Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 17

 

    "అబ్బర్డ్" బిడియంగా అనిపించినా కోపాన్ని వ్యక్తం చేస్తూ అంది "అయినా ఈ విషయం నాకెందుకు చెబుతున్నట్టు."
   
    "సింపుల్ ... ఇప్పటికీ యాంత్రోపోయిడ్ ఏఫ్ అయిన మగాడు అందమైన ఆడదాన్ని చూసి పరిణామం చెందుతుంటాడు. అలాగే నేనూ ,మీ సమక్షంలో యిలా మరిపోతుంటాను. హేన్స్ ది రిజల్ద్ ...." ఎక్కడో ప్రారంభించిన విషయం యిక్కడ యిలా కంప్లాడ్ చేయడం గొప్ప విశ్లేషణ కిందే కేల్లలోకి తీసుకోదగ్గదైనా  అలా అభినందించి ఓ పెద్ద పోలీసాఫీసరైన తను చదివేయ బడడం ఇష్టంలేనట్టు విసవిసా నడచి వెళ్ళిపోయింది.
   
     ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ కన్వర్వేటర్ గదిలోకి అడుగు పెట్టిన చైతన్యతో అన్నాడతను. "మిస్టర్ చైతన్యా, ఏ స్థాయికి ఎదిగినా తాను సులభంగా ఆకర్షించే అందమైన ఆడపిల్లని మాత్రమే అని ఆలోచించే అమాయకురాలు దీక్ష. కాని అమాయకత్వాన్ని తెచ్చే పెట్టుకున్న రోషంతో డామినేట్ చేయాలని విశ్వప్రయత్నం చేస్తూ వుంటుంది." ఓ రిపోర్ట్ ని చైతన్యకి అందించాడడాయన. "ఇది చదవండి. నిజానికి ఇది కాన్సిడేన్షియల్ గా వుంచాల్సిందే అయినా ఇది చదివితే మీ మీద విరుచుకుపడిన దీక్ష మనస్తత్వం మీకు అర్దమవుతుంది.
   
    వరసుగా ప్రతివాక్యాన్ని చదివాడు.
   
    అది నిజానికి శ్రీశైలం అడవుల్లో రైడ్ చేసి పట్టుకున్న గంజాయి మొక్కలు వివరాల్లా లేదు. చైతన్య ప్రజ్ఞకి రేటింగ్ లా వుంది. దాని డారాశం.
   
    "ఇది జరగకూడదనిదే అయినా అకుంఠితదీక్ష . నిజాయితీ అంతకుమించి తెగువగల డి.ఏఫ్. ఓ. చైతన్య వున్న ప్రదేశంలో జరగడమే నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ఈ నివేదికలో నేను చేస్తున్న ప్రయత్నం మీ డిపార్ట్ మెంట్ లో చైతన్య ఓ ఆణిముత్యం అని చెప్పడం కాదు అతడి దృష్టికి సైతం సోకకుండా జరిగే ఇలాంటి వ్యవహారాలని మీ దృష్టికి  తీసుకురావడం  ఈ విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రాష్ట్రా అధికారిణిగా నా సహకారం ఎప్పుడూ వుంటుందని హామీ యిస్తూ..." దీక్ష ఇంటెలిజేన్స్  ఆఫీసర్, ఎన్. సి. బి.
   
                     *    *    *    *   
   
    "ఏమైపోయావురా" వైజాగ్ లో ఇంటికి వచ్చిన చైతన్య ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ అడిగింది తల్లి అనసూయ. "ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాటానికే తీరిక లేదన్నమాట"
   
    "చేసేవాడ్నమ్మా..... అసలు అక్కడ"...... అడవిలో.... ఒఅదవి పంది చాలా  హడావిడి చేస్తుంటే......"
   
    "పందితోపాటు పిలేప్సీన్స్ వెళ్ళావన్నమాట ." ఠక్కున  ఖండించడంతో అవాక్కుయ్యాడు కిసిక్కున నవ్వు వినిపించింది.
   
    ద్వారం మాటున నిలబడ్డ ప్రీతి నీళ్ళు నమిలేస్తున్న చైతన్య ఇబ్బందిని చూస్తూ నవ్వుతోందిఅల్లరిగా.
   
