15
మార్నాడు సరిగ్గా మూడయింది. సీతకి వంటింట్లో పని అయిపోయింది.
సీత శరత్ బాబు గది దగ్గరకువచ్చి వాకిలిపక్కగా నుంచుండి పోయింది.
గదిలో శరత్ బాబు అద్దంముందు నుంచుని టై ముడి సరిచేసుకుంటూ అతి నెమ్మదిగా ఈలపాట పాడుకుంటున్నాడు. ఫ్రెండ్ సునీల్ బర్త్ డే పార్టీ. సునీల్ నాలుగు గంటలకల్లా రమ్మన్నాడు. అందుకే తొందరగా తయారవుతున్నాడు శరత్ బాబు.
"గదిలోకి వెళదామా? వద్దా? వెళ్ళి ఏం మాట్లాడాలి? పచ్చిపట్టినట్లు తను ఇలా వచ్చిందేమిటి? వెళ్ళిపోవాలి." గదిబైట సీత ఆలోచించి వెళ్ళి పోవటానికి నిశ్చయించుకుంది.
శరత్ బాబు ఈలపాట ఆగిపోయింది.
"ఓసారి గదిలోకి తొంగిచూసి వెళితే? తను అలా చూడటం శరత్ బాబు గమనించటం మంచిదికాదు." సీత అనుకుంది.
శరత్ బాబు గదిలోంచి బైటకొచ్చాడు. గుమ్మంపక్కనున్న సీత శరత్ బాబు నొకరు చూసుకున్నారు.
డ్రీమ్ గా తయారయిన శరత్ బాబు మేలిరకం యాపిల్ పండులా వున్నాడు. సీత, సీతలాగానే వుంది. అయినా ఒక్క అరనిమిషం కళ్లార్పకుండా ఒకరినొకరు చూసుకున్నారు.
"సీతా! అనబోయాడు శరత్ బాబు. గొంతు పెగల్లేదు.
"నే వెళ్లిపోతున్నాను." చెప్పాలనుకుంది, సీత కంఠం మూగవోయింది.
సీత ఈ ఇంట్లోంచి శాశ్వంతగా వెళ్ళిపోతుందని శరత్ బాబుకి తెలియదు.
సీత వేగంగా అవతలికి వెళ్లిపోయింది.
"సీత ఏదో చెప్పాలని వచ్చింది. ఎవరూ చూడకుండామాట్లాడాలి." అనుకుంటూ శరత్ బాబు బైట కెళ్ళిపోయాడు
సీత నీరద గదిలోకి వెళ్ళింది.
నీరద, పెర్రీమావన్ నవల చదువుతున్నది. సీత రావటం చూసి నవలనిదిండుమీద బోర్లించింది. చదువుతున్న పేజీలు కదలకుండా అలాగే వుంటాయని గుర్తుకోసం.
"ఏంకావాలి సీతా? పత్రిక కావాలా? ప్రభకావాలా?" అంది నీరద.
"రెండూ వద్దు."
"అదేం?"
సీత మాట్లాడలేదు. వార, మాస పత్రికలు కాలక్షేపానికి చదవటానికి నీరదనడిగి సీత అప్పుడప్పుడూ తీసుకెళుతుంది. సీత అందుకే వచ్చిందనుకుంది నీరద.
"ఊరికే వచ్చాను."
"తోచకనా?"
"అవును, ఇహ పనిలేదుకదా?"
ఇహ పనిలేదంటే ప్రస్తుతం ఖాళీ, సాయంత్రం కాఫీ, టిఫెన్ సమయంవరకూ అనుకుంది నీరద.
"కూర్చో సీతా!"
సీత కూర్చుంది కుర్చీ లాక్కుని. ఏమీ మాట్లాడలేదు.
"నువ్వు చేసిన పని ఏం బాగుండలేదు సీతా!" ఉన్నట్లుండి అంది నీరద.
సీత అయోమయంగా చూపింది. నీరదకేమీ తెలియదు అనుకుంటున్నది. ఇప్పుడు ఏదో తెలుసుకుని నీరద కావాలని అన్నట్లువుంది. నీరద ఏం తెలుసుకుంది? ఎంతవరకు తెలుసుకున్నది? అన్నదే సీతకర్థంకాలేదు.
"నేరం నాదా?" అంది సీత ఇంకేమనాలో తోచక.
"కాదా?"
"కాదనే అభిప్రాయంలో వున్నాను. వివరంగా చెప్పండి అర్థమవుతుంది." అంది సీత. అసలు విషయం నీరద నోట్లోంచి లాగాలని అలా అంది.
