినా అర్ధాకలితో తిని చావకుండా బతకటానికి, ఏ బట్టలకొట్లో సేల్స్ గరల్ గానో, చిన్న చిన్న ప్రయివేట్ స్కూల్లో టీచర్ గానో, ప్రయివేట్ హాస్పటల్స్ లో సిస్టర్ గానో, కనీసం ఆయాగానో....


    " చూద్దాం" అన్నాడు నగహరి ఆమె ఆందోళనను అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తూ.


    శకుంతలతో, ఆమె ముఖంలోకి చూస్తూ యింతకు ముందెన్నడూ మట్లాడలేదు. పరిస్థితులప్రాబల్యంవల్ల  శుష్కించివున్నా ముఖంలో అందం, అవయవాల్లో పొందిక అతని దృష్టిలో పదేపదే పడసాగింది. చూపులు ఆమె వక్షస్థలం మిదకు  అదే పనిగా ప్రసరించసాగాయి. శకుంతల చాలా సార్లు పైట సర్దుకోవాల్సి వచ్చింది.


    ఓ గంటపోయాక ఆమో కాఫీ కలిసి తీసుకొచ్చినప్పుడు ... నువ్వు కాఫీ చాలా కలుపుతాను" అన్నాడు.


    శకుంతల వినిపించీ వినిపించుకోనట్లు గ్లాసందించి  లోపల కెళ్ళిపోయింది.

    
    ఆరాత్రి తనకీ ఎంతకీ నిద్రపట్టలేదు. పదే పదే శకుంతల  రూపమే గుర్తొచ్చి కవ్విస్తోంది. అందేగాకుండా తన శరీరం విరజిమ్మె సెగలు ప్రమిల యింట్లోవుంటే  ఒక్కరోజు కూడా  అనుభవించకుండా వుండలేజు. ఆమెమిది వ్యామెహంతో కాదు. తన  అవసరం కోసం.  ముఖ్యంగా తెల్లవారు ఝూమున  అతన్లో కోరిక మరి బలీయంగా వుటుంది. వేసవి కాలంలో ఆరుబయట పడుకున్నా  తెల్లవారు ఝామున "ప్రమి! ప్రమి!" అంటూ పిలిచి, గిచ్చి. గిల్లి ఎలాగైనా ఆమెను నిద్రలేపి లోపలకు తీసుకెళ్ళేవాడు.  ఒక్కోసారి ఆమె బద్ధకంవల్ల లేవకుండా మొండికేస్తే అటూ యిటూ చూసి అక్కడే కక్కుర్తిపడేవాడు.


    అతని  ఆలోచనలలో శకుంతలే మెదల్తోంది.

    
    ఎందుకంత చొరవగా మాట్లాడింది? తనంటే యిష్టమేమో,


    ఆభావం రాగానే అతను కాసేపు మొగవీరుడిలా ఫీలయ్యాడు.


    సాయంకాలం సినిమాకి వెళ్ళి వచ్చాడు. శకుంతల  అన్నంపెడితే తిన్నాడు. "సాంబారు బావుంది" అని మెచ్చుకున్నాడు.


    రాత్రి ప్రక్కమిద పడుకొని అటూ యిటూ దొర్లాడుకాని నిద్రపట్టలేదు. కామంతో , కోరికతో ఒళ్లురగుల్తోంది.


    అప్పుడే పెళ్ళాం వెళ్ళిపోయి నాలుగయిదు రోజులైపోయింది. ప్రతిరోజూ అలవాటయిన తనకు... చాలా అసాధ్యంగానే వుంది.


    శకుంతల నడిగితే ?ఏమంటుంది? వొప్పుకుంటుందా? ఏమని అడుగుతాడు? అసలు సందర్భాలలో ఎలా ప్రొసీడవుతారు? తన ఆఫీసులో కొంతమంది స్నేహితులున్నారు. వాళ్ళేప్పుడూ మరో టాపిక్ లేనట్లు నాకు దాంతో సంబంధముంది, దీంతో సంబంధముంది అంటూంటారు." దాని కోసం రెండు మూడు రోజులు ట్రైచేశానంతే.పడిపోయింది"  అంటాడు ఒకడు. ఇంకొకడు అదే నాకోసం ట్రై చేసింది అంటాడు.


