"ప్రమాదకరమంటే..."
"నాగరికులు కనిపించగానే శత్రువులుగా భావించే ఖాసియా తెగవాళ్ళు విషపూరితమైన బాణాలతో తీస్తారట. మరో విచిత్రమేమిటంటే చంపినా తర్వాత ఆ శవాన్ని ఈడ్చుకుపోయి గూడెంలో వాళ్ళంతా నంచుకుతింటారట ఇదంతా చేసేది స్రీలని, ఇప్పటికి అక్కడ మాత్రుస్వామివ్యవస్థే కొనసాగుతూందని, మగాళ్ళు యింటిపనులు చేస్తుంటారని మృత్యురాజు చెప్పాడు...."
"అంటే వాళ్ళు ఈ అడవిలో ఎక్కాడున్నదీ మృత్యురాజుకి తెలుసా?"
"స్పష్టంగా చెప్పలేకపోయాడు. కానీ వాయువ్య దిశలో వున్న ఆ పర్వత పంక్తులకి ఆవల వుండొచ్చు అంటాడు. ఇక్కడ గిరిజనుల సైతం వాళ్ళంటే చాలా భయపడుతుంటారట!"
నిశ్సబ్దంగా వింటున్నాడు చైతన్య.
ఖాసియో తేగల గురించి సోషల్ ఏంత్రపాలజీలో చైతన్య చదివాడు. అండమాన్ నికోబార్ ఐలేండ్స్ లోనే కాక ఒరిస్సా ఇంటీరియల్ఫారెస్ట్ లో అలాంటి తెగలున్నట్టు తెలుసు గానీ ఈ అరణ్యంలో ఉన్నా రనడం చైతన్యకి న్యూస్....
"మొత్తానికి మృత్యురాజుకి చాలా అద్భుతంగా టేకిల్ చేశారు." జీపు సింధూర చెట్ల మధ్యనుంచి ఏటవాలుగా వున్న మట్టిరోడ్డుపై వెళ్తుండగా అన్నాడు రమాకాంత్! "రెండేళ్ళు క్రితం రంపచోడవరానికి ట్రాన్స్ ఫరై వచ్చిన నాకు ఈ ఏజెన్సీ ప్రాతం బాగా పరిచయం చైతన్యగారూ! గిరిజనులు నాగరికుల్ని చూసి ఏంట భయపడుతుంటారో మృత్యురాజు లాంటి గిరిజన పెద్దలు అంత స్వాతిశయాన్ని ప్రదర్శింస్తుంటారు.కాబట్టే తప్పిపోతున్న గిరిజన యువతుల విషయంలో ఎక్కువ వివరాల్ని రాబట్టిలేకపోయాను అన్నిటికన్న విచిత్రం ప్రత్యేకించి కన్నెపిల్లల్లే మిస్ కావడం...."
తను ప్రస్తుతం ప్రయాణిస్తున్నది ప్రమాదకరమైన జోన్ అన్న విషయాన్ని మరచిపొని చైతన్య ఎత్తుగా ఎదిగిన రెల్లు పొదలూ, బాటకిపాతిక అడుగుల దూరంలోని డేగిశ చెట్లని గమనిస్తూఅన్నడు. "ఇన్ వేస్ట్ గేషన్ లో ఏమున్నా తెలుసుకోవాలిరా?"
"లేదు చైతన్యగారూ....ఇప్పటికి మిస్సయ్యింది వందకువున్నా, ఈ మధ్య రెండు శవాలు మాత్రం దిరికాయి.కానీ మేం ఇక్కడకు రాకముందే అంత్యక్రియలు పూర్తీచేసేసారు ఇప్పటికే అదృశ్యంగా తిరిగే భూతమో లేక మరో తెలీని మృగమో వీళ్ళని ఎత్తుకుపోతూందన్నది ఇక్కడివాళ్ళ నమ్మకం......"
"ఇలాంటి అనుభవాలు నాకు కొత్తకాదు మిస్టర్ రమాకాంత్ .... నిరక్షరాస్యత తరతరాలుగా పట్టి పీడిస్తున్న మౌధ్యం వాళ్ళ ఆలోచనా సరళిపై అసాధారణమైన ప్రభావాన్ని చూపి నగరికామిన లేదా హేతుబద్దమైనా వాదంపై అవహేళన ప్రకటిస్తూనే వుంటుంది. ఆ నమ్మకాలని చాలా జాగ్రత్తగా కాపాడుతుంటారీ మృత్యురాజులాంటి పెద్దలు" విశ్లేషిస్తూ చెప్పుకుపోయిన చైతన్య ఎత్తైన గుట్ట అంచున జీపుని పోనిస్తూ అడవిని కలయచూశాడు.