"వ్యాసం నీవే చెప్పావు. అంతవరకురైటే! నీ పేరుతోరాసి పంపించింది నేను. పోటీలో వ్యాసం గెలిచింది నువ్వు వివరాలు యివ్వనన్నావు. ఏం చేయను? నువ్వు చెప్పినట్లే సీత నా పెన్ నేమ్ అంటూ ఎడిటర్ కి నా వివరాలు రాశాను. ఇదంతా నా ఫ్రెండ్స్ కి చెప్పాను. వాళ్ళంటారు సీత మీ ఇంట్లో వంటమనిషి, వంటమనిషి పేపర్లో ఎక్కటమేమిటని- నీవేకావాలని నీ వివరాలు ఇచ్చుకున్నావు- అంటూ గేలి చేశారు. నీవేచెప్పు నే కావాలని చేశానా? నువ్వు చెప్పబట్టేకదా నా పేరున పంపాను. తప్పు నా మీదకొచ్చింది." అంది నీరద బాధపడుతూ.
"అమ్మయ్య!" అనుకుంది సీత.
"తప్పు నీదీకాదు, నాదీకాదు. మీ ఫ్రెండ్స్ ది. జరిగిన నిజానిజాలు తెలుసుకోకుండా అనటమేనా? అసలువిషయం వాళ్ళకి రాలేదని కుళ్ళు వాస్యం ర్రాసింది మీరు. రైటింగ్ మీది కాకపోతే పేరు సీతాదేవి అని వుంది. కేరాఫ్ డాక్టరుగారి అడ్రసు వుంది. ఇప్పుడు ఏమయింది? సీతాదేవి పేరు నీరదయింది. రైటింగ్ అదే, అడ్రసు అదే, నిజంగా మీ మనసులో ఏమీ లేదు. కాబట్టే నాతోనూ, మీ ఫ్రెండ్స్ తూనూ వాస్తవం చెప్పారు. మనసులో కల్మషము, దుర్భుద్ది ఉన్నట్లయితే రెండోకంటికి తెలియకుండా సీత నా పెన్ నేమ్ అని ఎడిటర్ కి రాసి అందరితో నాకే బహుమతి వచ్చిందని చెప్పేవారు. అల్పులేప్పుడూ నిజాన్ని గ్రహించరు. అంత మాత్రాన న్యాయంగా వెళ్లేవారికి నిందరాదు, తగలదు. మీరు నిజాయితీ గానే ప్రవర్తించారు. ఎవరో ఏదో అన్నారని బాధ దేనికి, అనేవారు అల్పులు , పడేవారు పరమాత్ములు మీరెప్పుడూ వినలేదా?"
"సీతా!" ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అంది నీరద.
"ఏమిటి?"
"నిన్ను చూస్తుంటే ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉద్దండపిండంలాంటి లెక్చరర్ ఘాటుగా స్పీచ్ ఇచ్చినట్లు ఇస్తావు. అవతలి వాళ్ళు నోరు మెదపటానికి వుండదు. పెద్దచదువులు చదివినా నీలా మాట్లాడలేరు సీత!"
"ప్రయోజనం?"
"నేను దీనికి జవాబు చెప్పలేను. ప్రయోజనం గురించి చెప్పాలన్నా నువ్వే చెప్పగలవు, ఏదయినా నీవు చేయగలవు సీతా! ఆ నమ్మకం నాకుంది."
"ఏదయినా చేయగలవంటే, చాలా అర్థాలోస్తాయి." చిరునవ్వుతో అంది సీత.
"ఛా.....ఛా......మరో అర్థం తీయకు సీతా! నువ్వంటే నాకెంతో ప్రేమ. అది ఇలాంటిదీ అని కూడా చెప్పలేను. భావం రాదు, భాష తెలియదు. నీలా మాట్లాడగలిగితే ప్రేమకి అర్థం చెప్పేదాని."
"మంచిది. నాపై మంచి అభిప్రాయంవుంటే అంతేచాలు. అదే నే కోరేది" అంటూ సీత కుర్చీ మీదనుంచి లేచింది.
"అదేం, లేచావు? కూర్చో కాసేపు, వెళుదువుగాని." అంది నీరద.
"వెళ్ళటం తప్పనప్పుడు గంట కూర్చున్నా, అరగంట కూర్చున్నా ఒకటే!" నవ్వుతూ అని సీత బయటికొచ్చింది.
'ఏమిటో, ఈసీత మాటలు చాలా అర్థం కావు?' అనుకుంటూ నవలందుకుంది నీరద.
రాఘవేంద్రరావు గదిలోకి వెళ్ళింది సీత.
ఈజీ చెయిర్ లో కూర్చుని పళ్ళు కట్టుకుంటూ ఆలోచిస్తూన్న రాఘవేంద్రరావు సీతని చూడగానే లేచికూర్చున్నాడు. "సీ......సీతా!" అన్నాడు. సీత తన గదిలోకి వస్తుందని కలలోకూడా వూహించలేదు రాఘవేంద్రరావు. లోలోన తత్తరపడిపోతున్నాడు.
"నాపై మీకెటువంటి దురభిప్రాయం లేదుకదూ?" వస్తూనే అడిగింది సీత.
