ఈ మధ్య ఇప్పటికే పులి మూలంగా ముగ్గురు యువతులు ప్రాణాలను కోల్పోయారు.
కుదుపుల మధ్య వాస్థవంలోకి వచ్చిన చైతన్య జీఫ్ ను స్లో చేసిసమతలంగా నున్న సన్నని బాటలో నడుపుతూ ఎందరో ఆర్తుల కన్నీళ్ళతో తడిసిన మరుభూమిలాంటి అరణ్యానిల పరిశీలిస్తున్నాడు.
రాష్ట్రంలోని లక్షల హేక్తర్లా వైశాల్యంలో వున్న అడవుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన అరణ్యమది.....
గతుకులు ... ముళ్ళ డొంకల పైసాగినజీపు మరో పదిహేను నిముషాల్లో 'కూనం' గూడెం చేరుకుంది.
వందకి మించి వుండని గుడిసెలమధ్య అప్పటికే సాయుథూలైనపోలీసులు వున్నారు.
ఆగిన జీఫ్ ను చూస్తూ గూడెంలోకి గిరిజనుల పిల్లలు ఉత్సుకతగా ముందుకు వచ్చారు....
"ఐయామ్ రమాకాంత్ " చైతన్యకి తనను తాను పరిచయం చేసుకున్న యస్సైరమాకాంత్ అతడికి సమీపంలో నుంచున్న మృత్యురాజును పరిచయం చేశాడు.
"మీరు నిన్ననే వస్తున్నట్టు తెలిసింది."
జవాబు చైతన్య అప్పుడు చూశాడు. అక్కడ ఓ గుడిసే పులి తినగా మిగిలిన రెండు పీలికలైన కళేబరాలు..... సమీపంలో కూర్చున్న ఓ వృద్ధుడు నిశ్సబ్దంగా శవాల్ని.... నిజానికి అవి శవాలుకావు.... పులితినగా మిగిలిన రెండుపీలికలైన కళేబరాలు సమీపంలో కూర్చున్న ఓ వృద్ధుడు నిశ్సబ్దంగా శవాల్ని చూస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.
వేటలో అపారమైన అనుభవంగల చైతన్య ఇద్దరూ పులివాతబడిప్రాణా;లు కోల్పోయిన త్తునిర్దారణ చేసుకుంటూ అన్నాడు. "శవాల్ని అడవిలో నుంచి తరలించాల్సింది కాదు రమాకాంత్ గారూ!"
"కానీ మేం వచ్చేసరికి గూడెం పెద్దగా మ్రుత్యురాజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు...."
"అవును... దొరా పాతికమంది కుర్రాళ్ళని పంపి రెండుశవాల్ని వెదికించాను." మృతిరాజుఅన్నాడు.
అలా మీ మనుగుడకి ప్రమాదకరంగా మరిన ఓ క్రూరమృగాన్ని రక్షించారు." టక్కున అన్నాడు చైతన్య రెప్పలార్చకుండా తననే గమనిస్తున్న మృత్యురాజుతో "అవును మృత్యురాజుగారూ..... నేనీ అడవిలో అడుగుపెట్టిందిమీ కందరికీ పాణసంకటంగా మారిన పులిని ఎదుర్కోవాలని. ఇలా శవాల్ని తరలిస్తే పులికోసం నేను మాటేసే అవకాశం జారిపోతుంది."
"కాని మేం మార్పురీకి పంపాలి" రమాకాంత్ అన్నాడు.
"నేను ఫర్మాలిటీస్ గురించి మాట్లాడంలేదు యస్సై గారూ తను చంపిన వ్యక్తులని దాచుకుని కనీసం మూడుగంటలపాటుఆహారం కోసం ఆ పరిసరాలలోనే తిరిగే మేనీటర్ ఉనికి ఏ హంటరైనా తెలుసుకావాలీ అంటే శవాలు అది దాచిన చోటనే వుంచాలి."
