Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 19

 

    "ఏమైంది?" చాలావరకు అర్ధమైనా ఉద్వేగంగా అడిగింది ప్రీతి
   
    చైతన్య తేరుకోవటానికి అరనిముశం పట్టింది.
   
    వాస్తవాన్ని స్పష్టంగా తెలియచెపితే ఆమె ఎంత కంగారుపడేది అర్దమైనట్టు మందహాసంచేస్తూ అన్నాడు.
   
    "మరేంలేదు.ఫోన్ రింగైమంచి సన్నివేశం కట్ అయింది బస్....."
   
    ప్రీతి రెప్పవాల్చకుండాచూస్తుంటే గది బయటకి నడవబోయాడు.
   
    అక్కడ అనసూయ నిలబడివుందిఅంతా అర్దమైనట్లుగా.
   
                     *    *    *    *
   
    తెల్లవారుతుండగా నిద్రలేచిన చైతన్యతన సమీపంలోనే కూర్చుని వున్న ప్రీతిని చూసి అవక్కయిపోయాడు.
   
    "హాయ్.... ఎంతసేపయింది వచ్చి.... నిన్నే..."
   
    ప్రీతి తల పైకెత్తాడు.నీళ్ళు నిండిన కళ్ళతో క్షణం చూసిన ప్రీతి నెమ్మదిగా వెళ్లబోతుంటే అమాంత చేయి పట్టుకున్నాడు.
   
    "ఏయ్ ఏమిటా కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం . నన్ను పంపేది ఇలా గేనా?"
   
    తలవంచుకుని నిలబడింది అలాగే.
   
    "యస్ మిస్ ప్రీతి అసలు సైకలిజిస్ట్ లేమంటారో తెలుసా?"
   
    అతడు వాతావరణాన్నితేలికపరచడానికి టాఫిక్ మళ్ళించబోతున్న విషయం గ్రహించిందేమో "ఇక కధలు చెప్పకండి అంది.
   
    "కధకాదు ప్రీతి... అసలు ప్రేమంటే  వున్నదున్నట్టు ఒకరి నొకరు ఇష్టపడే టోటల్ ఎక్స్ ఫ్టేన్స్ . అంటే నేనేం చేసినా నువ్వు అంగీకరించడం లాంటిదన్నమాట. లేదూ అనుకోఅది కండిషనల్ ఎక్స్ ప్టేన్స్ . అనిపించుకుంటుంది. అసలు ప్రేమికుల మధ్య.....
   
    "ప్లీజ్ స్టాఫ్. మిమ్మల్ని అర్జంటుగా ప్రేమకి డెఫినిషన్ చెప్పామనడంలేదు."
   
    "పోనీ పెళ్ళి దాంపత్యం గురించి చెబుతాను. ఉదహరణకి మనం ఇప్పటికే భార్యాభర్తలమనుకో..... నన్ను చెప్పనీయ్ ...  ఇన్ ఏ 'కపుల్' వెన్ ఒన్ పార్టీ యీజ్ రివార్దేడ్ దట్ పార్టీ యీజ్ సర్వెంట్ అండ్ ద అదర్ మాస్టర్. దాంపత్యంలో ఇదికూడా సరైన పద్దతి కాదని....." ఠక్కున ఆగిపోయాడు. క్రమంగా ఉద్రుతమవుతున్న ప్రీతి కన్నీళ్ళను చూస్తూ. "ప్రీతి ప్లీజ్...."
   
    "మీరు వెళ్ళొద్దు"పాడేరు అడవుల్లో క్షణంక్షణం ప్రాణగండంలో చైతన్య గడిపిన గుర్తుకొచ్చాయి.
   
    "ఈ అసైన్ మెంట్ మరెవరికైయినా అప్పచెప్పమనండి."
   
    "లేదమ్మా" వినిపించింది అనసూయ కంఠం.
   
    "వాడ్ని వెళ్ళనీయ్ జీవితాన్ని యధాతథంగా అంగీకరించలేని స్థితిలో నేనూ ఇలాగె ఒకనాడు అందోళన పడ్డాను కదూ...... ఏమైంది. నా బిడ్డ సమ్రతను కోల్పోయాను. అక్కడే రాటుదేలిపోయనమ్మా ఒక మారణకాండలో అన్నయ్యకోసమే బలయిన నమ్రత ఆత్మ, సైతం ఇప్పుడు ఏ స్మృతుల శకలాలో మరింత నీటి తుంపర్లను చిమ్ముతుంటే స్థిరంగా అంది.
   
