Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 18

 

    "పిచ్చినాన్నా" కొడుకు చెంపల్ని చేతుల్లోకి తీసుకుని ఆర్తిగా చూసింది "వెళ్తానమ్మా ఒక్క మాట చెబితే చాలదూ. ఈ డొంకతిరుగుడు అంతా ఏమిటి."
   
    "డొంకలూ, పొదలూ కాక అడవుల్లో తొరిగే మనిషికి......"ప్రీతి అంటోంది అక్కసుగా "సూటిగా చెప్పడం మీ అబ్బాయికి చేతనవుతుందా అత్తయ్యా."
   
    "అమ్మా..... ఈ అమ్మాయీ ఇక్కడే వుంటుందా" అంతదాకా చూడనట్టు అన్నాడు పళ్ళు బిగించి.
   
    "నీకు పెళ్ళయితే ఇక్కడ కోడలుగా వుండేది. కాలేదు కాబట్టి తోడుగా వుంటోంది.
   
    "అంటే నేను చేజారిపోకుండారోజు నిన్ను కాకా పడుతుందన్న మాట."
   
    "వ్వె వ్వె వ్వె" వెక్కిరిస్తూ గదిలోకి వెళ్ళిపోయింది.
   
    "సరే రా.... తొందరగా స్నానంచేసి భోజనానికి సిద్డంకా" కూతురు నమ్రత పోయి ఇంకా ఏడాది కాకపోవడంతోఆ శుభకకార్యాన్ని యిలా పోస్ట్ ఫోన్ చేస్తుందామె.
   
    ఇద్దరికీ ఏకాంతంగా మాటాడుకునే అవకాశ మివ్వాలన్నట్టు వంట గదివేపు నడిచింది.
   
    ఒక్కామ్గలో ప్రీతి వున్న అగ్దిలోకి చొచ్చుకు పోయాడు. చైతన్య ఇలాంటి చైతన్యాన్ని ప్రదర్శించేది తల్లి దగ్గర, ప్రీతి సమక్షంలో మాత్రమే. బయట గంభీరంగా వుండే చైతన్యలో యిలాంటి ప్రవర్తన ఎవరి వూహక్లి అందనది.
   
    "వచ్చేముందు ఫోన్ చేయుచ్చుగా" నిష్టూరంగా అంది! అతడ్నల్లుకు పోయి.
   
    " ప్రిపేర్ చేస్తే థ్రిల్ వుండదని"
   
    "వదలండి"
   
    "బెడ్ రూమ్ లోకి పోదామా."
   
    "దేనికి."
   
    "ఓపని అయిపోయినట్టుందని."
   
    "పనేమిటి ."
   
    "వేట."
   
    "సిగ్గులేకపోతె సరి" బిడియంగా నవ్వింది. "వెళ్ళికాకుం......"
   
    "నో నోనో ...... పెళ్ళి చేసుకున్న వాళ్ళే వేటాడాలని రూలేంలేదు."
   
    "వెళ్ళి మంచంమీద పడుకోండి."   
   
    "వేటకి కావలసింది మంచం కాదు మేడమ్. మాటేయటానికి మంచే."
   
    "పెళ్లయ్యాక పులిగాక నన్ను గాండ్రించమంటారేమో."
   
    "దేనికీ!"
   
    "అప్పటికి కాని మీకు మూడ్ రాదని" అనేసిందికాని సూటిగా అతడి కళ్ళలో౦కి చూడలేక పోయింది.
   
    "కానిచ్చేద్దామా" దగ్గరకు లాక్కున్నాడు.
   
    "సిగ్గు లేకపోతె సరి అవతల అత్తయ్య."
   
    "విననియ్ . ఇదంతా నా కోసమా. అమ్మ కోసం..."
   
    "అదేంటి పాపం."
   
    "అవును ప్రీతి అర్జెంటుగా ఓ బాబునో, పాపనో యిచ్చేస్తే అమ్మకికాస్త కాలక్షేపంగా వుండదూ."
   
