Previous Page Next Page 
కదానాయికి పేజి 15

    "సరి....సరి..." అంటూ రామభద్రయ్య నీరుగారి మొహంతో వెళ్ళి పడక్కుర్చీలో  కూర్చుండిపోయ్యాడు.

    " పెద్దమ్మాయి సంగతి  ఆలోచించారా?" అంది కాసేపాగి సుభద్రమ్మ.

    "ఏ మాలోచించమంటావ్.? అన్నీ సవ్యంగావున్న వాళ్ళకే అతీగతీ లేదు." చుట్టుముట్టించడానికి వెలిగించిన అగ్గిపుల్ల కేసి చూస్తూ అన్నాడు. రామభద్రయ్య.   

     తల్లి, తండ్రి తనగురించి మాట్లాడుకోటం విని మరింత శ్రద్ధగా వింటూ రెండోజీడీ నోట్లో పెట్టుకుంది అనుపమ.

    "అలా అని ఏ ప్రయత్నంలేకుండా  చేతులు ముడుచుకు కూర్చుంటారా?"

    "ఇల్లు, పొలము  అమ్మినా అయ్యేపని కాదు. నువ్వేమీ అననంటే   ఒక్కమాట. మనిషన్న తరువాత లోపం లేకుండా లోటు రాకుండా వుండదు. నలభై అయిదేళ్లు ఏం పెద్ద వయసు! రాఘవయ్య మొన్న..."

    ఆపండి మాట్లాడటానికి సిగ్గు వుండాలి. కన్నతండ్రి మాట్లాడవలసిన మాటేనా  ఇది?  ఆ ఒక్క లోపమే లేకపోతే పెద్దమ్మాయి రాణీ కదండీ! సీతమ్మ తల్లికి రావణాసరుడు తగినవాడు అన్నటు వుంది మీమాట, మీరిలా మాట్లాడుతారునుకోలేదు." ఆ పై కంఠం పెగల్లేదు సుభద్రమ్న కి కళ్లల్లో గిర్రున నీళ్లుమట్టుకు తిరిగాయి.

    రామభద్రయ్య మళ్ళీ నోరు తెరవలేదు."

    అనుపమకి తండ్రి సంభాషణ అర్థం కాలేదు. లేచి  పెరట్లోకి వెళ్ళింది.

     రాఘవయ్య పక్కా తాగుబోతు .తిరుగుబోతు. రాఘవయ్య పద్నాలుగేళ్ల వయసులో అయుదేళ్ల మ్మాయినిచ్చి పెళ్ళి చేశారు. పెళ్లయి ఏడాది తిరక్కుండానే అమ్మవారు రెండో పెళ్ళిచేసుకున్నాడు.  ఆపిల్ల పట్టుమనిపదిరాజులుకూడా  కాపురం చేయక పాలికాపుతో లేచిపోయింది. మళ్ళీ పెళ్ళి మాట తలపెట్టలేదు.  రెండు తరాలు తిన్నా తరగని ఆ స్తీ, విదవప్పగారు, మేనత్త,ఆమె వునన్నాయి రాఘవయ్యకు, కళా హృదయ సొందర్యా రాధకుడు కావటంతో ఇన్నేళ్ళ తరువాత తిరుగుడుమీద మోజు తగ్గి పెళ్ళిమీద మోజు పెరిగింది. అందంగా వున్న. అమాయకురాలికోసం చూస్తుంటే అనుపమ కనిపించింది.

     రామభద్రయ్యకు రాఘవయ్యకు దూరపు బంధుత్వం వుంది.  కరణం గారింట్లో పెళ్లికి వచ్చినప్పుడు అనుపమని చూశాడు. మొగ్గ ఎంతలో వికసిస్తుంది? అని మధ్య వర్తులద్వారా రాయబారం జరిపాడు రాఘవయ్య.రామభద్రయ్యతో.

    సుభద్రమ్మ అడ్డు తగలకపోతే 'ఊ' అనేవాడే రామభద్రయ్య.

    సిరిసంపద ,బంధు బలగం, ఏదీ తక్కువ లేదు. రెండో  పెళ్లి మూడో పెళ్లి, వయసు విషయం మరచిపోతే రాఘవయ్యకు ఏ వంకా లేదు. తిరిగుడులేని మొగాడు ఓ మొగాడా? రామభద్రయ్య  ఆలోచనలు ఇలా సాగుతాయి. వయసులో ఏ ఆడది దగ్గరకు చేరనివ్వలేదు. తనూ ప్రయత్నించలేదు. అయినా తిరిగే మగాడంటే ఏహ్యభావంమటుకు లేదు రామభద్రయ్యకు.

    "పుణ్యం కొద్దీ పురుషుడు  దానంకొద్దీ బిడ్డలన్నారు. మీ ఆలోచనలిలా వున్నాయి. పెద్దమ్మాయి అందం అడవికాచిన వెన్నెలయింది. ఎవరినని మనసు నిబ్బరపడింతరువాత నాలుగూ అనిపెరట్లో  పని చూసుకోటానికి పోయింది సుభద్రమ్మ.

    చాతగాని నవ్వొకటి నవ్వి వూరుకున్నాడు రామభద్రయ.

    పెరట్లో కెళ్లిన సుభద్రమ్మ లంగాని చేత్తో తడుముతు నుంచున్న అనుపమను చూచింది. " ఏమిటే పెద్దమ్మాయి?" అంది దగ్గరగా వస్తు.

    చేతికయిన తడిని లంగాని తడుముతు " ఇదేంటమ్మా? అంది అనుపమ.

    అసలు విషయం అర్థమయ్యేటప్పటికి మిన్ను విరిగి మీదపడ్డట్టు అయింది. సుభద్రమ్మకు "ఇంట్లోకి రాకుండా ఇక్కడే నుంచో,  ఇప్పుడే  వస్తా" కంగారుగా అని పరుగులాంటి నడకతో ఇంట్లో కొచ్చేసింది. రామభద్రయ్య చుట్టు తాగుతూ అర్థనీలిమ నేత్రుడయి  ఆనందం అనుభవిస్తున్నాడు. కుర్చీ కంటిపెట్టుకు పడకుని. " ఇదిగో మిమల్నే , మన పెద్దమ్మాయి..."

    కుర్చీలోంచి గబుక్కున  లేచి కూర్చుని "పెద్దతల్లి పెళ్ళికి  వప్పుకుందా?" అన్నాడు. అంతవరకు పెద్దతల్లి పెళ్ళి ఎంత ఘనంగా చేయొచ్చో  ఆలోచిస్తున్నాడు రామభద్రయ్య.   

    ఖర్మ అన్నట్టు నుదుటిమీద చేత్తో కొట్టుకుని "పెద్దమ్మాయి, పెద్ద మనిషయిందండీ?అంది సుభద్రమ్మ.

    రెండోసారి చెప్పిందాకా అర్థం  కాలేదు రామభద్రయ్యకు .సంగతి అర్థమయి అవతలికి  పంపించింది. పనులు పూరమాయించి ,అప్పుడు పెరట్లోకి వెళ్ళి అనుపమ ఏం చేయాలో ఎలా మెలగాలో చెప్పి, శేషమ్మ పిన్ని ఇంటికి, కావమ్మ వదినగారి వద్దకు పిల్లలను  పంపి పిలిపించింది.

 Previous Page Next Page