    "చూడమ్మా.... అసలు "
   
    "అబద్దాలాడుటున్నావన్న మాట."
   
    "అదికాదు."
   
    "అంటే నువ్వు దేశం వదిలి వెళ్ళలేదు కదూ..."
   
    "అమ్మా..."
   
    "హవ్వా.... ప్రీతి ఈ రోజు పేపరు చూపించి చెప్పింది కాని లేకపొతే ఎన్ని కట్టుకథలు వినిపించేవాడో...."
   
    అప్పుడు చూశాడు న్యూస్ పేపరు. పిలిప్సీన్స్ నుంచి ఫోన్ చేసి జరిగింది అనిల్ కూమార్ కి చెప్పగానే అప్పుడే ప్రెస్ లో ఆ విషయం కక్కేసినట్టు అర్ధమైపోయింది.
   
    "అమ్మా" కోపంగా మూతి ముడుచుక్కూచున్న తల్లిని చేరి నెమ్మదిగా అన్నాడు. "అసలు చెప్పేవాడ్నీ కాని.... వ్యవధి లేక పోయింది. అప్పటికీ మా అమ్మ అనుమతి తీసుకోవాలి. అనక పేపర్లో పడితే అది చూసి చాలా కోపగించు కుంటుందీ అని అనిల్ కూమార్ గారితోగట్టిగా చెప్పానని. అయినా మళ్ళీ పేపర్లో..."

    "అంటే ఏమిట్రా" చిర్రెత్తుకొచ్చిందేమో కొడుకు చెవిపట్టుకుందిగట్టిగా "నువ్వు చెప్పకుండా వెళ్ళడం తప్పుకాదు.  వాళ్ళు పేపర్లో రాయడం తప్పంటావు."
   
    నీళ్ళు నమిలేశాడు "ఆహా.... తప్పని కాదు..... బాగోదుగా .... మరేం."

    నవ్వకుండా వుండలేకపోయింది. దేశం గర్వించదగ్గ తన కొడుకుఇలా ఆడాళ్ళలో బిడ్డలాగే  త్రోటుపడుతుంటే ఏ తల్లికి సంబరంగా వుండదని.
   
    ఆప్యాయంగా తల నిమిరింది. "పిచ్చినాన్న.... కదూ అనికాదు.   కాకూడదనీ కాదు. కాని అమ్మని సుఖంగా సెటిలైపోయాడు.
   
    ఏ పనిమీద బయలుదేరిందీ చెప్పడానికి ఇంతకన్నా మంచి అదనురాదానుకున్నాడేమో ఉత్సాహంగా అవకాశం చూసుకున్నాడు. "దీనికంతటికి కారణం నువ్వేనమ్మా. చిన్నప్పుడు నుంచీ నువ్వు ప్రయోజకుడివి కావాలిలా అంటూ తెగ హడావిడి చేసేవాడిని అయ్యానోలేదో అది తర్వాత సంగతి కాని ఇప్పుడు ప్రతి సమస్యకీ నన్నే ముందుకు నేడుతున్నారు. డిపార్ట్ మెంట్  లో.... అంతెందుకు..... కూనం అడవుల్లో ఏదో చిన్న ప్రాబ్లముంది. దానికీ నేను అవసరమవ్వాలో.. అప్పటికి చెబుతూనే వునాను మా అమ్మ అంగీకరించదని. అసలు వింటేగా. నువ్వు తప్ప మగాడు లేడోయ్ అన్నారు నీలాంటి కొడుకును కన్నతల అదృష్టవంతురాలోయ్  అంటారు అంతెందుకు నీ నాన్నాగారు స్కాడ్రస్ లీడర్ గా ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన దేశభక్తుడూ అంటారు. నథింగ్ డూయింగ్ అన్నాను అసలు అమ్మ అంగీకరించదూ అంటూ ఇలా వచ్చాను. తప్ప నీదికదమ్మా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో పెంక్ కవడామూ .లేదా పేరు సంపాదించుకోవడం యిదంతా."         

 Previous Page Next Page