కొన్ని క్షణాలపాటు నిశ్సబ్దంగా వుండిపోయాడు. రమాకాంత్.... "అంటే శవాలు లేకుండా పులిని ఎదుర్కొనడం కష్టమంటారా?"
"యస్ శవం లేకుండా అటాప్సీ ఎలా సాధ్యంకాదో పులి వాతబడినమనిషి శవం లేకుండా దాని ఉనికిని గుర్తుంచడమూ సాధ్యం కాదు. "సో.... "మృత్యురాజుని చూస్తూ మీరు నాకు సహకరిస్తే నేను వచ్చిన పని సులభమవుతుంది."
"అదేమిటి దొరా" జీలుగు కల్లు అప్పటికే తాగివున్నాడేమో మృత్యురాజు గొంతులో అవహేళన ద్వనించింది. "మీరు సెప్పారు కాబట్టి సచ్చినోళ్ళ శవాలు ఆడనే వదిలి మమ్మల్ని కూసోమంటారా....?'
"నా ఉద్దేశ్యం అదికాదు..... ఎటువంటి అవాంచనీయమైనాసంఘటన జరిగినా ముందు నాకు తెలియచేయమంటున్నాను...."
తోడేలులా నవ్వాడు బుగాతా. చురుక్కుమన్నా తమాయించుకున్నాడు చైతన్య. అడవుల్లో గిరిజనలకి నయుకుల్లా నటించే ఈ బుగతాలు గిరజనుల జీవితాలతో యోలా అడుకునేది, వారి కష్టాల్ని దోచుకుని ప్రభుత్వపథకాలు వారికీ అందకుండా దళారీల్లా యెలా వ్యవహరించేది అతడికి తేలీనది కాదు.
అయితే... ఇక్కడ జరిగేదేదైనా తమరికి సెప్పమంటారు."
"తప్పదు... మీకు మంచి జరగాలి అంటే ఈ బాధ్యతనిమీరు తీసుకోవాలి"
"లేదూ అనుకోండి..."
"పులి మూలంగానే కాదు, న పరంగా కూడా మీకు కొన్నిఇబ్బందులు ఎదురుకావచ్చు" హెచ్చరికాలా అన్నాడు చైతన్య.
"నేను ఈ చుట్టూపక్కలగూడేలకి పెద్దని"
"నేను ఈ అడవిని సంరక్షించేఅధికారిని "
"మాకేటి నష్టం "
"మీరు. మీ గిరిజనలూ బ్రతుకుతున్నది అడవులపై ఆధారపడి"
"అంచేత" మృత్యురాజు కళ్ళల్లోఎరుపు జీరలు చోటుచేసుకున్నాయి. తన వాళ్ళముందే తానిలా నిలదీయటానికి అంగీకరించలేక పోతున్నాడు...." అంచేత ఇక్కడేధన్నా మీ మాట పెకారం జరగాలంటారు."
"జరిగితే అది మీకే మంచి అవుతుంది"
"కాదంటే....."
"మీరు కప్పుకున్న జింక చర్మం చాలు మిమ్మల్ని అరెస్ట్ చేయించడానికి...."
అవాక్కయి చూస్తున్నాడు మృత్యురాజు.
"సో.... " మృదువుగా అన్నాడు చైతన్య. "రేపటి సంగతి వదిలేద్దాం.... ముందు ఈ శవాలు రెండూ ఎక్కడినుంచి తీసుకురాబడ్డాయోచూపిస్తే చాలా సహకరించిన వారవుతారు."
"ఈ అడవిలో వాల్మీకులు, సామంతులు, సవరలు, కొనులులాంటి తెగరేకాక ఒకనటిఆటవిక స్థాయినుంచిఇంకా ఎదగని ఖాసియోలాంటి అతి ప్రమాదకరమైన జాతులవాళ్ళు వున్నారంటరంతా..." నెమ్మదిగా వెళుతున్న జీపులో చైతన్య ప్రక్కన కూర్చున్న రమాకాంత్ చెబుతుంటే సాలోచనగా వింటున్నాడు.