ఇప్పుడిప్పుడే చాలా ప్రాచుర్యాన్ని పొందుతున్న దుర్గమారణ్యం లోని అడవిపూల సౌరభం పచ్చని పకృతిలో నుంచి నివసిచ్చే పక్షుల కిలకిలారావాలు ఆహ్లాదకరంగా లేవు.
ఉత్తరాన సూర్యకిరణాలు సైతం నేలని తాకే అవకాశవివ్వనట్లు గుబురుగా వున్న మద్దిచెట్లు దక్షిణాన విశాలమైన పచ్చిక బయళ్ళతో బాటు వున్న వేడుకుతోట సమీపంలో తూర్పున సుమారు ముప్ఫై అడుగుల పోడవున్న వెదురుతోట సమీపంలో చీలిన కొండ అక్కడినుంచి విస్తరించిన పర్వత పంక్తులు చెట్లు, చేనులూ ఎన్ని అనర్దాలైన సజావుగా సాగటానికి సకకరించేటట్టున్నాయి.
వేరాడబడాల్సిన క్రూరమృగాలికి తప్ప వేటుగాళ్ళకిఅనుకూలంగా లేని దట్టంగా వున్న అరణ్యమది.
సరిగ్గా అప్పుడు వినిపించిందో కణుసు కేక.
వెనువెంటనే మద్దిచెట్లపైనుంచి ఓ కుంజు కంగారుగా పైకి తేలింది. చెవులు రిక్కించిన చైతన్య జీఫ్ స్లో చేశాడు.
పులిలాంటి పెద్దజంతువుఉనికిని సృష్టంచేసే సంకేతాలవి.
రమాకాంత్ కిదంతా ఏమిటో అర్దంకాలేదు. ఇందాక గిరిజన యువకుడు చైతన్యతో చెప్పిన ప్రమాదస్థలం ఇదికాదు. మరో పర్లాంగుముందుకు వెళ్ళాలి.
రమాకాంత్ అదే చెప్పాబోతుండగా జీన్ ని టక్కున ఆపిన చైతన్య వేగంగా క్రిందకి డిగి మాటాడవద్దన్నట్టుసంజ్ఞ చేశాడు.
ఈశాన్య దిక్కున వున్న విప్పతోటలోకి నడవబోతూక్షణం ఆగి జీపులో రైఫిలు అందుకున్నాడు.
రమాకాంత్ నిశ్సబ్దంగా గమనిస్తున్నాదంతా.
దూరంగా ముళ్ళకంచేపై రక్తంతో తడిసిన ఓ చీరపీలిక కనిపిచింది.
అక్కడిదాకా చప్పుడు గుర్తించే 'ట్రాకింగ్' లో అసాధారణ ప్రజ్ఞ గల చైతన్య జాడల్ని చూస్తూ పదిహేను అడుగుల ముందుకు నడిచాడు.
ఓ చోట నేలపై పచ్చిక ఒరిగి వుంది పులి కళేబరాన్ని ఈడ్చుకు వెళ్ళిన గుర్తుగా... ఆ తర్వాత చదనుగావున్న రాతినేల, దానిపై ఎండిపోయిన రక్తపు బోట్లు..... మరికొంతదూరం వెళ్ళిన చైతన్య టక్కున ఆగిపోయాడు దిగువున వున్న గోతుని చూస్తూ.
విప్పతోట ప్రారంభమైంది ఆ గోతి అంచునుంటే... లోపలికి అడుగుపెట్టెవాడే కాని, తోట దట్టంగా వుండటంతో సూర్యరశ్మిపాదాలుగా నేలపై పడుతోంద. అనుభవమున్న వేటగాడు సైతం పోరపడేది ఆ స్థితి లోనే. ఒంటిపై దరలున్న పులి ఆ తోటలో వున్నా గుర్తించడం చాలా కష్టం.
"కౌఖోక్రో...." నిశ్శబ్దం చెదిరేలా వినిపించింది లంగూర్ కేక.
విప్పతోటలోనే ఓ తీతువు ఆర్తనాదం చేసింది.
ఉన్నట్టుండి ఆ ప్రాతంలో సంచలనం ఉదృత కాసాగింది.
చెవులు రిక్కించి విన్నాడు ప్రతిస్తబ్దాన్ని.