    ఆమె అందరిలాంటిఆడదే అయినా బలిదానంతోచాలా అరుదైన స్థానానికి ఎదిగింది ఒకనాడు భర్తను యుద్దంలో __ కూతుర్ని ప్రత్యర్ధుల పోరాటంలో పోగొట్టుకుంది. ఎందరి ఆర్తుల కన్నీళ్ళలో తుడివాలనితన కళ్ళను కన్నీటి కోనేటిగా మార్చుకుంది.
   
    బయలుదేరుతూ హాలు మధ్య వున్న నమ్రత ఫోటో దగ్గరికొచ్చాడు. అడవి మధ్యలో ప్రత్యర్ధుల పోరాటంలో చిక్కుకుని కడతేరిపోయిన చెల్లి అంత్యక్రియులకు సైత రాలేని నిస్సహాయుడిగా ఎన్నిరోజులు వ్యధ చెందాడని.
   
    "అమ్మా నమ్రతా......నిన్నకాక మొన్నటి నీ నవ్వులు ఇంకా ఇలాంటి గోడల్లో ప్రతిధ్వనిస్తూనీ ఉనికిని గుర్తుచేస్తూనేవున్నన్నమ్మా. నువ్వు లేవు.... కానీ నీ స్మృతులు అస్థికలు ఆగని నా కన్నీటి జీవనంలో కలసి ఇంక పదిలంగా దాచుకునే బ్రతుకుతున్నాను. నువ్వు నింగిలో నక్షత్రారానివే అయ్యవో లేక పలకని ఉల్కాలా రాలి ఇంక ఈనేలపైనే సంచరింస్తున్నావో కానీ.... బ్రతుకు ఆశను బ్రతికుండగానేగంగలో నిమజ్జనం చేసుకున్న అమ్మ నిబ్బరాన్ని  మాత్రం సడలనివ్వను.
   
    "వెళ్ళిరానా చెల్లి ."
   
    చైతన్య కదిలాడు.
   
    జీపులో వెళుతున్న చైతన్య ఇప్పుడు ప్రత్యూష పవనంలా లేడు.
   
    మరికొన్ని గంటల్లో పగిలే ప్రళయ ప్రపంజనంలా వున్నాడు.
   
    అలసట ఎరుగని ప్రయాణమది.
   
    మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తున్నా వారధిలేని చైతన్య.
   
    నూట ఏభై కీలోమీటర్ల దూరాన్ని మూడు గంటల వ్యవధిలో అధగమించిన చైతన్య దుర్గమారణ్యంలోకి జీపును మళ్ళించింది. కొన్ని నిముషాల క్రితమే. పరిచయంలేని అడవికి వెళుతున్న చైతన్య ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లోని మనుషుల సహాయం తీసుకోలేదు. అతడ్ని గైడ్ చేస్తున్నది జీపులో వున్న 'మేఫ్" మాత్రమే.
   
    అప్పుడే మొదలయిన అడవిగాలిరుద్రా హస్త స్పర్శాభివ్యక్త ఢమరుద్వానంలా ఉదృతమవుతుంది.
   
    ఇసుక బాటపై ధూళిమేఘాల్లా పైకి లేస్తుంది.
   
    బాటకిరుప్రక్కలావున్న పచ్చని చెట్లు మృత్యు ప్రాగణంలోని మామిడాకుల్లాకనిపిస్తున్నాయి.
   
    ఉషస్సును పిండకు తాగుతున్న గుట్టలు మొన్న భస్మమైన అరల్లోంనుంచి ఈరోజు పుట్టుకొచ్చినరణల్లా ప్రాణాల్లా వున్నాయి.
   
    భయంకరమైన లోయలమధ్య ఘాట్ రోడ్ పై జీఫ్ ను నడుపుతూ ఆలోచిస్తున్నాడు చైతన్య,
   
    కొన్ని నెలలుగా గిరిజన యువతులు అద్రుశ్యమవుతున్నారు. వాళ్ళకి చెందిన రెండు శవాలు ఈ మధ్య లభ్యమైనా ఏ క్రూరమృగం మూలంగా నీరు చచ్చిపోయిందనీ నిర్దారణ కాలేదు.
   
    సినీ నటి విజయ అంతార్దానమైపోయింది.
   
    ఫారెస్ట్ రేంజర్ జగన్నాథం ఏమైందీ ఇంతవరకూ తెలీదు.

 Previous Page Next Page