Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 12


    " ఊ" అన్నాడు ఏమనాలో తోచక.


     " ఒక్కసారేనా? తర్వాత అఖ్కర్లేదా?"


    "ఒకసారి జరిగాక... అవకాశాన్నిబట్టి .... తర్వాత అప్పుడప్పుడూ...."


    " మికు వీలయినప్పుడు."


    "అదేమరి..."


    " మికు కావాలని అనిపించినప్పుడు...."


    " అంతే మరి..." అన్నాడు నీళ్లు నములుతూ.


    "ఒకసారి అలవాటుయినాక నాకు  తరుచూ కావాలని అనిపిస్తే..."


    " ఇద్దరం కలిసి... అవకాశాన్ని వెదుక్కుంటూ వుండాలి..."

    
    " ఒకవేళ... నాకు కడుపొస్తే?"


    " ఎబార్షన్ చేయిస్తాను."


    " డాక్టర్లు చాలా  ఫీజులు తీసుకుంటారనుకుంటాను. డబ్బులో?"


    " నేనిస్తాను."


    " నా పిల్లలు ఆకలితో మాడుతుంటే , చిరుతిళ్ళకోసం వాచిపోతోంటే, నా వొంటిమిద సరియైన బట్టలు లేక కేవలం మూడు నాలుగు  చీరెలతో , అర్ధాకలితో పస్తులుంటూం


టే ఎప్పుడూ పైసా ఖర్చు పెట్టలేదుగానీ, కడుపుచేసి ఎబార్షన్ చేయించటానికి డబ్బులిస్తారా?"


    " అవును మరి" అన్నాడు ఏమననాలో తోచక.


    " అవును మరా?"


    " అవును. చప్పున.... తర్వాత ఆలోచిద్దాం. బాగా తెల్లారిపోయిందంటే పాలమ్మాయి వచ్చేస్తుంది. తొరగా రా మరి."


    "ఉండండుండండి" ఒక పనిచేసే ముందు చాలా పాయిట్లు ఆలోచించుకోవాలిగ మరి మి ఆవిడికి రేప్పొద్దుట మన విషయం తెలిస్తే ఎలా నిభాయించుకొస్తారు?"


    నరహరి మొహం నల్లబడిపోయింది.  " ఎలా తెలుస్తుంది?" అనడిగాడు.తడబడే గొంతుతో.

    
    " తెలుస్తుంది. పోనీ మన ప్రవర్తననుబట్టి అనుమానిస్తుంది. అప్పుడు నిజం ఒప్పుకొంటారా?"


    "ఎందుకొప్పుకుంటాను. దబాయించిపారేస్తాను. కావాలంటే దానికి నమ్మకమున్నన్నిఒట్లు వేస్తాను. అవసరాన్ని బట్టినా పిల్లలమిద కూడా  వొట్లు  వేస్తాను."


    " అంతేకాని బాహాటంగా యి అమ్మాయితో నాకు సంబంధముంది. ఏం చేసుకుంటావో చేసుకో అని అనలేరు."


    " అనటానికి నేనేం చవటని కాదు."


    శకుంతల అతనివంక అసహ్యంగదా చూసింది. ఇందాక ట్నుంచీ కూడగట్టుకున్న ఓర్పు అంతరిచిపోయింది.


    " పో ఇక్కణ్నుంచి లేకపోతే నలుగుర్నీ పిలిచి అల్లరిచేసి పారేస్తాను" అని అరిచింది.

    
    ఆ రోజే ఆమె పిల్లల్ని తీసుకొని విజయవాడకు బయల్దేరింది.

 
                                  8


    భూలోకమ్మకు నలభయి అయిదేళ్లుంటాయి.


