Previous Page Next Page 
కదానాయికి పేజి 4

                                                                                 2

     నలువైపులీ చీకట్లు బాగా అలుముకున్నాయి.

     వరండాలో కుర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ అర్దనీలిమనేత్రుడై గుఫ్ గుఫ్ మని చుట్టపీలుస్తున్నాడు రామభద్రయ్య.

    వీధివాకిలివైపుచూస్తూ లోలోపల అనుకోబోయి  పైకి అంది సుభద్రమ్మ." ఇందికా రాలేదేం చెప్మా?"అని.

    ఎవరో పిలిచినట్లయి 'ఆ!'అన్నాడు  రామభద్రయ్య.

     " అమ్మాయి రాలేదు,అలా వెళ్ళిచూసొస్తారేమిటి?"

    "వస్తుంది లెద్దూ, దాని కలవాటేగా రావటం" నిర్లక్ష్యంగా అన్నాడు. రామభద్రయ్య.

     "మీకు  ఒకదానిలో తొందరవుంది కాబట్టి,ఇహ నే చెప్పేదానిలో వుంటుందా? అన్నీ  నాకు కావాలి. దాని సంగతి మీకు పట్టదు.

    "తల్లివి కదుటే!"

    రమభద్రయ్య నోరు  విప్పితె వ్యంగ్యము, హేళన తప్పఓ మంచి అర్ధము వుండవని సుభద్రమ్మ నమ్మకం.విసుక్కోవాలిసిందేకాని గట్టిగా మాట్లాడి ఎదురు తిరగదు ప్రయోజనం  లేదని ఏనాడో గ్రహించింది అనుభవంమీద. " తల్లిని కదుటే!" అని భర్త అన్నదానికి మూతి తిప్పింవూరుకుంది.

     "అదుగో వచ్చింది. పెద్ద తల్లి!" గుమ్మం దాటి లోపల అడుగు  పెడుతున్న అనుపమను చూచి అన్నాడు రామభద్రయ్య.

     అనుపమ పుట్టినప్పుడు సుభద్రమ్మ ఎన్ని పేర్లో అనుకుంది. "సీత" సీవిత్రి , సుమతి" పతివ్రతల పేర్లు పెడదామని . రామభద్రయ ఒక్కటీ పడనివ్వలేదు. పుట్టినివ్వలేదు. పుట్టిన ఘడియల పట్టి అ. న.ప. మ.అక్షరాలు చేర్చి పేరు పెడితే అమ్మాయి జాతకరీత్యా ఓ వెలుగు వెలుగుతుందని నమ్మి"అనుపమ"అని నామకరణం చేశాడు. కాని.... ఏనాడూ అనుపమా అని పిలిచి ఎరుగడు " పెద్ద తల్లి!" అంటాడు సుభద్రమ్మ మట్టుకు "పెద్దమ్మాయా!" అంటుంది.   

     "పెద్దమ్మాయీ! ఇప్పుడటే ఇంటి మెహం చూడటం... ? ఎంత చీకటి పడిందో తెలుసా?" అంది మందలింపుగా సుభద్రమ్మ.   

     "చీకటి నీకూ నాకూ అనుభవం. పెద్దతల్లి కంతా చీకటే కదే!" అన్నాడు రామభద్రయ్య తన మామూలు ధోరణిలో.

     సుభద్రమ్మ మనసు చివుక్కుమంది.

     అరుగుమీద కూర్చుని సూన్యంలోకి చూస్తూ రెప్పలు ఆర్పుతున్న అనుపమను చూచి" అన్నం తింటావా , పెద్దమ్మాయి!" అంది సుభద్రమ్మ.

    "చెల్లాయిలు తమ్ముడు తినేటప్పుడు తింటాను. వాళ్ళింకా  ఇంటికి రాలేదా?" అంది అనుపమ.

    "వస్తారు ఆటల్లోపడితే ఇల్లు తెలియదుతల్లి " విసుక్కుంది సుభద్రమ్మ.

    అనుపమను చూచినప్పడల్లా సుభద్రమ్మా హృదయం తరుక్కుపోతుంది. అసమాన సౌందర్యంతో తన పేగులను చీల్చుకు  బైటపడ్డ పశిబిడ్డను చూచి ఏతల్లీ పడని ఆనందం, ఏ తల్లీ పొందని తృప్తి  పడింది. ఆ నిమిషాన  అనుపమకు ఆల్చిప్పలంత కళ్ళయితే వున్నాయి గాని, అవి అందానికే తప్ప అవసరానికి ఉపయోగపడవనితెలిసిన క్షణాన తల నెలకేసి కొట్టుకుంది. ఆత్మహత్య పూనుకుంది. ప్రయత్నం విఫలమైంది.

     అనుపమ తర్వాత  ఇద్దరు ఆడపిల్లలు ,ఒక మగపిల్లపవాడువుంటారు. పిల్లలకి  రూపం లేకపోయినా చూపువుంది."

    తొలిచూలు .ఆడపిల్ల మహాలక్ష్మిలా, ఇంట వెలిసింది. ఆడపిల్లకు అందం చూడటానికి ముచ్చటగావున్నా ఆ అందం శతృవులాంటిది. అందమైన ఆడపిల్ల పుట్టందురాలయితే ఈ జీవని భగవంతుడు కనిపెట్టివుండాల్సిందే.

     సుభద్రమ్మ అనుపమ భారం దైవంమీద  వేసింది. అయినా అందంతో ఆరోగ్యంతో ,పుట్టింతర్వాత జలుబు చేసికూడా ఎరగక మిసమిస లాడుతూ రోజు రోజుకి ఎదుగుతున్న కూతురిని చూస్తుంటే సుభద్రమ్మ మనసు " పీచు పీచు"మంటున్నది.

     అనుపమ ఉదయం స్నాం చేస్తుంటే చూచింది. సుభద్రమ్మ కూతురి రొమ్ముకట్టు చూచి ఉలిక్కిపడింది. పన్నెండు నిండుతూనే పెద్దమనిషి కావటం. ఇంటి  ఆనవాయితీ , మరో ఏడాది, ఎంతతో వస్తుంది? అనుపమ పెద్దమనిషి అవుతుంది. ముందేం జరగనుంది భగవంతుడా! అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

     సుభద్రమ్మ బాధ  ఒకళ్ళు తీసెయ్యతగ్గది కాదు.  ఆమె మరచిపోయేది కాదు.

     రామభద్రయ్య తన్మయానందంతో చుట్ట పీలుస్తూ కళ్ళు తెరుచుకొని కలలు కంటున్నాడు.

     సుభద్రమ్మ, కూతురు స్నానం చేస్తున్న రూపం గుర్తుకు రాగా అనుపమ చూస్తూ ఆలోచిస్తున్నది. "తనేం పాపం చేసిదంని ఆడపిల్ల కు చూపులేకుండా ప్రసాదించాడు దేముడు? ఆడదానికుండే అవస్తలు, మొగవాడికి వుండవు. అనుపమని మొగవాడినన్నా చేశాడా? మాయదారి దేముడు......

    తల్లి తండ్రి ఎవరికి వారు మౌనంగా వుండటం గ్రహించింది అనుపమ.

     "అమ్మ!తమ్ముడు చెల్లాయిలు రాలేదా?" అంది.

 Previous Page Next Page