    పది  నిమిషాలకోసారి శకుంతలతోబాటు భార్య కూడా గుర్తుకొస్తోంది. ఒకవేళ తనకూ, శకుంతలకూ మధ్య ఏదన్నా జరిగిందే అనుకో. ఆ రాక్షసి వూరుకుంటుందా? వార్నింగ్ కూడా యిచ్చి వెళ్ళింది. పసిగడితే నానా రభసాచేసి పారేస్తుందేమో.


    కాన  యిలాంటి మనయాల్లో మనిషి తర్వాతి దుష్పలితాలవైపు   మనసెక్కువగా పోనివ్వడు. అప్పటి అవసరాన్ని గురించే ఆలోచిస్తాడు


    తెల్లవారుజాము నాలుగయింది. ఇహ ఉద్రేకమూ, కాంక్షా  ఆపుకోలేకపోయాడు. మెల్లగా లేచి లోపలి గదిలోకి వెళ్ళాడు.

    
    శకుంతల చాపమిద పడుకొని వుంది. పమిట ప్రక్కకి తొలగివుంది. జాకెట్ హుక్స్ కూడా ఒకటి రెండు వూడియవ్వనం బయటకు తొంగిచూస్తోంది. పిల్లలు ప్రక్కనే నేలమిదపడి దొర్లుతున్నారు.


    నరహరి ఆమె వైపే చూస్తూ రెండు  నిముషాలు నిశ్శబ్దంగా నిలబడ్డాడు.


    ఎలా అడగాలి?ఏమని అడగాలి? అతని గుండె  వడివడిగా కొట్టుకుంటోంది. వొళ్ళంతా చెమటలు పడుతోంది.


    ఎందుకొచ్చిన  గొడవ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనుకొన్నాడు.

    
     కాని  లోపల్నుంచి చెలరేగుతోన్న కోరిక వెళ్ళనివ్వటంలేదు.


    శకుంతల నిద్దట్లో కదిలి ప్రక్కకి వొత్తిగిల్లింది.


    పమిటజారి వుండటం చేత ప్రక్కనుంచి ఎత్తయిన ఆమె సౌందర్యం అతన్ని నిలవనియ్యకుండా చేసింది.


    ముందుకు జరిగి క్రిందకు వొంగి ఆమె బుజాల క్రిందగా శరీరాన్ని తాకాడు.


    శకుంతల వులికిపడి కళ్లువిప్పింది. కావాలనే తాను రోజూ రాత్రుళ్ళులైటు  వేసుకునే పడుకొంటోంది. తోడి కోడలు ఊరు వెళ్ళినప్పట్నుంచీ ఇంకో మొగాడు ప్రక్క గదిలో పడుకుని వుండగా చీకట్లో పడుకోవాలంటే భయంట.

    
    " ఏమిటిది?" అంటూ  లేచి కూర్చుంది.


    ఎలా గురంగంలోకి దిగానుకదా- వెనక్కి తగ్గి ప్రయోజనం లేదనుకొని, ముందుకే  పోదలచాడు.


    " ఒక్కసారి.... ఒక్కసారి...ప్లీజ్" అంటూ మళ్ళీ బుజంమీద చెయ్య వెయ్యబోయాడు.


     ఆమె అతనికి  అందకుండా వెనక్కి జరిగింది. ఎందుకో భయం వెయ్యటంలేదు. చాలా కోపంగా అసహ్యంగా వుంది.    


     " ఏమిటి ఒక్కసారి... మనమిద్దరం..."


    " అదే ... ఒక్కసారి నన్ననుభవించటం కావాలా?" అంది.

 Previous Page Next Page