    మనిషి  ఎత్తుగా , నల్లగా , బలంగా వుంటుంది. ఆమె జీవితపు మొదటి ప్రాంగణంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నదో, తనని తానుకాపాడుకునేందుకు, తన వినికిని నిలద్రొక్కుకునేందుకు ఎంత పైశాచికంగా ప్రవర్తించవలసి  వచ్చిందో,  ఎంతమంది మొగుళ్ళని  మర్చవలసి వ చ్చిందో ఎవరికి తెలీదు. మృదుత్వం అనేది ఆమెలో ఏ కోశానాలేదు. మానవత్వం, నైతిక వలువలు- వీటి జోలికి ఆమె ఏమాత్రం వెళ్ళదు. ఆడదానీకి శీలం, గాడిదగుడ్డు- వీటిమీద ఆమెకు ఎటువంటి నమ్మకంలేవు. మనసులో ఏమూలో వున్నా వాటివల్ల ప్రయోజనం లేదన్న జీవితసత్యాన్ని అర్ధంచేసుకొని, పెరగనివ్వకుండా మడిచిపెట్టి పారేసింది.డబ్బు. నీతిగా ,సజావుగాపోతే డబ్బెవరూ సంపాదించలేరు. చివరిదాకా అటుపైకీ రాలేక అటు క్రిందకూ పోలేక పెనుగులాడుతూ వుంటారు.  అందుకని మొదట్నుంచీ  అడ్డం వెళ్ళిపోవటం నేర్చుకుంది. ఎప్పుడో చిన్నప్పుడు  నాలుగు అడ్డం వెళ్ళిపోవటం నేర్చుకుంది. ఎప్పుడో చిన్నప్పుడు నాలుగు గేదెల్ని కొని పాలవ్యాపారం  చేసింది.అందులో కొంత సంపాదించాక, ఎంత కాలమున్నా ఎదుగూ బొదుగూ వుండదన్నసత్యం గ్రహించి యింట్లోనే చిన్న లాడ్జింగుపెట్టేసింది.అంటే ముందుభాగంలోవున్న రెండు గదుల్లో కాపరం. వెనకవున్న మూడు నాలుగు గదుల్లో పడకలకోసం ఏర్పాటు చుట్టూ చిన్న పెంకుటిళ్ళూ , పాకలే.ఆమె చేస్తోన్న వ్యాపారం ఆ వాడకట్టులో అందరికీ తెలిసినా,ఆమె నోటికి ఝడిసి ఎవరూ పెదవి కదపటానికి సాహసించేవాళ్లు కాదు.ఉదయం ఎనిమిది గంటలనుంచే ఆమె యింటికి ట్రాఫిక్ మొదలలయేది. వ్యాపారానికి ఆమె ఎన్నుకున్న ఆడవాళ్ళలో రకరకాల వాళ్లుడేవారు. మొదట్నుంచీ పడువువృత్తిలో జీవించే ప్రొఫెషినల్స్, పెళ్ళయి భర్త అంగీకారంతో వ్యభిచారం చేసే ఆడవాళ్లు, భర్తలు ఆఫీసులకుపోయాక వాళ్ళకు  తెలీకుండా యిలాంటి చోట్లకొచ్చి రోజుకి యాభయ్యో,  వందో సంపాదించుకుని వెళ్ళే ఆడవాళ్లు , అమాయకంగావుండి, మధ్యవర్తులచేత గాలం వెయ్యబడి యీ ఊబిలో చిక్కుకొన్న ఆడవాళ్లు, బలవంతంగా ఎత్తుకు రాబడి శీలం పోగొట్టుకొన్న ఆడవాళ్లు..... ఆ దశలో ఆమెకు అనేకమంది రౌడీలతో, పోలీసు వాళ్ళతో పరిచయం ఏర్పడింది.ఎటువంటి రౌడినన్నా ఆమె లెక్క చేసేదికాదు.  వాళ్ళని ఎంతవరకూ  మేపాలో అంత వరకూ మేపేది. వాళ్ళకు తన అవసరం మేరకు చక్కగా ఉపయోగించుకునేది. ఒకరిద్దర్ని యీ భూమ్మిద లేకుండా శాల్తీలు కూడా గల్లంతు చేసిందని చెప్పకొంటారు. పోలిసు వాళ్ళతో కూడా అలానే ప్రవర్తించేది. వాళ్ళ మామూళ్ళు వాళ్ళకు పగడ్బందీగా, ఏమాత్రం లోటు  లేకుండా చెల్లించేది. ఎవరన్నా ఎదురు తిరిగి దెబ్బతియ్యటానికి ప్రయత్నిస్తే వాళ్ల అంతు చూసిగాని వొదిలిపెట్టిది కాదు. ఎకాయెకిని పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి ఏమిట్రా  నువ్వు చేసినపని నా సొమ్ము తిని నాకే ఎసరు పెడతావా? ఎంగిలికూడు తినే  ముండా కొడకా అని స్టేషన్ లో మిగతావారి ముందు అతను పరువు తీసిపారేసేది. ఒకసారి కొత్తగా వచ్చిన ఎ,స్.ఐ. ఆమె తడాఖా తెలీక , విజృంభించబోతే అతను నీట్లోవుండగానే చొక్కా పట్టుకు  గుంజి యివతలకు లాగింది. స్టేషన్ లో పదిమంది ఎదుట అతన్ని అడ్డమైన బూతులూ తిట్టి, యి  ఆడదాన్ని ఎలా లొంగదీసుకోవాలా  అతను ఆలోచించే లోపల ఎస్. పి.కి కంప్లెయింట్ చేసి అతను సస్పెండయినా కానీ, నిలబెట్టి వాడిదేతప్పు అనిపించేలా, విన్నవాళ్ళు, చూసినవాళ్ళు నమ్మేలా తన వాక్ శక్తితో డామినేట్ చేస్ పారేసేది. మనిషి నాలుక ఎంత శక్తి వంతమైనదో ఆమె ఎన్నో సందర్భాలలో రుజజువు చేసింది.ఎంతటి కొమ్ములు తిరిగిన మొనగాడినైనా  'లంజకొడకా....  లండికొడకా, దొంగనాయాలా" అంటు తిట్లవర్షం కురిపించి గుక్క త్రిప్పుకోకుండా చేసేది. బిజినెస్ విషయంలో ఆమె ఎప్పుడు రాజీపడేది కాదు. ఒకసారి ఆమె ముసలి తండ్రి చావు బ్రతుకులమధ్య వ్రేళ్లాడుతూ చిన్నక్షణాలలో వున్నాడు. ఆ సమయంలో కూడ ఎటు తన కోరికలు తీర్చుకోవటం  కోసం వచ్చారు. ఆమె విసుక్కోకుండా యిటు తండ్రి ట్రిట్ మెంట్ కి చెయ్యాల్సిన ఏర్పాట్లు చేస్తూనే , ఆ వచ్చిన మొగాళ్ళకి పడకలు కుదిర్చి డబ్బులు వెంట పంపించేది.   

 Previous Page Next Page