    "వదలండి" విడిపించుకోలేక పోతుంది. "ఈ రాత్రికి యిక్కడు౦టేకొంప తీసేటట్టున్నాడు ఇంటికెళ్ళిపోతాను. అబ్బా గుచ్చుకుంటుంది.
   
    "ఏమిటి."
   
    "మీ గెడ్డం."
   
    "అది చూస్తూనే మురిసిపోయేదానివిగా ."
   
    ఆమె చెంపల్లోగడ్డకట్టినద్రవం కరుగుతూ కాలుతున్న అరుణిమినీ పుంజుకుంటున్నాయి.
   
    గుండె కొండల కనుమల్లో నుంచి ఉద్విగ్నంగా జాలువారే సమ్మోహాన ఝూరి అతడ్ని వివశుడ్ని చేస్తుంటే ముకుళించిన మానస సరోవరాన ప్రతిబింబించే వేళ ఇంద్రధనస్సులఒరిపిడి.
   
    మృదువుగా పెదవుల్నీ మరోమారు తాకబోయాడు.
   
    గడిలోఅప్పుడు ఫోన్ రింగయింది.
   
    అయిష్టంగా దూరం జరిగి అన్యమనస్కంగా అందుకున్నాడు
   
    "యస్..... చైతన్య హియర్ ."
   
    "నేను అనిల్ కూమార్ మట్లాడుతూన్నాను."
   
    అలర్టయ్యాడు. చైతన్య. సర్ !"
   
    "మేనీటర్ యీజ్ బికనింగ్ ఏక్టివ్. ఈరోజు ఉదయమే మరోఇద్దరు గిరిజన యువతుల ప్రాణాలు తీసిందనిమెసేజ్ అందుకున్నాను."
   
    "వ్వాట్..." ఆ ప్రతిభుడై అడిగాడు.
   
    "యస్ మిస్టర్  చైతన్యా.... మీరు సాధ్యమైనంతత్వరలో...."
   
    "ఇప్పుడు చీకటిపడుతోంది. రేపు ఉదయమే బయలుదేరతాను."
   
    "దట్స్ ఫైన్స్ ."
   
    "ఈలోగా శవాల్ని వాళ్ళు కదిలించకుండావుంటే బెతరనుకుంటాను."
   
    "కదిలించేసాహసం ఎవరూ చేయరు చైతన్య. ఈ రోజు సాయంకాలం సారవప్పు కోసంఅడవిలోకి వెళ్ళినగిరిజన యువతుల మధ్య వచ్చిన పులిని చూసి అంతా పడుగేత్తగా మిగిలిన ఇద్దరు ఆడవాళ్ళనీ చంపిందని తెలిసింది.
   
    "ఇద్దర్నీ ఒకేసారా" మేనీటర్ అయినా ఇలా ప్రవర్తించే ఆవకాశంలేదు. ఒకేసారి ఇద్దరిపై దాడిచేయడమన్నది చైతన్యలాంటి అనుభవజ్ఞుడైన  'హంటర్' సైతం నమ్మలేని విషయం.
   
    "హౌ .... ఈజిట్ ట్రూ."
   
    ప్రత్యక్ష సక్షులున్నారు. మీరు ఎంక్వయిరీ చేస్తే తెలుస్తుంది. ఎనీవే. శవాలు బహుశా ఈ రాత్రికి అడవిలోనే వుంటాయి కాబట్టి రేపు ఉదయమే మీరు వేడితే ట్రేస్ చేయుచ్చునుకుంటాను. బట్ వన్ థింక్ .... మీరు ఎదుర్కోబోతున్నది చాలా ఫేరోసియస్  మేనీటారనిపిస్తుంది బికేర్ పుల్. ఎలాంటి సహాయం కావాల్సింవచ్చినా..."
   
    "ష్యూర్, థాంక్యూ సర్" ఫోన్ క్రేడిల్ చేశాడు. 

 Previous Page Next Page