"అదేమిటి.....నాకేం లేదే? నాకు నువ్వంటే....అదే..... మంది అభిప్రాయమే వుంది." కంగారుపడి ఎలా అయితేనేం మాట పూర్తిచేశాడు రాఘవేంద్రరావు.
"మరి నే ఏది కోరితే అది తెచ్చిపెడతారా?" సీత అదోవిధంగా నవ్వుతూ అంది.
రాఘవేంద్రరావు పొంగిపోయాడు. "ఏమిటో చెప్పు. కొంపదీసి కోహినూర్ వజ్రం తెమ్మని ఆడగవుకదా?" అన్నాడు.
"ఉహూఁ! నాకు కావలసింది ఖరీదైన ఆకుపచ్చ రూబీ జాకిట్టు, చెవులకు రోల్డ్ గోల్డ్ కమ్మలు రంగురంగుల బొట్లువుండే పెట్టె ప్రస్తుతానికి అవి చాలు! అమ్మగారి దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత వాటిఖరీదు ఇస్తాను. తెచ్చిపెట్టండి, మీ దగ్గరుంటే ఓ యాభై ఇవ్వండి. ఏమీ అనుకోకపోతేనే ఇవ్వండి. మళ్ళీ ఇస్తా." అంది సీత.
"అమ్మమ్మమ్మ..... ఈ పిల్ల ఆరోజు నన్ను పురుగుని దులిపినట్లు దూలపరించింది. ఇవాళ లొంగి వచ్చింది. డబ్బులేనివాళ్లు లొంగక చస్తారా? ఊఁ......ఇప్పుడు దీన్ని మంచిగా దగ్గరకు తీసుకుంటే, రెండు వారాల్లో పూర్తిగా నా స్వాదీనం అవుతుంది.' అనుకున్నాడు రాఘవేంద్రరావు. "అలాగే సీత! నువ్వు కోరాలిగాని వెంటనే తీసుకురానూ! యాభై రూపాయల చిల్లర నోట్లులేవు. వంద రూపాయల కాగితముంది ఇస్తాను. ఫరవాలేదు. వుంచుకో." అంటూ ఈజీ చెయిర్ లోంచి లేచాడు.
"ఉహూఁ....ఉంచుకోను బాబూ! మళ్లీ ఇచ్చేస్తాను." ముద్దుగా అంది సీత.
గట్టిగా బలవంతం చేస్తే మొదటికే మోసం వస్తుందని "సరి.....సరి....నీ ఇష్టం. బలవంతం ఏమీ చేయను. నువ్వెలా చెపితే అలా." అని వందరూపాయల నోటు తీసి ఇచ్చాడు. మరోసారి సీతకి కావలసినవి అడిగి కనుక్కున్నాడు.
సీత ముసిముసి నవ్వులు చిలకరించి వంద రూపాయల నోటుతో గదిలోంచి బయటికొచ్చింది.
ఈదపా సీత- శాంతకుమారి గదిలోకి వెళ్ళింది.
శాంతకుమారి, సీత కాసేపు కాలక్షేపం కబుర్లు చెప్పుకున్నారు. సీత పనిగట్టుకు తన గదిలోకి ఎందుకొచ్చిందో శాంతకుమారికి అర్థం కాలేదు. ఓ అరగంట తర్వాత సీత టిఫెన్ వేళయిందంటూ ఇవతలి కొచ్చేసింది రోజులు.....నెలలు.... సంవత్సరాలు....పోరాడగా కాలేదు, లక్షల సంఖ్యలో వీరులు విప్లవపోరాటంలో ఏళ్ళతరబడి ప్రాణాలకి లెక్కచేయక రక్తం ధారపోయగా, వాళ్ళలో మార్పు వచ్చి మనలో మహాత్ములు ఉదయించి విజయం సాధించాము. అలాగే, ఈ చీడపురుగులాంటి వేశ్యావృత్తి సర్వనాశనం కావాలంటే మగాళ్ళలో మార్పువచ్చి స్త్రీలు విజయం సాధించాలంటే చంపటమో? చావటమో? విజయమో? వీరమరణమో? ముందుగా పతనమయ్యే లేక పతనమైన ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. స్త్రీలందరిదీ ఒకే మాట, ఒకే బాటగా వుండాలి. మీలాంటివారు దీనిలో సౌఖ్యం వుందని వంచన చేసుకుంటూ పడుంటే, అందమైన పెళ్ళాలున్నవాళ్ళు, అనుకూల వతి అయిన భార్య వున్నవాళ్లు పెళ్ళాన్ని ఏడుస్తూవుండమని మీవద్దకొచ్చి పోతూనే వుంటారు. ఓసారి లొంగితే ఒకటా? రెండుసార్లు లొంగితే ఒకటా? అని మీరు లొంగిపోతూనే వుంటారు.